ఐఓసీఎల్‌లో 98 పోస్టులు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్).. పారాదీప్ రిఫైనరీ ప్రాజెక్ట్‌లో వివిధ విభాగాల్లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 98. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 21. వివరాలకు www.iocl.comచూడొచ్చు
బీహెచ్‌ఈఎల్‌లో 50 గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌లు
బెంగళూరులోని బీహెచ్‌ఈఎల్ (భారత్ హెవీ ఎలక్ట్రిక ల్స్ లిమిటెడ్).. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఐటీ విభాగాల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 50. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 14. వివరాలకు www.bheledn.comచూడొచ్చు.
ఎయిమ్స్‌లో జూనియర్ రెసిడెంట్స్
రాయ్‌పూర్‌లోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్).. తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 29. ఇంటర్వ్యూ తేది డిసెంబర్ 7. వివరాలకు www.aiimsraipur.edu.inచూడొచ్చు.
కేరళ వెటర్నరీ వర్సిటీలో తాత్కాలిక పోస్టులు
కేరళ వెటర్నరీ అండ్ యానిమల్ సెన్సైస్ యూనివర్సిటీ.. తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో అసిసెంట్ ప్రొఫెసర్‌స, టీచింగ్ అసిస్టెంట్స్, ల్యాబ్ అసిస్టెంట్స్, ఆఫీస్ అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 13. ఇంటర్వ్యూ తేది డిసెంబర్ 10. వివరాలకు www.kvasu.ac.inచూడొచ్చు.
టాటా మెమోరియల్ సెంటర్‌లో ఫీల్డ్ వర్కర్లు
టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఫీల్డ్ వర్కర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 8. ఇంటర్వ్యూ తేది డిసెంబర్ 7. వివరాలకు www.actrec.gov.inచూడొచ్చు.
ఎన్‌సీఈఆర్‌టీలో స్పెషల్ రిక్రూట్‌మెంట్
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్‌చ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ).. వికలాంగుల కోటాలో లోయర్ డివిజన్ క్లర్‌క పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 5. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 20. వివరాలకు www.ncert.nic.inచూడొచ్చు.
బెనారస్ హిందూ వర్సిటీలో ఖాళీలు
బెనారస్ హిందూ యూనివర్సిటీ.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ప్రాజెక్ట్ అసిస్టెంట్, డేటా కలెక్షన్/కోడింగ్ ఇన్వెస్టిగేటర్, డేటా ఎంట్రీ అండ్ ఎనాలిసిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 4. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 17. వివరాలకు www.bhu.ac.inచూడొచ్చు.
145 డీఎడ్ కాలేజీలకు అనుమతులు
రెండు రోజుల్లో డీఈఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎట్టకేలకు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్)లో ప్రవేశాలకు చ ర్యలు మొదలయ్యాయి. 145 ప్రైవేటు డీఎడ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇస్తూ సంబంధిత ఫైలుపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మంగళవారం సంతకం చేశారు. ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో కాలేజీల్లో 2015-16 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు చేపట్టేందుకు ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఆ వెంటనే డీఈఈసెట్-2015 ప్రవేశాల షెడ్యూల్‌ను జారీ చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. వీలైతే ఈ నెల 5 నుంచి వెబ్ ఆప్షన్లను ప్రారంభించే అవకాశం ఉంది. డీఈఈసెట్‌లో అర్హత సాధించిన 71 వేల మంది దీని కోసం ఎదురుచూస్తున్నారు.
కళాశాల విద్యా కమిషనర్‌గా కిషన్‌కు బాధ్యతలు
కళాశాల విద్యా కమిషనర్ వాణిప్రసాద్ సెలవులో ఉండడంతో ప్రభుత్వం... పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్‌కు ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య మంగళ వారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 28 వరకు ఆయన ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు.
8 వరకు ఓపెన్ వర్సిటీ పరీక్ష ఫీజు గడువు
హైదరాబాద్: బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పీజీ మొదటి, రెండో సంవత్సరం, ఎంబీఏ మొదటి, రెండో, మూడో సంవత్సర వార్షిక పరీక్షలు డిసెంబర్, జనవరిలో జరుగుతాయని అధికారులు వెల్లడించారు. ఈ నెల 8లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. డిగ్రీ వార్షిక పరీక్షలు కూడా డిసెంబర్ ఆఖరి వారంలో లేదా జనవరి మొదటి వారంలో జరుగుతాయని తెలిపారు. తెలంగాణ, ఏపీలోని స్టడీ సెంటర్లలో ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు.
5న నిమ్స్‌లో డిప్లొమా కోర్సులకు కౌన్సెలింగ్
హైదరాబాద్: నిమ్స్ ఆసుపత్రిలో పారామెడికల్ డిప్లొమా పీజీ కోర్సులకు రెండో విడ త కౌన్సెలింగ్ ఈ నెల 5న నిర్వహించనున్నట్లు నిమ్స్ అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 5న నిమ్స్ పాత భవనం మొదటి అంతస్తులోని లె ర్నింగ్ సెంటర్‌లో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు www.nims.edu.inవెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
సిబ్బంది వివరాలు అప్‌లోడ్ చేయాల్సిందే
జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు ఆదేశం... 15 వరకు గడువు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో అక్రమాలను అరికట్టేందుకు ఇంటర్మీడియట్ బోర్డు చర్యలు చేపట్టింది. అర్హులైన బోధన సిబ్బంది లేకపోయినా నెట్టుకొస్తున్న కాలేజీలను గాడిలో పెట్టేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది వివరాలను(బయోడేటా) తమ వెబ్‌సైట్‌లో ఈ నెల 15 లోగా అప్‌లోడ్ చేయాల్సిందేనని ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. కాలేజీల ప్రిన్సిపాళ్లు ఇందుకవసరమైన చర్య లు చేపట్టాలని ఆదేశించింది.
వెబ్‌సైట్‌లో జేఈఈ మెయిన్ దరఖాస్తుల లింకు
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్ దరఖాస్తుల ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. ఆన్‌లైన్‌లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా వెబ్‌సైట్‌లో దరఖాస్తుల లింక్‌ను మంగళవారం అందుబాటులోకి తెచ్చింది. ఇక జేఈఈ అడ్వాన్స్‌డ్ నోటిఫికేషన్‌లో అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన టాప్ 2 లక్షల మందిని పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొనగా, మెయిన్ నోటిఫికేషన్ లో మాత్రం 1.5లక్షల మందినే అడ్వాన్స్‌డ్ రాసేందుకు అర్హులుగా తీసుకుంటారంది.
ఉద్యోగ సమాచారం
Published Wed, Dec 2 2015 1:19 AM | Last Updated on Sun, Sep 3 2017 1:19 PM
Advertisement
Advertisement