Indian Oil Citi Credit Card Offers 68 Litres of Free Fuel, Conditions Apply! - Sakshi
Sakshi News home page

బంపర్‌ ఆఫర్‌..ఆ క్రెడిట్‌ కార్డ్‌ ఉంటే 68 లీటర్ల పెట్రోల్‌, డీజిల్‌ ఫ్రీ!

Published Tue, Nov 29 2022 4:24 PM | Last Updated on Tue, Nov 29 2022 5:34 PM

Indian Oil Citi Credit Card Offers 68 Litres Petrol Diesel Free, Follow This Rules - Sakshi

పెరుగుతున్న పెట్రోల్‌-డీజిల్‌ ధరలు ప్రజలపై భారంగా మారుతోంది. దీనికి తోడు ద్రవ్యోల్బణం విపరీతంగా పెరగడంతో సామాన్యులు నెలవారీ బడ్జెట్‌లో పొదుపు మంత్రం పాటించక తప్పట్లేదు. అందుకే పైసలు ఆదా చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్‌ అయిల్‌ సిటీ క్రెడిట్‌ కార్డ్‌ తన కస్టమర్లకు ఓ బంఫర్‌ ఆఫర్‌ ప్రకటించింది.

ఈ కార్డు వాడకం ద్వారా 68 లీటర్ల ఉచిత పెట్రోల్‌, డీజిల్‌ పొందవచ్చని తెలిపింది. ఇందుకోసం ఇండియన్ ఆయిల్‌తో ఒప్పందం చేసుకొని.. సిటీ బ్యాంక్ ఈ క్రెడిట్ కార్డు తీసుకొచ్చింది. కాకపోతే ఈ ఉచిత పెట్రోల్‌, డీజిల్‌ పొందేందుకు కొన్ని షరతులు కూడా ఉంటాయని పేర్కొంది.

68 లీటర్ల ఇంధనం ఉచితం
ఈ రోజుల్లో బైక్‌లు, కార్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో పెట్రోల్, డీజిల్‌కు డిమాండ్‌ పెరిగి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్రమంలో ప్రతీ నెలా ఇంధన బిల్లుకు వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అయితే ఈ పైసలను పొదుపు చేయాలంటే ఇలా చేయండి. ఈ సారి ఇంధన బిల్లులకు ఇండియన్ ఆయిల్ సిటీ క్రెడిట్ కార్డ్‌తో చెల్లించడం ద్వారా సంవత్సరానికి సుమారు రూ. 7వేల ఆదా చేయవచ్చు.

ఎలా అంటే.. ఈ కార్డ్‌ని ఉపయోగించి పేమెంట్‌ చేయడం ద్వారా కస్టమర్లు దీని నుంచి రివార్డ్ పాయింట్‌లను (టర్బో పాయింట్‌లు) పొందగలరు. ఈ పాయింట్లను రీడీమ్ చేయడం ద్వారా కార్డుదారులు సంవత్సరానికి 68 లీటర్ల వరకు పెట్రోల్, డీజిల్‌ని కొనుగోలు చేయవచ్చు.

పాయింట్లు ఎలా వస్తాయ్‌
► ఇండియన్ ఆయిల్ పంపుల వద్ద 1 శాతం ఇంధన సర్‌చార్జి మినహాయింపు.
► ఇండియన్ ఆయిల్ పంప్‌లలో ఖర్చు చేసే ప్రతి రూ. 150కి 4 టర్బో పాయింట్‌లను పొందండి.

► కార్డ్ ద్వారా గ్రోసరీలు, సూపర్ మార్కెట్‌లలో ఖర్చు చేసే రూ. 150కి 2 టర్బో పాయింట్‌లను పొందండి.
► కార్డ్ ద్వారా ఇతర కేటగిరీలో రూ.150 ఖర్చు చేస్తే 1 టర్బో పాయింట్‌ని పొందండి.

అయితే ఈ టర్బో పాయింట్లకు.. ఇండియన్ ఆయిల్ బంకుల్లో మాత్రం ఎక్కువ ప్రయోజనాలు లభించనున్నాయి. ఎలా అంటారా.. బంకుల్లో ఒక టర్బో పాయింట్.. ఒక రూపాయితో సమానం కాగా, ఇదే విధంగా ఇండిగో, గోఐబిబో వంటి ఇతర వాటిలో ఒక టర్బో పాయింట్‌కు రూ. 25 పైసలు మాత్రమే లభిస్తాయి.

బుక్‌మైషో, ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్, షాపర్స్ స్టాప్ వంటి ప్రదేశాల్లో ఒక టర్బో పాయింట్‌తో 30 పైసలు వస్తాయి. ఇలా ఏడాది మొత్తంలో ఈ కార్డు ఉపయోగించి జరిపే లావాదేవీలపై వచ్చే రివార్డులు, టర్బో పాయింట్లతో 68 లీటర్ల వరకు ఉచితంగా పెట్రోల్‌ లేదా డిజిల్‌ కానీ పొందవచ్చని సిటీ బ్యాంక్ వెల్లడించింది.

చదవండి: హైదరాబాద్‌: ఫుల్‌ డిమాండ్‌.. అందులో స్టార్టప్‌ల ఏర్పాటు కోసం ఎగబడుతున్న సంస్థలు!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement