బంగారం, క్రూడాయిల్ ధరల్లో భారీ పతనం
న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, క్రూడాయిల్ ధరలు భారీగా పతనం అవుతున్నాయి. దీంతో పసిడి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. పది గ్రాముల బంగారం ధర రూ.500 దాకా పడుతోంది. ప్రస్తుతం ఎంసీఎక్స్లో 24 క్యారెట్ల పసిడి ధర రూ.25,330గా ఉంది. గతవారాంతరంలోనూ బంగారం ధర రూ.500 తగ్గింది. రెండు రోజుల్లో ఔన్స్ ధర 50 డాలర్లు పడింది. ప్రస్తుతం ఔన్స్ ధర 1,051 డాలర్లు ఉంది.
మరోవైపు బ్రెంట్ క్రూడాయిల్ ధర కూడా 70 డాలర్లుకు దిగింది. సోమవారం కూడా రెండు డాలర్లదాకా పతనం అయ్యింది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడాయిల్ ధర 68 డాలర్లు ఉంది. క్రూడాయిల్ ధరల పతనంతో పెట్రోల్, డీజీల్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. ఈ పరిణామం భారత్ వంటి వర్ధమాన దేశాలకు తాజా పరిణామాలు శుభ సంకేతాలుగా చెప్పవచ్చు.