న్యూఢిల్లీ: దేశీయ ఎల్‌పీజి గ్యాస్ సిలిండర్ ధర రూ.10 తగ్గింది. ఫీబ్రవరిలో వరుస పెరుగుల తర్వాత గ్యాస్ ధర స్వల్పంగా తగ్గడంతో గృహా వినియోగదారులకు కాసింత ఉపశమనం లభిస్తుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ బుధవారం సిలిండర్ ధర రూ.10 తగ్గించినట్లు పేర్కొంది. తగ్గిన ధరలు రేపటి(ఏప్రిల్ 1) నుంచి అమలులోకి రానున్నాయి. ప్రస్తుతం న్యూఢిల్లీలో ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.871గా ఉంది. ఇక హైదరాబాద్ లో ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.871.5 ఉంటే, విశాఖపట్నంలో రూ.826.5గా ఉంది. సమీప భవిష్యత్తులో ధర మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు ఒక అధికారి తెలిపారు. అయితే, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను ప్రభుత్వ చమురు కంపెనీలు నిర్ణయిస్తాయి. ఎల్‌పీజి గ్యాస్ సిలిండర్ ధర అంతర్జాతీయ ఇంధన రేట్లు, యూఎస్ డాలర్-రూపాయి మారకపు రేట్లపై ఆధారపడి ఉంటుంది. దేశీయ ఎల్‌పిజి సిలిండర్ల అమ్మకాలపై భారత ప్రభుత్వం ప్రస్తుతం వినియోగదారులకు సబ్సిడీ ఇస్తోంది. సిలిండర్ కొనుగోలు చేసిన తరువాత సబ్సిడీ మొత్తం నేరుగా వ్యక్తి బ్యాంకు ఖాతాకు జమ చేస్తుంది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment