
ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్(Lpg Gas Cylinder) మన ఇంట్లో ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి 2,3 నెలలకు ప్రజల వాడకం బట్టి గ్యాస్ సిలిండర్‌ను తెప్పించుకుంటాం. అయితే సిలిండర్‌ను డోర్ డెలివరీ తీసుకున్న ప్రతి సారి రూ.30 లేదా అంత కంటే ఎక్కువ అదనంగా చెల్లించడం మూములుగా మారింది. ఇకపైన అలా డబ్బులు ఇవ్వడం ఆపేయండి. ఎందుకంటే!
ఐఓసీ, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) వినియోగదారులు తెలంగాణలోని డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లకు డెలివరీ ఛార్జీలు చెల్లించాలా వద్దా అనే సమాచారం కోసం ఓ వ్యక్తి దాఖలు చేసిన ఆర్టీఐ (RTI) ఈ మేరకు సమాధానం వచ్చింది.
హెచ్‌పీసీఎల్ కంపెనీ డీలర్ ఒప్పందంలో పేర్కొన్న విధంగా.. ట్రేడింగ్ ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లు ఉచితంగా వినియోగదారుల ఇంటి వద్దకు గ్యాస్ సిలిండర్ చేర్చాల్సి ఉంటుందని, అందుకయ్యే ఛార్జీలు వారు చెల్లించే బిల్లులోనే కలిపి ఉంటాయని పేర్కొంది.
డొమెస్టిక్, కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ (Lpg Gas) డెలివరీ ఛార్జీలు ఏమైనా ఉంటే తెలుసుకోవాలని ఇటీవల హైదరాబాద్‌కు చెందిన రాబిన్ జాకీస్ ఆర్టీఐ ద్వారా ఈ సమాచారాన్ని కోరాడు.
చదవండి: దేశంలోని ధనవంతులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment