delivery charges
-
కట్టండి రూ.803 కోట్లు.. జొమాటోకు జీఎస్టీ దెబ్బ!
ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ జొమాటోకు (Zomato) జీఎస్టీ (GST) విభాగం నుంచి గట్టి దెబ్బ తగిలింది. వడ్డీ, జరిమానాతో సహా రూ.803.4 కోట్ల పన్ను చెల్లించాలని థానేలోని జీఎస్టీ విభాగం ఆదేశించింది. డెలివరీ ఛార్జీలపై వడ్డీ,పెనాల్టీతో జీఎస్టీని చెల్లించని కారణం చూపుతూ పన్ను నోటీసు వచ్చినట్లు జొమాటో రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది."కంపెనీకి 2019 అక్టోబర్ 29 నుండి 2022 మార్చి 31 కాలానికి సంబంధించి 2024 డిసెంబర్ 12న ఒక ఆర్డర్ అందింది. రూ.4,01,70,14,706 జీఎస్టీతోపాటు వడ్డీ, పెనాల్టీ మరో రూ. 4,01,70,14,706 చెల్లించాలని సీజీఎస్టీ & సెంట్రల్ ఎక్సైజ్ జాయింట్ కమిషనర్, థానే కమిషనరేట్, మహారాష్ట్ర నుంచి ఆర్డరు జారీ అయింది" జొమాటో పేర్కొంది.అయితే జీఎస్టీ నోటీసులపై అప్పీల్‌కు వెళ్లనున్నట్లు జొమాటో తెలిపింది. దీనిపై తమ న్యాయ, పన్ను సలహాదారులతో సంప్రదించామని, వారి అభిప్రాయాల మేరకు జీఎస్టీ నోటీసులకు వ్యతిరేకంగా సంబంధిత అధికారుల ముందు అప్పీల్ దాఖలు చేస్తామని జొమాటో వివరించింది.సాధారణంగా కస్టమర్ ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు జొమాటో బిల్లులో మూడు అంశాలు ఉంటాయి. వాటిలో ఆహార పదార్థాల ధర ఒకటి కాగా మరొకటి ఫుడ్ డెలివరీ ఛార్జీ. సబ్స్క్రిప్షన్ తీసుకున్నవారికి కంపెనీ దీని నుంచి మినహాయింపు ఇస్తుంది. ఇక మూడోది ఆహారం ధర, ప్లాట్‌ఫామ్ ఫీజుపై విధించే ఐదు శాతం జీఎస్టీ పన్ను. ఇందులో ఫుడ్ డెలివరీ ఛార్జీలపై ట్యాక్స్ చెల్లించడం లేదనేది జీఎస్టీ విభాగం అభియోగం. -
జొమాటోకి గట్టి షాక్.. ఆ చార్జీలపైనా జీఎస్టీ కట్టాల్సిందే!
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (DGGI) షాకిచ్చింది. రూ.401.7 కోట్ల జీఎస్టీ బకాయిలు చెల్లించాలని నోటీసులు పంపించింది. డెలివరీ ఛార్జీలపై జీఎస్టీ చెల్లించనందుకు డీజీజీఐ తాజాగా ఫుడ్ డెలివరీ సంస్థలు జొమాటో, స్విగ్గీలకి పన్ను నోటీసులు జారీ చేసింది. ఆ సంస్థలు వసూలు చేస్తున్న డెలివరీ ఛార్జీలు సేవల కేటగిరీ కిందకు వస్తాయని, వీటిపై 18 శాతం జీఎస్టీ చెల్లించాలని స్పష్టం చేసింది. పెనాల్టీలు, వడ్డీ కూడా.. జీఎస్టీ బకాయిలతోపాటు డెలివరీ భాగస్వాముల తరపున కస్టమర్ల నుంచి వసూలు చేసిన డెలివరీ ఛార్జీలపై పన్ను చెల్లించలేకపోవడంపై 2019 అక్టోబర్ నుంచి 2022 మార్చి వరకు జరిమానాలు, వడ్డీని కూడా చెల్లించాలని జొమాటోను డీజీజీఐ ఆదేశించింది. జొమాటో స్పందన డీజీజీఐ జారీ చేసిన షోకాజ్ నోటీసుకు జొమాటో స్పందించింది. తాము ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. "డెలివరీ ఛార్జ్‌ని డెలివరీ భాగస్వాముల తరపున కంపెనీ వసూలు చేస్తుంది. కానీ కంపెనీ నేరుగా డెలివరీ సర్వీసులు అందించదు. కాంట్రాక్టు నిబంధనలు, షరతుల మేరకు డెలివరీ భాగస్వాములు కస్టమర్లకు డెలివరీ సేవలు అందిస్తారు." అని పేర్కొంది. లీగల్, ట్యాక్స్ నిపుణుల అభిప్రాయాలను తీసుకుని షోకాజ్‌కు నోటీసుకు తగినవిధంగా స్పందన సమర్పిస్తామని ప్రకటనలో పేర్కొంది. -
గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేస్తే డబ్బులు ఇస్తున్నారా? కంపెనీ ఏం చెప్తోందంటే!
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్(Lpg Gas Cylinder) మన ఇంట్లో ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి 2,3 నెలలకు ప్రజల వాడకం బట్టి గ్యాస్ సిలిండర్‌ను తెప్పించుకుంటాం. అయితే సిలిండర్‌ను డోర్ డెలివరీ తీసుకున్న ప్రతి సారి రూ.30 లేదా అంత కంటే ఎక్కువ అదనంగా చెల్లించడం మూములుగా మారింది. ఇకపైన అలా డబ్బులు ఇవ్వడం ఆపేయండి. ఎందుకంటే! ఐఓసీ, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) వినియోగదారులు తెలంగాణలోని డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లకు డెలివరీ ఛార్జీలు చెల్లించాలా వద్దా అనే సమాచారం కోసం ఓ వ్యక్తి దాఖలు చేసిన ఆర్టీఐ (RTI) ఈ మేరకు సమాధానం వచ్చింది. హెచ్‌పీసీఎల్ కంపెనీ డీలర్ ఒప్పందంలో పేర్కొన్న విధంగా.. ట్రేడింగ్ ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లు ఉచితంగా వినియోగదారుల ఇంటి వద్దకు గ్యాస్ సిలిండర్ చేర్చాల్సి ఉంటుందని, అందుకయ్యే ఛార్జీలు వారు చెల్లించే బిల్లులోనే కలిపి ఉంటాయని పేర్కొంది. డొమెస్టిక్, కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ (Lpg Gas) డెలివరీ ఛార్జీలు ఏమైనా ఉంటే తెలుసుకోవాలని ఇటీవల హైదరాబాద్‌కు చెందిన రాబిన్ జాకీస్ ఆర్టీఐ ద్వారా ఈ సమాచారాన్ని కోరాడు. చదవండి: దేశంలోని ధనవంతులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలుసా? -
డబ్బావాలాలు.. రేటు పెంచారు!!
క్రమం తప్పకుండా.. ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా సేవలు అందించే ముంబై డబ్బావాలాలు తమ రేటు పెంచారు. నిత్యావసరాల ధరలన్నీ పెరగడంతో వాటిని తట్టుకోడానికి నెలకు డబ్బాలు అందించడానికి ఛార్జీని వంద రూపాయలు చేశారు. ఈ సంక్షోభ సమయంలో తమకు అండగా ఉండాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు ముంబై డబ్బావాలాల సంఘం మాజీ అధ్యక్షుడు రఘునాథ్ మెడ్గే తెలిపారు. తమ డబ్బావాలాలు ఆత్మహత్యలు చేసుకోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని, వాళ్ల కనీస జీవనం గడవాలంటే ఈ రేటు తప్పనిసరని చెప్పారు. కూరగాయల ధరలతో పాటు రవాణా ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయని, అందుకే ధరలు పెంచక తప్పలేదని రఘునాథ్ తెలిపారు. గడిచిన 125 సంవత్సరాలుగా ముంబైలోని 5వేల మందికి పైగా డబ్బావాలాలు ప్రతిరోజూ ఆఫీసులు, పాఠశాలలు, కళాశాలలకు లక్షకు పైగా భోజనం క్యారియర్లు ఇస్తున్నారు. వీళ్లకు నెలకు సుమారు రూ. 8వేల నుంచి 10 వేల వరకు ఆదాయం వస్తుంది. ప్రిన్స్ ఛార్లెస్, రిచర్డ్ బ్రాన్సన్ లాంటివాళ్లు కూడా ఈ వ్యాపారానికి అభిమానులే. 80 లక్షల డెలివరీలకు ఒక్క సారి మాత్రమే పొరపాటు జరుగుతుందని వీరిపై అంచనా.