ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (DGGI) షాకిచ్చింది. రూ.401.7 కోట్ల జీఎస్టీ బకాయిలు చెల్లించాలని నోటీసులు పంపించింది. డెలివరీ ఛార్జీలపై జీఎస్టీ చెల్లించనందుకు డీజీజీఐ తాజాగా ఫుడ్ డెలివరీ సంస్థలు జొమాటో, స్విగ్గీలకి పన్ను నోటీసులు జారీ చేసింది. ఆ సంస్థలు వసూలు చేస్తున్న డెలివరీ ఛార్జీలు సేవల కేటగిరీ కిందకు వస్తాయని, వీటిపై 18 శాతం జీఎస్టీ చెల్లించాలని స్పష్టం చేసింది.
పెనాల్టీలు, వడ్డీ కూడా..
జీఎస్టీ బకాయిలతోపాటు డెలివరీ భాగస్వాముల తరపున కస్టమర్ల నుంచి వసూలు చేసిన డెలివరీ ఛార్జీలపై పన్ను చెల్లించలేకపోవడంపై 2019 అక్టోబర్ నుంచి 2022 మార్చి వరకు జరిమానాలు, వడ్డీని కూడా చెల్లించాలని జొమాటోను డీజీజీఐ ఆదేశించింది.
జొమాటో స్పందన
డీజీజీఐ జారీ చేసిన షోకాజ్ నోటీసుకు జొమాటో స్పందించింది. తాము ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. "డెలివరీ ఛార్జ్‌ని డెలివరీ భాగస్వాముల తరపున కంపెనీ వసూలు చేస్తుంది. కానీ కంపెనీ నేరుగా డెలివరీ సర్వీసులు అందించదు. కాంట్రాక్టు నిబంధనలు, షరతుల మేరకు డెలివరీ భాగస్వాములు కస్టమర్లకు డెలివరీ సేవలు అందిస్తారు." అని పేర్కొంది. లీగల్, ట్యాక్స్ నిపుణుల అభిప్రాయాలను తీసుకుని షోకాజ్‌కు నోటీసుకు తగినవిధంగా స్పందన సమర్పిస్తామని ప్రకటనలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment