న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా చమురు ధరలు దిగిరావడంతో దేశంలో 18 రోజుల వ్యవధిలో పెట్రోల్ ధర లీటరుకు రూ.4.05 తగ్గింది. అలాగే డీజిల్ ధర లీటరుకు రూ.2.33 తగ్గింది. ఆదివారం నాడు లీటరు పెట్రోల్ ధర 21 పైసలు, డీజిల్ ధర 17 పైసలు పతనమైంది. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 78.78, డీజిల్ ధర రూ.73.36 వద్ద కొనసాగుతోంది. ముంబైలో పెట్రోల్ రూ. 82.28, డీజిల్ రూ.76.88 వద్ద అమ్ముడవుతోంది. అక్టోబర్ 18 నుంచి ఇంధన ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతకుముందు, ఆగస్టు 16–అక్టోబర్ 4 మధ్య పెట్రోల్ ధర లీటరుకు రూ.6.86, డీజిల్ ధర లీటరుకు రూ.6.73 పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment