‘గాలి’ మోటార్.. | 'Wind' of the motor .. | Sakshi
Sakshi News home page

‘గాలి’ మోటార్..

Published Fri, Apr 11 2014 12:44 AM | Last Updated on Sat, Sep 2 2017 5:51 AM

‘గాలి’ మోటార్..

‘గాలి’ మోటార్..

రోజురోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్ రేట్లతో గాభరా పడాల్సిన పనిలేదిక. గాలితో నడిచే ద్విచక్ర వాహనాన్ని సృష్టించారు యానాంలోని రీజెన్సీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఆర్‌ఐటీ) బీటెక్ మెకానికల్ ఆఖరి సంవత్సరం విద్యార్థులు. తాము తయారు చేసిన ‘వాయురథాన్ని’ గురువారం నడిపి చూపించారు.
 
 
 కేవలం గాలి ఒత్తిడి (కంప్రెస్డ్ ఎయిర్ ఇంజిన్)తో నడవడం, ఇంజిన్ ఉష్ణోగ్రత 30 సెల్సియస్ డిగ్రీలకు మించకపోవడం, అత్యధిక మెకానికల్ వాల్యూ మెట్రిక్ సామర్థ్యం ఈ వాహనం ప్రత్యేకత అని ‘టీమ్-4 బాయ్స్’ సానిపేని వీరవెంకట వినోద్, ధరణికోట రాజేష్, తోట జైతేజ, బోడపాటి వెంకటేష్ విలేకరులకు చెప్పారు. ఈ వాహనం ఇంజిన్ నుంచి వెలువడే వాయవులు కాలుష్య రహితమైనవన్నారు. అంతేకాక.. ఇంజిన్ నుంచి వెలువడే వాయువు ఉష్ణోగ్రత 16 సెల్సియస్ డిగ్రీలు మాత్రమే ఉండడం వలన.. ఇదే ఇంజిన్‌ను కార్లకు అమర్చినప్పుడు ఏసీ మెషీన్‌లా కూడా ఉపయోగించవచ్చన్నారు.
 
  గాలిని నిల్వచేసే ట్యాంక్ పరిమాణం ప్రస్తుతానికి కొంచెం పెద్దగా ఉన్నా.. దాన్ని మామూలు బైక్‌ల ఫ్యూయల్ ట్యాంక్‌ల సైజులో రూపొందించాలన్న తమ యత్నం త్వరలోనే ఫలించగలదన్నారు. ఆర్‌ఐటీ మెకానికల్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్, ప్రాజెక్ట్ గైడ్ జి.రవికుమార్ సహకారంతో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టామని, గత ఏడాది అక్టోబర్ నుంచి  గ్రౌండ్ వర్కు చేసి, డిసెంబర్‌లో పని మొదలు పెట్టామని చెప్పారు. మొత్తం ప్రాజెక్ట్‌కు రూ.25 వేలు ఖర్చయిందన్నారు.     
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement