హైదరాబాద్: వివిధ కార్మిక సంఘాల పిలుపు మేరకు తెలుగు రాష్ట్రాల్లో రవాణా వ్యవస్థ స్తంభించింది. అర్థరాత్రి నుంచి ఆటోలు, లారీలు ఆగిపోయాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించిన రోడ్డు సేఫ్టీ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ వివిధ కార్మిక సంఘాలు నేడు దేశ వ్యాప్త సమ్మెకు పిలుపు నిచ్చాయి. ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎస్, బీఎంఎస్ తదితర సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నాయి.
అయితే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొనబోరని ఆయా కార్మిక సంఘాలు ప్రకటించాయి.