పది రోజుల్లో 84 పైసలు పెరిగిన పెట్రోలు ధర | Petrol Price Hiked By Up To 16 Paise Per Litre In Metros, Diesel Price Unchanged | Sakshi
Sakshi News home page

పది రోజుల్లో 84 పైసలు పెరిగిన పెట్రోలు ధర

Published Thu, Nov 14 2019 4:10 PM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM

పెట్రోలు ధరలు పెరిగాయి. వివిధ మెట్రో నగరాల్లో గురువారం పెట్రోల్‌ ధర లీటరుకు 16 పైసల చొప్పున  ఎగిసింది.  అయితే డీజిల్‌ ధరలు యథాతథంగా ఉన్నాయి.  బ్రెంట్‌ ఫూచర్స్‌ 0.3 శాతం పెరిగి బ్యారెల్‌కు 62.53 డాలర్లుగా ఉంది. అటు దేశీయ కరెన్సీ రూపాయి కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే 15 పైసలు క్షీణించి  72.24 ను తాకింది.   బుధవారం రెండు నెలల కనిష్ట స్థాయి 72.09 వద్ద ముగిసింది. కాగా గత పది రోజుల్లో పెట్రోలు ధర  85 పైసలు పెరిగింది.  బ్రెంట్ ముడి చమురు రేట్లు బ్యారెల్‌కు 62 డాలర్లకు మించడంతో, ప్రభుత్వ ఇంధన రిటైలర్లు గత 10 రోజులలో పెట్రోల్ ధరను 85 పైసలు పెంచగా, డీజిల్ ధర  4 పైసలు మాత్రమే పెరిగింది. 

Advertisement
 
Advertisement
 
Advertisement