మారని వైఖరికి చిరునామా | varavara rao writes on madras IIT issue | Sakshi
Sakshi News home page

మారని వైఖరికి చిరునామా

Published Wed, Jun 10 2015 12:50 AM | Last Updated on Sun, Sep 3 2017 3:28 AM

మారని వైఖరికి చిరునామా

మారని వైఖరికి చిరునామా

అభిప్రాయం

కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడినాక మోదీని అధికారం లోకి తేవడానికి వందలాది మంది కార్యకర్తలతో ప్రచారం లోకి దిగిన ఆర్‌ఎస్‌ఎస్ లౌకిక ప్రజాస్వామిక భావాలను, దళిత మైనారిటీ ఆలోచనలను అణచివేయడానికి చరిత్ర రచ న, విద్యారంగం, సమాచార రంగం మీద ఎంత కరడుగట్టిన భావాల ఒత్తిడిని తెస్తు న్నదో మద్రాసు ఐఐటీ మీద కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ నుంచి తెచ్చిన ఒత్తిడియే నిదర్శనం.

‘భిన్నాభిప్రాయం నేరమా?’ అని మీరు రాసిన సంపా దకీయం (మే 30) పాఠకులను అప్రమత్తం చేస్తుందని ఆశిస్తు న్నాను. అంబేద్కర్-పెరియార్ స్టూడెంట్ సర్కిల్ (ఏపీఏసీ) కరపత్రంపై నిషేధాన్ని, చర్యను ఉద్దేశించిన కుట్ర ఏ ఫాసిస్టు చర్యలకు దారితీస్తుందో ఈ ఏడాది పరి ణామాల నేపథ్యంలో ఎవరైనా ఊహించగలిగేదే. సకా లంలో ప్రజాస్వామ్యశక్తులు స్పందించడానికిదే అదను.

మీ సంపాదకీయంలో ‘ఎక్కడైతే మేధస్సు నిర్భ యంగా ఉంటుందో... విజ్ఞానానికి సంకెళ్లు ఉండవో... ఎక్కడైతే ప్రపంచం సంకుచిత కుడ్యాలుగా ముక్కలై పో దో...ఎక్కడైతే హేతువు దారితప్పదో... అలాంటి స్వేచ్ఛా ప్రపంచంలోకి తనను మేల్కొల్పడమ’న్న రవీంద్రుని గీతాన్ని 1978-79 విద్యా సంవత్సరంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో ఇంగ్లిష్‌లో పోస్టర్‌గా వేసిన ఉదం తం పూర్వాపరాలు గురించి రాయాలనిపించింది.

1976లో అంటే ప్రాథమిక హక్కులు రద్దయిన అత్యయికస్థితి (1975-77) కాలంలో కాకతీయ విశ్వవి ద్యాలయం ఏర్పడింది. అప్పుడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రిన్సిపల్‌గారు ఏబీవీపీ ఉపాధ్యక్షులుగా ఉన్నా రు. వరంగల్‌కు వచ్చిన జిల్లెళ్లమూడి అమ్మను క్యాం పస్‌లో ఉన్న మహిళా విద్యార్థుల హాస్టల్‌కు తీసుకువెళ్లి విద్యార్థినులతో ఆమెకు పాదాభివందనం చేయించారు ఆ ఆచార్యుల వారు.

ఈ నేపథ్యంలో ఎమర్జెన్సీ తొలగి వరంగల్‌లో రాడికల్ విద్యార్థి సంఘం రెండవ మహాస భలు 1978 ఫిబ్రవరిలో జరిగి ‘గ్రామాలకు తరలండి’ పిలుపు ఇచ్చింది. కాకతీయ విశ్వవిద్యాలయం కింద రాడి కల్ విద్యార్థి సంఘం అని సొంతం చేసుకున్నారు. ప్రిన్సి పల్ రూం ముందర ఆర్‌ఎస్‌యూ వాళ్లు పోస్టర్ వేశారని, తొలగించకపోతే తామూ పోస్టర్లు వేసి ఆందోళన చేస్తా మని ఏబీవీపీ విద్యార్థులు గుంపుగా వెళ్లి కేయూ క్యాం పస్ కాలేజీ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆ పోస్టర్‌లో ఏముందో చూడకుండానే ఆ పోస్టర్‌ను చింపే యించాడు.

వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ సాయం కళాశాలలో పనిచేస్తూ ఆ సంవత్సరమే ఎంఏ తెలుగులో చేరిన ఎన్.కె. రామా రావును ప్రిన్సిపల్ పిలిచి సంజా యిషీ కోరాడు-ఎన్.కె.రామారావు అప్పటికే విరసం సభ్యుడుగా, కవిగా, గాయకుడుగా సుప్రసిద్ధుడు. క్యాంపస్‌లో సహాధ్యాయి జి.లింగమూర్తి, పులి అంజ య్య, ఎం.గంగాధర్, గోపగాని ఐలయ్యల సాహచర్యం లో ఆర్‌ఎస్‌యూలో కూడా తిరుగుతున్నాడు. ప్రిన్సిపా ల్‌కు తెలిసిన, ప్రిన్సిపాల్ దబాయించి అడగగలిగిన సబార్డినేట్ అతడే గనుక పిలిచాడు. ఇంతలో ఆర్‌ఎస్ యూ విద్యార్థులు కూడ అధిక సంఖ్యలోనే ప్రిన్సిపాల్ రూంకు చేరుకున్నారు.

రవీంద్రుని గీతాన్ని ఎందుకు తొలగించారు అని ప్రశ్నించడానికి. ‘మీరు ఆ పోస్టర్ చూశారా? అది రవీంద్రుని సుప్రసిద్ధగీతం’ అన్నాడు ఎన్‌కే. చింపబడి తన టేబుల్‌పై (బహుశా పోలీసులకు అప్పగించడానికి) ఉన్న పోస్టర్ ముక్కలను అప్పుడు తీసి చూశాడాయన. అవాక్కయ్యాడు. ఆయన నిజానికి చాలా మంచి వ్యక్తి. లౌకిక ప్రజాస్వామ్యవాది. పబ్లిక్ అడ్మిని స్ట్రేషన్ ప్రొఫెసర్ పి.ఎ.జేమ్స్. కాని ప్రిన్సిపాల్ అధికా రం, ఏబీవీపీ ఒత్తిడి-సమర్థించుకోవాలి-‘కావచ్చు. కాని కింద రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఎందుకు రాశా రు? అది అభ్యంతరకరం’ అన్నాడు.

‘అది గోడపత్రిక సార్. సుప్రసిద్ధమైన సూక్తులు, కవితలు, కొటేషన్స్‌ను ప్రసిద్ధమైన వ్యక్తులవి ఆయా సంస్థలు, పత్రికలు ఉప యోగించుకునే సంప్రదాయం ఉందికదా సార్’ అన్నాడా యన. ‘కాని నా అనుమతి లేకుండా ప్రిన్సిపాల్ ఆఫీసు ముందుగానీ, క్యాంపస్‌లోగానీ ఆర్‌ఎస్‌యూ పోస్టర్స్ వేయకూడదు’ అన్నాడు. ‘ఈ ఉత్తర్వులు మాకేనా, ఏబీవీ పీకి కూడా వర్తిస్తాయా?’ అన్నారు విద్యార్థులు. ‘అంద రికీ వర్తిస్తాయి’ అన్నాడు ప్రిన్సిపాల్.

‘ఏబీవీపీకి రాష్ట్ర ఉపాధ్యక్షులే ప్రొఫెసర్లు, లెక్చరర్స్ ఉన్నారు కదా సార్’ అన్నారు ఒకే గొంతుతో విద్యార్థులు. సరేసరే వెళ్లండన్నా రాయన- ఎమర్జెన్సీ ఎత్తివేసిన ప్రజాస్వామిక వాతావర ణంలో తన గొంతు తనకే ఎబ్బెట్టుగా వినిపించినట్టున్న దతనికి. కాని ఇప్పుడేమో ఏడాదిగా ఒక అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతున్నట్టుగా ఉన్నది దేశమంతటా.

ఈ స్థితిలో ఉన్నత విద్యాలయాలు తమ స్వతంత్ర ప్రతిప త్తిని కాపాడుకొని అవి నిర్వహించవలసిన భావాల సం ఘర్షణను స్వేచ్ఛగా, స్వతంత్రంగా చేపట్టగలవా? అం దుకు ప్రభుత్వాలు, ప్రభుత్వాలను నడుపుతున్న రా జ్యాంగేతర ఫాసిస్టుశక్తులు అనుమతిస్తాయా? అన్నది పెద్ద ప్రశ్న.  (తరువాత పరిణామాలతో మద్రాస్ ఐఐటీ తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది.)
- వరవరరావు
(వ్యాసకర్త, విరసం నేత) మొబైల్: 9676541715

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement