సీమాంచల్: బంగ్లాదేశ్ చొరబాటుదారులు రహస్యంగా బీహార్‌లోని సీమాంచల్ ప్రాంతానికి వచ్చి స్థిరపడుతున్నారు. బీహార్‌లో కొన్నేళ్లుగా రహస్యంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ పౌరుడిని అరారియా పోలీసులు అరెస్టు చేసిన దరిమిలా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
బంగ్లాదేశ్‌కు చెందిన ఓ పౌరుడు గత కొన్నేళ్లుగా అరారియా పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపూర్ కోడర్‌కట్టి పంచాయతీలోని మారంగి తోలాలో రహస్యంగా నివసిస్తున్నాడు. ఆయన తన పాస్‌పోర్టుకు సంబంధించిన పని కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు ఈ విషయం వెలుగు చూసింది. పోలీసుల విచారణలో అతను బంగ్లాదేశ్ నివాసి అని, ఆరేళ్లుగా కతిహార్, అరారియాలో రహస్యంగా నివసిస్తున్నట్లు తేలింది.
ఈ బంగ్లాదేశ్ పౌరుడు భారతదేశంలో మోసపూరితంగా గుర్తింపు కార్డు కూడా సంపాదించాడు. ఇందులో అతని పేరు నవాబ్‌గా నమోదయివుంది. పోలీసులు అతనిని అరెస్ట్ చేసిన దరిమిలా, మరిన్ని రహస్యాలను బయటపెట్టాడు. ఈ నేపధ్యంలో పోలీస్ స్టేషన్‌లో ఏఎస్పీ రాంపుకర్ సింగ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, ఆ బంగ్లాదేశీయునికి సంబంధించిన వివరాలు తెలిపారు. తాము అరెస్టు చేసిన బంగ్లాదేశీయుడు హకీమ్ హకీమ్ పిటా అన్సార్ అలీ తన పేరును నవాబ్ (24)గా మార్చుకుని మారంగి తోలాలోలో నివసిస్తున్నాడని తెలిపారు. హకీమ్ మూడేళ్ల క్రితం ఇక్కడే పెళ్లి చేసుకున్నాడని, తన బంగ్లాదేశ్ గుర్తింపును దాచి ఇక్కడ నివసిస్తున్నాడన్నారు. స్థానిక పౌరునిగా గుర్తింపు పొందేందుకు అక్రమంగా ఓటర్ కార్డు, ఆధార్ కార్డును కూడా తయారు చేయించుకున్నాడని తెలిపారు. హకీమ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఇది కూడా చదవండి: ఆడ శిశువును విక్రయించిన తల్లి
Comments
Please login to add a commentAdd a comment