address
-
కేరాఫ్ అడ్రస్ లేదు!
సాక్షి, సిటీబ్యూరో: ఏ అడ్రస్ లేనివాళ్లకు నగరంలోని కొన్ని ప్రాంతాలు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. సిటీలోని బహిరంగ ప్రదేశాల్లో ఆశ్రయం పొందుతున్న వీరు స్వచ్ఛంద సంస్థలు, ప్రార్థన స్థలాలు, జీహెచ్ఎంసీపై ఆధారపడి బతికేస్తున్నారు. అనునిత్యం నిషాలో జోగుతూ, ఘర్షణలకు దిగుతూ స్థానికంగా ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ఇలాంటి వారిలో కొందరు కొన్ని నేరాలు చేస్తున్నప్పటికీ తీవ్రమైతే తప్ప రికార్డుల్లోకి ఎక్కట్లేదు. గతంలో నగర పోలీసు విభాగం ఈ అభాగ్యుల డేటాబేస్ నిర్వహించింది. ప్రస్తుతం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవకపోవడంతో వీరికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లోనే.. ఈ అపరిచితుల సమస్య ప్రధానంగా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి రవాణా సౌకర్యం ఉన్న ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటోంది. సికింద్రాబాద్‌లోని క్లాక్ టవర్, రైల్వేస్టేషన్, పాస్‌పోర్టు కార్యాలయం చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు నాంపల్లి, జేబీఎస్, సీబీఎస్ తదితర చోట్ల వీరు కనిపిస్తుంటారు. వీరిలో కొందరు మతిస్థిమితం సరిగా లేక ఇలా వస్తుండగా... మరికొందరు కుటుంబీకులతో సరిపడక, ఇబ్బందుల నేపథ్యంలో వచ్చేస్తున్నారు. ఫుట్‌పాత్‌లు, పార్కులతో పాటు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో జీవిస్తున్నారు. అనివార్య కారణాల నేపథ్యంలో ఇలాంటి అభాగ్యుల్లో అనేక మంది గంజాయి, వైట్నర్, మద్యంతో పాటు వివిధ రకాలైన మత్తు టాబ్లెట్లకు బానిసలుగా మారుతున్నారు. ఆ మత్తులో ఘర్షణలకు దిగడంతో పాటు స్థానికంగా అనేక సమస్యలు సృష్టిస్తున్నారు. గతంలో డేటాబేస్ క్రియేట్ చేసిన పోలీసులు... ఈ అభాగ్యులు, అనాథలు నేరాలకు పాల్పడుతుండటంతో నాంపల్లి పోలీసులు గతంలో డేటాబేస్ ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్‌తో పాటు పబ్లిక్‌గార్డెన్‌లో వీరి బెడద ఎక్కువగా ఉంటుంది. దీంతో మధ్య మండల అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టడం ద్వారా వీరి డేటాబేస్ రూపొందించారు. అందులో పేరు, ఫొటో, చిరునామాతో పాటు వేలిముద్రల్నీ సంగ్రహించి స్టోర్ చేశారు. దీనివల్ల భవిష్యత్తులో జరగరానిది జరిగితే ఈ డేటా ఉపయుక్తంగా మారుతుందని ఈ చర్యలు తీసుకున్నారు. అయితే కాలక్రమంలో పోలీసులు వీరి మాట పూర్తిగా మర్చిపోయారు. అయితే షెల్టర్ హోమ్స్‌కు లేదా స్వస్థలాలకు పంపాలని, లేదంటే కనీసం వీరిపై కన్నేసి ఉంచడంతో పాటు డేటాబేస్ రూపొందించాలని పలువురు కోరుతున్నారు. అలాకాకుంటే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని స్పష్టం చేస్తున్నారు. కడుపు నింపుతున్న స్వచ్ఛంద సంస్థలు..ఇలా బహిరంగ ప్రదేశాల్లో జీవిస్తున్న వారిలో కొందరు చిన్న చిన్న పనులు చేసుకుని పొట్టపోసుకుంటున్నారు. వీరికి జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న రూ.5 క్యాంటీన్లు ఆకలి తీరుస్తున్నాయి. అత్యధికులు మాత్రం కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ప్రార్థన స్థలాలు, నగర వాసులు అందిస్తున్న ఆహారం తిని బతికేస్తున్నారు. ఇలాంటి వారిలో కొందరు స్థానికంగా ఉన్న దుకాణాలు, వాహనచోదకులు, పాదచారుల నుంచి చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నారు. ఏదైనా పెద్ద ఉదంతం చోటు చేసుకున్నప్పుడు మాత్రమే రికార్డుల్లోకి ఎక్కుతున్నారు. అయితే ఈ నేరాలపై ఫిర్యాదు చేయడానికి ఎవరూ ఆసక్తి చూపకపోవడం వీరికి కలిసి వస్తోంది. నగరంలో విదేశీ వీవీఐపీల పర్యటనలు ఉన్నప్పుడు మాత్రమే యంత్రాంగాలకు వీరితో పాటు బిచ్చగాళ్లు గుర్తుకు వస్తుంటారు. ఆ సమయంలో హడావుడిగా షెల్డర్ హోమ్స్‌కు తరలించే అధికారులు ఆపై వీరి విషయం మర్చిపోతుంటారు. -
బంగ్లాదేశ్ ‘హకీమ్’.. బీహార్ ‘నవాబ్’గా మారి..
సీమాంచల్: బంగ్లాదేశ్ చొరబాటుదారులు రహస్యంగా బీహార్‌లోని సీమాంచల్ ప్రాంతానికి వచ్చి స్థిరపడుతున్నారు. బీహార్‌లో కొన్నేళ్లుగా రహస్యంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ పౌరుడిని అరారియా పోలీసులు అరెస్టు చేసిన దరిమిలా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.బంగ్లాదేశ్‌కు చెందిన ఓ పౌరుడు గత కొన్నేళ్లుగా అరారియా పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపూర్ కోడర్కట్టి పంచాయతీలోని మారంగి తోలాలో రహస్యంగా నివసిస్తున్నాడు. ఆయన తన పాస్‌పోర్టుకు సంబంధించిన పని కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు ఈ విషయం వెలుగు చూసింది. పోలీసుల విచారణలో అతను బంగ్లాదేశ్ నివాసి అని, ఆరేళ్లుగా కతిహార్, అరారియాలో రహస్యంగా నివసిస్తున్నట్లు తేలింది.ఈ బంగ్లాదేశ్ పౌరుడు భారతదేశంలో మోసపూరితంగా గుర్తింపు కార్డు కూడా సంపాదించాడు. ఇందులో అతని పేరు నవాబ్‌గా నమోదయివుంది. పోలీసులు అతనిని అరెస్ట్ చేసిన దరిమిలా, మరిన్ని రహస్యాలను బయటపెట్టాడు. ఈ నేపధ్యంలో పోలీస్ స్టేషన్లో ఏఎస్పీ రాంపుకర్ సింగ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, ఆ బంగ్లాదేశీయునికి సంబంధించిన వివరాలు తెలిపారు. తాము అరెస్టు చేసిన బంగ్లాదేశీయుడు హకీమ్ హకీమ్ పిటా అన్సార్ అలీ తన పేరును నవాబ్ (24)గా మార్చుకుని మారంగి తోలాలోలో నివసిస్తున్నాడని తెలిపారు. హకీమ్ మూడేళ్ల క్రితం ఇక్కడే పెళ్లి చేసుకున్నాడని, తన బంగ్లాదేశ్ గుర్తింపును దాచి ఇక్కడ నివసిస్తున్నాడన్నారు. స్థానిక పౌరునిగా గుర్తింపు పొందేందుకు అక్రమంగా ఓటర్ కార్డు, ఆధార్ కార్డును కూడా తయారు చేయించుకున్నాడని తెలిపారు. హకీమ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.ఇది కూడా చదవండి: ఆడ శిశువును విక్రయించిన తల్లి -
నెతన్యాహు ప్రసంగానికి హాజరుకాను:సెనేటర్
యుద్ధ నేరస్తుడు బెంజమిన్ నెతన్యాహును యూఎస్ కాంగ్రెస్‌లో మాట్లాడేందుకు చట్టసభ సభ్యులు ఆహ్వానించడాన్ని సెనేటర్ బెర్నీ శాండర్స్ తప్పబట్టారు. తాను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రసంగానికి హాజరుకావడం లేదని పేర్కొన్నారు.అక్టోబర్ ఏడవతేదీ నాటి హమాస్ ఉగ్ర దాడికి వ్యతిరేకంగా తమ దేశాన్ని రక్షించుకునేందుకు ఇజ్రాయెల్‌కు హక్కు ఉంది. అయితే నెతన్యాహు రైట్ వింగ్ తీవ్రవాద నాయకత్వంతో పాలస్తీనా ప్రజలపై యుద్ధానికి దిగారు. ఇటువంటి హక్కు ఇజ్రాయెల్‌కు లేదంటూ సెనేటర్ బెర్నీ శాండర్స్ సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు.రిపబ్లికన్, డెమొక్రాటిక్ నేతలు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును సెనేట్, ప్రతినిధుల సభలో ప్రసంగించేందుకు అధికారికంగా ఆహ్వానించారు. దీనికి నెతన్యాహు అంగీకారాన్ని తెలిపారని, కాంగ్రెస్ ఉభయ సభల ముందు ఇజ్రాయెల్‌కు ఆయన ప్రాతినిధ్యం వహించనున్నారని నెతన్యాహు కార్యాలయం తెలిపింది. అయితే ఈ కార్యక్రమం ఎప్పుడు జరిగేదీ వెల్లడించలేదు. Right now tens of thousands of children in Gaza are facing starvation, malnutrition, and famine.And Congressional leadership thinks it’s okay to invite war criminal Netanyahu to address Congress?No. Unacceptable. pic.twitter.com/sun43kAE4z— Bernie Sanders (@BernieSanders) June 4, 2024 -
ఆధార్‌కార్డులో ఆంధ్రప్రదేశ్ ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చు : కలెక్టర్ డాక్టర్ ప్రియాంక
భద్రాద్రి/కొత్తగూడెం: ప్రజాపాలన దరఖాస్తులకు ఆదాయం, లోకల్ ఏరియా సర్టిఫికెట్లు జతపర్చాల్సిన అవసరంలేదని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. దరఖాస్తుదారులు వ్యక్తం చేస్తున్న సందేహాలపై శుక్రవారం ఆమె స్పష్టతనిచ్చారు. ఆధార్‌కార్డుల్లో ఆంధ్రప్రదేశ్ అని ఉన్నా మార్చాలిన అవసరం లేదని తెలిపారు. ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్, పాస్‌పోర్టు ఫొటో సరిపోతాయని పేర్కొన్నారు. ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్, ఖమ్మం జిల్లా ఉంటే దరఖాస్తులు తీసుకోరని, ఆదాయం, కుల ధ్రువీకరణపత్రాలు అడుగుతున్నారని సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లను నమ్మవద్దని సూచించారు. సందేహాలు ఉంటే ప్రజలు హెల్ప్‌డెస్క్‌ను, రెవెన్యూ, ఎంపీడీఓ, ఎంపీఓ, గ్రామకార్యదర్శి, అంగన్వాడీ సిబ్బంది, మహిళాస్వయం సహాయక సంఘ సభ్యులను సంప్రదించాలని వివరించారు. అసత్య ప్రచారాలను నమ్మొద్దన్నారు. ఇతర వివరాలకు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్‌రూం 08744–241950కు కార్యాలయ పనివేళల్లో ఫోన్ చేయాలని చెప్పారు. రెండో రోజు 74 గ్రామ పంచాయతీల్లో, మూడు మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన గ్రామసభలు నిర్వహించామని తెలిపారు. 34,995 గృహాల లబ్ధిదారుల నుంచి 44,711 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేషస్పందన లభిస్తోందని తెలిపారు. స్వీకరించిన ప్రతి దరఖాస్తుకు బాధ్యతగా రశీదు అందజేయడంతోపాటు ప్రత్యేకంగా రిజిస్టర్లో నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికి దరఖాస్తులను ఉచితంగా అందజేస్తున్నట్లు చెప్పారు. జిరాక్స్ కాపీలకు అధిక ధరలు వసూలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, సంబంధిత జిరాక్స్ కేంద్రం అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఎవరైనా ఎక్కువ వసూలు చేస్తే తహసీల్దార్, ఎంపీడీఓ, ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని సూచించారు. 30న గ్రామ పంచాయితీ, మున్సిపాలిటీలలో షెడ్యూల్ ప్రకారం గ్రామ సభలు జరుగుతాయని తెలిపారు. ఇవి చదవండి: దరఖాస్తు ఫారాలు విక్రయిస్తే కేసులు.. : కలెక్టర్ రాహుల్‌రాజ్ -
అడ్రస్ అడిగిన డెలివరీ బాయ్‌పై దాడి.. గంటపాటు మహిళ హైడ్రామా!
దేశ రాజధాని ఢిల్లీలో అడ్రస్ అడిగిన వ్యక్తి కత్తిపోట్లకు గురైన సంఘటన సంచలనం రేపింది. ఒక మహిళను డెలివరీ బాయ్ ఏదో అడ్రస్ అడగగా, ఆమె ఆగ్రహంతో ఊగిపోతూ కత్తితో అతనిపై దాడి చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా, వారిపై కూడా ఆ మహిళ దాడికి తెగబడింది. అ మహిళ కారణంగా తీవ్రంగా గాయపడిన ఆ డెలివరీ బాయ్‌ని పోలసీలు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. నింతురాలు దాడికి పాల్పడిన వైనం అక్కడి సీసీటీవీలో కెమెరాలో రికార్డయ్యింది. పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఈ ఘటన ఢిల్లీలోని ద్వారకా సెక్టర్-23లో చోటుచేసుకుంది. ఒక ప్రవేటు కంపెనీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న గోలూ(18) రాత్రి వేళ డెలివరీ ఇచ్చేందుకు డీడీఏ ఫ్లాట్‌కు వెళ్లాడు. అక్కడున్న 42 ఏళ్ల మహిళను ఒక చిరునామా గురించి అడిగాడు. వెంటనే ఆ మహిళ కోపగించుకుంటూ, ఆ యువకునిపై కత్తితో మూడుసార్లు దాడి చేసింది. ఆ యువకుడు బాధతో కేకలు పెడుడుండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు విషయం తెలియజేశారు. వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ మహిళను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయితే ఆ మహిళ కత్తితో ఒక మహిళా కానిస్టేబుల్‌పై దాడికి యత్నించింది. అయితే ఆమె అక్కడున్న ఇతర మహిళల సాయంతో ఆ మహిళ చేతిలో ఉన్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంతలోనే ఆ మహిళ పోలీసుల చేతిలోని లాఠీ లాక్కొని పీసీఆర్ వ్యాన్‌తోపాటు అక్కడున్న మరికొన్ని వాహనాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించింది. ఎంతో కష్టం మీద పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ డ్రామా గంటపాటు కొనసాగింది. ఎట్టకేలకు పోలీసులు ఆ మహిళను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆ మహిళ సొసైటీలో ఒక అద్దె ఇంటిలో ఒంటరిగా ఉంటోంది. గతంలోనూ ఆమె ఇలాంటి దాడులకు పాల్పడిందని స్థానికులు చెబుతున్నారు. డెలివరీ బాయ్ గోలూ తెలిపిన వివరాల ప్రకారం అతను ఆమెను ఏదో చిరునామా అడగగా, ఆమె వెంటనే అతనిని స్కూటీ నుంచి కిందకు తోసివేసి, వాహనం తాళాలు లాక్కొన్ని వాటిని పారవేసింది. తరువాత అతనిపై కత్తితో దాడికి దిగింది. రోడ్డుపై నానా హంగామా చేసిన మహిళను పోలీస్ స్టేషన్‌కు తరలించి, కౌన్సెలింగ్ చేస్తున్నారు. ఆమెపై ఎవరూ ఫిర్యాదు చేయనందున పోలీసులు ఇంకా తదుపరి చర్యలు చేపట్టలేదు. ఇది కూడా చదవండి: అర్థరాత్రి తెల్లటి దుస్తుల్లో చెట్టుకు వేలాడుతున్న మహిళ.. తెల్లారేసరికి..! -
‘అడ్రస్’లేని భూములకు సర్వేనంబర్
ఏ భూమి అయినా ధరణిలో రిజిస్ట్రేషన్ చేయాలంటే ముందుగా స్లాట్ బుక్ చేయాలి. పట్టాదారు పాస్‌బుక్, ఖాతా నంబర్, సర్వే నంబర్, క్రయ విక్రయాలు చేసే వ్యక్తుల పేర్లు, వారి ఆధార్‌కార్డు, ఫోన్‌నంబర్లు ఆ స్లాట్‌లో పొందుపరచాలి. కానీ ఇక్కడ ఆ భూమికి సంబంధించి ఎలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్ లేకపోయినా, సర్వే నంబర్, ఖాతా నంబర్‌తో పనిలేకుండా స్లాట్ ఎలా బుక్ అయ్యింది? రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది? అనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వంలోని కొందరు పెద్దలు.. రెవెన్యూ అధికారులు కుమ్మక్కై ఏకంగా ‘బిలా దాఖలా’ భూమికి ఎసరు పెట్టారు. రికార్డులు లేవనే సాకుతో పొజి షన్లో ఉన్న రైతులను మభ్యపెట్టి బహిరంగ మార్కెట్ కంటే.. చౌకధరకు ఈ భూములు కొట్టేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఆ వెంటనే వాటికి సర్వే నంబర్ సృష్టించి, ధరణిలో రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకుంటున్నారని, వారు దరఖాస్తు చేసిందే తడవుగా అధికారు లు ఈ భూములను వారి పేరున బదలాయిస్తున్నారని అంటున్నారు. బహిరంగ మార్కెట్లో రూ.వెయ్యి కోట్లకుపైగా విలువ చేసే ఈ భూమిని.. చాలా తక్కువ రేటుకు కొనేస్తున్నారని సమాచారం. కోకాపేట సమీపంలో ఉండడంతోనే... రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మోకిల–కొండకల్ గ్రామాల మధ్యన కొండకల్ రెవెన్యూ పరిధిలో 76.24 ఎకరాల ఏ అడ్రస్ లేని(బిలా దాఖలా) భూమి ఉంది. దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ వద్ద ఎలాంటి రికార్డులు లేవు. 45 మంది స్థానిక రైతులు ఏళ్ల తరబడి ఈ భూములను సాగు చేసుకుంటున్నారు. పొజిషన్లో ఉన్నా వారి పేర్లు కూడా రికార్డుల్లో లేవు. పహాణీలు, పట్టాదారు పాసు పుస్తకాలు అసలే లేవు. కనీసం వీటి సర్వే నంబర్ ఏమిటో కూడా చాలామందికి తెలియదు. బహిరంగ మార్కెట్లో ఎకరా రూ.15 కోట్ల పైమాటే. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్‌కు ముఖ్యంగా కోకాపేటకు అతిసమీపంలో ఉన్న ఈ భూములపై కొంతమంది ప్రభుత్వ పెద్దల కన్నుపడింది. ఎలాగైనా వీటిని చేజిక్కించుకోవాలని భావించి తెరవెనుక కథ నడిపించారు. ఏ అడ్రస్ లేని ఈ మిగులు భూములు ప్రభుత్వానికి చెందుతాయని, ఈ విషయం బయటకు చెబితే..వాటిని సర్కారు లాగేసుకుంటుందని చెప్పి రైతుల నోరు మూయిస్తున్నారు. అంతా కలిసి.. ఓ వైపు రికార్డులు లేవని, ప్రభుత్వ భూములని ప్రచారం చేస్తూ పొజిషన్లో ఉన్న రైతులను భయాందోళనకు గురి చేస్తూ.. మరోవైపు రెవెన్యూ అధికారులతో ఈ భూములకు ఎంజాయ్మెంట్ సర్వే చేయించారు. తహసీల్దార్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా పాత రికార్డులను పరిశీలించి ఏడీ రిపోర్టు జారీ చేశారు. దీని ఆధారంగా కలెక్టర్ సూచన మేరకు సీసీఎల్ఏ ఈ భూములకు క్లియరెన్స్ కూడా ఇచ్చినట్టు సంబంధిత అధికారులు చెబుతున్నారు. అయితే అప్పటికే ఈ భూములపై కన్నేసిన బడా నేతలు, రియల్టర్లు, వ్యాపారులు పహాణీలు, పట్టాదారు పాసుపుస్తకాలు, సర్వే నంబర్, ఖాతా నంబర్లు లేవనే అంశాన్ని తెరపైకి తెచ్చారు. ప్రభుత్వం నుంచి ఏదైనా ఇబ్బంది ఉంటే తాము చూసుకుంటామని నమ్మ బలికారు. భూములు అమ్మాల్సిందిగా వారిపై ఒత్తిడి తీసు కొచ్చారు. చేసేది లేక రైతులు కూడా తలవంచక తప్ప లేదు. రైతుల్లో ఉన్న ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని రూ.2 కోట్లకు ఎకరం చొప్పున 21 ఎకరాలకుపైగా కొల్లగొట్టారు. అంతేకాదు ఎలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్లు సమర్పించకుండానే ‘ధరణి’లో స్లాట్ బుక్ చేసి.. గుట్టుగా రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. సర్వే నంబరు 555..దానికి బై నంబర్లు వేసి... ఇప్పటి వరకు ఏ అడ్రస్ లేని ఈ భూములకు రైతుల నుంచి చేతులు మారిన వెంటనే కొత్త అడ్రస్ సృష్టించారు. సర్వే నంబర్ 555గా నామకరణం చేసి..బై నంబర్లతో ఆయా భూములను బడాబాబులకు కట్టబెడుతున్నారు. ఈ విషయం బయటకు పొక్కితే.. ఎక్కడ తన ఉద్యోగానికి ఎసరు వస్తుందోననే భయంతో ఈ భూముల రిజిస్ట్రేషన్ సమయంలో ప్రస్తుత తహసీల్దార్ సెలవులో వెళ్లి.. డిప్యూటీ తహసీల్దార్లతో పని కానిచ్చేసినట్టు విశ్వసనీయ సమాచారం. శేరిగూడ భూములపైనా కన్ను సంగారెడ్డి– రంగారెడ్డి జిల్లాల సరిహద్దులోని శేరిగూడ రెవెన్యూ పరిధిలోనూ 90 ఎకరాలకు పైగా బిలా దాఖలా భూములు ఉన్నాయి. వీటిని కూడా కొల్లగొట్టేందుకు రెవెన్యూ అధికారులు, నేతలు, రియల్టర్లు, వ్యాపారులు తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలిసింది. విచిత్రమేమంటే.. ఏళ్ల తరబడి కబ్జాలో ఉండి.. సాగు చేస్తున్న రైతుల పేర్లు మాత్రం ఇప్పటికీ ధరణిలో కనిపించడం లేదు. కానీ వారి నుంచి కొనుగోలు చేసిన నేతలు, వ్యాపారులు, రియల్టర్ల పేర్లు మాత్రం ఆ వెంటనే నమోదవుతున్నాయి. ఇదే అంశంపై ఇటీవల కొంత మంది రైతులు మండల ఆఫీసులో ఆందోళనకు దిగారు. ప్రభుత్వం అనుమతించింది కొండకల్ రెవెన్యూ పరిధిలో ‘బిలా దాఖలా’ భూములు ఉన్న మాట వాస్తవమే. వీటికి సంబంధించి గతేడాది ప్రభుత్వం ఎంజాయ్మెంట్ సర్వే చేయించింది. ఆ నివేదిక ఆధారంగా భూ రికార్డులు, సర్వే శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పాత రికార్డులను పరిశీలించి, వాటికి సర్వే నం.555గా నిర్ధారించింది. కలెక్టర్ సిఫార్సు మేరకు సీసీఎల్ఏ ఈ భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇచ్చింది. ఆ మేరకే రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం.’ అని చెప్పిన తహసీల్దార్ నయీమొద్దీన్.. పొజిషన్లో ఉన్న రైతుల వివరాలు ధరణిలో ఎందుకు నమోదు చేయడం లేదని ‘సాక్షి’ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం దాటవేయడం విశేషం. – తహసీల్దార్, నయీమొద్దీన్ -
ఆన్లైన్లో కండోమ్స్ ఆర్డర్.. అడ్రస్ మార్చడం మర్చిపోయాడు..
ఒక యువకుడు తెలిసి చేశాడో తెలియక చేశాడో గాని ఆన్లైన్లో కండోమ్స్ ఆర్డర్ చేశాడు. అది తానున్న చోటికి కాకుండా ఇంటికి చేరడంతో యువకుడి తల్లి షాక్ కు గురైంది. ఈ సంఘటనను ఆ యువకుడి సోదరి సోషల్ మీడియాలో పంచుకోగా నెటిజన్ల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. ఓ యువకుడు ఆన్లైన్ షాపింగుకు బాగా అలవాటు పడ్డాడో ఏమో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో కండోమ్స్ ఆర్డర్ చేశాడు. ఆర్డర్ అయితే బాగానే చేశాడు కానీ అడ్రస్ మార్చడం మర్చిపోయాడా ప్రబుద్ధుడు. దీంతో ఆ కండోమ్స్ పార్సిల్ కాస్తా తానున్న చోటికి కాకుండా తన ఇంటికి చేరింది. ఆ యువకుడి తల్లి తన కొడుకు ఎదో సర్ప్రైజ్ ప్లాన్ చేశాడనుకుందో ఏమో ఆతృతగా పార్సిల్ తెరిచింది. లోపల కండోమ్స్ చూసి పాపం ఆ తల్లి షాక్ కు గురైంది. ఈ సంఘటనను ఆ యువకుడి సోదరి ఎలెనా ట్విట్టర్లో పోస్ట్ చేసి.. అన్నయ్య పాపం అడ్రస్ మార్చడం మర్చిపోయినట్టున్నాడు.. అమ్మ ఈ పార్సిల్ రిసీవ్ చేసుకుందని రాసి కండోమ్స్ ఫోటోను షేర్ చేసింది.. Looks like my brother forgot to change the address because my mom just received his instamart order💀💀 pic.twitter.com/BmZbLyEAtr — elena (@elena4yo) July 4, 2023 ఈ పోస్ట్ కు అతి తక్కువ వ్యవధిలోనే లక్షల్లో వ్యూస్ వచ్చాయి. చాలా మంది తర్వాత ఏం జరిగిందని ప్రశ్నించగా.. అమ్మకు దిమ్మతిరిగి తమ ఫ్యామిలీ గ్రూపు నుంచి అన్నయ్యని తొలగించిందని చెబుతూ వాట్సప్ గ్రూపులో తన సోదరుడిని తొలగించిన స్క్రీన్ షాట్ పోస్ట్ చేసింది. దీంతో ట్విట్టరంతా నవ్వులమయమైంది. pic.twitter.com/FGU8tUIyuV — elena (@elena4yo) July 4, 2023 ఇవ్వాళ రేపు ఏమి కొనాలన్నా అంతా ఆన్లైన్లో నడుస్తోంది మరి. మొబైల్ ఆన్ చేసి మీట నొక్కితే చాలు కాళ్ళకు భారం తగ్గి అన్నీ కళ్ల ముందుకు వచ్చి వాలుతున్నాయి. అలాగని అన్నిటినీ ఆన్లైన్లో ఆర్డర్ చేయకుండా కొన్నిటిని వెళ్లి కొనుక్కోవడమే మంచిదని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఇది కూడా చదవండి: బైక్ హెల్మెట్ ధరించి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్.. ఎందుకంటే.. -
ఆధార్ బిగ్ అప్డేట్ ఒక్క ఫోన్ తో ఆధాార్ సమస్యలకు చెక్
-
రాష్ట్రపతి ప్రసంగంలో ప్రత్యేకత ఏమి లేదు: కాంగ్రెస్ చీఫ్ ఎం ఖర్గే
బడ్జెట్‌ను చూడకుండా దాని గురించి మాట్లాడటం తగదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు. పార్టీ తరుఫున మీడియా సమావేశం ఏర్పాటు చేస్తామని , అందులో నిపుణులైన పార్టీ నేతలే దీని గురించి ముందుగా మట్లాడతారని ఆ తర్వాత తాను మాట్లాడతానని చెప్పారు. మంగళవారం ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంలో అంతగా చెప్పుకోదగ్గ ప్రత్యేకత ఏమి లేదన్నారు ఖర్గే. ఇదిలా ఉండగా, కేంద్ర బడ్జెట్‌ను సమర్పించే ముందు సీతారామన్‌ని రాష్ట్రపతి భవన్లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రి వర్గ సమావేశం అనంతరం ఖర్గే కలిశారు. కేంద్ర బడ్జెట్ 2023-24 సమర్పణ పార్లమెంటులో సీతారామన్ ప్రసంగంతో ప్రారంభమైంది. ఈ బడ్జెట్‌ను అమృత్ కాల్లో మొదటి బడ్జెట్‌గా పేర్కొన్నారు నిర్మలమ్మ. ఈ అమృత్కాల్ బడ్జెట్లో సంపన్నమైన సమ్మిళిత భారతేదేశాన్ని ఊహించాం అన్నారు. సవాళ్ల సమయం ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ ఉజ్వల భవిష్యత్తు వైపు పయనిస్తోంది. ఈ మేరకు సీతారామన్ 2022-23 ఆర్థిక సర్వేకి సంబంధించిన ముఖ్యాంశాలు, గణాంక అనుబంధం తోపాటు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల మొదటి రోజైన మంగళవారం ప్రవేశ పెట్టారు. కాగా, ఖర్గే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, చైనాతో సరిహద్దు వివాదం వంటి అంశాలను బడ్జెట్ సెషన్లో లేవనెత్తుతామని చెప్పారు. అలాగే కొంతమంది పెట్టుబడిదారులకు ప్రభుత్వ బ్యాంకులు బారీ మొత్తంలో రుణాలు ఇస్తున్న విషయాన్ని కూడా పార్టీ ప్రస్తావిస్తుందని చెప్పారు మల్లికార్జున ఖర్గే. (చదవండి: బడ్జెట్లో టంగ్ స్లిప్ అయిన నిర్మలమ్మ..ఓహ్ !సారీ అంటూ...) -
‘ఆధార్ కార్డు’లో అడ్రస్ మార్పు మరింత ఈజీ
న్యూఢిల్లీ: ఆధార్ కార్డులో చిరునామాను మార్చుకోవడం మరింత సులభతరంగా మారింది. ఇంటిపెద్ద(హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ) అంగీకారంతో ఆధార్ పోర్టల్‌లో (ఆన్లైన్లో) చిరునామా సులువుగా మార్చుకోవచ్చని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ కొత్త విధానంలో ఇంటి పెద్దతో సంబంధాన్ని ధ్రువీకరించే ఏదైనా పత్రం సమర్పించాల్సి ఉంటుంది. రేషన్ కార్డు, మార్కుల షీట్, మ్యారేజ్ సర్టిఫికెట్, పాస్‌పోర్టు తదితర ధ్రువీకరణ పత్రాల్లో ఏదైనా ఒకటి సమర్పించవచ్చు. కానీ, ఇందులో ఇంటిపెద్ద పేరు, దరఖాస్తుదారుడి పేరు, వారిద్దరి మధ్య సంబంధం గురించి తప్పనిసరిగా ఉండాలి. ఆన్లైన్లో ఓటీపీ ఆధారిత ధ్రువీకరణ ద్వారా అడ్రస్ మారుతుంది. ఇంటిపెద్ద ఫోన్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ రిలేషన్‌షిప్‌ను నిర్ధారించే డాక్యుమెంట్ లేకపోతే ఇంటిపెద్ద సెల్ఫ్–డిక్లరేషన్ సమర్పించవచ్చు. ఇది యూఐడీఏఐ నిర్దేశించిన ఫార్మాట్లో ఉండాలి. ఆధార్ కార్డులో చిరునామా మార్చుకోవడానికి తగిన ధ్రువపత్రాలు లేని వారికి ఈ కొత్త విధానంతో ఏంతో ప్రయోజనం చేకూరుతుందని యూఐడీఏఐ తెలియజేసింది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారినవారికి సైతం ఉపయోగకరమని వివరించింది. ఇదీ చదవండి: ఢిల్లీ దారుణం: వెలుగులోకి మరిన్ని నివ్వెరపరిచే నిజాలు -
ఆఫీసుల వెరిఫికేషన్ నిబంధనలకు మార్పులు ..
న్యూఢిల్లీ: కంపెనీల చట్టం ప్రకారం సంస్థల రిజిస్టర్డ్ చిరునామాలను అధికారులు భౌతికంగా ధృవీకరించుకునే నిబంధనలను కేంద్రం సవరించింది. వీటి ప్రకారం ఈ అంశంలో ఇకపై అధికారులు తమ విచక్షణ మేరకు నిర్ణయం తీసుకునే ప్రసక్తి ఉండదు. సాధారణంగా ఏదైనా సంస్థ సరైన రీతిలో వ్యాపారం నిర్వహించడం లేదని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ)కి అనుమానం కలిగినప్పుడు సదరు కంపెనీ రిజిస్టర్డ్ చిరునామాకు వెళ్లి భౌతికంగా వెరిఫికేషన్ చేయవచ్చు. తాజా మార్పుల ప్రకారం ఇటువంటి సందర్భాల్లో కంపెనీ నమోదైన ప్రాంతంలో ఉండే ఇద్దరు స్వతంత్ర సాక్షులు ఉండాలి. అవసరమైతే స్థానిక పోలీసుల సహకారం కూడా తీసుకోవచ్చని కార్పొరేట్ వ్యవహారాల శాఖ తెలిపింది. అలాగే కార్యాలయం ఫొటోనూ తీసుకోవాలి. ప్రాంతం, ఫొటోలు సహా వివిధ వివరాలతో కూడిన నివేదికను సవివరంగా రూపొందించాలి. -
పతా.. ఈ అడ్రెస్ ఎక్కడ..?
కావలసిన వారి చిరునామా వెతుక్కుంటూ ఒకరు ‘‘ఆనందరావు ఇల్లు ఎక్కడండీ?’’ అని అడిగితే.. ‘‘ఆనందరావు ఇల్లు ఎక్కడండి’’ అని వెటకారంగా సమాధానం చెబుతారు మరొకరు. తెలుగు సినిమాల్లో బాగా పాపులర్ అయిన జోకు ఇది. స్క్రీన్ మీద నటులు పడే తంటాలు మనకు నవ్వు తెప్పిస్తే, రియల్ లైఫ్‌లో మాత్రం ముచ్చెమటలు పట్టేస్తాయి. ఇల్లు, ఆఫీస్‌ల అడ్రెస్‌ను కనుక్కోవాలంటే తిప్పలు తప్పవు. కొత్త ఏరియాలో ఒకరి అడ్రెస్ కనుక్కోవాలన్నా, మన ఆర్డర్‌ను ఇంటికి తెచ్చి ఇచ్చే డెలివరీ బాయ్‌కు మన అడ్రెస్ వివరంగా చెప్పాలన్నా, గొంతు నొప్పి పుట్టేలా అరవాల్సిందే. అందరిలాగే ఈ ఇబ్బందులన్నీ కృతికా జైన్ కు కూడా ఎదురయ్యాయి. అడ్రెస్ దొరకగానే సమస్య తీరిపోయిందిలే అనుకోలేదు. తనలా ఇబ్బంది పడేవారందరికీ ఓ చక్కని పరిష్కారం చూపాలనుకుని ‘పతా’ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది కృతిక . ఇండోర్‌లోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన కృతికా జైన్‌కు విదేశాల్లో చదువుకోవడం అంటే ఎంతో ఇష్టం. పాఠశాల విద్య అయిన తరువాత పైచదువులు విదేశాల్లో చదువుకుంటానని మారాం చేసింది. ‘నువ్వు ఇంకా చిన్నపిల్లవు, ఒక్కదానివి అంతదూరం వెళ్లి చదువుకోవడం కష్టం’ అని వారించారు తల్లిదండ్రులు. దీంతో డిగ్రీ అయ్యాక విదేశాలకు వెళ్తానని మరోసారి తల్లిదండ్రులను అడిగి ఒప్పించింది. విదేశాలకు వెళ్లేందుకు అన్ని పరీక్షల్లోనూ నెగ్గి, న్యూయార్క్ యూనివర్సిటీలో ‘మేనేజ్మెంట్ టెక్నాలజీ’లో మాస్టర్స్ చేసేందుకు అడ్మిషన్ సంపాదించింది. అడ్రెస్సే కెరియర్‌గా.. చదువులో భాగంగా న్యూయార్క్‌లో రెండేళ్లపాటు ఉన్న కృతికను.. అక్కడి రోడ్లు, అడ్రెస్ తెలిపే మార్కింగ్‌లు ఎంతగానో ఆకర్షించాయి. దీంతో ఈ రంగాన్ని తన కెరియర్‌గా మలచుకోవాలనుకుంది. కానీ ఇండియా వచ్చిన వెంటనే మంచి సంబంధం రావడంతో కృతికకు వివాహం అయింది. పెళ్లి తరువాత ఒకరోజు కృతిక తనకు తెలిసిన వారింటికి వెళ్లడానికి బయలుదేరింది. అడ్రెస్ దొరకక పోవడంతో, చుట్టుపక్కల వారిని అడిగింది. కానీ వారు చెప్పింది కూడా అర్థంకాకపోవడంతో.. తను వెళ్లాల్సిన అడ్రెస్‌కు చేరుకొనేందుకు చాలా ఇబ్బంది పడింది. మరోసారి ఆన్ లైన్ లో ఆర్డరిచ్చిన ప్యాకేజీ ఇవ్వడానికి వచ్చిన డెలివరీ బాయ్‌కు తన అడ్రెస్ సరిగా అర్థం కాకపోవడంతో, ప్యాకేజీ ఇంటికి రావడానికి చాలా సమయమే పట్టింది. దీంతో న్యూయార్క్‌లో అడ్రెస్‌లకు గూగుల్ మార్కింగ్ ఉన్నట్టే, ఇండియాలో కూడా ఉంటే ఈ సమస్యలు తలెత్తవు, అనుకుని సహ వ్యవస్థాపకులు అయిన రజత్, మోహిత్ జైన్ లతో కలిసి ‘పతా’ యాప్‌ను రూపొందించింది. పతా.. అడ్రెస్‌ను ఖచ్చితంగా చూపించే యాపే ‘పతా’. మన డిజిటల్ అడ్రెస్‌ను పతా రూపొందిస్తోంది. ఇది కాంప్లెక్స్ అడ్రెస్‌కు ఒక కోడ్‌ను ఇస్తుంది. ఈ కోడ్ ఆఫీసు లేదా ఇంటి అడ్రెస్‌ను కచ్చితంగా చూపిస్తుంది. ఇంటి చుట్టుపక్కల ఉన్న భవనాలను ఫొటోలతో సహా చూపిస్తుంది. దీనివల్ల అడ్రెస్‌ను పదేపదే వివరించాల్సిన పని ఉండదు. ఇంకా అడ్రెస్‌ను మన వాయిస్‌తో ఒకసారి రికార్డు చేసి షేర్ చేయవచ్చు. ఇదంతా ఒక్క క్లిక్‌తో అయ్యేలా చేస్తుంది పతా యాప్. ఈ యాప్ కోడ్‌తోపాటు మన వాయిస్‌తో అడ్రెస్ డైరెక్షన్స్ కూడా ఇవ్వచ్చు. పతా యాప్‌లో మన లొకేషన్స్ కు వచ్చిన కోడ్ లింక్‌ను.. మన అడ్రెస్ కావాల్సిన వారికి షేర్ చేస్తే, వారు గమ్యస్థానానికి సులభంగా చేరుకోగలుగుతారు. గతేడాది ‘అడ్రెస్ నేవిగేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీని ప్రారంభించి, దీనిద్వారా పతా యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది కృతిక. ప్రస్తుతం ఈ యాప్ 50 లక్షలకు పైగా డౌన్ లోడ్స్‌తో దూసుకుపోతోంది. ‘పతా’ యాప్ సహ వ్యవస్థాపకులతో కృతిక -
గూగుల్ మ్యాప్స్.. ఇక అడ్రస్ కోసం ఇబ్బంది పడక్కర్లేదు
కొత్త ప్రదేశాల్లో.. కొత్త ప్రాంతాలకు వెళ్లడానికి చాలామందికి గూగుల్ మ్యాప్స్ ఒక మార్గదర్శి. అయితే కచ్చితమైన అడ్రస్సుల విషయంలోనే ఒక్కోసారి గందరగోళం ఏర్పడవచ్చు. ఇప్పుడు ఈ సమస్యను కూడా తీర్చడానికి ఒక కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది గూగుల్ మ్యాప్స్. చాలామంది తమ హోం అడ్రస్సులను అవసరం ఉన్నప్పుడు కరెంట్ లేదంటే అడ్రస్‌ను టైప్ చేయడం ద్వారా వివరాల్ని షేర్ చేస్తుంటారు. ఇకపై ఆ అవసరం లేకుండా ఫ్లస్ కోడ్‌ని షేర్ చేస్తే సరిపోతుంది. ఫ్లస్ కోడ్‌లో హోం అడ్రస్ బదులు.. నెంబర్లు, లెటర్ల ఆధారంగా ఉదాహరణకు.. ‘CCMM+64G’ ఇలా నెంబర్లు, లెటర్ల ఆధారంగా కోడ్ రూపంలో కనిపిస్తుంది. మాటి మాటికి అడ్రస్‌ను టైప్ చేయాల్సిన అవసరం లేకుండా ఇది షేర్(ఆల్రెడీ హోం అడ్రస్‌గా సేవ్ చేసి ఉంటారు కాబట్టి) చేస్తే సరిపోతుంది. గూగుల్ ఫ్లస్ కోడ్‌ను చాలా కాలం కిందటే(2018) తీసుకొచ్చింది. చాలాకాలం పాటు ఇది ఎన్జీవోలకు, ప్రభుత్వ కార్యాలయాలకు కేరాఫ్‌గా నిలిచి.. ప్రజలకు ఉపయోగపడ్డాయి. ఇక ఇప్పుడు ఈ ఫీచర్‌ను యూజర్లందరికీ అందించనుంది. ఇది అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా గ్రిడ్ తరహాలో ప్రాంతాలను విభజించుకుంటూ పోతుంది. విశేషం ఏంటంటే.. రోడ్డు మార్గం, సరైన ల్యాండ్ మార్క్‌లు లేనిచోట్ల కూడా అదీ ఆఫ్‌లైన్‌లోనే(ఒక్కసారి సేవ్ చేస్తే సరిపోతుంది) ఫ్లస్ కోడ్ సరైన అడ్రస్‌ను లొకేట్ చేస్తుంది. కరెక్ట్‌గా అడ్రస్ పెడితేనే రావట్లేదు.. ఇంక ఫ్లస్ కోడ్ వర్కవుట్అవుతుందా? అంటారా? కచ్చితంగా అవుతుంది. ఎందుకంటే.. గూగుల్ మ్యాప్ తీసుకుచ్చిన ఫ్లస్ కోడ్ అనేది యూనివర్సల్. భూమ్మీద ప్రతీ లొకేషన్, అడ్రస్‌కు ఒక్కో ఫ్లస్ కోడ్ ఉంటుంది. పైగా ఎగ్జాట్‌గా హోం లొకేషన్‌గా సేవ్ అవుతుంది కాబట్టి. ఇది జనరేట్ చేయాలంటే.. యూజ్ యువర్ కరెంట్ లొకేషన్ ద్వారా చేయొచ్చు. సేవ్డ్ ట్యాబ్‌ను కూడా హోం అడ్రస్ కాపీ చేయడానికి, షేర్ చేయడానికి ఉపయోగించొచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ కేవలం ఆండ్రాయిడ్ వెర్షన్లలో మాత్రమే ఉంది. కింద వీడియోలో మరింత స్పష్టత రావొచ్చు. -
కోపంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన కొడుకు.. ఐదేళ్ల తర్వాత ఆధార్ అలా కలిపింది!
పాలకొండ రూరల్(శ్రీకాకుళం): పదిహేనేళ్ల వయసు.. తెలిసీతెలియని తనం.. అమ్మానాన్న హాస్టల్లో చేర్పిస్తున్నారన్న కోపం.. ఆ కుర్రాడిని ఇంటి నుంచి పారిపోయేలా చేసింది. ఏళ్లకు ఏళ్లు గడిచినా కుమారుడి ఆచూకీ తల్లిదండ్రులకు తెలియలేదు. అమ్మతో మాట్లాడాలని ఆ బిడ్డకూ అనిపించలేదు. ఐదేళ్ల పాటు సాగిన ఈ ఎడబాటుకు ఆధార్ కార్డు ముగింపు పలికింది. తల్లీబిడ్డల మధ్య ఏర్పడిన దూరాన్ని దూరం చేసి వారిని కలిపింది. వివరాల్లోకి వెళితే.. మెళియాపుట్టి మండలం పెద్ద లక్ష్మీపురం గ్రామానికి చెందిన బైపోతు తవిటినాయుడు, రాజేశ్వరి దంపతుల ఏకైక కుమారుడు హరి ప్రకాష్‌ను 2016లో హాస్టల్లో చేర్పించారు. అయితే హరికి అక్కడ చదవడం ఇష్టం లేదు. తల్లిదండ్రులకు చెప్పినా ఫలితం లేకపోవడంతో చెప్పా పెట్టకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. హైదరాబాద్ వెళ్లి అక్కడ ఓ పెట్రోల్ బంకులో పనికి కుదిరాడు. ఇన్నేళ్లలో కనీసం ఇంటికి ఫోన్ కూడా చేయలేదు. కాలం అలా గడిచిపోయింది. తల్లిదండ్రులు మాత్రం ఒక్కగానొక్క కొడుకు కోసం ఎదురుచూస్తూనే ఉన్నా రు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇటీవల హరికి ఆ బంకులో క్యాషియర్‌గా పదోన్నతి రావడంతో వ్యక్తిగత సెల్‌ఫోన్ కోసం యత్నించాడు. ఈ క్రమంలో సిమ్‌కార్డు కొనుగోలు చేసేందుకు ఆధార్ తప్పనిసరి కావడంతో ఆధార్‌కార్డు పొందేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. నూతన ఆధార్‌కార్డు తన పాత ఆధార్‌కార్డుకు అనుసంధానం చేసి ఉండడంతో స్వగ్రామమైన పెద్ద లక్ష్మీపురంలో ఉన్న తల్లిదండ్రుల ఇంటికి కొత్త కార్డు వచ్చింది. ఊహించని విధంగా కుమారుడి పేరిట ఆధార్ కార్డు ఇంటికి రావడంతో తల్లిదండ్రులు వెంటనే స్థానిక ఎస్ఐ వి.సందీప్‌కుమార్‌ను సంప్రదించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ పాతపట్నం సీఐ ఎం.వినోద్‌బాబుకు సమాచారం అందించారు. స్పందించిన సీఐ ఆధార్‌కార్డులో ఉన్న వివరాల మేరకు దర్యాప్తు ప్రారంభించారు. తప్పిపోయిన హరిప్రకాష్ హైదరాబాద్‌లో ఉన్నట్టు గుర్తించారు. తమ బృందాలను పంపించి ఆయనను స్వగ్రామం తీసుకువచ్చారు. శుక్రవా రం పాలకొండ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం ద్వారా డీఎస్పీ ఎం.శ్రావణి సమక్షంలో హరిప్రకాష్‌ను తల్లితండ్రులకు అప్పగించారు. ఐదేళ్ల తర్వాత కొడుకును చూసిన తల్లిదండ్రులు ఉద్వేగానికి లోనయ్యాడు. వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ జీవనం గడుపుతున్నామని, ఏకైక కుమారుడు వదిలి వెళ్లిపోవడంతో ఎందరో దేవుళ్లకు మొక్కుకున్నామని వారు తెలిపారు. కొడుకును అప్పగించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. మిస్సింగ్ కేసును ఛేదించడంలో చొరవ చూపిన సీఐ, ఎస్ఐలను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. చదవండి: ప్రేమ పేరుతో తపస్విని వంచించిన డాక్టర్.. ఆపై.. -
ఆధార్ కార్డులో అడ్రస్ ఇలా మార్చుకోండి!
మన దేశంలో ఆధార్ కార్డు ఉన్న ప్రాముఖ్యత గురుంచి మన అందరికీ తెలిసిందే. పుట్టిన చిన్న పిల్లవాడి నుంచి 60 ఏళ్ల వృద్ధుడి వరకు ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగి ఉండాల్సిందే. పాస్ పోర్టు కోసం ధరఖాస్తు చేసుకోవాలన్న, కొత్త బ్యాంకు అకౌంట్ తీసుకోవాలన్న మనకు ఆధార్ కార్డు అవసరం. ఇలాంటి ముఖ్యమైన ఆధార్ కార్డులో పేరు, చిత్రం, చిరునామా వంటి మొదలైన వివరాలను అప్ డేట్ చేయడం కోసం యూఐడీఏఐ అనేక సేవలను ఆన్ లైన్ చేసింది. ఒకవేళ మీరు మీ ఆధార్ కార్డులోని చిరునామాను అప్ డేట్ చేయాలి అనుకుంటే యూఐడీఏఐ పోర్టల్ ద్వారా మీ చిరునామాలో మార్పు చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఆధార్ అడ్రస్ మార్చుకోవడం మీకు కష్టమని భావిస్తే.. ఆధార్ సెంటర్‌కు వెళ్లి కూడా పని పూర్తి చేసుకోవచ్చు. దీని కోసం ప్రూఫ్ డాక్యుమెంట్ తీసుకెలితే సరిపోతుంది. అయితే, ఈ అప్ డేట్ కోసం రూ.50 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. చిరునామా అప్ డేట్ కోసం పాస్ పోర్ట్, బ్యాంక్ స్టేట్ మెంట్/పాస్ బుక్, పోస్ట్ ఆఫీస్ అకౌంట్ స్టేట్ మెంట్/పాస్ బుక్, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, విద్యుత్ బిల్లు/వాటర్ బిల్లు/టెలిఫోన్ ల్యాండ్ లైన్ బిల్లు/క్రెడిట్ కార్డు స్టేట్ మెంట్/గ్యాస్ కనెక్షన్ బిల్లు, ప్రాపర్టీ ట్యాక్స్ రసీదు అవసరం. (చదవండి: Xiaomi: షావోమీ నుంచి ఎలక్ట్రిక్ వాహనాలు ..! ఎప్పుడు వస్తాయంటే..?) ఆధార్ కార్డులో అడ్రస్ అప్ డేట్ చేసే విధానం : మొదట ఆధార్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత మై ఆధార్ సెక్షన్లోకి వెళ్లాలి. ఇందులో అప్డేట్ యువర్ ఆధార్ అనే ట్యాబ్ ఉంటుంది. అప్డేట్ యువర్ ఆధార్ అడ్రస్ ఆన్లైన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. ఇప్పుడు ప్రొసీడ్ టు అప్డేట్ అడ్రస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయండి. మీ ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడీ, క్యాప్చా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సెండ్ ఓటీపీపై క్లిక్ చేస్తే.. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. తర్వాత ప్రూఫ్ అప్లోడ్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. -
Aadhar Card: చిరునామాని ఆన్లైన్లో సవరించండి ఇలా!
మీరు కొత్త ఇంటికి మారరా? ఆధార్ కార్డు ఇంకా చిరునామాని చేంజ్ చేయలేదా? అయితే, ఇప్పుడు సులభంగానే ఇంట్లో నుంచే ఆధార్ కార్డులో చిరునామాని మార్చవచ్చు. ఆధార్ సెల్ఫ్ సర్వీస్ పోర్టల్ ద్వారా ఆధార్ యూజర్ కొన్ని వివరాలను అప్ డేట్ చేయవచ్చు. ఆధార్ కార్డుదారులు స్వీయ సేవా పోర్టల్ ద్వారా చిరునామాను అప్ డేట్ చేయవచ్చు అని ఆధార్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ట్వీట్ చేసింది. "మీరు ఇప్పుడు చిరునామాని ఆధార్ సెల్ఫ్ సర్వీస్ అప్ డేట్ పోర్టల్ ద్వారా అప్ డేట్ చేయవచ్చు" అని ట్వీట్ లో పేర్కొంది. ఈ సేవను ఉపయోగించుకోవాలంటే ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరును కలిగి ఉండాలని ఆధార్ యూజర్ గమనించాలి. అలాగే, ఆన్ లైన్ పోర్టల్ ద్వారా అప్ డేట్ చేసినందుకు రూ.50 చార్జి చెల్లించాలి. సెల్ఫ్ సర్వీస్ ఆన్ లైన్ పోర్టల్ చిరునామాను అప్ డేట్ చేయడం కొరకు యుఐడీఎఐ వెబ్ సైట్ లో పేర్కొన్న పాస్ పోర్ట్, బ్యాంక్ పాస్ బుక్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి డాక్యుమెంట్ ల కాపీని అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. #AadhaarOnlineServices You can now update your address in your Aadhaar online through Aadhaar Self Service Update Portal at https://t.co/II1O6Pnk60 to update. To see the list of valid documents, click here: https://t.co/BeqUA0pkqL #UpdatedAddressOnline #UpdateOnline pic.twitter.com/iMM1qqcEqm — Aadhaar (@UIDAI) June 18, 2021 ఆధార్‌కార్డులో చిరునామాని ఇలా సవరించండి: ముందుగా ఈ https://ssup.uidai.gov.in/ssup/ లింకును ఓపెన్ చేయాలి. అందులో ఫ్రోసిడ్ టూ ఆప్డేట్ ఆధార్‌ను క్లిక్ చేయాలి. ఆప్డేట్ ఆధార్ ఆన్‌లైన్‌ను క్లిక్ చేసిన తరువాత 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి కాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి. తరువాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఆధార్‌తో లింక్ ఐనా ఫోన్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. మొబైల్‌కు వచ్చిన 6 అంకెల వన్ టైం పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఇప్పుడు డెమోగ్రాఫిక్ ఆప్షన్ ఎంచుకొని మీ కొత్త చిరునామా వివరాలు సమర్పించాలి. పీపీఎ డాక్యుమెంట్ ల మీ ఒరిజినల్ కలర్ స్కాన్ డ్ కాపీలను అప్ లోడ్ చేయండి. నమోదు చేసిన డేటాను ఇంగ్లిష్, స్థానిక భాషలో కనిపిస్తుంది. ఇప్పుడు అభ్యర్థనను సబ్మిట్ చేయండి. మీ ఆధార్ అప్ డేట్ స్టేటస్ ట్రాక్ చేయడం కొరకు మీరు మీ అప్ డేట్ రిక్వెస్ట్ నెంబరు(ఆర్ ఎన్ ఆర్ ఎన్)ని సేవ్ చేసుకోవాలి. చదవండి: పీఎఫ్ యూఎన్ నెంబర్ ను ఆధార్‌తో లింకు చేసుకోండి ఇలా..? -
లాక్‌డౌన్‌పై ప్రధాని మోదీ స్పష్టత
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి శరవేగంగా విస్తరిస్తున్న సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించారు.. దేశవ్యాప్తంగా మరోసారి లాక్డౌన్ విధించనున్నారనే ఊహాగానాల మధ్య లాక్డౌన్ అంచనాలకు ప్రధాని తెరదించారు. మహమ్మారిపై మరోసారి భీకర యుద్ధం చేస్తున్న నేపథ్యంలో అన్నివర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ కరోనా యుద్ధంపై గెలవాలని మోదీ దేశ వాసులకు పిలుపునిచ్చారు. మోదీ ప్రసంగంలోని కొన్ని ముఖ్య విషయాలు కరోనా సెకండ్ వేవ్ తుపానులా విస్తరిస్తోంది. కరోనాపై దేశం అతిపెద్ద యుద్దం చేస్తోంది.ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. దేశ ప్రజలు అనుభవిస్తున్న బాధలు, కష్టాలు చాలా బాధ కలిగిస్తున్నాయి.అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. దేశంలో ఆక్సిజన్ డిమాండ్ భారీగా పెరిగింది. డిమాండ్ కు తగ్గ ఉత్పత్తికి, కొత్త ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణానికి కృషి చేస్తున్నాం. ఈ మేరకు పలు ఫార్మా కంపెనీలను సంప్రదించాం. భారీగా కోవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం.దేశంలో తయారైన రెండు టీకాల ద్వారా అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించాం. ఇప్పటికే 12 కోట్లమందికి పైగా వ్యాక్సిన్లు అందించాం. మే ఒకటవ తేదీనుంచి 18 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్ అందిస్తాం. కొత్త వ్యాక్సిన్ కోసం ఫ్రాస్ట్ ట్రాక్ పద్ధతిని అవలంభించనున్నాం. ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మీమీ ప్రాంతాల్లో, అపార్ట్మెంట్లలో కమిటీలుగా ఏర్పడి జాగ్రత్తలు తీసుకోవాలి. అపుడిక కంటైన్మెంట్ జోన్ల ఏర్పాటు అవసరమే ఉండదు. కరోనా నియంత్రణలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అందరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. అలాగే అత్యవసర పరిస్థితి వస్తే బయటికి వెళ్లకుండా ప్రజలు నియంత్రణలో ఉండాలని, లాక్డౌన్ వైపు దేశం పయమనించకుండా జాగ్రత్తగా ఉండాలని మోదీ ప్రజలకు సూచించారు. -
అడ్రస్: అక్కడకు వచ్చి నన్ను పిలవండి !
జైపూర్ : ఆన్లైన్ డెలివరీ అందుబాటులోకి వచ్చాక ఉప్పు, పప్పు నుంచి వేసుకునే బట్టల వరకు అన్నీ అన్లైన్లో ఆర్డర్ పెట్టేస్తున్నాం. ఈ విధానం ద్వారా మనకు కొంత సమయం ఆదా అవుతుందనే చెప్పాలి. అయితే ఏ వస్తువు ఆర్ఢర్ చేసినా అది మన వద్దకు చేరాలంటే ముందుగా డెలివరీ అడ్రస్ ఇవ్వడం సర్వ సాధారణం. అప్పుడే అది మన ముంగిట్లోకి వచ్చి వాలుతుంది. అప్పుడప్పుడు మనం చేసిన ఆర్డర్లకు బదులు కొన్నిసార్లు వేరే వస్తువులు డెలివరీ అవుతుంటాయి. ఇలాంటి సందర్భాలు మచ్చుకు కొన్ని కనిపిస్తూనే ఉంటాయి. కానీ ప్రముఖ అన్‌డౌన్ డెలివరీ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు ఓ వింత అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి ఫ్లిప్‌కార్ట్‌లో వస్తువును ఆర్డర్ చేశారు. అయితే షిప్పింగ్ అడ్రస్‌ను మాత్రం వినూత్నంగా రాశాడు. (ఒకే దెబ్బకు రెండు పిట్టలంటే ఇదేనేమో..) రాజస్థాన్‌లోని కోటాలో డెలివరీ చేయాల్సిన ఈ ప్యాకిజీలో ‘444 చాత్ దేవాలయం. అక్కడికి వచ్చి నన్ను పిలవండి. నేను వస్తాను’. అని రాశాడు. దీనిని ట్విటర్ యూజర్ మంగేష్ అనే వ్యక్తి ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఈ ట్వీట్లో ఉన్న చిరునామా చూసిన నెటిజన్లు తమ నవ్వును ఆపుకోలేకపోతున్నారు. ప్రస్తుతం వైరల్ అవ్వడంతో అనేకమంది నెటిజన్లు దీనిపై స్పందిస్తున్నారు. ‘ఇండియా అంటే వేరే లెవల్, ఇది ఎంతో సరాదాగా ఉంది’ అని కామెంట్ చేస్తున్నారు. కాగా ఈ విషయంపై ఫ్లిప్‌కార్ట్ సంస్థ కూడా స్పందించడం విశేషం. ప్యాకేజీపై ఉన్న అడ్రస్‌ను చూపిస్తూ. ‘ప్రతి ఇల్లు ఓ ఆలయమే.. ఇది సరికొత్త స్థాయికి తీసుకెళ్లింది’ అనే క్యాప్షన్‌తో ట్విటర్లో పోస్టు చేసింది. (వైరల్: అల్లుడి కోసం 67 రకాల వంటకాలు) Indian eCommerce is different. pic.twitter.com/EewQnPcU5p — Mangesh Panditrao (@mpanditr) July 7, 2020 Taking ‘Ghar ek mandir hai’ to a whole new level! pic.twitter.com/uuDoIYLyId — Flipkart (@Flipkart) July 9, 2020 -
ఆధార్ ‘అడ్రస్ మార్పు’నకు కొత్త సర్వీస్
న్యూఢిల్లీ: ఆధార్ కార్డులో సరైన అడ్రస్ లేని వారు తాము ప్రస్తుతం ఉంటున్న నివాసం అడ్రస్‌ను అప్డేట్ చేసుకునేందుకు యూఐడీఏఐ కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకురానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ సర్వీస్ అమల్లోకి వస్తుంది. ‘సరైన అడ్రస్ ప్రూఫ్ ఉన్న వాళ్లు ఆ వివరాలను ఆధార్ సెంటర్లో సమర్పించి చిరునామా మార్చుకోవచ్చు. లేని వారు ఆ అడ్రస్‌కు పంపే ‘రహస్య పిన్’ను ఆధార్ కేంద్రంలో లేదా ఎస్ఎస్యూపీ ఆన్లైన్ పోర్టల్‌లో పొందుపరిచి చిరునామా మార్చుకోవచ్చు’ అని యూఐడీఏఐ తెలిపింది. ఆధార్‌లో సరైన అడ్రస్ లేనందున వలస కార్మికులు, అద్దె ఇళ్లలో ఉండేవారు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కొత్త సర్వీసు ఆధారంగా ఈ సమస్యకు వీలైనంత పరిష్కారం లభించవచ్చని అధికారులు భావిస్తున్నారు. దీనికోసం జనవరి 1, 2019 నుంచి పైలట్ ప్రాజెక్టు చేపట్టనున్నారు. -
ఇళ్లకూ ‘ఆధార్’ !
ఇళ్లకు ఆధార్ ఏంటనుకుంటున్నారా...నిజమే మరి. వ్యక్తులకు సంబంధించి బహుళప్రయోజకారిగా ఉపయోగపడుతున్న ఆధార్ కార్డు తరహాలోనే జీహెచ్ఎంసీ పరిధిలోనిప్రతి ఇల్లు, ప్లాట్, తదితర స్థలాలన్నింటికీ ‘ఆధార్’ నంబర్లు జారీ చేయనున్నారు. నగరంలోచిరునామా కనుక్కోవడంలో తిప్పలు తప్పించేందుకు డిజిటల్డోర్ నంబర్ల ప్రక్రియకు సిద్ధమైనజీహెచ్ఎంసీ.. ఇప్పటికే వివిధ సంస్థలకు ఆ బాధ్యతలు అప్పగించగా, ఏవీ పూర్తిస్థాయిలోకార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీయే స్వయంగా కొత్త డిజిటల్ డోర్ నంబరింగ్సిస్టమ్కు సిద్ధమైంది. దీన్నే ప్రాపర్టీ ఆధార్ నంబర్‌గా కూడా వ్యవహరిస్తారు. ఇందులో భాగంగాజీహెచ్ఎంసీ పరిధిలోని ప్రతి ఇల్లు, ప్లాట్, ఖాళీ స్థలం, నిర్మాణం జరుగుతున్న భవనం, నిర్మాణం పూర్తయినప్పటికీఆస్తిపన్ను జాబితాలో నమోదు కాని ఇల్లు.. ఇలా అన్నింటికీ డిజిటల్ డోర్‌నంబర్లను జారీ చేయనుంది. ఈ డిజిటల్ డోర్ నంబర్ ద్వారానే ఇల్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ తదితర వివరాలన్నీ తెలుస్తాయి. సాక్షి, సిటీబ్యూరో: ఆధార్..వ్యక్తులకు సంబంధించిన చిరునామాలతోపాటు బ్యాంకులు, సిమ్‌కార్డులు, రేషన్‌కార్డులు, ఓటరు కార్డు, పాన్ నంబర్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పనికీ ‘ఆధార్’ అవసరం తెలిసిందే. ఇది మనుషులకు కాగా ఇళ్లకూ ‘ఆధార్’ తరహా నంబర్లిచ్చేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. బహుళ ప్రయోజనకారిగా ఉపయోగపడుతున్న ‘ఆధార్’ తరహాలోనే జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రతి ఇల్లు, ప్లాట్, తదితర స్థలాలన్నింటికీ ‘ఆధార్’ నంబర్లు జారీ చేయనున్నారు. ఈమేరకు జీహెచ్ఎంసీయే స్వయంగా కొత్త డిజిటల్ డోర్ నంబరింగ్ సిస్టమ్‌కు సిద్ధమైంది. దీన్నే ప్రాపర్టీ ఆధార్ నంబర్‌గా కూడా వ్యవహరిస్తారు. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రతి ఇల్లు, ప్లాట్, ఖాళీ స్థలం, నిర్మాణం జరుగుతున్న భవనం, నిర్మాణం పూర్తయినప్పటికీ ఆస్తిపన్ను జాబితాలో నమోదు కాని ఇల్లు.. ఇలా అన్నింటికీ డిజిటల్ డోర్ నంబర్లను జారీ చేయనుంది. ఈ డిజిటల్ డోర్ నంబర్ ద్వారానే ఇల్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ తదితర వివరాలన్నీ తెలుస్తాయి. ఒక డిజిటల్ డోర్ (ఆధార్)నంబర్‌ను కేటాయించారంటే దానికి సంబంధించిన స్థలం ఎవరి పేరు మీద ఉంది.. ఒకరి నుంచి ఒకరికి మ్యుటేషన్ జరిగిందా.. వంటి వివరాలతోపాటు ఆ ఇంటి ఆస్తిపన్ను గుర్తింపు నంబర్( పీటీఐఎన్), నివాస భవనమా, వాణిజ్య భవనమా, వేకెంట్ ల్యాండా వంటి వివరాలు ఆన్లైన్ ద్వారానే తెలుసుకునే వీలుంటుంది. అంతే కాదు సంబంధిత ఇంటికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్(ఓసీ) జారీ అయిందా లేదా వంటివి కూడా తెలుస్తాయి. ఇది ప్రజలకుపకరించే అంశం కాగా.. ఇళ్ల ఆధార్ నంబర్ల ద్వారా ఆస్తిపన్ను చెల్లించారా..లేదా? చెల్లించకుంటే ఎంతకాలంగా చెల్లించడం లేదు..? రికార్డుల్లో మాత్రం నివాస భవనంగా ఉన్నప్పటికీ, వాస్తవంగా వాణిజ్యం నిర్వహిస్తున్నారా.. తదితర వివరాలు జీహెచ్ఎంసీకి తెలుస్తాయి. అంతేకాదు.. ఇంతవరకు ఓసీలు తీసుకోని, ఆస్తిపన్ను చెల్లించని ఇళ్ల వివరాలు కూడా తెలుస్తాయి. వీటిని గుర్తించి ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్సులు, ఇతరత్రా ఫీజులు వసూలు చేయడం ద్వారా జీహెచ్ఎంసీకి కనిష్టంగా ఏటా దాదాపు రూ.150 కోట్ల ఆదాయం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సమగ్ర కుటుంబ సర్వే మేరకు జీహెచ్ఎంసీలో దాదాపు 20 లక్షల ఇళ్తుండగా, ఆస్తిపన్ను జాబితాలో మాత్రం 14 లక్షలే ఉన్నాయి. సర్వే అనంతరం దాదాపు 70 వేల ఇళ్లు కొత్తగా వచ్చి ఉంటాయని అంచనా. వీటన్నింటినీ ఆస్తిపన్ను పరిధిలోకి తెస్తారు. ట్రేడ్ లైసెన్సులు లేకుండానే వ్యాపారాలు నిర్వహిస్తున్నవారికి ట్రేడ్లైసెన్సులుజారీ చేస్తారు. తద్వారా జీహెచ్ఎంసీ ఆదాయం పెరుగుతుంది. పైలట్ ప్రాజెక్ట్‌గా మూసాపేటలో.. ఈ డిజిటల్ డోర్‌నంబర్(ఆధార్) కోసం పైలట్ ప్రాజెక్టుగా మూసాపేట సర్కిల్లో బుధవారం సర్వేకు శ్రీకారం చుట్టారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ(ఎన్ఆర్ఎస్ఏ) సహకారంతో శాటిలైట్ చిత్రాల మ్యాపింగ్‌తో జీహెచ్ఎంసీ ఐటీ, రెవెన్యూ విభాగాలు ఈ సర్వే నిర్వహిస్తున్నాయి. మూసాపేట సర్కిల్లో దాదాపు 60 వేల ఇళ్లున్నట్లు అంచనా. వీటన్నింటి సర్వే రెండు నెలల్లో పూర్తవుతుందని, అడిషనల్ కమిషనర్ (ఐటీ) ముషార్రఫ్ ఫారూఖి తెలిపారు. అవసరాలకనుగుణంగా ఆరు నుంచి ఎనిమిది డిజిట్లతో ఇళ్ల ఆధార్ నంబర్లు జారీ చేయనున్నట్లు చెప్పారు. ఈ నంబర్ ఉంటే సెల్‌ఫోన్‌తోనే కావాల్సిన చిరునామాకు నేరుగా వెళ్లిపోవచ్చునని చెప్పారు. ఫైర్సర్వీసెస్, పోస్టల్, కొరియర్ సర్వీసులకు ఎంతో ఉపయుక్తమన్నారు. -
దొరకని ఆచూకీ
శ్రీకాకుళం, రణస్థలం: మండలంలోని జీరుపాలెంలో శనివారం పడవ బోల్తా పడి గల్లంతైన మత్స్యకారుడు మైలపల్లి రాము ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. రెండో రోజు ఆదివారం కూడా స్థానిక మత్స్యకారులు తీవ్రంగా గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో రాము కుటుంబంలో ఆందోళన పెరుగుతోంది. స్థానిక మర పడవలతో మత్స్యకారులు రణస్థలం, ఎచ్చెర్ల, గార, పూసపాటిరేగ మండలాల సముద్ర తీరం వెంబడి గాలింపు చేపట్టారు. మత్స్యశాఖ అధికారులెక్కడ? మత్స్యకారుడు గల్లంతైనా మత్స్యశాఖ అధికారులు నుంచి కనీసం స్పందించడం లేదని జీరుపాలెం మత్స్యకారులు మైలపల్లి కామరాజు, సర్పంచ్ బడి చిన్న రాములు, దుమ్ము రాముడు, మైలపల్లి లక్షు్మడుతో పాటు పలువురు ఆగ్రహం వ్యక్తంచేశారు. మత్స్యకారుల అభివృద్ధికి పాటు పడతామని ప్రకటనలు ఇవ్వడమే తప్ప మత్స్యకారుల సాదకబాధకాలు కనిపించడం లేదని వాపోతున్నారు. గల్లంతైన తోటి మత్స్యకారుడి కోసం గ్రామమంతా కంటి మీద కునుకు లేకుండా గాలింపు చర్యలు చేపడుతోంది. మత్స్యకారులకు, బాధిత కుటుంబానికి భరోసాగా నిలవాల్సిన మత్స్యశాఖ.. కనీసం మానవత్వాన్ని చాటుకోవడానికి ప్రయత్నించలేదని గ్రామస్తులు, స్థానిక మత్స్యకారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కళ్లెదుటే కనుమరుగైపోయాడు మైలపల్లి రాము కళ్లెదుటే కనుమరుగైయిపోయాడు. పడవ బోల్తా విషయాన్ని వెనువెంటనే గ్రామస్తులతో పాటు, సంబంధిత అధికారులకు తెలియజేశా. గ్రామస్తులు చర్యలు చేపట్టినా.. అధికారుల నుంచి ఎటువంటి సహకారం లేదు. – మృత్యంజయుడైన మాగుపల్లి లక్షు్మడు -
పూర్వీకుల జాడ దొరికిందోచ్!
వైఎస్ఆర్ జిల్లా ,చింతకొమ్మదిన్నె : పూర్వీకుల జాడ(చిరునామా) కోసం కొన్ని సంవత్సరాలుగా గాలిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డికి ఎట్టకేలకు వారు దొరకడంతో ఆయన ఆనందానికి హద్దులు లేవు. తెలంగాణలోని తమ వంశస్తులతో కలసి గురువారం మండలంలోని బయనపల్లి గ్రామానికి చేరుకున్నారు. అనంతరం తుమ్మల మల్లారెడ్డి, తుమ్మల బాలమల్లారెడ్డి, తుమ్మల యల్లారెడ్డి అనే వృద్ధులను కలసి పూర్వీకుల గురించి ఆరాతీశారు. నాలుగు తరాల క్రితం తమ తాతలది ఇదే గ్రామమని అని తెలుసుకుని మురిసిపోయారు. తమ పెద్దలు ఇక్కడి నుంచి తెలంగాణకు వలస వెళ్లినట్లు భావిస్తున్నారు. అనంతరం పాపిరెడ్డి మాట్లాడుతూ తుమ్మల వంశస్తుల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తామని అన్నారు. ఆయనతో పాటు తెలంగాణ నుంచి తుమ్మల రాజిరెడ్డి, జనార్దన్‌రెడ్డి, మోహన్‌రెడ్డిలు గ్రామాన్ని సందర్శించారు. -
ముగిసిన సాధికార సర్వే!
–అడ్రస్‌లు లభించనివారు 93,666 మంది –వీరి కోసం తహసీల్దారు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక కేంద్రాలు కర్నూలు(అగ్రికల్చర్): దాదాపు 7 నెలల పాటు సుదీర్ఘంగా సాగిన ప్రజాసాధికార సర్వేకు ఎట్టకేలకు మంగళవారంతో ముగింపు పలికారు. గత ఏడాది జూలై నెలలో సర్వే మొదలైంది. జిల్లాలో 11,60,220 ఇళ్లు ఉండగా 10,75,145 ఇళ్లను సర్వే చేశారు. 85,075 ఇళ్ల అడ్రస్‌లు లభించలేదు. ఈ సర్వే ప్రకారం జిల్లాలో 39,98,336 మంది ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇందులో 35,81,235 మందిని సర్వే పరిధిలోకి తెచ్చారు. మిగిలిన 4,17,101 మందిని వివిద కారణాలతో సర్వే చేయలేకపోయారు. ఇందులో 93,666 మందిని ఎన్యూమరేటర్లు గుర్తించలేకపోయారు. గుర్తించలేకపోయిన వారిలో పట్టణ ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్‌తో సహా జిల్లాలో పట్టణ ప్రాంతాలు 9 ఉన్నాయి. వీటిల్లోనే 84,132 మందిని గుర్తించలేదు. అత్యధికంగా నంద్యాల మున్సిపాలిటీలో 55,961 మంది అడ్రస్‌లను కనుగొనడంలో సర్వే సిబ్బంది విఫలమయ్యారు. కర్నూలు నగరపాలలక సంస్థలో 12,151 మంది వివరాలను తెలుసుకోలేకపోయారు. గ్రామీణ ప్రాంతాల్లో 9,534 మంది అడ్రస్‌లను గుర్తించలేదు. సర్వే చేయని 93,336 మంది కోసం తహసీల్దారు కార్యాలయాలు, మున్సిపల్ కమిషనర్ల కార్యాలయాల్లో ఒక ప్రత్యేక సెంటరు ఏర్పాటు చేసి సర్వేకు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు మీ సేవా కేంద్రాల పరిపాలనా అధికారిణి వెంకటలక్ష్మి తెలిపారు. సర్వేసిబ్బందికి టీఏ, డీఏలు విడుదల ప్రజాసాధికార సర్వే పూర్తి కావడంతో ఎన్యూమరేటర్లు, వారి అసిస్టెంట్లకు టీఏ, డీఏలు ఇవ్వడానికి ప్రభుత్వం రూ.2కోట్లు విడుదల చేసింది. సర్వే పూర్తి అయినట్లుగా ఎన్యూమరేటర్లు చార్జీ ఆఫీసర్లకు సర్టిఫికెట్లు ఇస్తే టీఏ, డీఏ పంపిణీ చేస్తారని మీ సేవా కేంద్రాల పరిపాలనా అధికారిణి తెలిపారు. ప్రజాసాధికార సర్వే వివరాలు ఇలా ఉన్నాయి... జిల్లా జనాభా 39,98,336 సర్వే చేసింది 35,81,235 సర్వేలో లేని వారు 4,17,101 మరణించిన వారు 30348 వలసవెళ్లిన వారు 2,05,036 వివాహాలు చేసుకుని వెళి్లన వారు 35,299 సర్వేపై అసక్తి చూపని వారు 5937 డోర్‌లాక్ 22730 ఆధార్ నంబర్లు లభించని వారు. 11907 సాంకేతిక సమస్యలు 12178 అడ్రస్‌లు లభించని వారు 93,666 పట్టణ ప్రాంతాల్లో అడ్రస్‌లు లభించనివారు 84,132 గ్రామీణ ప్రాంతాల్లో గుర్తించనివారు 9534 -
నల్లధనంపై పోరులో వెనక్కి తగ్గేది లేదు
న్యూఢిల్లీ: నవంబర్ 8 పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి జాతి నుద్దేశించి ప్రసంగిస్తున్నారు. నగదు కష్టాలపై శనివారం మాట్లాడిన ఆయన ముందుగా కొత్త ఆశలతో, కొత్త ఆకాంక్షలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాన్నారు. నల్లధనంపై ప్రభుత్వం చేపట్టిన పోరాటంలో భుజం భుజం కలిపి కోట్లాదిమంది ప్రజలు మద్దతు అందిస్తున్నారు. దీనికితాను గర్వపడుతున్నానని ప్రధాని హర్ష వ్యక్తం చేశారు. ప్రజలు అందిస్తున్న ఈ అపూర్వ మద్దతుతో నేపథ్యంలో నల్లధనం, నకిలీ కరెన్సీ పై పోరాటంలో ఒక్క అడుగు కూడా వెనక్కి వేసిదిలేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా దీపావళి పండుగ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నల్లధనంపై ఉక్కుపాదం మోపడం ద్వారా దీర్ఘ ప్రయోజనాలపై దృష్టి పెట్టింది. స్వచ్చ భారత్ దిశగా దేశం అడుగులు వేస్తోంది. అత్యాచారాలు, నల్లధనం, నిరోధంలో నిజాతీపరులకు కూడా కష్టం కలిగింది. (చదవండి...పెద్ద నోట్లు రద్దు..) అయినా చెడు పై పోరాటానికి అనేక ష్టాలను ఎదుర్కొంటూ అసమాన ధైర్యంతో ప్రజలు పోరాటం చేస్తున్నారని మోదీ చెప్పారు. దీపావళి తరువాత కేంద్ర ప్రభుత్వం కోట్లాది మంది ప్రజల కష్టాలనుంచి గట్కెక్కేపనిలో పడ్డట్టు మోదీ తెలిపారు. అనేక సందర్భాల్లో పోరాటాల్లో ప్రజలు కంకణ బద్దులయ్యారు. ముఖ్యంగా కార్గిల్ యుద్దం, అనేక కోట్లాది మంది భారతీయుల దేశభక్తిని మనం చూశాం. మోదీ ప్రసంగం ఇంకా కొనసాగుతోంది. (జైలు లేదు జరిమానాయే) కాగా నవంబర్ 8న రూ.500, 1000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అనంతరం 2వేలు, 500 నోట్లను చలామణిలోకి తెచ్చింది. దీంతో పాత నగదును మార్చుకోవడానికి, కొత్త కరెన్సీని పొందడానికి సామాన్యులు క్యూలైన్లలో నానా కష్టాలు పడ్డారు. కాగా నోట్ల మార్పిడికి గడువు కూడా నిన్నటి(డిసెంబర్ 30 ) తో ముగిసిపోయింది. మరోవైపు పెద్దనోట్ల రద్దుతో తాత్కాలికంగానే ప్రజలకు కష్టాలు ఉంటాయని, దీర్ఘకాలంలో సంపన్నులే దీనివల్ల నష్టపోతారని, పేదలు, సామాన్యులు లాభపడతారని మోదీ చెప్తున్న విషయం తెలిసిందే. -
న్యూ ఇయర్‌కి మరో బాంబు పేల్చనున్నారా?
-
న్యూ ఇయర్‌కి మరో బాంబు పేల్చనున్నారా?
న్యూఢిల్లీ: నవంబర్ 8 వ తేదీ రాత్రి 8 గంటలకు హఠాత్తుగా నోట్ల రద్దును ప్రకటించి అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తదుపరి సమావేశంలో మరో బాంబు పేల్చనున్నారా? నల్లకుబేరులకు, అక్రమార్కులకు రానున్నది కష్టకాలమే అన్న ఇటీవల హెచ్చరికల నేపథ్యంలో డిసెంబర్ 31నాటి సమావేశంపై పలు అంచనాలు నెలకొన్నాయి. నూతన సంవత్సరంలో ప్రధాని దేశ ప్రజలకు ఎలాంటి వార్తను అందించనున్నారు? పాత నోట్ల డిపాజిట్లకు సమయం శుక్రవారంతో ముగియనుండడంతో మానిటైజేషన్ తరువాతి రోడ్ మ్యాప్ పై మళ్లీ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారని అధికారిక వర్గాల సమాచారం. శుక్రవారం లేదా శనివారం ప్రసంగిస్తారా అనేది పూర్తిగా స్పష్టత లేనప్పటికీ పెద్ద నోట్ల రద్దు తర్వాతి పరిణామాలు, దేశంలో ఏర్పడిన నగదు కొరతను తీర్చేందుకు తీసుకున్న చర్యలను ఆయన ప్రకటించవచ్చునని తెలుస్తోంది. అలాగే డీమానిటైజేషన్ అనంతరం కేంద్ర ప్రభుత్వ రోడ్ మ్యాప్ పై మళ్లీ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారని అధికారిక వర్గాల సమాచారం. నగదు కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలనుద్దేశించి 50రోజుల గడువు ఇవ్వండని విజ్ఞప్తి చేసిన ప్రధాని ఈ సారి ఏ ప్రకటన చేస్తారోననే సస్పెన్స్ నెలకొంది. మరోవైపు పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై భారీ ప్రచారం నిర్వహించేందుకు కేంద్రం సంసిద్దమవుతోంది. దీనికి మంత్రులను కూడా సన్నద్ధం చేస్తోంది. దీనికి సంబంధించి 60 పేజీల డాక్యుమెంట్ ను మంత్రులందరికీ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే పంపిణీ చేసింది. ఇందులో పెద్దనోట్ల రద్దు కు సంబంధించిన ప్రతీ అంశాన్నీ పాయింట్ టు పాయింట్ చేర్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా డీమానిటైజేషన్ అనంతరం దేశ ఆర్ధిక వ్యవస్థ ఎదుర్కొన్న ఇబ్బందుల పరిష్కారానికి తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలగురించి కూడా మోదీ వివరించవచ్చు. నోట్ల రద్దు వల్ల ఏర్పడిన పరిణామాలు, 50 రోజులు గడిచినా ఇంకా తీరని నోట్ల కొరత, దీని పరిష్కారానికి ఆయన ఎలాంటి వ్యూహం అనుసరించారో తేలనుంది. కాగా మంగళవారం ప్రధాని ప్రస్తుత ఆర్ధిక పరిస్థితిపై చర్చించేందుకు నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో జరిగిన ఒక సమావేశంలో ఆర్థికవేత్తలు, నిపుణులతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. -
అడ్రస్ ఓ చోట.. తయారీ మరో చోట
- వ్యవసాయ శాఖను పక్కదోవ పట్టిస్తున్న బయో కంపెనీలు - ఆదోని కిసాన్ మాల్ భారీగా అక్రమాలు - 2112 లీటర్లపై స్టాప్‌సేల్స్ కర్నూలు(అగ్రికల్చర్): పేరు ఒక ప్రాంతంలో... తయారీ మరో సుదూర ప్రాంతంలో.. ఇది బయో పెస్టిసైడ్స్, బయో ఫర్టీలైజర్ కంపెనీల తీరు ఇది. గుర్తింపు ఉన్న కంపెనీలే తప్పుడు అడ్రస్‌లతో వ్యవసాయ శాఖను పక్కదోవ పట్టిస్తున్నాయి. బయో కంపెనీలు ఇచ్చిన అడ్రస్‌ల ప్రకారం వెళ్తే అక్కడ వాటి జాడ లభించలేదు. అధికారికంగా జిల్లాలో 13 బయో ఉత్పత్తుల తయారీ కేంద్రాలు, అడ్రస్ లేని దొంగ కంపెనీలు వందల్లో ఉన్నాయి. బయో వ్యాపారంలో వ్యవసాయాధికారులే మునిగి తేలుతున్నారు. వీటికి చెక్ పెట్టేందుకు వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. వేర్వేరు జిల్లాలకు చెందిన డీడీఏ, ఏడీఏ, ఏఓ స్థాయి అధికారులను స్క్వాడ్‌గా ఏర్పాటు చేసి జిల్లాలో బయో ఉత్పత్తుల తయారీ కేంద్రాలను తనిఖీలకు చర్యలు తీసుకున్నారు. బుధ, గురు వారాల్లో ఏడు తయారీ కేంద్రాలకు ఆయా కంపెనీలు ఇచ్చిన అడ్రస్‌ల ప్రకారం వెళ్లి తనిఖీ చేశారు. ఇందులో నాలుగు బయో ఉత్పత్తుల తయారీ కేంద్రాలు ఇచ్చిన అడ్రస్‌లో లేవు. హైదరాబాద్, తదితర నగరాల్లో తయారు చేసి నేరుగా జిల్లాలోని గ్రామాలకు తరలిస్తున్నట్లు స్పష్టమవుతోంది. వ్యవసాయశాఖను తప్పుదోవ పట్టించేందుకే తప్పుడు అడ్రస్‌లు ఇచ్చినట్లుగా అధికారులు భావిస్తున్నారు. కల్లూరు మండలం బస్తిపాడు అడ్రస్‌తో ఉన్న పద్మజ క్రాప్ సైన్స్, కర్నూలు మండలం దిన్నెదేవరపాడులోని గోశాల దగ్గర అడ్రస్‌తో పవన్‌పుత్ర అగ్రి లైప్ సైన్సెస్, దిన్నెదేవరపాడులోని ఇండియన్ క్రాఫ్ కేర్, బేతంచెర్లలోని ఏఎస్ రామమూర్తి బయో కంపెనీలు వారు ఇచ్చిన అడ్రస్‌లో, పరిసరాల్లోనూ లేనట్లు స్పష్టమైంది. ఆదోనిలో కిసాన్ మాల్ పేరుతో బయో కంపెనీ ఉన్నా పలు అక్రమాలు వెలుగు చూశాయి. బయోల వివరాలు స్టాక్ రిజిస్ర్టర్లో చూపకపోవడం తదితర కారణాలతో రూ.1.56 లక్షల విలువ కలిగిని 2112 లీటర్ల బయో మందుల అమ్మకాలపై నిషేధం విధించారు. ఈ సందర్భంగా స్క్వాడ్ డీడీఏ మోహన్‌రావు సాక్షితో మాట్లాడుతూ బయోపెస్టిసైడ్ కంపెనీలు విధిగా కోర్టు స్టే ఆర్డర్ కలిగి ఉండాలని, ఆ మేరకు పత్రాలు, ఇన్వాయిస్ వివరాలు, స్టాక్ రిజిస్ర్టర్ తదితర వన్నీ ఉండాలని వివరించారు. తనిఖీలతో పాటు శ్యాంపుల్స్ కూడా సేకరించి ల్యాబ్‌కు పంపుతామని ఇందులో కెమికల్స్ ఉన్నాయని నిర్ధారణ అయితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వివరించారు. ఇంకా ఆరు కంపెనీలను తనిఖీ చేయాల్సి ఉందన్నారు. -
ఆరోగ్యానికి చిరునామా క్రీడలు
ఎన్పీడీసీఎల్ సీఎండీ వెంకటనారాయణ ∙విద్యుత్ ఉద్యోగుల రాష్ట్రస్థాయి క్రీడలు ప్రారంభం వరంగల్ స్పోర్ట్స్ : క్రీడలు ఆరోగ్యానికి చిరునామా లాంటివని ఎన్పీడీసీఎల్ సీఎండీ కొంటె వెంకటనారాయణ అభివర్ణించారు. తెలంగాణ ట్రాన్స్‌కో, డిస్కంల ఇంటర్ సర్కిల్ కబడ్డీ, క్యారమ్ టోర్నమెంటు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కౌన్సిల్ ఆపరేషన్స్ సర్కిల్ ఆధ్వర్యంలో హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీలను శుక్రవారం వెంకటనారాయణ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. క్రీడా పతాకాన్ని ఆవిష్కరించిన ఆయన క్రీడాకారుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతు పని ఒత్తిడితో సతమతమయ్యే ఉద్యోగులకు క్రీడలు మానసిక ప్రశాంతతను చేకూరుస్తాయన్నారు. ఒత్తిడితో అనారోగ్య బారిన పడుతున్న వారిసంఖ్య అన్ని రంగాల్లోనూ ఉందన్నారు. అనంతరం క్యారమ్ క్రీడాకారుడు, మాజీ విద్యుత్ ఉద్యోగి వెలంటేన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎండీ వెంకటనారాయణ కబడ్డీ ఆడడం క్రీడాకారుల్లో ఉత్తేజాన్ని నింపింది. కార్యక్రమంలో డైరెక్టర్ ప్రాజెక్ట్స్ బి.వెంకటేశ్వర్రావు, డైరెక్టర్ ఆపరేషన్స్ బి.నర్సింగరావు, వరంగల్ సర్కిల్ ఎస్ఈ శివరాం, సీజీఎం సదర్లాల్, తిరుపతిరెడ్డి, మోహన్‌రావు, మధుసూదన్, డీఈలు శ్రీకాంత్, రాంబాబు, విజయేందర్‌రెడ్డి, స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ కేవీ జాన్సన్, ఇన్చార్జి ఆర్.రమేష్ వివిధ జిల్లాల డీఈ, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యంలో పెద్దేరు
⇒ కట్టపై రాళ్లపై రావి చెట్లు ⇒ రంధ్రాలు పడి దెబ్బతింటున్న నిర్మాణం ⇒ సిబ్బంది పోస్టులన్నీ ఖాళీ ⇒ పట్టించుకోని అధికార యంత్రాంగం బి.కొత్తకోట: తంబళ్లపల్లె.. కరువుకు చిరునామా. అక్కడ గుక్కెడు తాగు నీరు గగనమే. అలాంటి ప్రాంతం సస్యశ్యామలం చేయడానికి వర్షపు నీటిని ఒడి పట్టడానికి 1976లో బీజం పడింది. అదే తంబళ్లపల్లె మండలం కొటాల గ్రామానిక సమనీపంలో నిర్మించిన పెద్దేరు ప్రాజెక్టు. ఇది 1981కి పూర్తి అయ్యింది. కర్షకులకు సాగు నీరందించి తంబళ్లపల్లె, పెద్దమండ్యం మండలాల కరువు రైతుల కల్పతరువుగా నిలిచింది. నాటి వరకు సజ్జ సంగటితో సరిపెట్టుకునే అన్నదాతలు వరి అన్నం తినే స్థాయికి ఎదిగారు. అయితే అధికార యంత్రాంగం ఆ ప్రాజెక్టు నిర్వహణ గాలికి వదిలేయడంతో ఆ ఆనందం నీరుగారిపోతోంది. నేడు పెద్దేరు ప్రాజెక్టు నిర్వహణ నిర్లక్షానికి నిలువెత్తు నిదర్శనంగా మారింది. తంబళ్లపల్లె నియోజకవర్గంలో తొలి సాగునీటి ప్రాజెక్టు పెద్దేరు. అయితే దీని నిర్వహణపై అధికార యంత్రాంగం పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. నీటి నిర్వహణ, కాలువల యాజమాన్యం కోసం రూ.కోట్లు ఖర్చు చేసినా దుర్భర పరిస్థితులు వీడలేదు. ప్రాజెక్టు నిర్వహణ కోసం ప్రత్యేక వ్యవస్థే ఉన్నా ప్రస్తుతమిది ఏమి చేస్తోందో, అసలు ఉందో లేదో అన్న అనుమానం ప్రాజెక్టు దుస్థితిని చూస్తే కలగకమానదు. నిర్వహణ గాలికి వదిలేశారు రూ.7.98 కోట్లతో నిర్మించిన పెద్దేరు ప్రాజెక్టు నిర్వహణపై జలవనరులశాఖ పట్టించుకోవడం లేదన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. పూర్తిగా రాయి కట్టడంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు గురించి పట్టించుకోకపోవడంతో కట్టపై రావిచెట్లు మొలిచి ఏపుగా పెరుగుతున్నాయి. కట్ట పైనుంచి కిందకు పైపుల ఏర్పాటు సందర్భంగా ఏర్పడిన రంధ్రాలను రాళ్లతో పూడ్చారు. కట్ట వెనుక భాగం నెర్రులొచ్చాయి. కట్టపై గోడలకు రంధ్రాలు పడినా వాటిని పట్టించుకోక అలాగే వదిలేశారు. ఇది ప్రాజెక్టు భద్రతపై ప్రభావం చూపించే పరిస్థితులుగా స్పష్టం అవుతున్నా కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. ప్రాజెక్టును చూస్తే పాడుబడినట్టుగా కనిపిస్తుంది. ప్రాజెక్టు నుంచి పొలాలకు సాగునీరు వెళ్లాలంటే కుడి, ఎడమ కాలువలే కీలకం. ఈ కాలువల నిర్వహణ కోసం ప్రభుత్వం ఏటా రూ.లక్షలు ఖర్చు చేస్తున్నా కనీస నిర్వహణ లేదు. కాలువలు మట్టి, రాళ్లతో పూడిపోతున్నాయి. కుడికాలువపై ముళ్లపొదలు పెరిగాయి. అక్కడక్కడ కాలువ కోతకు గురైంది. శిథిలావస్థలో భవనాలు.. ప్రాజెక్టు నిర్వహణ కోసం 1981లోనే పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేశారు. అధికారులు, సిబ్బందిని నియమించారు. వారికోసం ప్రాజెక్టు దిగువన పెద్ద భవనాలు, అతిథి గహలు, కార్యాలయాలు నిర్మించారు. ఉద్యానవనం నిర్వహణ కోసం లష్కర్లను నియమించారు. అయినా ఫలితం శూన్యం. గతంలో ఇక్కడ ఉండాల్సిన పోస్టులన్నీ భర్తీ చేసినప్పటికీ నిర్వహణ చర్యలు అంతంతమాత్రమే. దీంతో ప్రాజెక్టు కళతప్పింది. నిండా నీళ్లున్నా ఎప్పుడూ ప్రాజెక్టు ముందుభాగంలోని ఉద్యానవనాల నిర్వహణ గాలికి వదిలేశారు. ఇప్పడీlప్రాంతం ముళ్లచెట్లు, పొదలతో నిండిపోయింది. ’ప్రాజెక్టు పోస్టులన్నీ ఖాళీగానే.. పెద్దేరు ప్రాజెక్టు నిర్వహణ, నీటి యాజమాన్యం కోసం ఒక జేఈ ఉండాలి. ఇతను నిత్యం ప్రాజెక్టును పర్యవేక్షిస్తూ ఉండాలి. ప్రాజెక్టు నిండాక నీటి విడుదల, పంటల సాగు పరిస్థితులకు అనుగుణంగా నీటిని కుడి, ఎడమ కాలువలకు ఏ స్థాయిలో విడుదల చేయాలన్న అంశాలపై పర్యవేక్షణ కొనసాగాలి. అయితే ప్రస్తుతం ఈ పోస్టుకు అధికారిని నియమించలేదు. ప్రస్తుతం పెద్దతిప్పసముద్రం మండల జేఈ సారధి ప్రాజెక్టు ఇన్చార్జి జేఈగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక లష్కర్ పోస్టులు నాలుగుండగా మూడు పోస్టులు ఖాళీ, ఒక ఎలక్ట్రిషియన్ పోస్టు ఖాళీ, ఇద్దరు వర్క్ ఇన్స్పెక్టర్లు ఉండాల్సి ఉండగా ఒకరు మాత్రమే ఉన్నారు. వాచ్మెన్ పోస్టు కూడా ఖాళీగానే ఉంది. ఇదీ ప్రాజెక్టు స్వరూపం తంబళ్లపల్లె మండలం కొటాల గ్రామంలో రెండు కొండల నడుమ పెద్దేరు ప్రాజెక్టుకు 1976 అక్టోబర్‌లో పనులు ప్రారంభించి, 1980 డిసెంబర్లో పూర్తి చేశారు. 600 మీటర్ల పొడవు, 35.74 మీటర్ల ఎత్తు కలిగిన ప్రాజెక్టులో నీటిæనిల్వ సామర్థ్యం 793 ఎంసీఎఫ్‌టీలు. తొలిసారి 1981 డిసెంబర్ 29న పంటలకు నీటిని విడుదల చేశారు. దీనికింద ఖరీఫ్‌లో 7వేల ఎకరాలు సాగవుతుంది. మొదటి స్టేజిలో కుడికాలువకింద 1,800 ఎకరాలు, ఎడమ కాలువకింద 2,800 ఎకరాలు, రెండో స్టేజీలో 2,700 ఎకరాల ఆయకట్టు సాగుకు నీళ్లిచ్చేలా నిర్ణయించారు. కుడికాలువ 14.60 కిలోమీటర్లు కాగా 65.34 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తారు. ఎడమకాలువ 17కిలోమీటర్లు కాగా 40 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తారు. జీవితాలు మార్చేసింది పెద్దేరు ప్రాజెక్టు నిర్మాణంతో మా జీవితాలు మారిపోయాయి. బీడు భూములు సాగులోకి వచ్చాయి. కొర్రలు, సద్దలు తప్ప మరో పంట ఎరుగని మాకు వరి సాగు చేసేలా చేసి, భోజనం తినేలా చేసింది ఈ ప్రాజెక్టే. దీన్ని కట్టకుండా ఉంటే ఇప్పటికీ మా బతుకులు బీడుబారేవి. గత డిసెంబర్లో ప్రాజెక్టు నిండటంతో రెండెకరాలు సాగులోకి వచ్చాయి. ఇప్పుడు పంటలు సాగుచేసుకుంటూ ఆర్థికంగా బాగుపడుతున్నాం. – వై.వెంకటనర్సప్ప, 75ఏళ్ల రైతు, ఇర్రివారిపల్లె కపిలతో సాగుచేసే వాళ్లం పెద్దేరు ప్రాజెక్టు నిర్మాణానికి ముందు పంటలు సాగు చేయాలంటే కపిలతో నీటిని తోడేవాళ్లం. ప్రాజెక్టు వచ్చాక 3 ఎకరాల్లో పంటలు సాగు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకొన్నాం. రాగి,సద్దల సంగటి తీనేవాళ్లం. ఇప్పుడు వరి భోజనం చేస్తున్నాం. ప్రాజెక్టుకు ముందు మా ప్రాంతంలో పెద్ద భూస్వాములు మాత్రమే వరి భోజనం చేసేవారు. ఇప్పుడు సాధారణ రైతులూ వరి భోజనం చేస్తున్నారు. ప్రాజెక్టు కట్టేసమయంలో దీని విలువ తెలియదు. ఇప్పుడు తెలుస్తోంది. – కే.వెంకటరెడ్డి, 90ఏళ్ల రైతు, ఉప్పలూరివాండ్లపల్లె -
ఇంటర్ విద్యా మండలి కేంద్ర కార్యాలయం మార్పు
శ్రీకాకుళం: ఇంటర్మీడియెట్ విద్యా మండలి కేంద్రం కార్యాలయం హైదరాబాద్ నుంచి విజయవాడకు మార్చినట్లు ఇంటర్మీడియెట్ విద్యామండలి ప్రాంతీయ పర్యవేక్షణాధికారి పాత్రుని పాపారావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కావున జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు తమ మెయిలింగ్ లిస్టులో కార్యదర్శి, ఇంటర్మీడియెట్ విద్యామండలి, డోర్ నంబర్ 48–18–2/ఎ, నాగార్జున నగర్ కాలనీ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎదురుగా, విజయవాడ–520008, ఫోన్ 0866–2974130 చిరునామాను నమోదు చేసుకోవాలని ఆ ప్రకటనలో తెలిపారు. -
రంగంలోకి దిగనున్న ప్రియాంకా గాంధీ
మీరట్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ రాజకీయ అరంగేట్రం ఖరారైందా? ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఆమె పూర్తి స్థాయిలో ప్రచారం చేయనున్నారా?సంప్రదాయబద్ధంగా అమేథి, రాయ్ బరేలిల్లో మాత్రమే ప్రచారం చేస్తూ వస్తున్న ప్రియాంక ఇప్పటి వరకూ ఎవరూ ప్రచారం చేయని విధంగా ఏకంగా 150 ర్యాలీల్లో ప్రసంగిస్తారని ఆపార్టీ ఉత్తరప్రదేశ్ ప్రతినిధి సత్యదేవ్ త్రిపాఠి మీడియాకు తెలిపారు. 2017 ఎన్నికల్లో ప్రియాంక ప్రధాన పాత్రను పోషించనున్నారని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం హైకమాండ్ స్థాయిలో పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారని ఆయన తెలిపారు. -
అడ్రస్ పోయింది...
ఆ కుటుంబానికి తండ్రే ఒక అడ్రస్. భార్యకు భర్తగా, పిల్లలకు తండ్రిగా, కుటుంబానికి పెద్ద దిక్కుగా తానే ఒక అడ్రస్‌గా ఉన్నాడు. కాని ఇప్పుడా అడ్రస్ పోయింది. భార్యాపిల్లలు ఆ అడ్రస్ వెతుక్కుంటున్నారు. చెప్పకుండా మాయమైన తండ్రిని ఐదేళ్లుగా వెతుక్కుంటున్నారు. ‘మా నాన్న అడ్రస్ చెప్పరూ’ అని మానవ హక్కుల కమిషన్ గడప తొక్కిన ఆ పిల్లలకు కావలసింది ఓదార్పు మాత్రమే కాదు. ఆ తండ్రి తోడు. అతని నీడా. ఫలితంగా తమకో అడ్రస్ ఉందనే ధైర్యం. చింతల మల్లయ్యకు యాభై ఏళ్లు. గవర్నమెంట్ టీచర్. ఊరు నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం పెద్దమాందాపురం గ్రామం. భార్య ఉంది. పేరు యాదమ్మ. ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుమారుడు కౌశిక్‌కుమార్, కూతురు సృజన, మరో కూతురు శ్రీలేఖ. ఆర్థికంగా పెద్ద కష్టాలేమీ లేవు. మల్లయ్య ఉపాధ్యాయునిగా పనిచేస్తూ, పిల్లలను చదివిస్తున్నాడు. వారి సంసారం హాయిగా సాగిపోయేది. కాని- సరిగ్గా ఐదేళ్ల క్రితం. 2011. మండు వేసవి. ఆ వేసవి ఆ ఇంట్లో వడగాడ్పు కొట్టింది. అంతవరకూ ఎంతో బాధ్యతగా ఉన్న మల్లయ్య హఠాత్తుగా ఇంటినుంచి వెళ్లిపోయాడు. ఎవరికీ ఏమీ చెప్పకుండా వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు ఎంతో వెతికారు. కాని దొరకలేదు. మూడు నెలలకు అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యి పాలివాండ్లతో భూముల గొడవలను పరిష్కరించుకొని ఉన్న డబ్బులను, ఆస్తులను పట్టుకెళ్లిపోయాడు. చాలా పెద్ద దెబ్బ ఇది. ఆ దెబ్బకు కుటుంబం వీధిన పడింది. భార్య యాదమ్మ కూలీనాలీ చేస్తూ మిగిలిన భూమిని కౌలుకు చేయిస్తూ, కుటుంబాన్ని పోషిస్తూ, పిల్లలను చదివిస్తోంది. ఈ పని చేస్తూనే ఇంటి బాధ్యతను వదిలేసి అనాథలను చేసిన మల్లేశంను వెతుకుతూనే ఉంది. ఎక్కడున్నాడు? మల్లయ్య ఉప్పల్‌లో ఉంటున్నాడని తెలుసుకొని 2014లో అప్పటి జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులును ఆశ్రయించారు యాదమ్మ, పిల్లలు. పోలీసులు మల్లయ్యపై మిస్సింగ్ కేసు నమోదు చేసి వెతికి పట్టి తెచ్చి కుటుంబానికి అప్పగించారు. ఇకపై తాను ఎక్కడికీ వెళ్లనని, బుద్ధిగా భార్యాపిల్లలను చూసుకుంటానని, లేదంటే చట్టరీత్యా చర్యతీసుకోమని పోలీస్ స్టేషన్లో రాసిచ్చాడు మల్లయ్య. కుటుంబ సభ్యుల వెంట ఇంటికెళ్లాడు. కాని రెండు రోజులే ఉన్నాడు. మళ్లీ పరార్. ఇప్పటికి రెండున్నర సంవత్సరాలుగా ఇంటికిగాని, ఉద్యోగానికి గాని రాలేదు. విద్యాశాఖ అధికారులు అతను చేస్తున్న టీచరు ఉద్యోగం నుంచి తొలగించారు. ఆ సంగతి తెలిసి మల్లయ్య మళ్లీ ఊడిపడ్డాడు. భార్యాపిల్లలతో కలిసి అప్పటి డీఈవోను ఉద్యోగం ఇప్పించాలని మొరపెట్టుకున్నాడు. 8నెలల పాటు తిరిగితే చివరకు పిల్లల మోహం చూసి అధికారులు మళ్లీ ఉద్యోగం ఇస్తూ గుర్రంపోడు మండలం మక్కపల్లి ప్రాథమిక పాఠశాలలో పోస్టింగ్ వేశారు. మల్లయ్య రెండు రోజులు ఉద్యోగం చేశాడు. మూడో రోజు తెల్లారి లేచి చూసేసరికి ఇంట్లో లేడు. కుటుంబ సభ్యులు మళ్లీ మిస్సింగ్ కేసు పెట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇంతవరకు, అత ని ఆచూకీ కనుగొనలేదు. దీంతో రెండు రోజుల క్రితం మల్లయ్య పిల్లలు హెచ్చార్సీని ఆశ్రయించి, తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇంతకీ ఏం చేస్తున్నాడు... మల్లయ్య వివాహేతర సంబంధంలో ఉన్నాడని బోగట్టా. టీచర్‌గా ఉద్యోగం చేస్తున్న సమయంలో పక్క మండలానికి చెందిన ఓ మహిళతో సంబంధం ఏర్పడిందని చెబుతున్నారు. ఆ మహిళకు వివాహం అయిందని, వీరి సంబంధం చూసి భర్త గొడవ పడి మల్లయ్యను కొట్టాడని ఆ తర్వాత ఆమెను వదిలేశాడని చెబుతున్నారు. తనతో సంబంధం వల్ల ఇదంతా అయ్యింది కనుక మల్లయ్య ఆమెతోనే ఉంటూ ఆమెను పోషిస్తూ ఉన్నాడని కథనం. ఇది తెలిసి యాదమ్మ దేవరకొండ కోర్టులో భరణం కేసు కూడా వేసింది. కాని అడ్రస్ లేని మనిషికి ఎక్కడికని నోటీసులు పంపాలి? ఏమైనా ఇది బాధ్యత మరిచిన ఒక మనిషి కథ. కుటుంబానికి అన్యాయం చేసిన మనిషి తప్పిదం. ఈ తప్పిదానికి శిక్ష అనుభవిస్తున్నది మాత్రం భార్యా పిల్లలు.డడడడ - కనకల లింగస్వామి సాక్షి, చౌటుప్పల్, నల్లగొండ జిల్లా మొగుడు సచ్చిండనుకొని బతుకమండు నేను మూడో తరగతి వరకే చదివా. కూలీనాలీ చేసి పిల్లలను పోషిస్తున్నా, ఇప్పటికి రూ.3 లక్షల మేర అప్పులు చేసి నా శక్తిమేరకు పిల్లలను సదివిపిస్తున్నా. నా భర్త మల్లయ్య ప్రభుత్వ ఉద్యోగి కావడంతో, స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ కూడా రావడంలేదు. నా భర్తకు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉన్న మూడేళ్ల వరకు కనుక్కోలేకపోయా. నిలదీస్తే మొగుడు సచ్చిండనుకొని బతుకమండు. కుటుంబం పరువుపోతుందని ఇంతవరకు రోడ్డెక్కలే. ఇక ఈ కుటుంబాన్ని పోషించేందుకు నాకు దమ్ము చాలడంలేదు. పిల్లలు పెళ్లీలకు ఎదిగిండ్రు. నా భర్తను నాకు వెతికిపించాలె - యాదమ్మ, భార్య డాడే గుర్తుకొస్తుండు ఏడాదిన్నర క్రితం కిట్స్‌లో ఎంటెక్ పూర్తి చేశా. బ్యాక్లాగ్ ఉండడంతో ఖాళీగా ఉన్న. నాన్న ఉన్నప్పుడు ప్రతిపనికి భుజం తట్టి ప్రోత్సహించేవాడు. నాన్న వెళ్లిపోయాక ఏం చేయాలో తెలియడం లేదు. కష్టమొచ్చినా, సంతోషమనిపిచ్చినా ఆయనే గుర్తుకొస్తుండు. ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. నాన్నకు ఇంకా 9 ఏళ్ల సర్వీసు ఉంది. ఇప్పటికైనా వస్తే వారి పెళ్లిళ్లు చేసి, కుటుంబాన్ని సర్దుకోవచ్చు. - కౌశిక్‌కుమార్ కుమారుడు ఫీజు రూ.3 లక్షలు చెల్లిస్తే బీటె క్ సర్టిఫికేట్లు నాన్నే 2008లో బాసర ట్రిపుల్ ఐటీలో చేర్పించిండు. నాన్న నా ఇంటర్‌కు బ్యాంకులో ఎడ్యుకేషన్ లోన్ తీసుకుండు. ఆ తర్వాత ఇంటి నుంచి వెళ్లి పోయిండు. బ్యాంకు లోన్ కట్టలే. ఇంటర్ పూర్తయ్యాక బీటెక్ చదివా. ఏడాదికి ఫీజు రూ.40 వేలు. ఇప్పుడు బ్యాంకు లోను, ఫీజు అన్నీ కలిసి, రూ.3 లక్షలకు చేరాయి. ఈ పైసలు కడితేనే సర్టిఫికేట్లు ఇస్తామని చెబుతుండ్రు. బీటెక్ కిందటి ఏడాదే పూర్తయింది. ఉస్మానియా పీజీసెట్ రాశా. 300 ర్యాంకు వచ్చింది. సర్టిఫికేట్లు ఉంటే ఎంటెక్ మొదటి ఏడాది పూర్తయ్యేది. నాన్న వస్తడేమో, ఫీజు కట్టి సర్టిఫికేట్లు ఇప్పిస్తడేమోననే ఆశతో మళ్లీ, ఈ ఏడాది పీజీ సెట్‌కు ప్రిపేర్ అవుతున్నా. ప్రభుత్వం ఫీజురీయింబర్స్‌మెంట్ ఇప్పించినా చదువుకుంటా. - సృజన, పెద్ద కుమార్తె బువ్వపెడ్త కానీ, చదివించలేనంది నాన్న ఉన్నప్పుడు నల్లగొండలోని ఆల్ఫా స్కూల్లో చదివించిండు. 9వ తరగతిలో ఉన్నప్పుడు ఇంటి నుంచి వెళ్లిపోయిండు. ఎస్సెస్సీలో 9.8పాయింట్లు సాధించా. నల్లగొండలోని గౌతమ్ కళాశాల వారు ఉచితంగా కళాశాలలో సీటు ఇచ్చారు. ఎంసెట్ కోచింగ్ ఇచ్చారు. ఇంటర్లో 959మార్కులు సాధించా. బీటెక్ చదవాలనేది నా కోరిక. కానీ, ఫీజు రియింబర్స్‌మెంట్ రానందున అమ్మ బువ్వ పెడతా కానీ, అంత ఫీజు కట్టలేనంది. దీంతో డిగ్రీలో చేరా. నాన్న ఉంటే మా పరిస్థితి ఇలా ఉండేది కాదు. పెద్ద చదువులు చదివించే వారు. - శ్రీలేఖ, చిన్నకుమార్తె -
మాటలుండవు ‘చేతలే’!
స్నాచింగ్ సమయంలో తెలివిగా వ్యవహరించే గ్యాంగ్ షామ్లీ జిల్లాలో 12 గ్రామాల్లో నివసిస్తున్న బవరియాలు సోని పోలీసు కస్టడీలోకి తీసుకోవాలని అధికారులు నిర్ణయం సిటీబ్యూరో: చిరునామా చెప్పమని అడుగుతూనో... మంచి నీళ్లు కావాలనో.. దుకాణంలో సరుకులు కావాలంటూ నో... ఇలా ఏదో ఒక రకంగా బాధితులతో మాటలు కలిపి గొలుసు దొంగతనాలు చేయడం స్నాచర్ల నైజం. అయితే నగరంపై విరుచుకుపడి మూడు రోజుల్లో 14 నేరాలు చేసిన బవరియా గ్యాంగ్ స్టైలే వేరు టార్గెట్ చేసుకున్న మహిళలతో అసలు మాట్లాడరు. ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేసిన సోను ఈ ముఠాకు చెందిన సభ్యడన్న విషయం విదితమే. ఈ గ్యాంగ్ లీడర్ మన్‌ప్రీత్ అలియాస్ మంగళ్ సహా మరికొందరి కోసం జంట కమిషనరేట్ల అధికారులు వేట కొనసాగిస్తున్నారు. ఒక చోట మాత్రమే డైలాగ్స్... గత నెల 13, 14, 15 తేదీల్లో జంట కమిషనరేట్ల పరిధిలోని 14 ప్రాంతాల్లో పంజా విసిరిన ఈ ముఠా సభ్యులు కేవలం ఒక్క చోటే బాధితురాలితో మాట కలిపారు. మిగిలిన 13 ఉందంతాల్లోనే సంజ్ఞలతోనే ‘పని’ పూర్తి చేసుకుపోయారు. రెండు బృందాలుగా వేర్వేరు వాహనాలపై బయలుదేరే మంగళ్ గ్యాంగ్ ‘పెలైట్’, ‘హిట్’ పంథాలో రెచ్చిపోతుంది. నగరంలో పంజా విసిరిన మూడు రోజుల్లో టార్గెట్‌గా చేసుకున్న ఓ మహిళ వద్దకు వెళ్లిన ముఠా సభ్యుడు సమీపంలో ఉన్న చెట్టు వైపు చెయ్యెత్తి చూపించాడు. అక్కడ ఏముందా అని ఆ మహి ళ అటు చూడగా... గొలుసు లాక్కుని బైక్ ఎక్కి పారిపోయాడు. మరో ఉదంతంలో మార్నింగ్ వాక్ పూర్తి చేసుకుని వచ్చి అరుగుపై కూర్చున్న మహిళ వద్దకు వెళ్లిన గ్యాంగ్ మెంబర్ ఆమె సమీపంలో నేలపై రాయడం మొదలెట్టాడు. అదేంటో చూద్దామని ఆ మహిళ కిందికి వంగగా... మెడలోని పుస్తెల తాడు లాక్కొని ఉడాయిం చాడు. మిగిలిన నేరాలనూ ఇలానే చేసిందీ బవరియా గ్యాంగ్. భాషతో ప్రాంతం తెలుస్తుందని... ఉత్తరప్రదేశ్ షామ్లీ జిల్లాలోని 12 గ్రామాల్లో బవరియా తెగవారు నివసిస్తున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో చైన్ స్నాచింగ్స్తో పాటు ఇతర నేరాలు చేయడమే వీరి వృత్తి. బడాకాన్పూర్, జఠాన్పూర్, రామ్‌పుర, సూక్రా, నవబస్, ధూద్దీ, మసద్ఘడ్, ఛోటా కాన్పూర్, బైరాహియాం, హ్మద్ఘడ్, ఖేడీ, లాధీపూర్ల్లో ఈ తెగ విస్తరించి ఉంది. నాగరికత ఆనవాళ్లు పూర్తిగా కనిపించని ఆ గ్రా మాల్లోని యువత ఎప్పటికప్పుడు వేర్వేరు ముఠాలు కడుతూ నేరాలు చేయడమే వృత్తిగా చేసుకున్నారు. ఇలా దేశ వ్యాప్తంగా నేరాలు చేసే వీరు బాధితులతో మాట్లాడితే... తమ భాష, యాస ఆధారంగా తాము ఏ ప్రాంతం వారిమో అనేది పోలీసులు పసిగట్టి పట్టుకుం టారనే భయంతో దొంగలు సాధ్యమైనంత వరకు మా టలకు దూరంగా ఉండి ‘చేతల’తో రెచ్చిపోతుంటారు. స్థానికంగా ఏ నేరాలు చేయరు... ఎంపిక చేసిన నగరాల్లో ఇళ్ల అద్దెకు తీసుకుని డెన్లు ఏర్పాటు చేసుకుంటూ రోజుల తరబడి మకాం వేసి మరీ పంజా విసురుతాయి బవరియా ముఠాలు. తమ సొంత ప్రాంతంలో మాత్రం ఎలాంటి నేరాలు చేయవు. దీనికితోడు స్థానిక పోలీసులతో వీరికి ‘ములాఖత్’ ఉంటుంది. బయటి ప్రాంతాల నుంచి పోలీసులు వస్తే ఆ విషయాన్ని అక్కడి పోలీసులే బవరియాలకు చేరవేస్తారు. ఇలా చేసినందుకు వారికి భారీ ‘పారితోషికాలే’ ముడతాయట. బవరియాలు నివసించే 12 గ్రామాలూ పక్కపక్కనే ఉండటంతో ఓ గ్రామంలోని వారికి విషయం తెలిస్తే చాలు.. చాలా తేలిగ్గా మిగిలిన వారికీ పాకి అందరూ అప్రతమత్తం అవుతారు. అలాగని స్థానిక పోలీసుల సహకారం లేకుండా బయటి పోలీసులు గ్రామాల్లోకి ప్రవేశిస్తే వారిపై దాడులకూ వెనుకాడరు. ఒకే ఒక్కడు నుంచి ముఠాలుగా... షామ్లీ జిల్లాలోని బవరియా తెగకు ఒకప్పుడు ఛత్రసేన అనే వ్యక్తి నాయకుడిగా ఉండేవాడు. ఇతడే పదుల సంఖ్యలో ముఠాలు నిర్వహిస్తూ నేరాలు చేయించేవాడు. దేశ వ్యాప్తంగా నేరాలు ఇతడి నేతృత్వంలోనే జరిగేవి. కాలక్రమంలో ఎవరికి వారు ముఠాలు ఏర్పాటు చేసుకుని రెచ్చిపోవడం ప్రారంభించడంతో మన్‌ప్రీత్ అలియాస్ మంగళ్ లాంటి వాళ్లు పెరిగిపోయారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న మన్‌ప్రీత్ ఇల్లు బడా కాన్పూర్‌లో పెద్ద కోటను తలపిస్తూ గేటులతో ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. దేశంలో ఏ ప్రాంతంలో నేరాలు చేయడానికి వెళ్లినా.. ముఠా సభ్యులకు అవసరమైన అన్ని ఖర్చులూ అతడే భరిస్తాడు. నివాసం, ఆహారం, ఇతర ఖర్చులు మాత్రమే కాదు... ఎవరైనా పోలీసులకు చిక్కితే బెయిల్ తదితర వ్యవహారాలు పర్యవేక్షిస్తాడు. ఈ నేపథ్యంలోనే చోరీ సొత్తులో అధిక మొత్తం అతడే తీసుకుంటాడు. ముఠా సభ్యులకు మాత్రం సొత్తు విలువను బట్టి ఒక్కో చోరీకి రూ.10 నుంచి రూ.15 వేల చొప్పున ఇస్తాడని పోలీసులు చెప్తున్నారు. గురువారం అరెస్టు చేసిన సోనును కోర్టు అనుమతితో అదుపులోకి తీసుకున్న తర్వాత నగర పోలీసులు మరోసారి షామ్లీకి వెళ్లాలని నిర్ణయించారు. -
అడ్రస్ కావాలంటూ వచ్చి భారీ చోరీ..
రైల్వేకోడూరు: వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు పట్టణంలోని కృష్ణనగర్‌కు చెందిన ప్రవీణ అనే మహిళ ఇంటిముందు వరండాలో ఉండగా ఒక వ్యక్తి అడ్రస్ అడిగేందుకు వచ్చి ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లాడు. కుటుంబసభ్యులు దుండగుడ్ని వెంబడించినా కొద్దిదూరం వెళ్లిన తర్వాత అక్కడ రెడీగా ఉన్న బైక్‌పై ఉడాయించాడు. 150 గ్రాముల బంగారు గొలుసు లాక్కెళ్లాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దుండగుడి కోసం గాలిస్తున్నారు. బంగారు గొలుసు ధర సుమారు ప్రీ ప్లాన్ గా ఈ చోరీ జరిగి ఉండొచ్చునని పోలీసులు భావిస్తున్నారు. -
చిరునామా చెప్పారూ!
నగరంలో గందరగోళంగా ఇంటి నెంబర్లు గుర్తించేందుకు కష్టాలు నిత్యం ఎంతోమందికి అవస్థలు సిటీబ్యూరో: సురేష్ కొత్తగా నగరంలోకి వచ్చాడు. బంజారాహిల్స్‌లో ఉంటున్న అతని మిత్రుడు ఇచ్చిన చిరునామా ఆధారంగా ఇంటి నెంబర్ కనుక్కొనేందుకు బయలుదేరాడు. ఉదయం 8 గంటలకు వెతకడం ప్రారంభిస్తే...11 గంటలైనా చిరునామా కనుక్కోలేకపోయాడు. ఇంటి నెంబర్ గుర్తించలేకపోయాడు. చివరికి తన మిత్రుడు ఆఫీస్‌కు ఒక పూట సెలవు పెట్టి...స్వయంగా వచ్చి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఒక్క సురేష్ మాత్రమే కాదు... నిత్యం ఎంతోమందికి ఇలాంటి పరిస్థితే ఎదురవుతోంది. పూర్తి చిరునామా కాగితం చేతిలో ఉన్నా.. మనం చేరాల్సిన ఇల్లు ఎక్కడ ఉందో తెలియక గంటలు గంటలు తిరగాల్సిన పరిస్థితి. ఒక ఇంటి నెంబరును చూసి.. తర్వాతి నెంబరు గల ఇల్లు పక్కనే ఉంటుందనుకుంటే పొరపాటే. గజిబిజి గల్లీలు... క్రమపద్ధతిలో లేని వీధి నెంబర్లు... గందరగోళంగా కాలనీలు... వరుస క్రమంలో లేని ఇళ్ల నెంబర్లు.. ఒక్క డోర్ నెంబరులోనే ఎన్నో బై (/) సంఖ్యలతో ఇళ్లు. వీటిలో అసలు చిరునామా కనుక్కోవడానికి నిత్యం ఎంతోమంది అవస్థలు పడుతున్నారు. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం నాటి నెంబర్ల వ్యవస్థే నేటికీ కొనసాగుతోంది. ఈ మధ్యకాలంలో లక్షల సంఖ్యలో ఇళ్లు పెరిగాయి. దాంతో అప్పటికే ఉన్న ఇంటి నెంబరుకు ‘బై’ (/) గుర్తును చేర్చి... వరుసగా నెంబర్లు రాసుకుంటూ పోవడమో లేక ఏ..బీ..సీ.. డీ.. ఈ..లుగా పొడిగిస్తూ పోవడమో చేశారు. ఫలితంగా చిరునామాలు కనుక్కోవడం పరీక్షగా మారింది. ప్రజలకు ఈ అవస్థలు తప్పించేందుకు... సులభంగా చిరునామాలు తెలుసుకునేందుకు వీలుగా పద్ధతి ప్రకారం ఉండేలా కొత్త ఇంటి నెంబర్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. కానీ.. ముందుకు సాగడం లేదు. ప్రత్యేక విభాగం ఇళ్లు, రోడ్లు, వీధుల పేర్లు, నెంబర్లకోసం జీహెచ్ఎంసీలో ఒక విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. డెరైక్టర్ స్థాయి అధికారి నేతృత్వంలో ఇది పని చేస్తుంది. గతంలో అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నయ్ నగరాల్లోని ఇంటినంబర్ల విధానాన్ని పరిశీలించి.. సులభంగా ఉండేలా లొకాలిటీల (ప్రాంతాలు) విధానంతో ఇంటి నెంబర్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ మేరకు నిబంధనలు రూపొందించారు. ఏళ్లకేళ్లు గడుస్తున్నాయే తప్ప ప్రజలు సులభంగా ఇంటి చిరునామా కనుక్కునే అవకాశం మాత్రం కలుగలేదు. కొత్త పద్ధతి ఇలా.. కొత్త ఇంటి నెంబర్ల విధానానికి నగరాన్ని ‘లొకాలిటీ’లు.. ప్రధాన రహదారులుగా విభజించారు. బాగా వాడుకలో ఉన్న ప్రాంతాల పేర్లనే ‘లొకాలిటీ’లకు వినియోగించాలని నిర్ణయించారు. వీటిలో వీధి నెంబర్లు .. ఇంటి నెంబర్లను నిర్ణయించారు. నిర్మాణ అనుమతులు ఉన్నదీ లేనిదీ... సంబంధం లేకుండా అన్ని ఇళ్లకూ.. ఖాలీ స్థలాలుంటే ఆవరణలకు (ప్రెమిసెస్) సైతం నెంబర్లు ఇవ్వాలని యోచించారు. అపార్టుమెంట్లు, వాణిజ్య కాంప్లెక్సుల్లో ఆవరణ నెంబర్/ఇంటి నెంబరు రెండూ కేటాయించే ప్రయత్నం చేశారు. తద్వారా చిరునామా కనుక్కోవడం సులభమవుతుందని భావించారు. కొత్త విధానంలో వీధి ప్రారంభంలోనే ఆ ప్రాంతంలోని ఇంటి నెంబర్లను సూచిస్తూ సైన్‌బోర్డులు ఉంటాయి. ప్రాంతం (లొకాలిటీ) పేరు, వీధి నెంబరు, అక్కడ ఎన్ని ఇళ్లు ఉన్నాయో వివరాలు ఉంటాయి. ఇంటి నెంబరు ప్లేటుపై లొకాలిటీ (ఉదా: బాగ్ లింగంపల్లి ), వీధి నెంబరు (ఉదా: 3), ఇంటి నెంబరు (ఉదా:15) ఉంటాయి. ఇదంతా ఒకటి, రెండు చోట్ల ప్రయోగాలకే పరిమితమైంది. కొత్త ప్రభుత్వంలోనైనా సమస్య తీరేనా? నాలుగేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇళ్ల నెంబర్ల కార్యక్రమాన్ని అప్పటి మున్సిపల్ మంత్రి మహీధర్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అప్పటి ప్రభుత్వంతో పాటు రాష్ట్రం కూడా మారిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం నగరానికి సంబంధించిన వివిధ అంశాలపై దృష్టి సారించినప్పటికీ... ఇంటి నెంబర్లపై మాత్రం ఇంతవరకూ శ్రద్ధ చూపలేదు. దాంతో పరిస్థితిలో మార్పులేకుండాపోయింది. కాంట్రాక్ట్ ఇచ్చినా... జీహెచ్ఎంసీ సిబ్బందితో పని కాకపోవడంతో కాప్రా, ఉప్పల్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, మల్కాజిగిరి, కూకట్పల్లి సర్కిళ్ల బాధ్యతలను కాంట్రాక్టుకు ఇచ్చారు. అయినా అదే పరిస్థితి. శివార్లలో కాప్రా, మల్కాజిగిరి సర్కిళ్లలో సర్వే పూర్తయింది. ఎల్బీనగర్, రాజేంద్రనగర్, కూకట్పల్లి సర్కిళ్లలో లొకాలిటీ ప్రణాళికల పనులు జరుగుతున్నాయి. ఇవి పూర్తయితే ప్రణాళికబద్ధ నగరమైన చండీగఢ్‌లా ఉంటుందని భావిస్తున్నారు. కానీ.. ఎప్పటికో మరి.. ?! టెండర్లకు సిద్ధం? శివార్లలోని శేరిలింగంపల్లి-1, శేరిలింగంపల్లి-2, పటాన్చెరు-ఆర్సీపురం, కుత్బుల్లాపూర్, అల్వాల్సర్కిళ్లలో సర్వే లొకాలిటీ ప్రణాళిక పనులను కాంట్రాక్టు ఏజెన్సీలకు ఇచ్చారు. ప్రణాళికలు ఇంకా పూర్తి కాలేదు. కోర్ ఏరియాలోని ఖైరతాబాద్, మెహదీపట్నం (సర్కిల్7) సర్కిళ్ల సర్వే సైతం కాంట్రాక్టుకు ఇవ్వాలని యోచిస్తున్నారు. సిబ్బంది కొరత జీహెచ్ఎంసీలో తగినంతమంది సర్వేయర్లు, ఇతర సిబ్బంది లేరు. దాంతో పనులు పూర్తి కాలేదు. రెండు సర్కిళ్లలో(సర్కిల్-9, సర్కిల్-8) మాత్రం ఇంటి నెంబర్ ప్లేట్లు బిగించారు. నాలుగు, ఐదు సర్కిళ్లలో సర్వే పూర్తయింది. -
ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి
-
ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి: ఒమర్ అబ్దుల్లా
దుబాయి: ప్రపంచంలోనే ఎత్తైన భవనం బూర్జ్ ఖలీఫా సమీపంలోని ఫైవ్ స్టార్ హోటల్ అయిన అడ్రస్ డౌన్ టౌన్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టెర్రస్‌లో ముందుగా మంటలు అంటుకొని ఆ తర్వాత అంతటా వ్యాపించాయని జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో అడ్రస్ హోటల్ సమీపంలోనే ఉన్నట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు. చిన్నగా ప్రారంభమైన మంటలు ఒకే సారి పెద్ద ఎత్తున వ్యాపించి భవనాన్ని అంటుకున్నాయని తెలిపారు. భవనంలో ఇరుకున్న వారందరి కోసం ప్రార్థిస్తున్నాను. వారందరూ సురక్షితంగా బయటకు రావాలని ఆకాంక్షింస్తున్నట్టు ఒమర్ తెలిపారు. I'm next to The Address in Dubai where a sudden fire enveloped the building. Started from a terrace & raced up. pic.twitter.com/p8OWF6NIW5 — Omar Abdullah (@abdullah_omar) December 31, 2015 It started from a tiny fire & in no time at all spread all the way up the building #Dubai #AddressFire pic.twitter.com/rykqos5Euj — Omar Abdullah (@abdullah_omar) December 31, 2015 -
దుబాయ్‌లోని భారతీయులతో మోదీ
అబుదాబి : రెండు రోజుల విదేశీ పర్యటన కోసం దుబాయ్ వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టూర్ కొనసాగుతోంది దీంట్లో భాగంగా మోదీ దుబాయ్‌లోని అంతర్జాతీయ మైదానంలో ప్రసంగించనున్నారు. సోమవారం ఆయన జీరో కార్బన్ సిటీ(మాస్దర్ సిటీ)ని సందర్శిస్తారు. అక్కడి వాణిజ్య ప్రముఖులతో మోడీ సమావేశం కానున్నారు. వాణిజ్యం, భద్రత, ఉగ్రవాదం విదేశీ వ్యవహారాలు తదితర అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అనంతరం మధ్యాహ్నం విందు తర్వాత అంతర్జాతీయ వేదికపై భారతీయులనుద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే ఈ వేదిక సామర్ధ్యం నలభైవేల మందికే అయినప్పటికీ, ఇప్పటికే యాభైవేలమంది ఈ సమావేశానికి హాజరయ్యేందుకు తన పేర్లను నమోదు చేసుకున్నారని సమాచారం. తన పర్యటనలో భాగంగా మోడీ ఆదివారం రాత్రి అక్కడి ప్రఖ్యాతి షేక్ జాయేద్ మసీదును సందర్శించారు. భారత్ సహా వివిధ దేశాలనుంచి మార్బుల్స్‌తో నిర్మించిన మసీదు దగ్గర ఆయన ఎప్పటిలాగానే సెల్పీలతో సందడి చేశారు. రెండు దేశాల మధ్య వాణిజ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకోవడమే తన పర్యటన ఉద్దేశమని ప్రధాని మోదీ తెలిపారు. దుబాయ్ తనకు మినీ ఇండియా లాంటిదని అభివర్ణించారు.కాగా ప్రధాని నరేంద్రమోడీ యూఏఈలో రెండురోజుల పర్యటన ఈ రోజుతో ముగియనుంది. -
అడ్రస్‌ల కోసం అగచాట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి కేటీఆర్ గన్‌మెన్, డ్రైవర్లకు జారీ చేసిన నోటీసులు పట్టుకుని సీఐడీ, విశాఖపట్నం పెందుర్తి పోలీసులు చక్కర్లు కొడుతున్నారు. వీటిని అందించాల్సిన వ్యక్తుల ఆచూకీ గురువారం రాత్రి లభించకపోవడంతో చిరునామాల కోసం వెతుకులాట కొనసాగిస్తున్నారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో చంద్రబాబు తనయుడు లోకేష్ డ్రైవర్ కొండల్‌రెడ్డికి తెలంగాణ ఏసీబీ నుంచి నోటీసు జారీ అయ్యింది. దీంతో ఏపీ సీఐడీ అధికారులు కేటీఆర్ గన్‌మెన్, డ్రైవర్లు జానకిరామ్, సత్యనారాయణలకు బుధవారం నోటీసులు సిద్ధం చేశారు. మరోపక్క పెందుర్తి పోలీసులు 2013లో నమోదైన కేసుకు సంబంధించి కేటీఆర్ డ్రైవర్, అనుచరుడిగా అనుమానిస్తున్న మధుసూదన్‌రెడ్డి, సతీష్‌రెడ్డిలకు నోటీసులు తీసుకుని బుధవారమే హైదరాబాద్ చేరుకున్నారు. ఈ బృందాలు నోటీసులు అందించాల్సిన వ్యక్తుల్ని వెతుక్కుంటూ బుధవారం రాత్రి తెలంగాణ సీఎం క్యాంపు కార్యాలయం, కేటీఆర్ నివాసం, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ కార్యాలయాలకు వెళ్లాయి. నోటీసులు అందించాల్సిన వారి ఆచూకీ అక్కడ లభించకపోవడంతో గురువారం ఉదయం ఆ బృందాలు కరీంనగర్ వెళ్లాయి. జానకిరామ్, సత్యనారాయణలు వాస్తవానికి కరీంనగర్ జిల్లా పోలీసు ఆధీనంలోని జిల్లా ఆర్డ్మ్ రిజర్వ్ (డీఏఆర్) విభాగానికి చెందిన ఏఆర్ కానిస్టేబుళ్లు. కేటీఆర్ మంత్రి అయిన తరవాత డిప్యుటేషన్‌పై ఐఎస్‌డబ్ల్యూలో రిపోర్ట్ చేసి కేటీఆర్ వద్ద విధులు కొనసాగిస్తున్నారు. మధుసూదన్‌రెడ్డి సైతం కరీంనగర్ డీఏఆర్‌లోనే పని చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడకు వెళ్లిన సీఐడీ, పెందుర్తి పోలీసులు.. వారి కోసం ఆరా తీసినా ఫలితం లభించలేదు. దీంతో గురువారం సాయంత్రం హైదరాబాద్ చేరుకుని తదుపరి ప్రయత్నాలు ప్రారంభించాయి. -
మారని వైఖరికి చిరునామా
అభిప్రాయం కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడినాక మోదీని అధికారం లోకి తేవడానికి వందలాది మంది కార్యకర్తలతో ప్రచారం లోకి దిగిన ఆర్ఎస్ఎస్ లౌకిక ప్రజాస్వామిక భావాలను, దళిత మైనారిటీ ఆలోచనలను అణచివేయడానికి చరిత్ర రచ న, విద్యారంగం, సమాచార రంగం మీద ఎంత కరడుగట్టిన భావాల ఒత్తిడిని తెస్తు న్నదో మద్రాసు ఐఐటీ మీద కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ నుంచి తెచ్చిన ఒత్తిడియే నిదర్శనం. ‘భిన్నాభిప్రాయం నేరమా?’ అని మీరు రాసిన సంపా దకీయం (మే 30) పాఠకులను అప్రమత్తం చేస్తుందని ఆశిస్తు న్నాను. అంబేద్కర్-పెరియార్ స్టూడెంట్ సర్కిల్ (ఏపీఏసీ) కరపత్రంపై నిషేధాన్ని, చర్యను ఉద్దేశించిన కుట్ర ఏ ఫాసిస్టు చర్యలకు దారితీస్తుందో ఈ ఏడాది పరి ణామాల నేపథ్యంలో ఎవరైనా ఊహించగలిగేదే. సకా లంలో ప్రజాస్వామ్యశక్తులు స్పందించడానికిదే అదను. మీ సంపాదకీయంలో ‘ఎక్కడైతే మేధస్సు నిర్భ యంగా ఉంటుందో... విజ్ఞానానికి సంకెళ్లు ఉండవో... ఎక్కడైతే ప్రపంచం సంకుచిత కుడ్యాలుగా ముక్కలై పో దో...ఎక్కడైతే హేతువు దారితప్పదో... అలాంటి స్వేచ్ఛా ప్రపంచంలోకి తనను మేల్కొల్పడమ’న్న రవీంద్రుని గీతాన్ని 1978-79 విద్యా సంవత్సరంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో ఇంగ్లిష్‌లో పోస్టర్‌గా వేసిన ఉదం తం పూర్వాపరాలు గురించి రాయాలనిపించింది. 1976లో అంటే ప్రాథమిక హక్కులు రద్దయిన అత్యయికస్థితి (1975-77) కాలంలో కాకతీయ విశ్వవి ద్యాలయం ఏర్పడింది. అప్పుడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రిన్సిపల్గారు ఏబీవీపీ ఉపాధ్యక్షులుగా ఉన్నా రు. వరంగల్‌కు వచ్చిన జిల్లెళ్లమూడి అమ్మను క్యాం పస్‌లో ఉన్న మహిళా విద్యార్థుల హాస్టల్‌కు తీసుకువెళ్లి విద్యార్థినులతో ఆమెకు పాదాభివందనం చేయించారు ఆ ఆచార్యుల వారు. ఈ నేపథ్యంలో ఎమర్జెన్సీ తొలగి వరంగల్‌లో రాడికల్ విద్యార్థి సంఘం రెండవ మహాస భలు 1978 ఫిబ్రవరిలో జరిగి ‘గ్రామాలకు తరలండి’ పిలుపు ఇచ్చింది. కాకతీయ విశ్వవిద్యాలయం కింద రాడి కల్ విద్యార్థి సంఘం అని సొంతం చేసుకున్నారు. ప్రిన్సి పల్ రూం ముందర ఆర్ఎస్యూ వాళ్లు పోస్టర్ వేశారని, తొలగించకపోతే తామూ పోస్టర్లు వేసి ఆందోళన చేస్తా మని ఏబీవీపీ విద్యార్థులు గుంపుగా వెళ్లి కేయూ క్యాం పస్ కాలేజీ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆ పోస్టర్లో ఏముందో చూడకుండానే ఆ పోస్టర్‌ను చింపే యించాడు. వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ సాయం కళాశాలలో పనిచేస్తూ ఆ సంవత్సరమే ఎంఏ తెలుగులో చేరిన ఎన్.కె. రామా రావును ప్రిన్సిపల్ పిలిచి సంజా యిషీ కోరాడు-ఎన్.కె.రామారావు అప్పటికే విరసం సభ్యుడుగా, కవిగా, గాయకుడుగా సుప్రసిద్ధుడు. క్యాంపస్‌లో సహాధ్యాయి జి.లింగమూర్తి, పులి అంజ య్య, ఎం.గంగాధర్, గోపగాని ఐలయ్యల సాహచర్యం లో ఆర్ఎస్యూలో కూడా తిరుగుతున్నాడు. ప్రిన్సిపా ల్కు తెలిసిన, ప్రిన్సిపాల్ దబాయించి అడగగలిగిన సబార్డినేట్ అతడే గనుక పిలిచాడు. ఇంతలో ఆర్ఎస్ యూ విద్యార్థులు కూడ అధిక సంఖ్యలోనే ప్రిన్సిపాల్ రూంకు చేరుకున్నారు. రవీంద్రుని గీతాన్ని ఎందుకు తొలగించారు అని ప్రశ్నించడానికి. ‘మీరు ఆ పోస్టర్ చూశారా? అది రవీంద్రుని సుప్రసిద్ధగీతం’ అన్నాడు ఎన్కే. చింపబడి తన టేబుల్‌పై (బహుశా పోలీసులకు అప్పగించడానికి) ఉన్న పోస్టర్ ముక్కలను అప్పుడు తీసి చూశాడాయన. అవాక్కయ్యాడు. ఆయన నిజానికి చాలా మంచి వ్యక్తి. లౌకిక ప్రజాస్వామ్యవాది. పబ్లిక్ అడ్మిని స్ట్రేషన్ ప్రొఫెసర్ పి.ఎ.జేమ్స్. కాని ప్రిన్సిపాల్ అధికా రం, ఏబీవీపీ ఒత్తిడి-సమర్థించుకోవాలి-‘కావచ్చు. కాని కింద రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఎందుకు రాశా రు? అది అభ్యంతరకరం’ అన్నాడు. ‘అది గోడపత్రిక సార్. సుప్రసిద్ధమైన సూక్తులు, కవితలు, కొటేషన్స్‌ను ప్రసిద్ధమైన వ్యక్తులవి ఆయా సంస్థలు, పత్రికలు ఉప యోగించుకునే సంప్రదాయం ఉందికదా సార్’ అన్నాడా యన. ‘కాని నా అనుమతి లేకుండా ప్రిన్సిపాల్ ఆఫీసు ముందుగానీ, క్యాంపస్‌లోగానీ ఆర్ఎస్యూ పోస్టర్స్ వేయకూడదు’ అన్నాడు. ‘ఈ ఉత్తర్వులు మాకేనా, ఏబీవీ పీకి కూడా వర్తిస్తాయా?’ అన్నారు విద్యార్థులు. ‘అంద రికీ వర్తిస్తాయి’ అన్నాడు ప్రిన్సిపాల్. ‘ఏబీవీపీకి రాష్ట్ర ఉపాధ్యక్షులే ప్రొఫెసర్లు, లెక్చరర్స్ ఉన్నారు కదా సార్’ అన్నారు ఒకే గొంతుతో విద్యార్థులు. సరేసరే వెళ్లండన్నా రాయన- ఎమర్జెన్సీ ఎత్తివేసిన ప్రజాస్వామిక వాతావర ణంలో తన గొంతు తనకే ఎబ్బెట్టుగా వినిపించినట్టున్న దతనికి. కాని ఇప్పుడేమో ఏడాదిగా ఒక అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతున్నట్టుగా ఉన్నది దేశమంతటా. ఈ స్థితిలో ఉన్నత విద్యాలయాలు తమ స్వతంత్ర ప్రతిప త్తిని కాపాడుకొని అవి నిర్వహించవలసిన భావాల సం ఘర్షణను స్వేచ్ఛగా, స్వతంత్రంగా చేపట్టగలవా? అం దుకు ప్రభుత్వాలు, ప్రభుత్వాలను నడుపుతున్న రా జ్యాంగేతర ఫాసిస్టుశక్తులు అనుమతిస్తాయా? అన్నది పెద్ద ప్రశ్న. (తరువాత పరిణామాలతో మద్రాస్ ఐఐటీ తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది.) - వరవరరావు (వ్యాసకర్త, విరసం నేత) మొబైల్: 9676541715 -
ఏపీ ఉభయసభల్లో గవర్నర్ ప్రసంగం
-
అడ్రస్ ప్లీజ్..
దరఖాస్తుదారుల చిరునామా కోసం అధికారుల తిప్పలు 12 శాతం మాత్రమే పరిశీలన స్థానికుల సహకారంతో వివరాలు సేకరణ గడువులోగా కష్టమే 8 నుంచి కొత్త పింఛన్ల పంపిణీ సాధ్యమా! సాక్షి, సిటీబ్యూరో: బా..బ్బాబూ.. కాస్త ఈ అడ్రస్ చెప్పండి.. డోర్ నంబర్ ఎక్కడ ఉంది.. ఇదీ నగరంలో సామాజిక పింఛన్లు, ఆహార భద్రత కార్డుల దరఖాస్తుల పరిశీలన కోసం అధికారులు, ఉద్యోగులు పడుతున్న తిప్పలు. స్థానికుల సహకారం లేకుండా పరిశీలన కష్టతరంగా మారింది. వృద్ధాప్య, వితంతు పింఛన్ రూ.1,000.. వికలాంగులకు రూ.1,500 ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో నగరంలో దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. వీటిని పరిశీలనకు బస్తీల్లో తిరుగుతున్న అధికారులకు దరఖాస్తుదారుల అడ్రస్ తెలుసుకోవడం గగనంగా మారింది. పాత బస్తీలో అయితే పరిస్థితి దారుణంగా ఉందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉన్న చోటా నాయకులు, మాజీ కార్పొరేటర్ల సహకారంతో ముందుకుసాగుతున్నారు. ఇప్పటి వరకు కేవలం 12 శాతం మాత్రమే పరిశీలించారు. ఈ నేపథ్యంలో నవంబరు ఎనిమిది నుంచి పింఛన్ల పంపిణీ అనుమానంగా మారింది. వీటికోసం నగరంలో దరఖాస్తులను ఈనెల 20వ తేదీ వరకు స్వీకరించారు. వెల్లువలా వచ్చిన దరఖాస్తులను కంప్యూటరీకరణ చేసిన తర్వాత 24 నుంచి పరిశీలనకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ జిల్లాలో 225 మంది ఉద్యోగులు పింఛన్ల దరఖాస్తులను, 350 మంది ఉద్యోగులు ఆహారభద్రత కార్డుల దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. అదేవిధంగా గ్రేటర్ పరిధిలో ఉన్న రంగారెడ్డి జిల్లాలోని దరఖాస్తుల పరిశీలనలో 300పైగా ఉద్యోగులు భాగస్వామ్యాన్ని పంచుకుంటున్నారు. పూర్తిగా అర్బన్ ప్రాంతం కావడంతో దరఖాస్తుల పరిశీలన నత్తనడన సాగుతున్నట్టు అధికావర్గాలు పేర్కొంటున్నాయి. సామాజిక పింఛన్లు 3.49 లక్షలు ఉండగా తాజాగా 4.96 లక్షల దరఖాస్తులు వచ్చాయి. రేషన్ కార్డులు 15.62 లక్షలు ఉండగా... తాజాగా ఆహారభద్రత కార్డు కోసం 21.88 లక్షలు దరఖాస్తులు వచ్చాయి. రేషన్ సరుకుల కోసమే ఆహారభద్రత కార్డు పని చేస్తుందని పేర్కొన్నప్పటికీ అప్లికేషన్లు భారీగా వచ్చాయి. పరిశీలన 12 శాతమే... నవంబర్ 4వ తేదీ నాటికి దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలని కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనా ఆదేశించడంతో ఉద్యోగులు కుస్తీ పడుతున్నారు. ఇప్పటివరకు పింఛన్ల దరఖాస్తుల పరిశీలన 12 శాతం మాత్రమే పూర్తయినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వృద్ధాప్య పింఛన్ల పరిశీలన 11.9 శాతం పూర్తి కాగా, వితంతువు పింఛన్ల పరిశీలన 10.8 శాతంగా నమోదైంది. వికలాంగుల పింఛన్ల పరిశీలన 11.7 శాతమైంది. ఆహార భద్రత కార్డుల దరఖాస్తులు, కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల పరిశీలన నత్తనడకన సాగుతోంది. ఈ దరఖాస్తుల పరిశీలన మొదలు పెట్టినా కంప్యూటరీకణపైనే ఎక్కువ దృష్టిసారిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రాధాన్యతలను అనుసరించి ముందుగా పింఛన్ల దరఖాస్తుల పరిశీలనపైనే అధికారులు కేంద్రీకరిస్తున్నారు. ప్రభుత్వం అర్హుల ఎంపిక విషయంలో విధించిన నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తుల పరిశీలన జరపడంతో జాప్యం అవుతోందని తెలుస్తోంది. దరఖాస్తుల పరిశీలనలో తేడా వస్తే బాధ్యులను చేసే అవకాశం కూడా ఉండడంతో కుటుంబ సర్వే, ఆధార్‌తోపాటు, నిబంధనలను జోడించి సమగ్రంగా విచారణ నిర్వహించాల్సి రావడం సమయం బాగా తీసుకుంటుందని పేర్కొంటున్నారు. 8 నుంచి పింఛన్ల పంపిణీ అసాధ్యం.. ప్రభుత్వం నిర్దేశించిన నవంబర్ 8 నుంచి కొత్త పింఛన్లు పంపిణీ చేయడం అసాధ్యమేనన్న విషయం తాజా దరఖాస్తుల పరిశీలన బట్టి తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకు 50 శాతం దరఖాస్తుల పరిశీలన పూర్తయినట్టు అధికారులు పేర్కొంటుండగా... నగరంలో ఈ పరిస్థితి భిన్నంగా ఉంది. చిరునామాలు తెలుసుకోవడం కష్టతరంగా మారింది. నిర్దేశించిన సమయానికి పంపిణీ అసాధ్యమని తెలుస్తోంది. -
ఆధార్‌లో తప్పుల సవరణ ఇలా..
అద్దంకి: ఆధార్‌కార్డు బాధలు తప్పాయిరా దేవుడా అనుకుంటున్న లోపే రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఆధార్ ప్రక్రియను తెరపైకి తెచ్చింది. దీంతో ఎక్కడివారు అక్కడ ఆధార్ కార్డు నమోదు కోసం పరుగులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని కార్డుల్లో వివిధ వివరాలు తప్పులుగా నమోదవుతున్నాయి. అయితే వీటిని సవరించుకొనేందుకు అవకాశం ఉంది. కానీ కార్డులో ఫొటో మాత్రం మార్పు చేయలేం. పేరు, స్త్రీ పురుష లింగాలు, పుట్టిన తేదీ, చిరుమనా, ఫోన్ నంబర్లను తిరిగి మార్పు చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానం... htpp:uidai.gov.in/updateyouradhaardata.htmను క్లిక్ చేయాలి. తరువాత కొన్ని ముఖ్య సూచనలు వస్తాయి. వాటిని బాగా చదవాలి. అనంతరం అప్డేట్, కరెక్షన్, రిక్వెస్ట్ ప్లీజ్ ఆప్షన్ల మీద క్లిక్ చేయాలి. మీకు నచ్చిన ఆప్షన్లో ఆధార్ కార్డు నంబరును ఎంటర్ చేయాలి. ఇప్పుడు దాని కింద ఇచ్చిన వెరిఫికేషన్ కోడ్‌ను నమోదు చేయాలి. ఈ సమయంలో మీ మొబైల్‌కు వన్‌టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) వస్తుంది. దీనిని ఎంటర్ చేయగానే మీరు కార్డులో ఏమి మార్పు చేయదలచుకున్నారో ఆ వివరాలపై క్లిక్ చేయాలి. తరువాత సంబంధించిన ఫారం డిస్ప్లే అవుతుంది. ఆ ఫారాన్ని పూర్తి చేశాక సబ్మిట్, అప్డేట్, రిక్వెస్ట్ ఆప్షన్లను క్లిక్ చేయాలి. డాక్యుమెంటేషన్ ఆప్షన్లో మార్పు చేయాలనుకుంటున్న పత్రాలను అప్లోడ్ చేయాలి. మీకు అందుబాటులో ఉన్న సర్వీస్ ప్రొవైడర్‌ను ఎంపిక చేసుకుని ఎంటర్ చేయాలి. ఇప్పడు మీకు అప్డేట్ రిక్వెస్ట్ నంబరు వస్తుంది. ఈ నంబరులో మీ ఆధార్ కార్డులో ప్రస్తుత పరిస్థితి ఏమిటో తెలుసుకోవచ్చు. ఆఫ్‌లైన్ విధానం (పోస్ట్ ద్వారా) htpp:uidai.gov.in/images/applicationform11102012pdfను క్లిక్ చేస్తే సంబంధిత ఫార ం వస్తుంది. దానిలో మీ వివరాలు నమోదు చేసి సంబంధిత దరఖాస్తును జతచేయాలి. నిర్దేశిత కాలంలో ప్రాంతీయ భాషలో కూడా పూరించాలి. ఒక ఎన్వోలప్పై రిక్వెస్ట్ ఫర్ ఆధార్ అప్డేట్ అండ్ కరక్షన్ అని రాసి పాంతీయ కార్యాలయానికి పోస్ట్‌లో పంపాలి. ఆన్ లైన్ విధానంలో ఫారం పూరించే సమయంలో కొన్ని ఆప్షన్లు, గ్రామం, పిన్‌కోడ్, టౌన్, సిటీ, జిల్లా, రాష్ట్రం వివరాలు రాకుంటే పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అటెస్ట్ చేయాల్సిన విషయంలో రెండు విధానాలూ ఒకేరకంగా ఉంటాయి. సూచనలు- జాగ్రత్తలు వన్‌టైమ్ పాస్‌వర్డ్‌కు కేవలం 15 నిముషాలు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. ప్రాంతీయ భాషకు అనుగుణంగా సర్వీస్ ప్రొవైడర్‌ను ఎంచుకోవాలి. ఫారం పూర్తి చేసేటప్పుడు ప్రాంతీయ భాషలో తప్పులు వస్తుంటే, సంబంధిత ఆప్షన్ వద్ద కర్సర్ పెట్టి కీ బోర్డులోని ట్యాబ్బార్ను ప్రెస్ చేయాలి. ఇప్పడు కొన్ని ఆప్షన్లు వస్తాయి. వీటిలో సరైనది సెలక్ట్ చేసుకోవచ్చు. ఐదేళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల్లో ఒకరి సంతకం సరిపోతుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసేటప్పుడు రిఫ్రెష్ చేయకూడదు. పేరుకు ముందు ఎలాంటి హోదాలు, వివరాలు చేర్చకూడదు. ఉదాహరణకు, డాక్టర్, శ్రీ, శ్రీమతి వంటివి. అడ్రెస్ స్పష్టంగా ఉండాలి. పుట్టిన తేదీ మార్చుకోవడానికి ఒక్కసారే అవకాశం ఉంటుంది. మొబైల్ నంబరు మార్పు మాత్రం ఫోన్ ద్వారా మెసేజ్ వస్తుంది. -
ఇంటికి సోలార్ పవర్ కావాలంటే?
సోలార్‌సిస్టం ఏర్పాటుకు కావాల్సిన కనీసం 10 చదరపు గజాల స్థలం మీ భవనంపై ఉండేలా చూసుకోవాలి. ఉంటే మీ దగ్గరలో ఉన్న విద్యుత్ వినియోగదారుల సేవ కేంద్రానికి వెళ్లి అక్కడ ఉచితంగా దరఖాస్తును పొందవచ్చు. ఇందు కోసం మీరు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, ప్రస్తుత కరెంట్ బిల్ జిరాక్స్, అడ్రస్, ఐడి ఫ్రూప్‌లతో పాటుగా ఎస్ఎస్పీడీఎస్ పేరుపై రూ.1000 డీడీ తీసి అక్కడ ఇవ్వాలి. దరఖాస్తుతో పాటుగా రెండు ఎన్వలప్ కవర్లపై సెల్ఫ్ అడ్రస్ రాసి రూ.5 పోస్టల్ స్టాంప్‌లను అతికించి ఇవ్వాలి. మీ దరఖాస్తును స్థానిక అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (ఏడీఈ) పరిశీలించి, సోలార్ సిస్టంను ఏర్పాటు చేయాలనుకున్న ప్రాంతాన్ని పరిశీలిస్తారు. స్థలం అనుకూలంగా ఉంటే పదిహేను రోజుల పని దినములలో మీకు అప్రూవల్ లెటర్ వస్తుంది. తర్వాత మీరు ప్రభుత్వ అనుమతి ఉన్న ఏదైనా డీలరును సంప్రదించి పని మొదలు పెట్టవచ్చు. డీలరు ఇందుకు కావాల్సిన సోలార్ పరికరాలు, ఇన్వ్ర్టర్, బ్యాటరీలను ఏర్పాటు చేస్తారు. పని పూర్తి అయినప్పుడు మీకు ఇంపోర్ట్-ఎక్స్పోర్ట్ మీటరును అమరుస్తారు. ఈ మీటరు కోసం మీరు విడిగా దరఖాస్తు చేసుకోవాలి. 3 కేవీ వరకు డొమస్టిక్: ఒక మీటరు కనెక్షన్‌కు 3 కేవీ వరకు విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అనుమతి ఇస్తారు. 1 కేవీకి 10 చదరపు మీటర్ల స్థలం అవసరం. ప్రతి అదనపు కిలోవాట్‌కు 10 చదరపు మీటర్ల స్థలం కావాలి. 1కేవీ నుంచి 3కేవీ వరకు ఉత్పత్తి సామర్ధ్యాన్ని డొమస్టిక్గా పరిగణిస్తారు. 99.99 శాతం ఈ విధానానికి అందరూ అర్హులే. 5 కేవీ సామర్ధ్యం నుంచి ప్రభుత్వం కేవలం 30 శాతం సబ్సిడీ ఇస్తుంది. అమ్ముకోవచ్చు: ఈ సిస్టం ద్వారా పొందిన విద్యుత్‌ను మీ ఇంటి అవసరాలకు వాడుకొని... మిగులు విద్యుత్‌ను తిరిగి విద్యుత్ గ్రిడ్‌కు అమ్ముకోవచ్చు. ఉదా: మీరు ఒక నెలలో 700 యూనిట్లు ఉత్పత్తి చేశామనుకుందాం. అందులో మీరు 500 మాత్రమే వాడుకుంటే మిగిలిన 200 యూనిట్లను గ్రిడ్ కొనుగోలు చేస్తుంది. ఉత్పత్తి చేసిన దానికంటే ఎక్కవ వాడుకుంటే వాడుకున్న దానికే బిల్లు కట్టాలి. ఉదా : 700 యూనిట్లు ఉత్పత్తి చేసి 800 యూనిట్ల కరెంట్ వాడుకుంటే మీరు 100 యూనిట్లకు బిల్లు చెల్లించాలి. డీలర్ల వివరాల కోసం www.nedcap.gov.in వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. మరిన్ని వివరాలను apcentralpower.com లో సోలార్ రూ్ఫ్టాప్ నెట్ మీటరింగ్ అప్షన్‌ను క్లిక్ చేసి పొందవచ్చు. లేదా మీ దగ్గరలోని ఇంటిగ్రేటెడ్ కస్టమర్ సర్వీస్ సెంటర్లో అధికారి డీఈని, కస్టమర్ సర్వీస్ సెంటర్లో ఏడీఈని సంప్రదించవచ్చు. -
నేపాల్ పార్లమెంట్లో ప్రసంగించనున్న మోడీ
ఖాట్మాండు: భారత ప్రధాని నరేంద్ర మోడీ నేపాల్ పార్లమెంట్లో ప్రసంగించనున్నారు. వచ్చే నెలలో మోడీ రెండు రోజుల పాటు నేపాల్ పర్యటనకు వెళ్లనున్నారు. ఆగస్టు 4న మోడీ నేపాల్ పార్లమెంట్‌ను సందర్శించనున్నారు. నేపాల్‌లోని ప్రసిద్ధ పశుపతి ఆలయాన్ని మోడీ సందర్శించనున్నారు. హిందువులు పవిత్రంగా భావించే ఈ ఆలంయలో శివుడు కొలువైఉన్నాడు. మోడీ రాకను పురస్కరించుకుని ఆలయం పరిసర ప్రాంతాలను శుభ్రం చేస్తున్నారు. మోడీ పర్యటన సందర్భంగా ఇరు దేశాల నాయకులు కీలక అంశాలపై చర్చించనున్నారు. భారత ప్రధానిగా మోడీ బాధ్యతలు స్వీకరించాక ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలకు ప్రాధానం ఇస్తున్నారు. మోడీ ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాధినేతలు హాజరైన సంగతి తెలిసిందే. -
కోరిన అడ్రస్‌కు చేర్చే యాప్..
జిప్పర్ యాప్‌తో చిరునామా వెతకడం ఈజీ హైదరాబాదీ స్టార్టప్ ఘనత హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటికి తొలిసారిగా వచ్చే స్నేహితులకు వారికి అర్థమయ్యేలా చిరునామా చెప్పడంలో పడే కష్టం అంతా ఇంతా కాదు. మీరు ఎంత వివరించినా చిరునామా కోసం వారి నుంచి పదే పదే ఫోన్ కాల్స్ రావడం సహజం. అదే మీరు పంపే ఒక్క కోడ్‌తో స్నేహితులు నేరుగా ఇంటికి రాగలిగితే.. మీలాంటి వారి కోసమే హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ జిప్పర్ ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. ఉదాహరణకు సాక్షి ప్రధాన కార్యాలయానికి రావాలంటే జిప్పర్లోకి వెళ్లి ‘క్యూయూకేజెడ్3285’ అనే కోడ్ ఇస్తే చాలు. గూగుల్ మ్యాప్‌తో కూడిన చిరునామా మీ స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్/ల్యాప్‌టాప్‌లో ప్రత్యక్షమవుతుంది. మీరున్న చోటు నుంచి ఎలా వెళ్లాలోదారి చూపుతుంది కూడా. ఎలా పనిచేస్తుందంటే.. స్మార్ట్‌ఫోన్‌లో జిప్పర్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. క్రియేట్ ఏ జిప్పర్ అన్న చోట క్లిక్ చేయాలి. ఆ తర్వాత స్క్రీన్ మీద ఉన్న మ్యాప్‌పై మీరుండే ప్రాంతం పేరు దగ్గర క్లిక్ చేయాలి. యాడ్ లొకేషన్ పేరుతో ఒక బాక్స్ తెరుచుకుంటుంది. పూర్తి చిరునామా వివరాలు ఇచ్చి సేవ్ చేయాలి. జెడ్ఐపీ.పీఆర్ అనే వెబ్సైట్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు. ఇచ్చే వివరాల ఆధారంగా ఒక కోడ్ రూపొందుతుంది. జిప్పర్ యాప్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో ఈ కోడ్‌ను టైప్ చేయగానే అడ్రస్ స్క్రీన్‌పైన కనిపిస్తుంది. రూట్ మ్యాప్పైన క్లిక్ చేస్తే దారి కూడా చూపిస్తుంది. మీ స్నేహితులు, బంధువులు, డెలివరీ బాయ్, క్యాబ్ డ్రైవర్ ఇలా ఎవరికైనా ఈ కోడ్‌ను షేర్ చేయొచ్చు. అనుభవమే యాప్‌కు.. డిజిటల్ మీడియా యాడ్ ఏజెన్సీ మీడియా మింట్‌ను స్థాపించిన వి.ఆదిత్య జిప్పర్ యాప్‌కు రూపకర్త. కాలిఫోర్నియాలో స్టార్టప్ కంపెనీల్లో పనిచేసిన అనుభవం ఉంది. హైదరాబాద్‌లో ఉంటున్న ఆదిత్య తండ్రి వృత్తిరీత్యా వైద్యుడు. క్లినిక్ చిరునామా చెప్పేందుకు ఆయన పడిన శ్రమ అంతా ఇంతాకాదు. అమెరికాలో ఇల్లు, కార్యాలయాల చిరునామా కనుక్కోవడం చాలా సులువు. ఆ స్థాయిలో చిరునామాను సూచించే బోర్డులుంటాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని చిరునామా సమస్యలకు పరిష్కారం ఇవ్వాలన్న ఆలోచన ప్రతిరూపమే జిప్పర్ అని అంటున్నారు ఆదిత్య. 2013 డిసెంబరులో యాప్ విడుదలైంది. ఇప్పటి వరకు 17 దేశాలకు చెందిన 25 వేల మందికిపైగా యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. హలో కర్రీ, డిజిటల్ క్యాంపస్, ఫుడ్ మింగో, మీడియా మింట్ వంటి 15 కంపెనీలు ఈ యాప్ ద్వారా కస్టమర్లకు చేరువ అవుతున్నాయి. 108 అంబులెన్సుల్లోనూ ఈ యాప్‌ను వినియోగిస్తున్నారు. నిధుల సమీకరణలో.. మొబైల్, టెలికం ద్వారా కోట్లాది ప్రజలపై ప్రభావం చూపే కంపెనీలకు ఇచ్చే ఎం బిల్లియన్త్ అవార్డ్ సౌత్ ఆసియా రన్నరప్‌గా జిప్పర్ నిలిచింది. కంపెనీకి ఉజ్వల భవిష్యత్తు ఉందనడానికి ఈ అవార్డు నిదర్శనమని ఆదిత్య తెలిపారు. ప్రతి ఇంటికి, కార్యాలయానికి, వ్యాపార సంస్థలకు డిజిటల్ చిరునామా గుర్తింపు ఇవ్వాలన్నదే తమ ల క్ష్యమని చెప్పారు. వ్యక్తులెవరైనా యాప్‌ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. కంపెనీల నుంచి కొంత రుసుము వసూలు చేస్తామన్నారు. తొలి 50 కంపెనీలకు ఉచితమని వివరించారు. ఇప్పటి వరకు రూ.1 కోటి వ్యయం చేశామన్నారు. రూ.10 కోట్ల దాకా సీడ్ ఫండ్ సమకూర్చేందుకు రెండు కంపెనీలు ముందుకొచ్చాయని, నెల రోజుల్లోగా ఈ మొత్తాన్ని స్వీకరిస్తామన్నారు. ఆదిత్య టీమ్‌లో 10 మంది యువకులున్నారు. -
తోకలేని పిట్ట 45 ఏళ్లు లేటు!
మాంట్రియల్: తోకలేని పిట్ట తొంభై ఊళ్లు తిరిగిందో లేదో తెలియదు కానీ, కెనడాలో పోస్టు చేసిన ఒక ఉత్తరం మాత్రం 45 ఏళ్ల తరువాత చిరునామా వెతుక్కొని వాలింది. కెనడాకు చెందిన ఆర్.డి. టింగ్లేకు ఆమె తోబుట్టువు 1969లో రాసిన ఉత్తరం 45 ఏళ్ల తర్వాత వాళ్ల ఇంటి అడ్రస్‌కు వచ్చింది. ప్లాస్టిక్ కవరుతో అంతికించి ఉన్న ఆ ఉత్తరంలో కొంత భాగం దెబ్బతింది. దానితో పాటు వచ్చిన మరో లేఖలో తపాలా సిబ్బంది ఆలస్యానికి చింతిస్తున్నట్లు వివరణ కూడా ఇవ్వడం విశేషం. అయితే లెత్బిడ్జ్ ్రనుంచి రాసిన ఈ ఉత్తరం చిరునామాలో మిస్టర్ అండ్ మిస్సెస్ ఆర్.డి.టింగ్లే పేరుతో పాటు స్ట్రీట్ నంబర్ సరిగానే ఉన్నా... ఇంటినంబర్ మాత్రం తప్పుగా రాశారు. అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే టింగ్లే ఆ ఇంటి నుంచి మరో చోటికి వెళ్లినా ఆమెనే వెతుక్కుంటూ ఉత్తరం రావడం గమనార్హం. దీనిపై టింగ్లే స్పందిస్తూ... ఈ ఉత్తరం నా కొత్త అడ్రస్‌కు ఎలా వచ్చిందో తెలియడం లేదు. కానీ, గతంలోనే నా ఇంటి అడ్రస్ మార్చినట్లు తపాలా శాఖకు తెలిపాను. తొమ్మిదేళ్ల వయసులో నా సోదరి ఈ ఉత్తరం రాసింది. ఆరు సెంట్ల విలువ కలిగిన స్టాంపు ఉత్తరానికి అతికించి ఉంది’ అని పేర్కొంది.