అడ్రస్‌ అడిగిన డెలివరీ బాయ్‌పై దాడి.. గంటపాటు మహిళ హైడ్రామా! | Delhi Woman Stabbed Flipkart Delivery Boy Over 20 Times Due To Mobile Phone Order Reached Her Late - Sakshi
Sakshi News home page

Delhi Flipkart Delivery Boy Incident: అడ్రస్‌ అడిగిన డెలివరీ బాయ్‌పై దాడి.. గంటపాటు మహిళ హైడ్రామా!

Aug 23 2023 11:54 AM | Updated on Aug 23 2023 12:42 PM

Woman Stabbed Delivery Boy in Delhi - Sakshi

దేశ రాజధాని ఢిల్లీలో అడ్రస్‌ అడిగిన వ్యక్తి కత్తిపోట్లకు గురైన సంఘటన సంచలనం రేపింది. ఒక మహిళను డెలివరీ బాయ్‌ ఏదో అడ్రస్‌ అడగగా, ఆమె ఆగ్రహంతో ఊగిపోతూ కత్తితో అతనిపై దాడి చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా, వారిపై కూడా ఆ మహిళ దాడికి తెగబడింది. అ మహిళ కారణంగా తీవ్రంగా గాయపడిన ఆ డెలివరీ బాయ్‌ని పోలసీలు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. 

నింతురాలు దాడికి పాల్పడిన వైనం అక్కడి సీసీటీవీలో కెమెరాలో రికార్డయ్యింది. పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఈ ఘటన ఢిల్లీలోని ద్వారకా సెక్టర్‌-23లో చోటుచేసుకుంది. ఒక ప్రవేటు కంపెనీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న గోలూ(18)  రాత్రి వేళ డెలివరీ ఇచ్చేందుకు డీడీఏ ఫ్లాట్‌కు వెళ్లాడు. అక్కడున్న 42 ఏళ్ల మహిళను ఒక చిరునామా గురించి అడిగాడు. వెంటనే ఆ మహిళ కోపగించుకుంటూ, ఆ యువకునిపై కత్తితో మూడుసార్లు దాడి చేసింది. 

ఆ యువకుడు బాధతో కేకలు పెడుడుండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు విషయం తెలియజేశారు. వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ మహిళను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయితే ఆ మహిళ కత్తితో ఒక మహిళా కానిస్టేబుల్‌పై దాడికి యత్నించింది. అయితే ఆమె అక్కడున్న ఇతర మహిళల సాయంతో ఆ మహిళ చేతిలో ఉన్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంతలోనే ఆ మహిళ పోలీసుల చేతిలోని లాఠీ లాక్కొని పీసీఆర్‌ వ్యాన్‌తోపాటు అక్కడున్న మరికొన్ని వాహనాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించింది.

ఎంతో కష్టం మీద పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ డ్రామా గంటపాటు కొనసాగింది. ఎట్టకేలకు పోలీసులు ఆ మహిళను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆ మహిళ సొసైటీలో ఒక అద్దె ఇంటిలో ఒంటరిగా ఉంటోంది.  గతంలోనూ ఆమె ఇలాంటి దాడులకు పాల్పడిందని స్థానికులు చెబుతున్నారు. 

డెలివరీ బాయ్‌ గోలూ తెలిపిన వివరాల ప్రకారం అతను ఆమెను ఏదో చిరునామా అడగగా, ఆమె వెంటనే అతనిని స్కూటీ నుంచి కిందకు తోసివేసి, వాహనం తాళాలు లాక్కొన్ని వాటిని పారవేసింది. తరువాత అతనిపై కత్తితో దాడికి దిగింది. రోడ్డుపై నానా హంగామా చేసిన మహిళను పోలీస్‌ స్టేషన్‌కు తరలించి, కౌన్సెలింగ్‌ చేస్తున్నారు. ఆమెపై ఎవరూ ఫిర్యాదు చేయనందున పోలీసులు ఇంకా తదుపరి చర్యలు చేపట్టలేదు. 
ఇది కూడా చదవండి: అర్థరాత్రి తెల్లటి దుస్తుల్లో చెట్టుకు వేలాడుతున్న మహిళ.. తెల్లారేసరికి..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement