deliver
-
10 నిమిషాల్లో యాపిల్ ఉత్పత్తుల డెలివరీ
క్విక్ కామర్స్ రంగంలో ఉన్న బ్లింకిట్ (Blinkit) 10 నిమిషాల్లో యాపిల్ (Apple) ఉత్పత్తుల డెలివరీ సేవలను ప్రారంభించింది. మ్యాక్‌బుక్ ఎయిర్, ఐప్యాడ్, ఎయిర్‌పాడ్, యాపిల్ వాచ్, యాక్సెసరీస్‌ను కస్టమర్లు బ్లింకిట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, పుణే, లక్నో, అహ్మదాబాద్, చండీగఢ్, చెన్నై, జైపూర్, బెంగళూరు, కోల్‌కతలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. కాగా గత ఏడాది యాపిల్ ప్రీమియం రీసెల్లర్ యూనికార్న్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుని ఆర్డర్లు ఇచ్చిన 10 నిమిషాల్లోనే ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ ఫోన్లను కస్టమర్లకు డెలివరీ చేసింది.అంతకుముందు బ్లింకిట్ పైలట్ ప్రాజెక్టుగా గురుగ్రామ్‌లోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో 10 నిమిషాల అంబులెన్స్ సేవలను ప్రారంభించింది. ఈ అంబులెన్సుల్లో ఆక్సిజన్ సిలిండర్లు, ఏఈడీ (ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్), స్ట్రెచర్, మానిటర్, సక్షన్ మెషీన్, అత్యవసర మందులు, ఇంజెక్షన్లు వంటి అవసరమైన ప్రాణరక్షణ పరికరాలు ఉంటాయి.జొమాటోకు చెందిన ఈ క్విక్ కామర్స్ బిజినెస్ 2024 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.103 కోట్ల నష్టాన్ని చవిచూసింది. పెట్టుబడుల కారణంగా బ్లింకిట్ కింద క్విక్ కామర్స్ వ్యాపారంలో నష్టాలు సమీపకాలంలో కొనసాగుతాయని కంపెనీ భావిస్తోందని షేర్ హోల్డర్లకు రాసిన లేఖలో జొమాటో పేర్కొంది. -
డెలివరీ సమయంలో వైద్యుల నిర్లక్ష్యం, రూ..11.42 కోట్ల జరిమానా
ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చినప్పటికీ ఇప్పటికీ బిడ్డకు జన్మనివ్వడమంటే మహిళకు మరో జన్మ. గర్భంలో పాపాయి రూపు దిద్దుకోవడం మొదలు, ప్రసవం దాకా నిరంతరం పర్యవేక్షణ అవసరం. స్వయంగా గర్భిణీతోపాటు, కుటుంబ సభ్యులు, చికిత్స అందించే వైద్యులు అప్రమత్తంగా ఉండాల్సిందే. కానీ వైద్యుల నిర్లక్ష్యం ఇద్దరు చిన్నారులకు కన్నతల్లిని దూరం చేసింది. మలేసియాలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఈకేసులో ఆ దేశ కోర్టు ఇచ్చిన తీర్పు నెట్టింట చర్చకు దారి తీసింది. 2019లో జరిగిన సంఘటన ఇది. 36 ఏళ్ల పునీత మోహన్(Punita Mohan) రెండో కాన్పుకోసం ఆస్పత్రి లో చేరింది. అయితే ప్రసవం తరువాత ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. పోస్ట్‌పార్టమ్ హెమరేజ్ (Postpartum Hemorrhage) కారణంగా విపరీత రక్తస్రావం అయింది. నొప్పితో ఆమె విలవిల్లాడి పోయింది. బ్లీడింగ్ అవుతోందని ఆమె తల్లి ఆమెకు వైద్యం చేసిన వైద్యడు డాక్టర్లు రవి, క్లినిక్ యజమాని షణ్ముగానికి చెప్పినప్పటికీ పట్టించుకోలేదు. ప్రాణాంతకమని తెలిసినా నిర్ల్యక్ష్యంగా వ్యవహరించారు. పైగా మావిని చేతితో తీయడం వల్ల రక్తస్రావం అవుతోందని, అంతా సర్దుకుంటుందని కుటుంబ సభ్యులకు చెప్పి ఎటో వెళ్లి పోయారు. రెండు గంటలు గడిచిన తరువాత కూడా ఆమె గురించి వాకబు చేయలేదు. పరిస్థితి విషమించడంతో ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. తన కళ్ల ముందే తన బిడ్డ ఊపిరి తీసుకోవడానికి కష్టపడి నానాయతన పడిందని, ఇద్దరు చిన్నారులకు తల్లిని దూరం చేశారంటూ పునీత తల్లి కన్నీటి పర్యంతమైంది.ఈ కేసును విచారించిన హైకోర్టు బాధిత కుటుంబానికి రూ.11.42 కోట్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. వైద్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే ఈ మరణం సంభవించి ఉండేది కాదని కోర్టు పేర్కొంది. వైద్యులు రోగికి భద్రత కల్పించకుండా, గంటల తరబడి వదిలివెళ్లడం క్షమించరాని నేరమని వ్యాఖ్యానించింది. అంతులేని నిర్లక్ష్యం కారణంగానే పునీత మరణించిందని ఆగ్రహించిన కోర్టు ఇద్దరు వైద్యులకు భారీ జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. -
30 కిలోల ఆహారంతో ఇంటిపై కూలిన డ్రోన్!
హర్యానాలోని గురుగ్రామ్‌లో ఆహారాన్ని తరలిస్తున్న ఒక డ్రోన్ కలకలం సృష్టించింది. సౌత్ సిటీలోని జి బ్లాక్ మీదుగా ఆహారాన్ని తీసుకువెళుతున్న ఆ డ్రోన్ హఠాత్తుగా ఒక ఇంటిపై పడిపోయింది. ఈ ఘటనలో సుమారు 30 కిలోల బరువున్న ఆహార పదార్థాలు ఆ ఇంటిపై పడటంతో పాటు ఇంటి బాల్కనీ, డిష్ యాంటెన్నా దెబ్బతిన్నాయి. ఆ సమయంలో ఎవరూ ఇంటి బాల్కనీలో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. అకస్మాత్తుగా హౌస్ నంబర్ జి-68 పైనుండి పెద్ద శబ్దం వచ్చింది. ఇంటి యజమాని బయటకు వచ్చి చూసేసరికి డ్రోన్ శిథిలాలు, మరికొన్ని వస్తువులు అక్కడ పడి ఉన్నాయి. ఆహార సరఫరా కోసం డ్రోన్ల ట్రయల్ జరుగుతున్నదని. ఇందుకోసం అధికారుల నుంచి అనుమతులు కూడా తీసుకున్నట్లు ఆ కంపెనీ ఉద్యోగులు పోలీసులకు తెలిపారు. ఇంటికి జరిగిన నష్టానికి పరిహారం అందజేస్తామని ఆ కంపెనీ తెలిపింది. మరోవైపు ఈ ప్రాంతంలో ప్రధాని పర్యటన సందర్భంగా డ్రోన్లను ఎగురవేయడంపై జిల్లా యంత్రాంగం నిషేధం విధించింది. ఇదే సమయంలో డ్రోన్లను ఎగురవేసేందుకు ఆ కంపెనీకి అనుమతి ఎలా లభించిందనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. అయితే నిషేధ ఉత్తర్వుల గురించి తెలుసుకున్న డ్రోన్ పైలట్ ఈ భవనంపై అత్యవసర ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించాడని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఉదంతంపై ఎఫ్ఐఆర్లో పేర్కొన్న వివరాల ప్రకారం డ్రోన్లోని సాంకేతిక లోపం కారణంగా అది కూలిపోయింది. ఈ ఘటనపై సెక్టార్ 50 పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ జితేంద్ర కుమార్ మాట్లాడుతూ పాడైన డ్రోన్‌ను స్వాధీనం చేసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నమన్నారు. అలాగే సదరు కంపెనీపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
అడ్రస్ అడిగిన డెలివరీ బాయ్‌పై దాడి.. గంటపాటు మహిళ హైడ్రామా!
దేశ రాజధాని ఢిల్లీలో అడ్రస్ అడిగిన వ్యక్తి కత్తిపోట్లకు గురైన సంఘటన సంచలనం రేపింది. ఒక మహిళను డెలివరీ బాయ్ ఏదో అడ్రస్ అడగగా, ఆమె ఆగ్రహంతో ఊగిపోతూ కత్తితో అతనిపై దాడి చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా, వారిపై కూడా ఆ మహిళ దాడికి తెగబడింది. అ మహిళ కారణంగా తీవ్రంగా గాయపడిన ఆ డెలివరీ బాయ్‌ని పోలసీలు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. నింతురాలు దాడికి పాల్పడిన వైనం అక్కడి సీసీటీవీలో కెమెరాలో రికార్డయ్యింది. పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఈ ఘటన ఢిల్లీలోని ద్వారకా సెక్టర్-23లో చోటుచేసుకుంది. ఒక ప్రవేటు కంపెనీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న గోలూ(18) రాత్రి వేళ డెలివరీ ఇచ్చేందుకు డీడీఏ ఫ్లాట్‌కు వెళ్లాడు. అక్కడున్న 42 ఏళ్ల మహిళను ఒక చిరునామా గురించి అడిగాడు. వెంటనే ఆ మహిళ కోపగించుకుంటూ, ఆ యువకునిపై కత్తితో మూడుసార్లు దాడి చేసింది. ఆ యువకుడు బాధతో కేకలు పెడుడుండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు విషయం తెలియజేశారు. వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ మహిళను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయితే ఆ మహిళ కత్తితో ఒక మహిళా కానిస్టేబుల్‌పై దాడికి యత్నించింది. అయితే ఆమె అక్కడున్న ఇతర మహిళల సాయంతో ఆ మహిళ చేతిలో ఉన్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంతలోనే ఆ మహిళ పోలీసుల చేతిలోని లాఠీ లాక్కొని పీసీఆర్ వ్యాన్‌తోపాటు అక్కడున్న మరికొన్ని వాహనాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించింది. ఎంతో కష్టం మీద పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ డ్రామా గంటపాటు కొనసాగింది. ఎట్టకేలకు పోలీసులు ఆ మహిళను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆ మహిళ సొసైటీలో ఒక అద్దె ఇంటిలో ఒంటరిగా ఉంటోంది. గతంలోనూ ఆమె ఇలాంటి దాడులకు పాల్పడిందని స్థానికులు చెబుతున్నారు. డెలివరీ బాయ్ గోలూ తెలిపిన వివరాల ప్రకారం అతను ఆమెను ఏదో చిరునామా అడగగా, ఆమె వెంటనే అతనిని స్కూటీ నుంచి కిందకు తోసివేసి, వాహనం తాళాలు లాక్కొన్ని వాటిని పారవేసింది. తరువాత అతనిపై కత్తితో దాడికి దిగింది. రోడ్డుపై నానా హంగామా చేసిన మహిళను పోలీస్ స్టేషన్‌కు తరలించి, కౌన్సెలింగ్ చేస్తున్నారు. ఆమెపై ఎవరూ ఫిర్యాదు చేయనందున పోలీసులు ఇంకా తదుపరి చర్యలు చేపట్టలేదు. ఇది కూడా చదవండి: అర్థరాత్రి తెల్లటి దుస్తుల్లో చెట్టుకు వేలాడుతున్న మహిళ.. తెల్లారేసరికి..! -
భర్త చంకలో పిల్లాడు.. భార్య చేతిలో సైకిల్.. డెలివరీ బాయ్ ఫ్యామిలీ వీడియో వైరల్!
సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యే కొన్ని వీడియోలు మనల్ని భావోద్వేగానికి గురిచేస్తుంటాయి. తాజాగా ఢిల్లీ ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ స్వాతీ మాలవీయ్ తన ట్విట్టర్ హ్యాండిల్లో ఒక జంటకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఇది ఆ దంపతుల ప్రేమకు ప్రతీకగా కనిపిస్తుంది. ఈ వీడియోను షేర్ చేసిన ఆమె. ‘నువ్వుండగా నాకు మరేం కావాలి?.. ఈ పాట ఒరిజినల్ వీడియోగా ఇది ఉండాలి’ అని రాశారు. పిల్లాడిని ఎత్తుకున్న భర్త, సైకిల్ నడుపుతున్న భార్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చాలామందిని ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో జొమాటో డెలివరీ ఏజెంట్ తన పనంతా ముగిసి, చీకటిపడ్డాక తన భార్య, పిల్లాడితో పాటు ఇంటికి వెళుతుంటాడు. జొమాటో టీషర్టు ధరించిన ఆ వ్యక్తి ఒక పిల్లవాడిని ఎత్తుకుంటాడు. అతని భార్య సైకిల్ హ్యాండిల్ పట్టుకుని దానిని ముందుకు నడుపుతుంటుంది. కుటుంబం కోసం కష్టిస్తున్న భర్త, అతనికి సాయం అందిస్తున్న భార్యతో కూడిన ఈ వీడియో హృదయాలకు హత్తుకునేలా ఉంది. “Tu hai to mujhe fir aur kya chahiye” This should be the official video of the song ❤️ pic.twitter.com/G9MQOnfW9x — Swati Maliwal (@SwatiJaiHind) July 7, 2023 భార్యాభర్తల బంధం ఈ వీడియోను జాగ్రత్తగా గమనిస్తే ఆ మహిళ తమ పిల్లాడితో పనికి వెళ్లిందని, భర్త సైకిల్‌పై జొమోటా డెలివరీ చేస్తున్నాడని అర్థం అవుతుంది. ఇద్దరి పనులు ముగిశాక రాత్రి ముగ్గురూ కలిసి ఇంటికి చేరుకుంటున్నారని అర్థం చేసుకోవచ్చు. స్వాతి మాలవీయ్ షేర్ చేసిన ఈ పోస్టుకు కొద్ది గంటల వ్యవధిలోనే 56 వేల మంది వీక్షించారు. 19 వేలకుపైగా లైక్స్ వచ్చాయి. ఇది కూడా చదవండి: వృద్ధునిపై గాడిద దాడి.. ఎంతమంది అడ్డుకున్నా.. -
తూటా తగిలినా.. అద్భుతం జరిగింది
-
తూటా తగిలినా.. అద్భుతం జరిగింది
సాక్షి, శ్రీనగర్ : సుంజ్వాన్ ఉగ్రదాడిలో గాయపడిన క్షతగాత్రులు ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. తాజాగా వీరిలో మగ్గురు కన్నుమూయటంతో మృతుల సంఖ్య 9కి చేరుకుంది. ఇక కాల్పుల్లో ఓ గర్భిణి గాయపడిన విషయం తెలిసిందే. అయితే ఆమె కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలపై ఆశలు వదిలేసుకున్న ఆ కుటుంబంలో ఇప్పుడు సంతోషం వెల్లివిరుస్తోంది. అద్భుతం జరిగి ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. శనివారం ఆర్మీ కార్టర్స్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో.. రైఫిల్‌మ్యాన్ నజీర్ అహ్మద్‌తోపాటు ఆయన భార్య షాజాద్ ఖాన్(24) తీవ్రంగా గాయపడ్డారు. ఆమె వెన్నెముకలోకి తూటా దూసుకుపోవటంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. 35 వారాల గర్భిణి అయిన ఆమెను హుటాహుటిన ప్రత్యేక హెలికాప్టర్లో సత్వారీలోని మిలటరీ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరికీ ప్రాణాపాయం ఉందని వైద్యులు చెప్పటం బిడ్డపై కుటుంబ సభ్యులు ఆశలు వదులుకుని.. కనీసం తల్లినైనా రక్షించాలని వేడుకున్నారు. చివరకు ఆమెకు ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు తర్వాత సిజేరియన్ చేయటంతో ఆమె ఆడశిశువుకు జన్మనిచ్చింది. 2.5 కేజీల బరువుతో ఆ బిడ్డ, తల్లీ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. కాగా, తీవ్ర రక్తస్రావంతో తల్లి, బిడ్డా ఇద్దరూ బతకటం కష్టమని భావించామని.. కానీ, ఏదో అద్భుతం జరిగినట్లు ఇద్దరూ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారని ఆర్మీ డాక్టర్లు చెబుతున్నారు. కాగా, గాయపడిన ఆమె భర్త అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
ఏయూలో పీవీ ఐదవ స్మారకోపన్యాసం
-
డెలివరీ కోసం హీరోయిన్ లండన్‌కు
బాలీవుడ్ దంపతులు కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్‌లు డిసెంబర్లో మొదటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఈ జంట డెలివరీ కోసం ముంబైలోగాక లండన్‌కు వెళ్లనున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ముంబైలో అయితే మీడియా ఫోకస్ ఎక్కువగా ఉంటుందని, కరీనాకు జన్మించే బిడ్డకు సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారని ఈ దంపతులు ఆందోళన చెందుతున్నట్టు వారి సన్నిహితులు చెప్పారు. లండన్‌లో మీడియాకు దూరంగా కరీనా, సైఫ్ ఉండనున్నట్టు సమాచారం. కరీనా డెలివరీ సమయంలో పటౌడీ కుటుంబం ఆమె వద్దే గడపనుంది. సైఫ్ తల్లి షర్మిలా ఠాగూర్, అతని సోదరి సోహా అలీఖాన్ ఎక్కువ సమయం కరీనాతో ఉండనున్నారు. కరీనా ప్రెగ్నెన్సీకి సంబంధించి ఇప్పటికే పలు వదంతులు వచ్చాయి. లండన్‌లో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారని, ఆమెకు జన్మించేది మగబిడ్డేనని మీడియాలో వార్తలురాగా.. కరీనా, సైఫ్ వీటిని ఖండించారు. అంతేగాక ప్రెగ్నెన్సీతో ఉన్న కరీనా ఫొటోలు మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. -
మిడ్ వైఫ్స్ లా సహకరించిన పోలీసులు!
న్యూఢిల్లీః సాహసమే ఊపిరిగా, సామాజికే సేవే లక్ష్యంగా పనిచేసే పోలీసులు.. తమలోని సేవా గుణాన్ని దేశరాజధాని సాక్ష్యంగా మరోసారి నిరూపించుకున్నారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు తక్షణ సేవలను అందించి... సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆమెను ప్రమాదం నుంచి తప్పించారు. పోలీసు పీసీఆర్ వాహనంలోనే ఆమె ప్రసవానికి మిడ్ వైఫ్స్ లా సహకరించి అభినందనలు అందుకున్నారు. ఢిల్లీ పోలీసుల సహకారంతో పీసీఆర్ వాహనంలో 23 ఏళ్ళ మహిళ ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవంకోసం అత్తింటివారితో పాటుగా స్మాల్ ఖా వెళ్ళేందుకు పానిపట్ నుంచి గ్వాలియర్ వెళ్ళే దాద్రి ఎక్స్ ప్రెస్ ఎక్కిన ఆర్తీ...ఢిల్లీలోని సబ్జి మండి స్టేషన్ ప్రాంతానికి వచ్చే సరికి నొప్పులు తీవ్రమవ్వడమే కాక, ఉమ్మనీరు కూడ పడిపోవడంతో అత్తింటివారు టికెట్ కలెక్టర్ కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన టీసీ కంట్రోల్ రూం కు ఫోన్ చేసి, పోలీసులుకు సమాచారం చెప్పడంతో సబ్జీ మండి ప్రాంతం పోలీసులు వైద్య సహకారం అందించేందుకు సిద్ధమయ్యారు. ఓ పీసీఆర్ వ్యాన్ ను రైలు దగ్గరకు తెచ్చి ఆర్తీని ప్రయాణీకుల సహకారంతో అందులోకి ఎక్కించి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. హెడ్ కానిస్టేబుల్ సంజీవ్, కానిస్టేబుల్ సంజయ్ లు మహిళను స్ట్రెచ్చర్ పై వ్యాన్ లో ఎక్కించుకున్నారు. ఇంతలో నొప్పులు ఎక్కువ కావడంతో ఆర్తీ పీసీఆర్ వ్యాన్ లోనే ప్రసవించింది. దీంతో పుట్టిన బిడ్డకు కావలసిన టవల్స్, వేడి నీటితో పాటు సౌకర్యాలను అందించి తమ సేవాగుణాన్ని చాటుకున్నారు. అనంతరం స్థానిక హిందూరావ్ ఆస్పత్రికి తల్లీ బిడ్డలను తరలించారని వారిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని డీసీపీ ఆర్ కె సింగ్ తెలిపారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి సహకారం అందించిన ఇద్దరు పోలీసులకు ఆర్తీ బంధువులు కృతజ్ఞతలు తెలిపారు. ఆపరేషన్స్ స్పెషల్ కమిషనర్ సంజయ్ బెనివాల్ ఆర్తీకి సహకారం అందించిన ఇద్దరు పోలీసులకు ప్రత్యేక అవార్డులను ప్రకటించారు. -
ఇదో బుజ్జి గణేశుడి కథ
ముంబై: ఒకవైపు దాద్రి హత్యోందంతో దేశం అట్టుడికి పోతోంటే ముంబైలో మత సామరస్యానికి అద్దం పట్టే ఘటన చోటు చేసుకుంది. కష్టకాలంలో ఉన్న మైనారిటీ మహిళను ఆదుకొని మానవత్వానికి మతం అడ్డురాదని ముంబై మహిళలు నిరూపించారు. మనుషులంతా ఒక్కటే అని చాటిచెప్పారు. ఇల్వాజ్ షేక్ నూర్జహాన్ భార్యభర్తలు. ముంబైలో నివసించే ఇల్వాజ్ భార్యకు అనుకున్న సమయాని కంటే ముందుగానే పురుటి నొప్పులు మొదలయ్యాయి. హుటాహుటిన కారులో ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళుతుండగా నొప్పులు ఎక్కువయ్యాయి. అయితే మానవత్వం చూపించాల్సిన కారు డ్రైవర్ నిర్దాక్షిణ్యంగా వ్యవహరించి వారిని నడిరోడ్డుమీదే వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో దిక్కుతోచని భర్త నూర్జహాన్ ను పక్కనే ఉన్న గణేష్ ఆలయంలోకి తీసు కెళ్లాడు. దేవాలయం దగ్గర కూర్చొని ఉన్న హిందూ మహిళలు దీన్ని గమనించారు. క్షణం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగారు. నూర్జహాన్ను ఊరడించి ధైర్యం చెప్పారు. అప్పటికప్పుడు చీరలతో ల్యాబర్ రూమును తయారు చేశారు. అందరూ కలిసి ఆమెకు పురుడు పోసి పండంటి బిడ్డను చేతిలో పెట్టారు. దీంతో నూర్జహాన్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరైంది. తన బిడ్డకు గణేశ్ అని పేరు పెట్టుకుంటానని పొత్తిళ్లల్లోని బిడ్డను చూసి మురిసిపోయింది. అటు పురుడు పోసిన మహిళలు సైతం 'చిన్ని గోవిందా' అంటూ పసిపిల్లాడిని ముద్దు చేశారు. అనంతరం తల్లీబిడ్డలను ఆసుపత్రికి తరలించారు. కాగా, బుజ్జి గణేశుడు పుట్టిన సందర్భంగా ఇల్యాజ్, నూర్జహాన్ దంపతులతో కలిసి వేడుకలు జరుపుకునేందుకు ఇరుగుపొరుగు సిద్దమవుతున్నారట.