డెలివరీ కోసం హీరోయిన్ లండన్కు | Kareena might deliver baby in London, not Mumbai | Sakshi
Sakshi News home page

డెలివరీ కోసం హీరోయిన్ లండన్కు

Jul 22 2016 3:49 PM | Updated on Sep 4 2017 5:51 AM

డెలివరీ కోసం హీరోయిన్ లండన్కు

డెలివరీ కోసం హీరోయిన్ లండన్కు

బాలీవుడ్ దంపతులు కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్లు డిసెంబర్లో మొదటి బిడ్డకు జన్మనివ్వనున్నారు.

బాలీవుడ్ దంపతులు కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్లు డిసెంబర్లో మొదటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఈ జంట డెలివరీ కోసం ముంబైలోగాక లండన్కు వెళ్లనున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ముంబైలో అయితే మీడియా ఫోకస్  ఎక్కువగా ఉంటుందని, కరీనాకు జన్మించే బిడ్డకు సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారని ఈ దంపతులు ఆందోళన చెందుతున్నట్టు వారి సన్నిహితులు చెప్పారు.

లండన్లో మీడియాకు దూరంగా కరీనా, సైఫ్ ఉండనున్నట్టు సమాచారం. కరీనా డెలివరీ సమయంలో పటౌడీ కుటుంబం ఆమె వద్దే గడపనుంది. సైఫ్ తల్లి షర్మిలా ఠాగూర్, అతని సోదరి సోహా అలీఖాన్ ఎక్కువ సమయం కరీనాతో ఉండనున్నారు.

కరీనా ప్రెగ్నెన్సీకి సంబంధించి ఇప్పటికే పలు వదంతులు వచ్చాయి. లండన్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారని, ఆమెకు జన్మించేది మగబిడ్డేనని మీడియాలో వార్తలురాగా.. కరీనా, సైఫ్ వీటిని ఖండించారు. అంతేగాక ప్రెగ్నెన్సీతో ఉన్న కరీనా ఫొటోలు మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement