ఇళ్లకూ ‘ఆధార్‌’ ! | GHMC Decide To Aadhar Card For House And Plots | Sakshi
Sakshi News home page

ఇళ్లకూ ‘ఆధార్‌’ !

Published Thu, May 10 2018 7:39 AM | Last Updated on Tue, Sep 4 2018 5:44 PM

GHMC Decide To Aadhar Card For House And Plots - Sakshi

ఇళ్లకు ఆధార్‌ ఏంటనుకుంటున్నారా...నిజమే మరి. వ్యక్తులకు సంబంధించి బహుళప్రయోజకారిగా ఉపయోగపడుతున్న ఆధార్‌ కార్డు తరహాలోనే జీహెచ్‌ఎంసీ పరిధిలోనిప్రతి ఇల్లు, ప్లాట్, తదితర స్థలాలన్నింటికీ ‘ఆధార్‌’ నంబర్లు జారీ చేయనున్నారు. నగరంలోచిరునామా కనుక్కోవడంలో తిప్పలు తప్పించేందుకు డిజిటల్‌డోర్‌ నంబర్ల ప్రక్రియకు సిద్ధమైనజీహెచ్‌ఎంసీ.. ఇప్పటికే వివిధ సంస్థలకు ఆ బాధ్యతలు అప్పగించగా, ఏవీ పూర్తిస్థాయిలోకార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీయే స్వయంగా కొత్త డిజిటల్‌ డోర్‌ నంబరింగ్‌సిస్టమ్‌కు సిద్ధమైంది. దీన్నే ప్రాపర్టీ ఆధార్‌ నంబర్‌గా కూడా వ్యవహరిస్తారు. ఇందులో భాగంగాజీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రతి ఇల్లు, ప్లాట్, ఖాళీ స్థలం, నిర్మాణం జరుగుతున్న భవనం, నిర్మాణం పూర్తయినప్పటికీఆస్తిపన్ను జాబితాలో నమోదు  కాని ఇల్లు.. ఇలా  అన్నింటికీ డిజిటల్‌ డోర్‌నంబర్లను జారీ చేయనుంది.  ఈ డిజిటల్‌ డోర్‌ నంబర్‌ ద్వారానే ఇల్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌ తదితర వివరాలన్నీ తెలుస్తాయి.       

సాక్షి, సిటీబ్యూరో: ఆధార్‌..వ్యక్తులకు సంబంధించిన చిరునామాలతోపాటు బ్యాంకులు, సిమ్‌కార్డులు, రేషన్‌కార్డులు, ఓటరు కార్డు, పాన్‌ నంబర్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పనికీ  ‘ఆధార్‌’ అవసరం తెలిసిందే. ఇది మనుషులకు కాగా ఇళ్లకూ ‘ఆధార్‌’ తరహా నంబర్లిచ్చేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. బహుళ ప్రయోజనకారిగా ఉపయోగపడుతున్న  ‘ఆధార్‌’ తరహాలోనే జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రతి ఇల్లు, ప్లాట్, తదితర స్థలాలన్నింటికీ ‘ఆధార్‌’ నంబర్లు జారీ చేయనున్నారు. ఈమేరకు జీహెచ్‌ఎంసీయే స్వయంగా కొత్త డిజిటల్‌ డోర్‌ నంబరింగ్‌ సిస్టమ్‌కు సిద్ధమైంది. దీన్నే ప్రాపర్టీ ఆధార్‌ నంబర్‌గా కూడా  వ్యవహరిస్తారు. ఇందులో భాగంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రతి ఇల్లు, ప్లాట్, ఖాళీ స్థలం, నిర్మాణం జరుగుతున్న భవనం, నిర్మాణం పూర్తయినప్పటికీ ఆస్తిపన్ను జాబితాలో నమోదు  కాని ఇల్లు.. ఇలా  అన్నింటికీ డిజిటల్‌ డోర్‌ నంబర్లను జారీ చేయనుంది.  ఈ డిజిటల్‌ డోర్‌ నంబర్‌ ద్వారానే ఇల్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌ తదితర వివరాలన్నీ తెలుస్తాయి. ఒక డిజిటల్‌ డోర్‌ (ఆధార్‌)నంబర్‌ను కేటాయించారంటే దానికి సంబంధించిన స్థలం ఎవరి పేరు మీద ఉంది.. ఒకరి నుంచి ఒకరికి మ్యుటేషన్‌ జరిగిందా.. వంటి వివరాలతోపాటు ఆ ఇంటి  ఆస్తిపన్ను గుర్తింపు నంబర్‌( పీటీఐఎన్‌), నివాస భవనమా, వాణిజ్య భవనమా, వేకెంట్‌ ల్యాండా వంటి వివరాలు ఆన్‌లైన్‌ ద్వారానే తెలుసుకునే వీలుంటుంది.

అంతే కాదు సంబంధిత ఇంటికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌(ఓసీ) జారీ అయిందా లేదా వంటివి కూడా తెలుస్తాయి. ఇది ప్రజలకుపకరించే అంశం కాగా.. ఇళ్ల ఆధార్‌ నంబర్ల ద్వారా ఆస్తిపన్ను చెల్లించారా..లేదా? చెల్లించకుంటే ఎంతకాలంగా చెల్లించడం లేదు..? రికార్డుల్లో మాత్రం నివాస భవనంగా ఉన్నప్పటికీ, వాస్తవంగా వాణిజ్యం నిర్వహిస్తున్నారా.. తదితర వివరాలు జీహెచ్‌ఎంసీకి తెలుస్తాయి. అంతేకాదు.. ఇంతవరకు ఓసీలు తీసుకోని,  ఆస్తిపన్ను చెల్లించని ఇళ్ల వివరాలు కూడా తెలుస్తాయి. వీటిని గుర్తించి ఆస్తిపన్ను, ట్రేడ్‌ లైసెన్సులు, ఇతరత్రా ఫీజులు వసూలు చేయడం ద్వారా జీహెచ్‌ఎంసీకి  కనిష్టంగా ఏటా దాదాపు రూ.150 కోట్ల ఆదాయం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సమగ్ర కుటుంబ సర్వే మేరకు జీహెచ్‌ఎంసీలో దాదాపు 20 లక్షల  ఇళ్తుండగా, ఆస్తిపన్ను జాబితాలో మాత్రం 14 లక్షలే ఉన్నాయి. సర్వే అనంతరం దాదాపు 70 వేల ఇళ్లు కొత్తగా వచ్చి ఉంటాయని అంచనా. వీటన్నింటినీ ఆస్తిపన్ను పరిధిలోకి తెస్తారు. ట్రేడ్‌ లైసెన్సులు లేకుండానే వ్యాపారాలు నిర్వహిస్తున్నవారికి ట్రేడ్‌లైసెన్సులుజారీ చేస్తారు. తద్వారా జీహెచ్‌ఎంసీ ఆదాయం పెరుగుతుంది. 

పైలట్‌ ప్రాజెక్ట్‌గా మూసాపేటలో..
ఈ డిజిటల్‌ డోర్‌నంబర్‌(ఆధార్‌) కోసం పైలట్‌ ప్రాజెక్టుగా మూసాపేట సర్కిల్‌లో బుధవారం సర్వేకు శ్రీకారం చుట్టారు. నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ(ఎన్‌ఆర్‌ఎస్‌ఏ) సహకారంతో శాటిలైట్‌ చిత్రాల మ్యాపింగ్‌తో జీహెచ్‌ఎంసీ ఐటీ, రెవెన్యూ విభాగాలు ఈ సర్వే నిర్వహిస్తున్నాయి. మూసాపేట సర్కిల్‌లో దాదాపు 60 వేల ఇళ్లున్నట్లు అంచనా. వీటన్నింటి సర్వే రెండు నెలల్లో పూర్తవుతుందని, అడిషనల్‌ కమిషనర్‌ (ఐటీ) ముషార్రఫ్‌ ఫారూఖి తెలిపారు. అవసరాలకనుగుణంగా ఆరు నుంచి ఎనిమిది డిజిట్‌లతో ఇళ్ల ఆధార్‌ నంబర్‌లు జారీ చేయనున్నట్లు చెప్పారు. ఈ నంబర్‌ ఉంటే సెల్‌ఫోన్‌తోనే కావాల్సిన చిరునామాకు నేరుగా వెళ్లిపోవచ్చునని చెప్పారు. ఫైర్‌సర్వీసెస్, పోస్టల్, కొరియర్‌ సర్వీసులకు ఎంతో ఉపయుక్తమన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

మూసాపేట పరిధిలో సర్వేలో పాల్గొన్న అడిషనల్‌ కమిషనర్లు ముషార్రఫ్‌అలీ, అద్వైత్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement