house plots
-
ఆ ఇళ్లన్నీ.. బాబు ఖాతాలోకి!
సాక్షి, అమరావతి: ‘మేం అధికారంలోకి వస్తే పేదల ఇంటి నిర్మాణానికి పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు చొప్పున స్థలాలు మంజూరు చేస్తాం. ఇంటి నిర్మాణం కోసం సీఎం జగన్ ప్రభుత్వం చేసిన దానికంటే ఇంకా ఎక్కువ సాయంచేసి చూపిస్తాం’.. అని సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీలిచ్చారు. ఇప్పుడాయన సీఎం కూడా అయ్యారు. ఇక తమ సొంతింటి కల సాకారం చేయడానికి బాబు ఎంత పెద్ద సాయం చేస్తారోనని ఇళ్లులేని పేదలు ఓ పక్క ఎదురుచూస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం పేదలకు మెరుగైన సాయం చేయడం అటుంచి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను తమ ఖాతాలో వేసుకునేందుకు పెద్ద స్కెచ్చే వేసింది. ఇందులో భాగంగా వంద రోజుల్లో 1.28 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తిచేస్తాం అని గొప్పగా ప్రకటించింది. అండగా నిలిచిన సీఎం జగన్.. గడిచిన ఐదేళ్లలో సొంతింటి కల సాకారం చేస్తూ పేదలకు సీఎం జగన్ అన్ని విధాలుగా అండగా నిలిచారు. ఏకంగా 31 లక్షల మందికి పైగా పేద అక్కచెల్లెమ్మల పేరిట రూ.76 వేల కోట్లకుపైగా మార్కెట్ విలువ చేసే స్థలాలు పంపిణీ చేశారు.ఇంటి నిర్మాణానికి యూనిట్‌కు రూ.1.80 లక్షలు బిల్లు మంజూరు చేయడంతో పాటు, స్వయం సహాయక బృందాల ద్వారా లబ్దిదారులైన మహిళలకు పావలా వడ్డీకి రూ.35 వేలు రుణ సాయం అందించింది. ఉచితంగా ఇసుకను పంపిణీ చేయడం ద్వారా రూ.15 వేలు, స్టీల్, సిమెంట్, ఇలా 12 రకాల నిర్మాణ సామగ్రిని సబ్సిడీపై సరఫరా చేయడం ద్వారా మరో రూ.40 వేలు చొప్పున మొత్తంగా రూ.2.70 లక్షల చొప్పున ప్రయోజనం చేకూర్చారు.స్టేజ్ అప్‌గ్రేడ్ చేసి ఈ ప్రభుత్వ ఖాతాలోకి.. నిజానికి.. గత ప్రభుత్వ హయాంలో ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద గత ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల మందికి పైగా పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేసింది. స్థలాలు పొందిన వారిలో 19 లక్షల మందికి పైగా ఇళ్ల నిర్మాణానికి అనుమతులిచ్చారు. ఎన్నికలు ముగిసే నాటికి 1,28,058 ఇళ్లు శ్లాబ్ దశను పూర్తిచేసుకున్నాయి. వీటిలో చాలావరకూ తుదిదశ పనులు కూడా పూర్తిచేసుకున్నాయి. అయితే, ఎన్నికల కోడ్ నేపథ్యంలో గృహ నిర్మాణ కార్యకలాపాలు నిలిచిపోవడంతో పాటు, ఆన్లైన్లో స్టేజ్ అప్డేట్ ప్రక్రియకు బ్రేక్ పడింది. దీంతో చివరి దశ బిల్ కోసం ఇళ్లు పూర్తయినట్లు స్టేజ్ అప్డేట్ చేయలేదు. ఈ ఇళ్లనే వంద రోజుల్లో మేం నిర్మాణం పూర్తిచేస్తామని ప్రభుత్వం ప్రకటన చేసింది. దీంతో పాటు గత ప్రభుత్వంలోనే ప్రారంభించి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న 6.08 లక్షల ఇళ్లనే స్టేజ్ కన్వర్షన్స్ చేపడతామని చెబుతున్నారు కానీ, తాము పేదలకు స్థలాలు పంపిణీ చేస్తామని, కొత్తగా ఇళ్లు మంజూరు చేస్తామని ఇప్పటివరకూ ప్రస్తుత ప్రభుత్వం చెప్పలేదు. ఆ దిశగా ఎక్కడా చర్చించనూ లేదు. -
డీలాపడే.. ఇళ్లపై రంకెలు
సాక్షి, అమరావతి : అధికారంలో చంద్రబాబు తప్ప వేరెవరైనా ఉంటే అ ప్రభుత్వం చేసే మంచి పనులేవీ రామోజీరావుకు కనిపించవు. ఒకవేళ కనిపించినా కనిపించనట్లు జీవిస్తారు. అదే చంద్రబాబు అధికారంలో ఉంటే ఆయనెంత దుర్మార్గం చేసినా ఆహా ఓహో అంటూ భజనలు. ఇది తన సహజ లక్షణమని ఆయన నిత్యం నిరూపించుకుంటున్నారు. తాజాగా.. పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల చరిత్రలో ఏ ప్రభుత్వం తీసుకురాని సంస్కరణను వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చి విజయవంతంగా అమలుచేయడాన్ని ఈ పచ్చకళ్ల రామోజీరావు సహించలేకపోతున్నారు. జగన్‌ను, ఆయన సర్కారును ఎలాగైనా అభాసుపాల్జేయాలన్న కసి ఆయనను దహించేస్తోంది. దీంతో.. దేశంలో పేదల ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్లు చేసిన ఏకైక ప్రభుత్వంగా నిలిచినా దాన్ని తక్కువచేసి చూపేందుకు, లబ్ధిదారుల్లో అపోహలు సృష్టించేందుకు తన క్షుద్ర పత్రికలో చేతికొచ్చింది రాసిపారేస్తున్నారు. ‘అంకెలు భళా.. అమలు డీలా’ అంటూ నిజాలకు పాతరేసి తన పెత్తందారీ భావజాలాన్ని అక్షరం అక్షరంలో ప్రదర్శించారు. 45 రోజుల వ్యవధిలో పేదలకిచ్చిన 15.59 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్లు చేయడం డీలాపడడం ఎలా అవుతుందో రామోజీరావుకే తెలియాలి. పేదలకు జగన్ సర్కారు చేస్తున్న మేలుతో చంద్రబాబుకు ఇక జన్మలో అధికారం దక్కదన్న దుగ్థతో రామోజీనే డీలాపడి ఇష్టమొచ్చినట్లు రంకెలు వేస్తున్నారు. అసలు.. రిజిస్ట్రేషన్ల శాఖ సంవత్సరం మొత్తం మీద చేసే రిజిస్ట్రేషన్ల సంఖ్య 20 లక్షలు. మామూలుగా అయితే ఈ రిజిస్ట్రేషన్లు చేయడానికి దాదాపు ఏడాది పడుతుంది. కానీ, పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై వారికి వెనువెంటనే హక్కు కల్పించేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఆఘమేఘాల మీద ఈ రిజిస్ట్రేషన్లు చేసింది. ఫిబ్రవరి 4న మొదలుపెట్టి మార్చి 15 వరకు రికార్డు స్థాయిలో 15.59 లక్షల రిజిస్ట్రేషన్లను చేసింది. ఎన్నికల పనులు, రీసర్వే వంటి కార్యక్రమాలున్నా జిల్లా కలెక్టర్లు, అధికార యంత్రాంగం అత్యంత వేగంగా రిజిస్ట్రేషన్లు చేసి చరిత్ర సృష్టించడాన్ని డీలాపడడం అని రామోజీ పదకోశంలో ఈనాడు అనుకుంటే దానిని కడుపుమంట కాక ఇంకేమనాలి? నిజానికి.. చంద్రబాబు తన హయాంలో పేదలకు చెప్పుకోదగ్గ మేలు చేసింది ఏమీలేదు. కానీ రామోజీరావు ఎప్పుడూ దీన్ని ప్రశ్నించలేదు. ఎందుకంటే అప్పుడు డీపీటీ (దోచుకో–పంచుకో–తినుకో) పద్ధతిలో పచ్చముఠా రాష్ట్ర ఖజానాను పూర్తిగా నాకేసింది. కానీ, ఇప్పుడు అలాంటిదేవీులేదు. ఖర్చుపెట్టే ప్రతి పైసాకూ తగ్గ ప్రతిఫలం పేదలకు దక్కాలన్నదే సీఎం జగన్ తపన. దీనిని చంద్రబాబే కాదు.. ఎల్లోగ్యాంగ్లో ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఈ రాతలు.. ఈ రోత కథనాలు. రిజిస్ట్రేషన్లకు తాత్కాలిక విరామం.. ఇక ఎన్నికల కోడ్ మార్చి 16న రావడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను తాత్కాలికంగా నిలుపుదల చేయడాన్ని వక్రీకరించి ఇక అక్కడితో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆగిపోయినట్లు చిత్రీకరించడం రామోజీ దివాళాకోరుతనం. ఎన్నికల కోడ్ అమలులో ఉండడంవల్ల రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్న కన్వేయన్స్ డీడ్లపై సీఎం ఫొటో ఉండకూడదనే నిబంధనవల్లే ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్లకు విరామం ఇచ్చారు. ఎన్నికల కమిషన్ అనుమతితో సీఎం ఫొటోలేకుండా రిజిస్ట్రేషన్లు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ ఆధ్వర్యంలో దీనిపై కసరత్తు జరుగుతోంది. త్వరలో మిగిలిన ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లను ప్రారంభించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. లెక్క ఎక్కువ కాదు. అసలు లెక్కే రామోజీ.. ఇళ్ల స్థలాల లెక్కను ఎక్కువచేసి ప్రచారం చేసుకుంటున్నారని, కాలనీలు కాదు ఊళ్లు నిర్మిస్తున్నట్లు చెప్పుకుంటున్నారని ఈనాడు తన అక్కసు వెళ్లగక్కింది. 31.19 లక్షల మంది ఇళ్ల స్థలాలులేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలివ్వగా అందులో 22 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. మరో 7 లక్షల మంది పొజిషన్లో ఉండడంతో వీరికి గతంలోనే పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చారు. మిగిలినవి టిడ్కో, ఇతర ఇళ్లు. ఇందులో లెక్క ఎక్కువచేసి చూపింది ఎక్కడ? 22 లక్షల మంది జగనన్న కాలనీల్లో ఇళ్లు కట్టుకుంటున్న విషయం నిజంకాదా? 17 వేలకుపైగా జగనన్న కాలనీలు ఏర్పడడం రామోజీకి కనిపించడంలేదా? 22 లక్షల ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇప్పటికే 15.50 ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. త్వరలో మిగిలిన స్థలాలకు రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. ఇవి కాగితాల్లో లెక్కలు కాదు. వాస్తవంగా కనిపించే లెక్కలే. రిజిస్ట్రేషన్లు చేయకుండా టీడీపీ అడ్డంకులు.. పేదలకిచ్చిన ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామనే మాటకు కట్టుబడి వైఎస్ జగన్ ప్రభుత్వం 2020లోనే జీఓ ఇచ్చినా టీడీపీ నేతలు కోర్టుల్లో కేసులు వేసి దానికి అడ్డుపడ్డారు. రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేలోపు పేదలు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఏకంగా 71,811 ఎకరాల భూమిని సేకరించి, పేదలకు అప్పటికి డీకేటీ పట్టాలిచ్చింది. టీడీపీ అడ్డుకున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగించేందుకు ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ (పీఓటీ) చట్టాన్ని 2021లో సవరించి పదేళ్ల తర్వాత ఇంటి పట్టాను అమ్ముకునే అవకాశం లబ్ధిదారులకు కల్పించింది. రిజిస్ట్రేషన్ చేస్తుంటే ఉపయోగంలేని రిజిస్ట్రేషన్ అంటూ వక్రభాష్యం చెబుతూ పేదలను మోసం చేస్తోంది. వాస్తవానికి.. ఈ రిజిస్ట్రేషన్ చేయడంవల్ల బ్యాంకుల్లో తక్కువ వడ్డీకి రుణం తెచ్చుకునే సౌలభ్యం ఏర్పడుతుంది. ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేస్తుంది కాబట్టి బ్యాంకులు రుణాలిస్తాయి. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కాబట్టి డేటాబేస్‌లో ఆ వివరాలన్నీ పదిలంగా ఉంటాయి. ఎప్పుడంటే అప్పుడు సర్టిౖఫెడ్ కాపీ పొందే దానికి వీలుంటుంది. ఫోర్జరీ, ట్యాంపరింగ్ భయం ఉండదు. ఇన్ని ఉపయోగాలుండగా రిజిస్ట్రేషన్ అవసరంలేదని బుకాయించడం రామోజీ ఏడుపు కాక మరేమిటి? వైఎస్సార్సీపీ నేతలు ఎక్కడ రాయించుకున్నారు? ఇళ్ల స్థలాలు తీసుకున్న వారిలో కొందరు చనిపోవడంతో వారి వారసులను (లీగల్ హైర్స్) గుర్తించడం ఆలస్యమవడంవల్ల కొన్ని రిజిస్ట్రేషన్లు ఆలస్యమయ్యాయి. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా అర్హులను గుర్తించి వారికి రిజిస్ట్రేషన్లు చేసేందుకు చేసే ప్రయత్నాన్ని కూడా ఈనాడు రామోజీ తట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి స్థలాలను వైఎస్సార్సీపీ నేతలు తమ పేరుతో ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు ఆధారాల్లేకుండా కుట్రపూరిత రాతలు రాస్తోంది. అలాగే, ఈ కథనంలోనే అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వారికి మొదట రిజిస్ట్రేషన్లు చేస్తున్నారనే తప్పుడు ఆరోపణను అచ్చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల వారీగా ఇచ్చిన ఇళ్లన్నింటికీ రిజిస్ట్రేషన్లు చేస్తుంటే దానిపైనా నిందలు మోపి తన వక్రబుద్ధిని ఆ క్షుద్ర పత్రిక చాటుకుంది. పదేళ్ల తర్వాత ఇళ్ల స్థలాలపై యాజమాన్య హక్కులు ఆటోమేటిక్‌గా వస్తాయని, వాటికి కన్వేయన్స్ డీడ్ల పేరుతో రిజిస్ట్రేషన్లు చేయడం అవసరంలేదనే వింత వాదన లేవనెత్తింది. రెవెన్యూ శాఖ ఎన్ఓసీ లేకుండా యాజమాన్య హక్కులు ఎలా వస్తాయో మహా మేధావి రామోజీకే తెలియాలి. -
23న ఒంగోలుకు సీఎం జగన్
ఒంగోలు అర్బన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 23వ తేదీన ఒంగోలు రానున్నారు. నగరంలోని 22వేల మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా నగర శివారు అగ్రహారం వద్ద నిర్వహించనున్న సభ ఏర్పాట్లను సోమవారం మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ తలశిల రఘురాం, కలెక్టర్ దినేష్‌కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం ద్వారా అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి తీరుతామని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని చెప్పారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. మల్లేశ్వరపురం, అగ్రహారం, వెంగముక్కలపాలెం గ్రామాల్లోని జగనన్న టౌన్‌షిప్‌లలో అర్హులైన 22వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని వివరించారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోందని చెప్పారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని ఆలోచనల మేరకు నగర పరిధిలో అర్హులైన 22 వేల మంది పేదలకు సీఎం చేతుల మీదుగా చేపడుతున్న పట్టాల పంపిణీ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో జగనన్న టౌన్‌షిప్‌లను అర్బన్ డెవలప్మెంట్ టౌన్‌గా ఏర్పాటు చేయడంతోపాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పింస్తామన్నారు. కలెక్టర్ దినేష్‌కుమార్ మాట్లాడుతూ పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు మల్లేశ్వరపురం, అగ్రహారం, వెంగముక్కలపాలెం గ్రామాల్లో 536 ఎకరాలు భూసేకరణ చేశామన్నారు. పట్టాల పంపిణీ పూర్తి పారదర్శకంగా చేపట్టడంతోపాటు నగరంలోని 70 సచివాలయాల పరిధిలో కన్వేయడ్ డీడ్ ప్రక్రియ జరుగుతున్నట్లు తెలిపారు. ఆర్డీవో విశ్వేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
Fact Check: పేదల ఇళ్లపైనా ఏడుపేనా రామోజీ?
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు వరుస అబద్ధాలతో, కట్టు కథలతో రాష్ట్ర ప్రభుత్వంపై విషం జిమ్ముతున్న ఈనాడు రామోజీరావు మరోసారి అడ్డగోలు రాతలకు దిగారు. ఇళ్లు లేనివారు రాష్ట్రంలో ఒక్కరు కూడా ఉండకూడదని ప్రభుత్వం 31 లక్షల మందికి పైగా పేద మహిళలకు ఇంటి స్థలాలు ఇచ్చినా రామోజీ తట్టుకోలేకపోయారు. ఇప్పుడు ఇళ్లను ప్రభుత్వం లబ్దిదారుల పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నా ఓర్వలేక విషం జిమ్ముతున్నారు. లక్షలాది మంది పేద అక్కచెల్లెమ్మలకు మేలు జరిగేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుగా చిత్రీకరిస్తూ అడ్డగోలు రాతలతో బరితెగించారు. పేదలకు ఇచ్చిన లక్షలాది ఇళ్లకు రిజిస్ట్రేషన్లు చేయడం, వారికి కన్వేయన్స్ డీడ్లు ఇవ్వడాన్ని తప్పుపడుతూ తన కడుపుమంటకు మందే లేదని రామోజీ చాటుకున్నారు. ఇందులో భాగంగానే ‘ఎన్వోసీ లేకుండా హక్కులు ఇవ్వగలరా’ అంటూ ‘ఈనాడు’లో పెడార్థాలు తీశారు. ఎన్వోసీ (నిరభ్యంతర ధ్రువపత్రం) పేరుతో పేదలు భవిష్యత్తులో ఇబ్బందులు పడకూడదనే కన్వేయన్స్ డీడ్ ఇస్తారు. ఆ విషయం తెలిసి కూడా ప్రజల్లో అపోహలు సృష్టించడమే లక్ష్యంగా రామోజీ తన పచ్చ పైత్యాన్ని ప్రదర్శించారు. ఇచ్చిన హామీ కంటే మిన్నగా.. వైఎస్సార్సీపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇళ్ల స్థలాలు లేని 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని, వారికి ఇళ్లు కట్టించి ఇస్తామని.. వారి పేరుతోనే రిజిస్ట్రేషన్ చేసి అందిస్తామని హామీ ఇచ్చింది. అయితే ఇచ్చిన హామీ కంటే మిన్నగా ప్రభుత్వం 31.19 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి అందులో 22 లక్షల ఇళ్లు మంజూరు చేసింది. ఇంటిని రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామనే మాటకు కట్టుబడి 2020లోనే జీవో ఇచ్చింది. అయితే పేదలకు మంచి జరగకూడదనే ఉద్దేశంతో టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లి రిజిస్ట్రేషన్ ప్రక్రియను అడ్డుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేలోపు పేదలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఒకేసారి 71,811 ఎకరాల భూమిని సేకరించి డీకేటీ పట్టాలిచ్చింది. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగించడానికి అసైన్ ల్యాండ్స్ (పీవోటీ) చట్టాన్ని 2021లో సవరించింది. దీనిప్రకారం.. పదేళ్ల తర్వాత ఇంటి స్థలాన్ని లబ్దిదారులు అమ్ముకునే అవకాశం కల్పించింది. ఇళ్ల పట్టా ఇచ్చి, ఇళ్లు మంజూరు చేయడంతోపాటు ఇచ్చిన మాటకు కట్టుబడి న్యాయపరమైన అవరోధాలను అధిగమించి ఇటీవలే ఆర్డినెన్స్ తెచ్చింది. తద్వారా రిజిస్ట్రేషన్లు చేయడానికి మార్గం సుగమం చేసింది. అయితే ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌ను పట్టాతో పోల్చడం ‘ఈనాడు’ దివాళాకోరుతనం కాక మరేమిటి? రిజిస్ట్రేషన్‌కు విలువ ఉండదా? విలువ లేని రిజిస్ట్రేషన్ అంటూ ‘ఈనాడు’ తన కథనంలో అసత్యాలను వల్లె వేసింది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌ని సైతం పట్టా అని తప్పుదోవ పట్టించింది. రిజిస్ట్రేషన్ చేస్తుంటే దాన్ని విలువ లేని రిజిస్ట్రేషన్ అంటారా? ఇళ్ల పట్టాకు రిజిస్ట్రేషన్ చేయడం వల్ల బ్యాంకుల్లో తక్కువ వడ్డీకే రుణం లభిస్తుంది. ఏకంగా ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేస్తుంది కాబట్టి బ్యాంకులు త్వరగా రుణాలిస్తాయి. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కాబట్టి డేటా బేస్‌లోనూ ఆ వివరాలన్నీ పదిలంగా ఉంటాయి. ఎప్పుడంటే అప్పుడు సర్టిఫైడ్ కాపీ పొందొచ్చు. ఫోర్జరీ, ట్యాంపర్ భయాలు అసలు ఉండవు. ఇంటిని అమ్ముకునే సమయంలో ఈ డాక్యుమెంట్ ఒక్కటి సరిపోతుంది.. ఎటువంటి లింక్ డాక్యుమెంట్లు అవసరం లేదు. నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇలాంటి ఎన్నో ఉపయోగాలు ఉండగా విలువ లేని రిజిస్ట్రేషన్ అంటూ అబద్ధాలను అచ్చేయడం ‘ఈనాడు’ కడుపు మంట కాక మరేమిటి? పట్టా రూపంలో ఇచ్చే కన్వేయన్స్ డీడ్ వల్ల లబ్ధిదారులకు ఎలాంటి ఉపయోగం ఉండదని లబ్దిదారుల్లో అపోహ సృష్టించడమే ‘ఈనాడు’ పచ్చరాతల లక్ష్యం. డీడ్‌లో ఏ తేదీ నుంచి లబ్దిదారులకు సర్వహక్కులు లభిస్తాయో స్పష్టంగా ఉంటుంది. ఏ విధమైన ఎన్వోసీ లేకుండా బదిలీ చేసుకోవచ్చు. లబ్దిదారులు ఏ ప్రభుత్వ కార్యాలయం చుట్టూ ఎన్వోసీ కోసం తిరగనక్కర్లేదు. ఇది ఉపయోగం కాదా? ఎలాంటి ఉపయోగం లేదని ‘ఈనాడు’ వక్రభాష్యం చెప్పడం ఎంతవరకు సమంజసం? వక్రీకరణలు.. అసత్యాలు.. కన్వేయన్స్ డీడ్ విధానంలో జరిగే రిజిస్ట్రేషన్ల సమయంలో షరతులు విధించినట్లు ‘ఈనాడు’ అబద్ధాలను అచ్చేసింది. ఇంటి నిర్మాణం 24 నెలల్లో పూర్తి చేయాలనే షరతును వక్రీకరించింది. ఈనాడుకు చట్టాల మీద ఎటువంటి అవగాహన లేదని దీని ద్వారా స్పష్టమవుతోంది. ప్రతి డి పట్టా మీద ఈ షరతు ఉంటుందని చట్టాల మీద అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. టీడీపీ ప్రభుత్వంలో ఒక్క డీకేటీ పట్టా అయినా ఇచ్చి ఉంటే.. ఈనాడుకు పట్టాలో పొందుపరిచే నిబంధనల గురించి తెలిసి ఉండేది. లబ్ధిదారు రెండేళ్లలో ఇల్లు కట్టుకోలేరని తెలిసి, కన్వేయన్స్ డీడ్ చేయడానికి తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌లో ఈ 24 నెలల సమయాన్ని పొడిగించే అధికారం తనకు ఉండేలా ప్రభుత్వం చూసింది. పేదల పక్షపాతి అయిన వైఎస్ జగన్ ప్రభుత్వం పేదలకు అన్యాయం జరిగే ఏ నిర్ణయం తీసుకోదు. ప్రభుత్వానికి పేదలకు ఏ విధంగా మంచి చేద్దామనే ఆలోచన తప్ప మరే దురాలోచన లేదు. -
టీటీడీ వార్షిక బడ్జెట్ రూ.5,141.74 కోట్లు
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానములకు సంబంధించి 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.5,141.74 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ఆమోదించినట్లు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. చైర్మన్ అధ్యక్షతన సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. వార్షిక బడ్జెట్‌తోపాటు పలు కీలక నిర్ణయాలకు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపినట్లు భూమన వెల్లడించారు. దాదాపు 30ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న టీటీడీ ఉద్యోగుల కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి టీటీడీ పాలకమండలి కృతజ్ఞతలు తెలియజేస్తూ తీర్మానం చేసిందని చెప్పారు. టీటీడీలోని వివిధ విభాగాల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్నవారికి, శిల్పులకు వేతనాలు, వేదపారాయణదారులకు పెన్షన్, కాంట్రాక్టు అర్చకులు, సంభావన అర్చకులు, వేద పాఠశాలల్లోని సంభావన అధ్యాపకుల వేతనాలను, క్రమాపాఠీలు, ఘనాపాఠీలకు సంభావనలు పెంచినట్లు వివరించారు. టీటీడీ నిర్వహిస్తున్న 26 స్థానిక ఆలయాలు, విలీనం చేసుకున్న 34 ఆలయాల్లో 515 పోస్టులు సృష్టించేందుకు ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించినట్లు తెలిపారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో టీటీడీ వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన నగదు, బంగారం ద్వారా వడ్డీ రూ.1,167 కోట్లు వస్తుందని భావిస్తున్నట్లు వివరించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో శ్రీవారి హుండీ ద్వారా సుమారు రూ.1,611 కోట్లు, ప్రసాదాల ద్వారా రూ.600 కోట్లు, దర్శనం ద్వారా రూ.338 కోట్లు వస్తాయని అంచనా వేసినట్లు చెప్పారు. అదేవిధంగా పరికరాల కొనుగోలు కోసం రూ.751కోట్లు, కార్పస్, ఇతర పెట్టుబడుల కోసం రూ.750 కోట్లను బడ్జెట్లో కేటాయించామని, మానవ వనరుల ఖర్చు రూ.1,733 కోట్లు ఉంటుందని అంచనా వేసినట్లు తెలిపారు. హిందూ ధర్మ ప్రచారానికి రూ.108.50కోట్లు కేటాయించినట్లు భూమన వివరించారు. టీటీడీ ఉద్యోగుల ఇళ్లస్థలాల కోసం వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యం వద్ద అదనంగా కేటాయించిన 132.05 ఎకరాల స్థలంలో గ్రావెల్ రోడ్డు ఏర్పాటు టెండరుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఈ సమావేశంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, జేఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, పలువురు పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. మహిళలకు శ్రీవారి ఆశీస్సులు అందించిన మంగళ సూత్రాలు సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా హిందువుల ఆరాధ్యదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందించిన మంగళసూత్రాల(తాళిబొట్లు)ను మహిళలకు అందించాలని టీడీపీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. స్వామి వారికి భక్తులు సమర్పించిన బంగారంతో వివిధ ఆచారాలు అనుసరించి మంగళసూత్రాలు తయారు చేయిస్తారు. ఆ మంగళసూత్రాలను శ్రీవారి పాదాల చెంత ఉంచి పూజలు చేసి లాభ, నష్టాలు లేని ధర నిర్ణయించి విక్రయిస్తారు. నాలుగైదు డిజైన్లలో తయారు చేసే ఈ మంగళ సూత్రాలు 5 గ్రాములు, 10 గ్రాముల బరువుతో ఉంటాయి. ఇప్పటికే వివాహం అయినవారు, వివాహం చేసుకోబోయే వధువులు ఈ తాళిబొట్లను ధరించడం వల్ల దీర్ఘసుమంగళిగా ఉంటారని భక్తుల విశ్వాసం. భూమన కరుణాకరరెడ్డి గతంలో టీటీడీ చైర్మన్‌గా ఉన్న సమయంలో నిర్వహించిన కల్యాణమస్తు (సామూహిక వివాహాలు) ద్వారా సుమారు 32వేల మంది వధువులకు స్వామివారి ఆశీస్సులు అందించిన మంగళసూత్రాలు ఉచితంగా అందించారు. -
CM Jagan: పేదల ఇళ్ల నిర్మాణానికి రూ.16,927 కోట్లు
31 లక్షల పేద అక్కచెల్లెమ్మలకు స్వగృహయోగం రాష్ట్రవ్యాప్తంగా 17,005 జగనన్న కాలనీలు.. 31.19 లక్షల మంది అక్కచెల్లెమ్మల పేరిట ఉచితంగా ఇళ్ల స్థలాలు.. వారు ఇళ్లు కట్టుకోవడానికి ఒక్కొక్కరికి రూ.2.70 లక్షలు సాయం.. నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తూ ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం చేస్తున్న మేలు ఇది. – సాక్షి, అమరావతి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి కావాల్సిన భూమి కొనుగోలుకు భారీ ఎత్తున ప్రభుత్వం వ్యయం చేసింది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చాక 2019 నుంచి ఇప్పటివరకు వారి ఇళ్ల నిర్మాణానికి ఏకంగా రూ.16,927.16 కోట్లు ఖర్చు చేసింది. ఈ వ్యయాలు కాకుండా కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి మరింత ఖర్చు పెట్టనుంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా పేదింటి అక్కచెల్లెమ్మలను లక్షాధికారులను చేస్తూ కనిష్టంగా 1.50 లక్షల కోట్ల నుంచి గరిష్టంగా రూ.3 లక్షల కోట్ల సంపదను వారి చేతుల్లో ప్రభుత్వం పెడుతోంది. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇప్పటివరకు పేదలకు ఇంత పెద్ద ఎత్తున స్థలాలు, ఇళ్లు ఇచ్చిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. ఆర్థిక సాయంతోపాటు నిర్మాణ సామగ్రిపై సబ్సిడీ 2019లో అధికారంలోకి వచ్చాక నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద ఇళ్ల నిర్మాణాల కోసమే ఇప్పటివరకు ఏకంగా రూ.16,927.16 కోట్లు ఖర్చు చేశారు. ఈ నిధులతో లబ్దిదారులకు చకచకా ఇంటి బిల్లులను చెల్లించారు. అంతేకాకుండా 4.70 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా సిమెంట్, 33 వేల టన్నులకుపైగా స్టీల్, ఇతర నిర్మాణ సామగ్రిని సబ్సిడీపై సరఫరా చేశారు. ఉచితంగా స్థలం ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణం కోసం యూనిట్‌కు రూ.1.80 లక్షలు ప్రభుత్వం ఇస్తోంది. పావలా వడ్డీకి రూ.35 వేలు చొప్పున బ్యాంక్ రుణాన్ని సమకూరుస్తోంది. బ్యాంక్‌లు 9 నుంచి 11 శాతం వడ్డీకి రుణాలు ఇస్తుండగా లబ్దిదారులు పావలా వడ్డీనే కడుతున్నారు. మిగిలిన వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తోంది. అంతేకాకుండా రూ.15 వేల విలువ చేసే ఇసుకను ఉచితంగా అందిస్తోంది. స్టీల్, సిమెంట్, ఇలా 12 రకాల నిర్మాణ సామగ్రిని సబ్సిడీపై సరఫరా చేయడం ద్వారా మరో రూ.40 వేలు చొప్పున మేలు చేస్తోంది. రూ.20 లక్షల విలువైన ఆస్తి ఇంటి స్థలం, ఇల్లు రూపంలో రూ.20 లక్షలు, అంతకంటే విలువైన స్థిరాస్తిని అక్కచెల్లెమ్మల పేరిట ప్రభుత్వం అందిస్తోంది. తద్వారా పేదింటి మహిళలను లక్షాధికారులుగా మారుస్తోంది. ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన స్థలాల విలువ.. ప్రాంతాన్ని బట్టి రూ.2.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ మార్కెట్లో పలుకుతోంది. ఇంటి నిర్మాణం కూడా పూర్తయితే ఆ ఆస్తి విలువ కనీసం రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షలు, అంతకు పైమాటే. -
తెలంగాణ: సొంత జాగా ఉన్నవారికే ఇందిరమ్మ ఇళ్లు!
సాక్షి, హైదరాబాద్: పేదలకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తొలుత సొంత జాగా ఉన్న వారికి ఇళ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. సొంత స్థలం లేనివారికి పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు వంటివి ఆ తర్వాత చేపట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇంటి స్థలాల పంపిణీ కోసం భూమిని సేకరించేందుకు కాస్త సమయం పట్టే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదల కోసం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేశాయి. ఇప్పు డు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో.. మళ్లీ ఇందిరమ్మ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. సొంత జాగా ఉన్న అర్హులైన పేదలకు ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చింది. జాగా లేని పేదలకు స్థలం పట్టాలు ఇచ్చి, ఇంటి నిర్మాణానికి నిధులు ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఈనెల 28వ తేదీ నుంచి ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో తొలుత సొంత జాగా ఉన్న పేదలకు ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు చొప్పున నిధులు విడుదల చేసి, వారు వెంటనే ఇళ్ల నిర్మాణం చేపట్టేలా చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. తర్వాతే ఇంటి స్థలాల పంపిణీ.. రాష్ట్రంలో సొంత జాగా లేని నిరుపేదలు లక్షల్లో ఉన్నారు. అలాంటి వారికి తొలుత ఇంటి స్థలం ఇచ్చి, అందులో వారు ఇల్లు నిర్మించుకునేందుకు నిధులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేదలకు పంపిణీ కోసం భారీగా భూమిని సేకరించాల్సి ఉంది. ఈ ప్రక్రియ కోసం సమయం పట్టే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇళ్ల డిజైన్లపై కసరత్తు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మూడు నమూనాలను సిద్ధం చేస్తున్నట్టు ఇటీవల గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. అయితే నిర్ధారిత డిజైన్‌లో ఇళ్లను నిర్మించాలంటే.. కాలనీల తరహాలో ఒకే చోట భూమిని సేకరించాల్సి ఉంటుంది. సొంత జాగా ఉన్నవారు నిర్మించుకునే ఇళ్లు నిర్ధారిత డిజైన్‌లో ఉండాలంటే ఇబ్బంది ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. కొందరు ఉమ్మడి కుటుంబంగా ఒకే ఇంట్లో ఉంటున్నారు. అందులో పెళ్లిళ్లు అయినవారు కొత్తగా ఇళ్లకు దరఖాస్తు చేసుకునే వీలుంది. వారు ఉంటున్న ఇంటికి ఆనుకుని ఉండే ఖాళీస్థలాల్లో ఇళ్లను నిర్మించుకుంటారు. అలాంటి ఖాళీ స్థలం ఆకృతి, అధికారులు సిద్ధం చేసే డిజైన్ ప్రకారం ఇల్లు నిర్మించేందుకు అనుకూలంగా ఉండకపోవచ్చనే సందేహాలు ఉన్నాయి. ఈ అంశంలో త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అమరుల కుటుంబాలకు ముందుగానే ప్లాట్లు తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలకు 250 చదరపు గజాల చొప్పున ప్లాట్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అదే స్థలాల్లో వారికి ఇళ్లను కూడా నిర్మించి ఇవ్వనున్నారు. ఇందిరమ్మ లబ్ధిదారుల్లో సొంత జాగా లేనివారికి పట్టాలు ఇచ్చేందుకు కాస్త సమయం తీసుకున్నా.. అమరుల కుటుంబాలకు మాత్రం వెంటనే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే జాబితా రూపకల్పన, భూసేకరణ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించి.. 2004– 2014 మధ్య ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించి దాదాపు 19 లక్షల ఇళ్లను నిర్మించారు. మళ్లీ అధికారంలోకి వస్తే అదే తరహాలో ఇళ్లను నిర్మిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. గెలిచి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కసరత్తు ప్రారంభించింది. అయితే గత సర్కారు ఎన్నికల ముందు స్వీకరించిన గృహలక్ష్మి దరఖాస్తులను తిరస్కరించాలని ఇప్పటికే నిర్ణయించింది. దీంతో ఇందిరమ్మ ఇళ్ల కోసం మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమంలోనే పేదల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వాటిని పరిశీలించి అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నారు. -
చకచకా కరెంటు.. కుళాయి
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద నిర్మిస్తున్న పేదల ఇళ్లకు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నిర్మాణం పూర్తయిన ఇళ్లకు చకచకా విద్యుత్, కుళాయి కనెక్షన్లను ఇస్తోంది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు పక్కా గృహయోగం కల్పించేందుకు 30.75లక్షల మంది మహిళల పేరిట విలువైన ఇంటి స్థలాలను ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా 21.75 లక్షల (19.13 లక్షల సాధారణ, 2.62 లక్షల టిడ్కో) ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. గత నెల 12వ తేదీ నాటికి 7.42 లక్షల (5.85 లక్షల సాధారణ, 1.57 లక్షల టిడ్కో) ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేసింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇళ్లు నిర్మిస్తున్న 17వేల కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఏకంగా రూ.32 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. 6,655 కాలనీల్లో విద్యుత్ పనులు పూర్తి పేదల ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్న 9,414 వైఎస్సార్–జగనన్న కాలనీల్లో విద్యుత్ ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు 6,655 కాలనీల్లో విద్యుత్ స్తంభాలు నాటడం, వైర్లు లాగడం, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు పూర్తయింది. ఇక నిర్మాణం పూర్తయినవాటిలో 5,02,654 ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. మిగిలిన ఇళ్లకు కనెక్షన్లు ఇస్తున్నారు. అదే విధంగా నిర్మాణం పూర్తయిన ఇళ్లన్నింటికీ తాగునీటి సదుపాయం కల్పించారు. 1.15 లక్షల ఇళ్లకు ఇంకుడు గుంతలు కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాలైన డ్రెయిన్లు, రోడ్లు, సైడ్ కాలువలు నిర్మించాలంటే ఇళ్ల నిర్మాణాలన్నీ పూర్తికావాల్సి ఉంది. అలా కాకుండా ముందుగానే సదుపాయాలు కల్పిస్తే ఇళ్ల నిర్మాణ సమయంలో భారీ వాహనాల రాకపోకలు, ఇతర సందర్భాల్లో డ్రెయిన్లు, కాలువలు ధ్వంసమవుతాయి. అందువల్ల ప్రస్తుతం నిర్మాణం పూర్తయిన ఇళ్లకు తాత్కాలిక డ్రెయినేజీ అవసరాల కోసం ఇంకుడు గుంతలను ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 1,15,973 ఇళ్లకు ఇంకుడు గుంతలను నిర్మించారు. అదేవిధంగా వైఎస్సార్, జగనన్న కాలనీలకు స్వాగత ఆర్చ్‌లను ప్రభుత్వం నిర్మిస్తోంది. 2,394 కాలనీలకు ఆర్చ్ నిర్మాణ పనులకు అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం 510 చోట్ల పనులను ప్రారంభించగా, 28 చోట్ల ఆర్చ్‌ల నిర్మాణం పూర్తయింది. మిగిలిన చోట్ల వివిధ దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మరోవైపు నిర్మించిన ఇళ్లు అన్నింటికీ విద్యుత్, నీటి ఇంకుడు గుంతల ఏర్పాటు చేశారా.. లేదా.. అని ఆడిట్ నిర్వహించాలని ఇటీవల గృహ నిర్మాణ శాఖ అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. -
రూ. 200 కోట్ల భూ దందా..
అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్‌లో అక్రమాలు చోటుచేసుకు న్నాయని అందులోని కొందరు సభ్యులు ఆరోపిస్తు న్నారు. ఈ మేరకు సహకార శాఖకు ఫిర్యా దు చేశారు. సొసైటీ సభ్యుల కోసం కొన్న భూమిలో కొంత వివాదా స్పద స్థలం ఉందని చెప్పి, ఆ మేరకు కోత విధించి ఇళ్ల స్థలాలు కేటాయించారు. చివరకు వివాదా స్పదం అని చెబుతూ వచ్చిన భూమిలో విల్లాలు నిర్మించి అమ్ముకునేందుకు మేనేజ్ మెంట్ కమిటీ సభ్యులు రంగం సిద్ధం చేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ లాభాపేక్ష లేకుండా ఉద్యో గుల కోసం ఏర్పడింది. సాధారణ అటెండర్ మొదలుకొని అకౌంటెంట్ జనరల్ వరకు కూడా ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఉద్యో గుల భాగస్వామ్యంతో డబ్బులు సమకూర్చు కొని భూమి కొనుగోలు చేసి దాన్ని లే ఔట్ చేసి సభ్యులకు ఇళ్ల స్థలాలు కేటాయించాల న్నది దీని లక్ష్యం. ఈ సొసైటీ కింద ఇప్పటి వరకు 14 వెంచర్లు వేశారు. సొసైటీలో 5 వేల మంది వరకు సభ్యులున్నారు. అత్తాపూర్, శ్రీనగర్‌కాలనీ, ఆనంద్‌నగర్ కాలనీ, నలందా నగర్, అత్తివెల్లి, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో వెంచర్లు వేశారు. మేనేజింగ్ కమిటీనే ఈ వెంచర్లు, లేఔట్లు వేసే బాధ్యత తీసుకుంది. 13వ వెంచర్‌కు సంబంధించి ఏజీ సొసైటీ మేడ్చల్ మండలం అత్తివెల్లి గ్రామంలో 94.12 ఎకరాలు కొనుగోలు చేసింది. ఈ 13వ వెంచర్లో 1112 మంది సభ్యులు న్నారు. ప్రతి ఒక్కరూ ఎవరి స్థాయిలో వారు కొనుగోలు చేసేలా 67 గజాలు, 150 గజాలు, 200, 267, 333, 400, 500 గజాల చొప్పున వెంచర్లు వేసి వాటికి లేఔట్ వేశారు. వివాదస్పద భూమి ఉందంటూ.. మొత్తం 94.12 ఎకరాల్లో 91 ఎకరాలు క్లియర్‌గా ఉందని 2020లో కోఆపరేటివ్ రిజిస్ట్రార్‌కు రాసిన లేఖలో దాని అధ్యక్షుడు పేర్కొన్నారు. మిగిలిన 3.12 ఎకరాలపై అస్పష్టత నెలకొందని తెలిపారు. అయితే రెండేళ్ల తర్వాత 2022లో కేవలం 79.24 ఎకరాలకు మాత్రమే ఫైనల్ లేఔట్ అనుమతి వచ్చింది. మిగిలిన ఎకరాలకు మాత్రం లేఔట్ తీసుకోలేదు. సర్వే నెంబర్లో భూసంబంధిత వివాదాలున్నాయంటూ పక్కన పెట్టేశారు. ఆ మిగిలిన భూముల్లో ఒకటిన్నర ఎకరా మాజీ ఎమ్మెల్యే కబ్జాలో ఉందనీ, నాలుగు ఎకరాలు రైతుల ఆధీనంలో ఉందన్న వాదనలు వెల్లువెత్తాయి. కాగా, 2022 జూన్, జూలై నెలల్లో కోఆపరేటివ్ కమిటీ విచారణ చేపట్టి భూమి మొత్తం క్లియర్‌గానే ఉందని, భూవివాదాలు, మాజీ ఎమ్మెల్యేతో, రైతులతో ఉన్న వివాదాలను సరి చేసుకున్నామని నివేదికలో పేర్కొంది. కానీ 2022 సెప్టెంబర్‌లో అధ్యక్షుడు కేవలం 79.24 ఎకరాలకు మాత్రమే లేఔట్ తీసుకొచ్చారు. అంతా క్లియర్‌గా ఉన్నప్పుడు కేవలం 79.24 ఎకరాలకే ఎందుకు లేఔట్ తీసుకొచ్చారన్న ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేదు. వివాదాస్పద భూముల్లో విల్లాలు.. మొత్తంగా లేఔట్ భూమిలో 1112 ఫ్లాట్లు ఇచ్చారు. 67, 150 గజాలు లేఔట్ ఉన్న వారికి పక్కాగానే ఇచ్చారు. కానీ 200 గజాలు ఇవ్వాల్సిన వారికి 166 గజాలు, 267 గజాలు ఇవ్వాల్సిన వారికి 200 గజాలు, 333 గజాలు ఇవ్వాల్సిన వారికి 233 గజాలు, 400 గజాలు ఇవ్వాల్సిన వారికి 300 గజాలు, 500 గజాలు ఇవ్వాల్సిన వారికి 350 గజాలు మాత్రమే ఇచ్చారు. అంటే 30 శాతం కోత విధించి ప్లాట్లు కేటాయించారు. వివాదంలో భూమి ఉందని చెప్పి తక్కువ కేటాయించారు. ఇక మిగిలిన 14.88 ఎకరాల్లో అనధికారికంగా విల్లాలు నిర్మించి అమ్ముకుందామని నిర్ణయించారు. ఆ మేరకు 2022లో కోఆపరేటివ్ సొసైటీ పేరు మీదనే విల్లాలు నిర్మిస్తామని బ్రోచర్ కూడా వేశారు. 150 గజాల్లో నిర్మిస్తున్న ఒక్కో విల్లా రూ. 1.08 కోట్లు అంటున్నారు. 14.88 ఎకరాలు ధర మార్కెట్లో రూ. 200 కోట్లు ఉంటుందని అంచనా. విల్లాల వ్యవహారంపై కొందరు సభ్యులు సహకారశాఖలో ఫిర్యాదు చేస్తే, బెదిరింపు కాల్స్, మెంబర్షిప్ క్యాన్సిల్ చేస్తామని బెదిరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఐదుగురు సభ్యుల మేనేజ్మెంట్ కమిటీనే ఈ విల్లాల కుంభకోణానికి పాల్పడిందని సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. అంతా అక్రమాలమయమే.. సొసైటీ పెద్దలదంతా అక్రమాల మయమే. వివాదాస్పద భూమిలో విల్లాలు కడతామని, లేకుంటే వేలం పాడుతామని చెప్తూ, తద్వారా వచ్చిన సొమ్మును అందరికీ ఇస్తామని మేనేజ్మెంట్ కమిటీ చెబుతోంది. కానీ ఆ అధికారం వారికి ఎక్కడిది? 1112 మంది నుంచి రిజిస్ట్రేషన్ చార్జీలు, డాక్యుమెంటేషన్ చార్జీలు, మెంబర్షిప్, వెంచర్ నిర్వహణ, ఆఫీసు ఖర్చులు, అదనపు ఖర్చుల కింద 2022 నవంబర్‌లో రూ.9 కోట్లు వసూలు చేశారు. వాస్తవంగా ఒక్కొక్కరి నుంచి రూ. 9 వేలు తీసుకుంటే సరిపోతుంది. కానీ ఒక్కొక్కరి నుంచి రూ.60 వేలు వసూలు చేశారు. – అరుణ్‌కుమార్, సొసైటీ సభ్యుడు ఎక్కడా అక్రమాలు జరగలేదు 13వ వెంచర్‌కు సంబంధించి మేమే చేస్తున్నాం. 8.4 ఎకరాలకు ఇంకా ఇప్పటివరకు అనుమతి రాలేదు. అనుమతి వస్తే విల్లాలు కడతాం. ఆ మేరకు జనరల్ బాడీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. లేకుంటే భూమిని అమ్మి అందరికీ ఇస్తామని చెప్పాం. అంతేగానీ ఎక్కడా అక్రమాలు జరగలేదు. – నరేంద్రనాథ్, సొసైటీ అధ్యక్షుడు -
మొక్కలు నాటిన సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: అమరావతిలోని పేదల ఇళ్ల స్థలాల లేఔట్లలో పచ్చదనాన్ని పెంపొందించే దిశగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మొక్కలు నాటారు. సోమవారం కృష్ణాయపాలెం లేఔట్లో మొక్కలు నాటి నగర వన మహోత్సవాన్ని ప్రారంభించారు. తర్వాత ఈ లేఔట్లో నిర్మించిన మోడల్ హౌస్‌ను పరిశీలించారు. ఆ ఇంటి యజమానురాలు ఈపూరి జీవరత్నం, ఆమె భర్త, పిల్లలతో మాట్లాడారు. వారి కోరిక మేరకు ఫొటో కూడా దిగారు. కృష్ణాయపాలెంలో మొక్కలకు నీళ్లు పోస్తున్న సీఎం జగన్ కాగా, మొత్తం 25 లేఔట్లలో పచ్చదనం అభివృద్ధి కోసం కేటాయించిన 10 శాతం భూమిలో అర్బన్ ఫారెస్ట్ కార్యక్రమంలో భాగంగా రూ.1.68 కోట్లతో 28 వేల మొక్కలు నాటనున్నట్టు సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ ఓ ప్రకటనలో తెలిపారు. రావి, వేప, నేరేడు, బాదం, రెయిన్‌ట్రీ, పచ్చతురాయి, పొగడ, ఆకాశమల్లె వంటి నీడను, పళ్లను ఇచ్చే మొక్కలతో కృష్ణాయపాలెం లేఔట్ హరిత వనంగా మారుతుందన్నారు. ఇక్కడ నివసించే ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించడంతో పాటు ఆహ్లాదభరిత వాతావరణాన్ని కల్పిస్తామన్నారు. -
అక్కడ పేదలకు ఇళ్లిస్తే..మా భూముల ధరలు పడిపోతాయి
సాక్షి, అమరావతి: రాజధానిలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తే తమ భూముల ధరలు అమాంతం పడిపోతాయని అమరావతి కోసం భూములిచ్చిన వ్యక్తుల తరఫు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు హైకోర్టుకు నివేదించారు. రాజధాని ప్రాంతంలో పేదలకు 5 శాతం భూములిస్తూ చట్టం చేసేందుకు తాము గతంలో ఎంతమాత్రం అంగీకరించలేదన్నారు. ప్రపంచ స్థాయి రాజధానిని నాశనం చేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇళ్లను కూడా నిర్మించి ఇస్తోందన్నారు. ముఖ్యమంత్రికి పేదలపై అంత ప్రేమ ఉంటే రాజధాని ప్రాంతంలో కాకుండా కడపలో ఇళ్ల స్థలాలు ఇచ్చుకోవాలన్నారు. ఎల్రక్టానిక్ సిటీకి కేటాయించిన భూముల్లో పేదల ఇళ్ల నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తున్నారని చెప్పారు. రాజధానికి ఆదాయాన్ని సమకూర్చే ఎల్రక్టానిక్ సిటీ ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలిస్తే చుట్టుపక్కల తమ భూముల ధరలు దారుణంగా పడిపోతాయన్నారు. రాజధాని వెలుపల పెద్ద సంఖ్యలో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని, అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చుకోవచ్చని పునరుద్ఘాటించారు. రాజధాని భూముల విషయంలో సీఆర్డీఏ, రైతులకు మధ్య ఉన్నది వ్యాపార ఒప్పందమన్నారు. రైతుల అనుమతి లేకుండా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వీల్లేదన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అనుమతినిచ్చిన సుప్రీంకోర్టు... పట్టాల మంజూరు హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసిందన్నారు. అందువల్ల పట్టాల మంజూరు వ్యవహారం తేలకుండా ఇళ్ల నిర్మాణం చేపట్టడం తగదన్నారు. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం హడావుడిగా ఏర్పాట్లు చేస్తోందని, గృహ నిర్మాణాలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. రాజధాని భూములపై సీఆర్డీఏకు పూర్తిస్థాయి యాజమాన్యపు హక్కులు లేవని, కేవలం షరతులతో కూడిన హక్కులు మాత్రమే ఉన్నాయని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదుల్లో ఒకరైన దమ్మాలపాటి శ్రీనివాస్ పేర్కొన్నారు. భూ సమీకరణ కింద తీసుకున్న భూములను ఇతరులకు ఇవ్వడానికి వీల్లేదన్నారు. ల్యాండ్ పూలింగ్ స్కీం బాధ్యతలన్నింటినీ పూర్తి చేసిన తరువాతే రాజధాని భూములపై సీఆర్డీఏకు హక్కులు వస్తాయని పిటిషనర్ల తరఫున మరో న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు వాదించారు. మా నినాదమే.. పేదలందరికీ ఇళ్లు ఈ వాదనలను రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏ, రెవెన్యూ శాఖల తరఫున హాజరైన అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, కాసా జగన్మోహన్రెడ్డి, పోతిరెడ్డి సుభాష్ తోసిపుచ్చారు. ఏ ప్రభుత్వమైనా ఇళ్ల పట్టాలు ఇచ్చేది ఇళ్లను నిరి్మంచుకోవడానికేనన్నారు. ఇళ్లు నిర్మాణం లేనప్పుడు ఇళ్ల పట్టాలు ఇచ్చి ప్రయోజనం ఏముంటుందన్నారు. ప్రభుత్వ నినాదమే ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ అని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు సైతం తన ఉత్తర్వుల్లో ఎక్కడా ఇళ్లు నిర్మించవద్దని చెప్పలేదన్నారు. ఈ విషయంలో స్పష్టత కావాలనుకుంటే పిటిషనర్లు సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చన్నారు. ఎల్రక్టానిక్ సిటీకి మరో చోట భూమి కేటాయిస్తామన్నారు. రాజధాని ప్రాంతంలో మొత్తం భూమిలో 5 శాతం పేదల ఇళ్ల కోసం కేటాయించాలని సీఆర్డీఏ చట్టం చెబుతోందన్నారు. చట్ట నిబంధనలకు లోబడి చేసే పనిని ఏ కోర్టు కూడా తప్పుబట్టడానికి వీల్లేదన్నారు. రాజధాని కోసం రైతులు మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా 14 వేల ఎకరాలను ఇచ్చిందని రెవిన్యూ శాఖ తరఫు న్యాయవాది సుభాష్ తెలిపారు. అందులో 1,400 ఎకరాలు పేదలకిస్తే పిటిషనర్లు రాద్దాంతం చేస్తున్నారన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తులు జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్ రవినాథ్ తిల్హరీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఇళ్ల నిర్మాణంపై తన నిర్ణయాన్ని రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వీలుగా చట్ట సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని, తదనుగుణంగా జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ పలువురి చేత టీడీపీ పిటిషన్లను దాఖలు చేయించిన విషయం తెలిసిందే. -
ఇళ్ల యజ్ఞం.. ఊళ్లకు ఊళ్లే నిర్మాణం
దేవుడి దయతో, మీ అందరి ఆశీర్వాదంతో మనం అధికారంలోకి రాగానే 300 అడుగుల టిడ్కో ఇళ్లను కేవలం ఒక్క రూపాయికే ఇస్తామని గతంలో ఇదే గుడివాడ బహిరంగ సభలో చెప్పాను. ఈ రోజు ఆ మాటను నిజం చేసి చూపిస్తున్నా. ఇవిగో ఆ ఇళ్లు.. ఇవిగో ఆ ఊళ్లు. టిడ్కో ఇళ్ల ద్వారా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మన ప్రభుత్వం రూ.16,601 కోట్లు లబ్ధి చేకూర్చుతూ ఖర్చు భరిస్తోంది. ఇందులో చంద్రబాబు చేసింది ఏమిటి? గుమస్తాగిరి కూడా సరిగా చేయలేదు. నిస్సిగ్గుగా తాను చేయని పనులు చేసినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. నోరు విప్పితే అబద్ధాలే. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణ యజ్ఞం కొనసాగుతోందని, ఏకంగా ఊళ్లకు ఊళ్లే నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదల అభ్యున్నతే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నామని చెప్పారు. ఇది పేదల బాగు కోసం పరితపించే ప్రభుత్వం అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం 77 ఎకరాల ఒకే లేఅవుట్లో పూర్తయిన 8,912 టిడ్కో ఇళ్లను ఆయన ప్రారంభించారు. ఈ మేరకు లబ్ధిదారులతో కలిసి గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొని, ఇంటి హక్కు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఏకంగా 30.60 లక్షల ఇంటి పట్టాలు అందజేశామని, ఇళ్లు కూడా నిర్మిస్తున్నామని తెలిపారు. అమరావతిలో సైతం అన్ని అడ్డంకులను అధిగమించి, చంద్రబాబు నాయుడు దుర్మార్గాన్ని అడ్డుకొని, సుప్రీంకోర్టులో మరీ పోరాడి పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశామన్నారు. గత ప్రభుత్వం పేదలను అప్పులపాలు చేయాలని చూస్తే, మనందరి ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేశామని చెప్పారు. అక్కచెల్లెమ్మలు హక్కుదారులుగా ఆయా కుటుంబాల చరిత్రను మార్చేలా ఇవాళ మనం ఊళ్లకు ఊళ్లు నిర్మిస్తున్నామని చూపించే గొప్ప కార్యక్రమం గుడివాడలో జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. కొత్త గుడివాడ కనిపిస్తోంది ♦ ఒకవైపు టిడ్కో ఇళ్లు.. మరోవైపు మనం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్లు చూస్తుంటే.. ఇక్కడ కొత్త గుడివాడ నగరం కనిపిస్తోంది. మొత్తం 257 ఎకరాల్లో రూ.800 కోట్లతో 8,912 ఇళ్లు కట్టడమే కాకుండా.. వాటిని నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చే కార్యక్రమం ఇవాళ చేస్తున్నాం. ఇదే లే అవుట్లో 7,728 ఇళ్ల స్థలాలను ఇళ్లు లేని నా నిరుపేద అక్కచెల్లెమ్మలకు ఇచ్చాం. మొత్తంగా 16,640 కుటుంబాలు ఇక్కడ నివాసం ఉండబోతున్నాయి. అంటే ఇంటికి కనీసం ముగ్గురు వేసుకున్నా దాదాపు 50 వేల మంది జగనన్న లే అవుట్లో నివాసం ఉండబోతున్నారు. ♦ ఈ లేఅవుట్‌తో పాటు నియోజకవర్గం మొత్తం 13,145 మందికి ఇళ్ల పట్టాలిచ్చాం. వీటికి 8,912 టిడ్కో ఇళ్లు కూడా కలిపితే 22 వేల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలిచ్చామని గర్వంగా చెబుతున్నా. ♦ ఈ లేఅవుట్ ఇంటి స్థలం విలువ ఎంత ఉంటుందని ఇక్కడకు వచ్చే ముందు ఎమ్మెల్యే నానిని అడిగాను. గజం రూ.14 వేలని, ఒక్కో లబ్ధిదారుడికి ఇచ్చిన స్థలం రూ.7 లక్షలు ఉంటుందని చెప్పాడు. అంటే ఇవాళ ప్రతి లబ్ధిదారుడికి ఇచ్చిన 1.1 సెంటు స్థలం ద్వారా రూ.7 లక్షలు వాళ్ల చేతుల్లో పెట్టినట్టయింది. ♦ ఒక్కో ఇంటిని రూ.2.70 లక్షలతో కడుతున్నాం. అక్కడ డ్రెయిన్లు, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రూ.6 లక్షలు ఖర్చవుతుంది. ఈ లెక్కన ఇంటి నిర్మాణం పూర్తయితే కనీసం రూ.10–15 లక్షలు వాళ్ల చేతుల్లో పెట్టినట్టవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 30.60 లక్షల ఇళ్లు కూడా చూసుకుంటే మహాయజ్ఞం ద్వారా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల కోట్ల ఆస్తిని అక్కచెల్లెమ్మల చేతిలో పెడుతున్నాం. ♦ ఇవాళ ఇచ్చిన పట్టాలకు సంబంధించి 4,200 ఇళ్లు మంజూరైతే మొత్తం 13,145 ఇళ్ల పట్టాలలో కూడా ఇళ్లు వస్తాయి. జూలై 8.. నాన్న గారి జయంతి రోజున ఈ ఇళ్లు కూడా మంజూరు చేస్తాం. ఇలాంటి అభివృద్ధి గుడివాడలో మాత్రమే కాదు.. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ప్రస్ఫుటంగా కనిపించేలా, ప్రతి పేద కుటుంబం బాగుపడాలనే తలంపుతో, మమకారంతో అడుగులు ముందుకు వేస్తున్నాం. ఇంటి స్థలాల విలువే రూ.75 వేల కోట్లు మనందరి ప్రభుత్వంలో అక్కచెల్లెమ్మల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 30,60,000 ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఇప్పటికే రెండు దశల్లో 21 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మనం నిర్మిస్తున్న కాలనీలు 17,000. ఇప్పటికే పూర్తయిన ఇళ్లు 5,52,000. అక్కచెల్లెమ్మల పేరుతో ఇచ్చిన ఒక్కో ఇంటి స్థలం విలువ ఏరియాను బట్టి కనీసం రూ.2.5 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా ఉంటుంది. కేవలం రూ.2.5 లక్షల చొప్పున వేసుకున్నా, 30.60 లక్షల ఇళ్ల పట్టాల విలువ రూ.75,000 కోట్లకు పైగా ఉంటుంది. టిడ్కో ఇళ్ల పేరుతో నాడు పేదలపై భారం ♦ ఈ రాష్ట్రంలో కొంతమందికి ఈర్ష, ద్వేషం ఎక్కువయ్యాయి. ఏ మాత్రం కళ్లార్పకుండా అబద్ధాలు చెబుతున్నారు. అందుకే కొన్ని విషయాలు మీకు తెలియాలి. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గత చంద్రబాబు ప్రభుత్వం చేసిన నిర్వాకమిది. నిరుపేదలు నివాసం ఉండే 300 చదరపు అడుగుల ప్లాట్ కట్టడానికి అయ్యే ఖర్చు అడుగుకు రూ.2 వేలు చొప్పున ఒక్కో ఫ్లాట్‌కు దాదాపు రూ.5.75 లక్షలు, మౌలిక సదుపాయాలకు మరో రూ.లక్ష అవుతుంది. ♦ రూ.6.75 లక్షలు ఖర్చయ్యే ఒక్కో ఫ్లాట్‌కు కేంద్రం రూ.1.50 లక్షలు ఇస్తే రాష్ట్రం రూ.1.5 లక్షలు ఇస్తోంది. మిగిలిన రూ.3 లక్షలు చంద్రబాబు హయాంలో పేద వాడి పేరు మీద అప్పుగా రాశారు. ప్రతి నెలా రూ.3 వేలు 20 ఏళ్లపాటు పేదవాడు కడుతూపోవాలి. అలా రూ.7.20 లక్షలు పేదవాడు తన జేబు నుంచి కట్టాలి. అది చంద్రబాబు హయాంలో తెచ్చిన టిడ్కో పథకం. అది కూడా నేల మీద ఇళ్లు లేవు, పట్టాలేదు, ఉచితంగా ఇచ్చింది అంతకన్నా లేదు. ♦ మీ బిడ్డ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 300 చదరపు అడుగులలో నిర్మిస్తున్న 1,43,600 టిడ్కో ఇళ్లను అన్ని హక్కులతో ఒక్క రూపాయికే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం. రూ.6.75 లక్షలయ్యే ఒక్కో ఇంటిని అక్కచెల్లెమ్మల పేరుతో ఇస్తున్నాం. ♦ 365 చదరపు అడుగుల ఇంటికి గతంలో ఇదే మాదిరిగా లెక్కలు కట్టారు. రాష్ట్రం, కేంద్రం ఇస్తున్న రూ.3 లక్షల సబ్సిడీకి అదనంగా రూ.50 వేలు కట్టించుకున్నారు. మీ బిడ్డ వచ్చిన తర్వాత రూ.3 లక్షలు ఇవ్వడంతో పాటు వాటిలో సిమెంటు రోడ్డులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మరో రూ.లక్ష ఖర్చు పెట్టారు. మరో రూ.25 వేలు కలిపి ప్రతి పేద వాడికి రూ.4.25 లక్షలు సబ్సిడీ ఇస్తున్నాం. ♦ 430 చదరపు అడుగులు ఇంటికి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న రూ.3 లక్షలు కాకుండా, మౌలిక సదుపాయాల కోసం రూ.లక్ష వేసుకుని.. గతంలో తీసుకున్న డిపాజిట్‌ను రూ.లక్ష నుంచి రూ.50 వేలకు తగ్గించాం. రూ.50 వేలు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ.. రూ.4.50 లక్షల సబ్సిడీ ఇస్తున్నాం. పేదల వ్యతిరేకి చంద్రబాబు ♦ నాలుగేళ్లలో మన ప్రభుత్వం ఇన్ని లక్షల ఇళ్లు ఎలా కట్టగలిగింది? 30 లక్షల ఇళ్ల స్థలాలు ఎలా ఇవ్వగలిగింది? ఇదే పని 30 ఏళ్ల క్రితమే సీఎం అయిన చంద్రబాబు, మూడుసార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న ఈ బాబు, 14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా ఎందుకు చేయలేకపోయారు? అందరూ ఆలోచించాలి. కారణం చంద్రబాబు పేదల వ్యతిరేకి కాబట్టి చేయలేదు. ♦ అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలిస్తే అక్కడ డెమోగ్రాఫిక్ ఇంబ్యాలన్స్ వస్తుందని చంద్రబాబు తన బినామీ భూముల రేట్ల కోసం అడ్డుపడ్డాడు. ఏకంగా కోర్టుల్లో కేసులు వేయించారు. అయినా సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడి అమరావతిలో 50 వేల మంది నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద అక్కచెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ♦ మన ప్రభుత్వం నాలుగేళ్లలో రూ.2.16 లక్షల కోట్లు నేరుగా బటన్ నొక్కి లంచాలు, వివక్షకు తావు లేకుండా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేసింది. నాలుగేళ్లలో అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులకు పింఛన్ రూపంలో రూ. 72 వేల కోట్లు ఇవ్వగలిగాం. రైతన్నలకు రైతు భరోసాగా రూ.31 వేల కోట్లు ఇచ్చాం. అమ్మ ఒడిగా అక్కచెల్లెమ్మల పిల్లల బాగోగుల కోసం రూ.19,674 కోట్లు ఇవ్వగలిగాం. ఆసరాగా అక్కచెల్లెమ్మలు వాళ్ల కాళ్లమీద నిలబడాలని రూ.19,178 కోట్లు, చేయూతగా రూ.14,129 కోట్లు ఇచ్చాం. ♦ నా అక్కచెల్లెమ్మల పిల్లలు బాగా చదవాలి, ఎదగాలని విద్యాదీవెన, వసతి దీవెన కింద రూ.14,913 కోట్లు ఇవ్వగలిగాం. సున్నావడ్డీ, ఈబీసీ నేస్తం, చేదోడు, కాపునేస్తం, తోడు, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, లా నేస్తం, ఉచిత పంటలబీమా, వాహనమిత్ర, పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ.. ఆరోగ్యఆసరాతో పాటు చివరకి అగ్రిగోల్డ్ బాధితులకు కూడా మేలు చేశాం. గుడివాడకు వెన్నుపోటు అల్లుడు ♦ ఇదే గుడివాడకు చెందిన ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి పదవి లాక్కున్న అల్లుడు.. ఆయన 14 ఏళ్ల పాలనలో ఇక్కడి పేదలకు ఎన్ని ఇళ్లపట్టాలు ఇచ్చారు? కనీసం ఒక్కరికి కూడా సెంటు స్థలం ఇవ్వలేదు. ఒక్క ఇల్లు కట్టించలేదు. ♦ ఎన్నికలు దగ్గరకొచ్చేసరికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఇల్లు కట్టుకుంటాను అనుమతివ్వండి అంటూ అడుగుతున్నాడు. కుప్పంలో ఎమ్మెల్యేగా గెలిచిన 34 ఏళ్ల తర్వాత.. 75 ఏళ్ల వయసులో ఇప్పుడు సొంతిల్లు కట్టుకుంటారట. ♦ ఇప్పుడు మైకు పట్టుకొని ఇంకో చాన్స్ ఇవ్వండి అన్నీ చేసేస్తా అంటాడు. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటాడు. ప్రతి ఇంటికి బెంజ్ కారూ ఇస్తానని చెబుతారు. ఎన్నికలు దగ్గర పడేసరికి ఇలా మాయ మాటలు చెబతూ మళ్లీ మోసం చేయడానికి బయలుదేరాడు. ♦ ఫలానా మంచి పని చేశాను కాబట్టి చాన్స్ ఇవ్వండి అని అడగలేని పరిస్థితి ఆయనది. ఎవరికీ మంచి చేసిన చరిత్ర లేని ఈయనకు ప్రజలను ఓటు అడిగే నైతికత కూడా లేదు. ఊరూరా విప్లవాత్మక మార్పులు ♦ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే లంచాలు, వివక్షకు తావివ్వని వలంటీర్ వ్యవస్థ, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాం. ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్‌లను గ్రామ స్థాయిలోకి తీసుకొచ్చాం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చాం. నాడు–నేడుతో స్కూళ్ల రూపురేఖలు మార్చాం. ♦ కొత్త జిల్లాలు ఏర్పాటు చేశాం. కొత్తగా మరో 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాం. కొత్తగా మరో నాలుగు సీపోర్టులు, ఎయిర్‌పోర్టులు, ఫిషింగ్ హార్భర్లు, ఫిషింగ్ సెంటర్లు కడుతున్నాం. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, సామాజిక న్యాయం.. ఇలా అన్ని రంగాలలో విప్లవాత్మక మార్పులు ఊరూరా కళ్లెదుటే కనిపించేలా మనసు పెట్టి పని చేసిన ప్రభుత్వం మనదే. ♦ 40 ఏళ్ల రాజకీయ జీవితం తర్వాత కూడా ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేని చంద్రబాబుకు రెండు పక్కలా రెండు పార్టీలు ఉంటే తప్ప లేచి నిలబడలేని పరిస్థితి. ఇలాంటి ఈ చంద్రబాబు.. 175 నియోజకవర్గాల్లో 175 మంది అభ్యర్థులను కూడా పెట్టలేని ఈ చంద్రబాబు మనకు ప్రత్యర్థి అట! రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్ల తర్వాత కూడా తాను చంద్రబాబు కోసమే పుట్టానంటున్నట్లు ప్రవర్తిస్తున్న ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు మరో వంక. తన జీవితమే బాబు కోసమని, తన వ్యాన్‌ను చూసి మురిసిపోతూ, ఇక తాను కూడా ఎమ్మెల్యే అవుతానని, తనను ఎవరు ఆపుతారో చూస్తానంటున్నారు. వీరికితోడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5.. మొత్తంగా గజ దొంగల ముఠా మళ్లీ రాష్ట్రాన్ని దోచుకోవాలని ప్రజల ముందుకు వస్తోంది. వీళ్ల మాదిరిగా నాకు హంగూ, ఆర్భాటం, ఇతర పార్టీలు, చానళ్లు తోడు లేకపోవచ్చు. ఈ తోడేళ్ల గుంపు అంతా ఒక వైపు ఉంటే, మీ బిడ్డ మాత్రం మిమ్మల్ని, దేవుడిని నమ్ముకుని ఒంటరిగా మరోవైపు ఉన్నారు. మీరంతా ఈ దుష్టచతుష్టయం అబద్ధాలను నమ్మకండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా? లేదా? అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు సైనికులుగా మారండి. గుడివాడకు వరాల జల్లు గుడివాడ నియోజకవర్గంలో మరికొన్ని మంచి పనులకు సాయం కావాలని ఎమ్మెల్యే నాని అడిగారు. గుడివాడలో ఎస్సీ శ్మశాన వాటికకు రూ.5 కోట్లవుతుందన్నారు. దాన్ని మంజూరు చేస్తున్నాను. టిడ్కో మాస్టర్ ప్లాన్ కోసం ముదినేపల్లి నుంచి బందరు రోడ్డుకు రూ.17 కోట్లు ఖర్చవుతుందన్నారు. అదీ మంజూరు చేస్తున్నాం. నియోజకవర్గంలో మంచినీటి సరఫరా కోసం ల్యాండ్ అక్విజేషన్ కావాలన్నారు. అందుకు రూ.45 కోట్లు మంజూరు చేస్తున్నాం. మల్లాయపాలెం లే అవుట్లో ఇంటర్నల్ రోడ్డు కోసం మరో రూ.9 కోట్లు ఇస్తున్నాం. గుడివాడ మున్సిపాల్టీలో ఇంటర్నల్ సీసీ రోడ్లు, అభివృద్ధి పనులకు రూ.26 కోట్లతో శంకుస్థాపన చేశాం. కృష్ణా జిల్లాలో రూ.750 కోట్లతో జలజీవన్ మిషన్ కింద చేపడుతున్న పైప్‌లైన్ ప్రాజెక్టులో భాగంగా గుడివాడ ప్రాంతాల్లో తాగునీటి అవసరాల కోసం రూ.160 కోట్లు కేటాయిస్తూ ఈ పనులకూ శంకుస్థాపన చేశాం. మనం మేనిఫెస్టోను ఖురాన్, భగవద్గీత, బైబిల్‌గా భావించి.. 99 శాతం హామీలు నెరవేర్చాం. మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన ఆ పెద్ద మనిషి చంద్రబాబు.. ప్రతిసారీ మేనిఫెస్టోను చెత్తబుట్టకే పరిమితం చేశాడు. మన పార్టీ పేదల హృదయం నుంచి పుట్టింది కాబట్టి.. ఇలా మంచి పనులు చేయగలుగుతున్నాం. టీడీపీ పెత్తందార్ల పార్టీ.. వారంతా గజదొంగల ముఠా కాబట్టి వాళ్లు చేయలేదు. మనం దేవుడిని, ప్రజలను నమ్ముకుంటే.. వారు పొత్తులు, ఎత్తులు, చిత్తులంటూ దుష్ట చతుష్టయాన్ని నమ్ముకున్నారు. – సీఎం వైఎస్ జగన్ -
అవి ప్రణాళికాబద్ధంగా నిర్మించే ఊళ్లు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎల్లో మీడియా, అమరావతి రైతుల ముసుగులో దుష్ప్రచారం చేస్తున్నారు. అక్కడ వచ్చేది కాలనీలు కావని.. ప్రపంచంలోనే అతి పెద్ద మురికివాడలు వస్తాయని తప్పుడు ప్రచారం చేస్తూ లబ్దిదారుల్లో అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా సీఆర్డీఏ పరిధిలో 50,793 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. పేదలకు ఇళ్ల స్థలాలివ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఏకంగా సుప్రీంకోర్టు దాకా వెళ్లి అడ్డుకోవడం చూశాం. పేదలకు ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని చంద్రబాబు అండ్ కో వాదించారు. చంద్రబాబునాయుడు మరో అడుగు ముందుకేసి.. ఒక సెంట్ స్థలం సమాధులకు సరిపోతుందని వ్యాఖ్యానించడం.. దానిపై పేదలు, సామాజికవేత్తలు భగ్గుమనడంతో ఇప్పుడు తాజాగా ఆయన వర్గం మురికివాడలు అంటూ ప్రచారం ప్రారంభించింది. పక్కా ప్లానింగ్‌తో నిర్మాణం ప్రభుత్వం 25 లే అవుట్లలో 50,793 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చింది. ప్రతి లే అవుట్‌ను కూడా సీఆర్డీఏ, టౌన్ ప్లానింగ్ నిబంధనలకు అనుగుణంగా తీర్చిదిద్దారు. లే అవుట్లో 38 శాతం మాత్రమే ప్లాట్ల కోసం, మిగిలిన స్థలాన్ని మౌలిక సదుపాయాల కోసం కేటాయించారు. ఉదాహరణకు కృష్ణాయపాలెం లే అవుట్ 58.15 ఎకరాల్లో వేశారు. ఇందులో 2,234 మంది లబ్దిదారులకు స్థలాలు కేటాయించారు. ప్రతి ప్లాట్ ఆరు మీటర్ల వెడల్పు, 6.80 మీటర్ల పొడవు ఉండేలా ఏర్పాటు చేశారు. మొత్తం స్థలంలో 38.72 శాతం మాత్రమే ఇళ్ల స్థలాలకు కేటాయించారు. 36.52 శాతం రోడ్లకు, 10.28 శాతం భూమిని ఓపెన్ స్పేస్‌గా, ఇతర అవసరాల కోసం 8.79 శాతం, పార్కింగ్ కోసం 5.69 శాతం కేటాయించారు. ప్రతి లేఅవుట్లో ప్రధాన రహదారులు 40 అడుగులు, అంతర్గత రహదారులు 30 అడుగులు ఉండేలా ఏర్పాటు చేశారు. ప్రతి కాలనీలో అంగన్న్వాడీ కేంద్రం, విలేజి క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, పార్కులు ఏర్పాటు చేయనున్నారు. పెద్ద లేఅవుట్లలో ప్రైమరీ స్కూల్ కూడా మంజూరు చేస్తారు. నవులూరు, కృష్ణాయపాలెంలో ఉన్న చెరువులను అభివృద్ధి చేసి వాకింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఇన్ని మౌలిక సదుపాయాలతో వచ్చే కాలనీలు మురికివాడలు ఎలా అవుతాయో తెలుగుదేశం నాయకులే చెప్పాలని ప్రజలు నిలదీస్తున్నారు. ఆధిపత్యం తగ్గిపోతుందని టీడీపీ భయం పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపులో కూడా సామాజిక న్యాయం చేకూర్చడం ఈ ప్రభుత్వానికే చెల్లింది. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు సంబంధించి 50,793 మందికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తే అందులో సగానికి పైగా బీసీలకు దక్కాయి. రెండు జిల్లాల్లో 26,869 మంది బీసీలకు, 8,495 మంది ఎస్సీలకు, 1579 మంది ఎస్టీలకు, మిగిలిన 13,850 మంది ఇతరులకు ఇళ్ల స్థలాలు వచ్చాయి. వీరందరూ వస్తే తమ ఆధిపత్యం తగ్గి పోతుందనే భయం తెలుగుదేశం పార్టీని వెంటాడుతోంది. -
జన సునామీ చుట్టేసింది. జనసంద్రం తరలి వచ్చింది
సాక్షి ప్రతినిధి, గుంటూరు: అమరావతిని జన సునామీ చుట్టేసింది. జనసంద్రం తరలి వచ్చింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెం ఒక చారిత్రక ఘట్టానికి వేదిక అయ్యింది. ఒకే రోజు 50,973 మందికి ఇళ్ల స్థల పట్టాలతో పాటు, 5,024 మందికి టిడ్కో గృహాలను సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా పంపిణీ చేస్తున్న సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభకు జనం పోటెత్తారు. ఇంటి స్థలం పట్టా వచ్చిన ప్రతి ఇంటి నుంచి లబ్ధిదారులు కుటుంబాలతో సహా రావడంతో ఉదయం 8 గంటలకే సభా ప్రాంగణం పూర్తిగా నిండిపోయింది. రోహిణీ కార్తెలో ఎండలు మండిపోతున్నా పట్టించుకోకుండా పట్టాల పండుగకు జనం తరలి వచ్చారు. సభా ప్రాంగణంతో పాటు ముందు ఉన్న ఖాళీ స్థలం మొత్తం నిండిపోయింది. ఇప్పటి వరకు పేదలకు చోటు లేని రాజధానిగా ఉన్న అమరావతిలో టీడీపీ కుట్రలను ఎదుర్కొని సుప్రీంకోర్టు వరకూ వెళ్లి పోరాడి పేదలకు పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కిందని లబ్ధిదారులు చర్చించుకున్నారు. నాలుగేళ్లుగా ఇంటి స్థలం కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులు తమ కల నెరవేరడంతో తమకు సంక్రాంతి పండుగ ముందే వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. విజయవాడ, తాడేపల్లి, మంగళగిరి, పెదకాకాని, తుళ్లూరు మండలాల నుంచి లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో వచ్చారు. కట్టుదిట్టంగా ఏర్పాట్లు సభా ప్రాంగణం పూర్తిగా కిక్కిరిసి పోవడంతో చాలా మంది పక్కనే ఉన్న సీడ్ యాక్సిస్ రోడ్డుకు ఇరుపక్కలా ఉన్న చెట్ల కింద నిలబడి ముఖ్యమంత్రి ఉపన్యాసం విన్నారు. పట్టాలు వచ్చిన లబ్ధిదారుల సంఖ్యకు రెండింతల మంది తరలి రావడంతో వెంకటపాలెంకు వెళ్లే రోడ్లన్నీ జనసంద్రాలుగా మారాయి. సీఎం చిత్రపటాలతో కూడిన పోస్టర్లు, ప్లకార్డులు చేతపట్టుకుని పైకి చూపిస్తూ అడుగడుగునా జగనన్నకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంతపెద్ద సంఖ్యలో లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు తరలి వచ్చినా, ఎక్కడా ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. తాగునీరు, మజ్జిగ పంపిణీ చేయడంతో పాటు గ్యాలరీలలో ఉన్న మహిళలకు స్నాక్స్ అందజేశారు. వైఎస్సార్సీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త కత్తెర సురేష్ కుమార్, ఎంపీ నందిగం సురేష్‌లు సీఎం వైఎస్ జగన్‌కు రహదారి పొడవునా 3 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన స్వాగత బ్యానర్లు, తోరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మీ సంకల్పానికి సలాం దేశంలో ఎక్కడా అభివృద్ధి–సంక్షేమం రెండు కళ్లుగా ముందుకెళుతున్న ప్రభుత్వం లేదు. పేదలను ఆస్తిపరులను చేయాలన్న మీ (సీఎం) సంకల్పానికి సలాం. మీ నాయకత్వంలో అన్ని వసతులతో ఊళ్లే నిర్మితమవుతున్నాయి. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా ముందుకే వెళ్లారు. చంద్రబాబు దళితులను, బీసీలను.. చివరికి పేదలను అవమానించారు. ఇప్పుడు ఇస్తున్న ఇంటి స్థలాలను కూడా సమాధులతో పోల్చారు. ఇన్ని తప్పులు చేసి నాలుగేళ్లుగా కోట్లు ఖర్చుపెట్టి స్టేలు తెచ్చుకుంటున్నాడేగాని, చేసిన పాపాలకు క్షమాపణ చెప్పలేదు. బాబుతో ఎంత మంది కలిసి వచ్చినా జగన్‌ను ఆపలేరు. వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలు గెలిచి బాబుకు రాజకీయ సమాధి కట్టడం ఖాయం. – డాక్టర్ ఆదిమూలపు సురేష్, పురపాలకశాఖ మంత్రి ప్రజల సీఎం వైఎస్ జగన్ గతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వామపక్షాలు ధర్నాలు చేసేవి. కానీ జగన్ సీఎం అయ్యాక ఆ పరిస్థితి లేదు. వారంతా చంద్రబాబుతో కలిసి డ్రామాలు ఆడుతున్నారు. బాబు సీఎం అయ్యి, అమరావతిలో రైతులను నిలువునా ముంచేశారు. ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టుకు వెళ్లి అడ్డుపడాలని చూశారు. మరికొందరు అంబేడ్కర్ పేరు అడ్డుపెట్టుకుని అమ్ముడుపోయి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని అడ్డుపడుతున్నారు. కానీ రాష్ట్ర చరిత్రలో ఈ రోజు సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన రోజు. ఒకేసారి 50 వేల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ప్రజల ముఖ్యమంత్రిగా నిలిచారు. – మేరుగ నాగార్జున, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి న్యాయం సీఎం పక్షానే గతంలో ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ధర్నాలు, ఆందోళనలు చేసిన వారిని చూశాం. ఇప్పుడు మాత్రం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని ధర్నాలు చేయడం చూస్తున్నాం. వారికి చంద్రబాబు నాయుడు నాయకుడిగా ఉన్నారు. ఇప్పుడు పేదలకు.. పెత్తందార్లకు మధ్య యుద్ధం జరుగుతోంది. బాబు పెత్తందార్ల పక్షాన ఉంటే సీఎం జగన్ పేదల పక్షాన నిలబడ్డారు. అందుకే ధర్మం కూడా ఆయన పక్షానే ఉంది. అన్ని వర్గాల పేదలు ఆయనతో ఉన్నారు. న్యాయం పేదల పక్షాన నిలిచింది. 2024లో మళ్లీ జగన్‌ను సీఎంగా చూస్తాం. – జోగి రమేష్, గృహ నిర్మాణ శాఖ మంత్రి సమానత్వానికి నాంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం ద్వారా రాజధానిలో సామాజిక సమానత్వానికి నాంది పలికినట్లయింది. పేదలు రాజధానిలో నివాసముంటే సామాజిక సమతుల్యత దెబ్బ తింటుందనేది తప్పు అని దీని ద్వారా తేటతెల్లమైంది. ఇప్పటి వరకు కొందరిదిగా ఉన్న అమరావతి ఇప్పుడు అందరిదైంది. ఏకంగా 50 వేలకు పైగా ఇళ్ల పట్టాలివ్వడం అంటే మామూలు విషయం కాదు. తద్వారా లబ్ధిదారులకు వ్యక్తిగత లాభంతో పాటు ఇక్కడ ఏర్పడే ఇళ్ల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. తద్వారా రాజధాని ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. పాలకులకు ఎంతో గొప్ప మనసు ఉంటే కానీ ఇలాంటి నిర్ణయాలు సాధ్యం కావు. – కె మధుబాబు, సీడీసీ డీన్, ఏఎన్‌యూ ఈ అవకాశం ఎవరికీ రాలేదేమో.. 35 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలపై సంతకం పెట్టే అవకాశం బహుశా ఇప్పటి వరకు ఎవరికీ రాలేదేమో. ఆ అవకాశం నాకు మాత్రమే దక్కడం పట్ల చాలా సంతోషంగా ఉంది. నేను ఉద్యోగంలో చేరి 35 సంవత్సరాలు. ఇన్ని ఏళ్లలో అత్యంత సంతోషకరమైన రోజు ఇది. ఈ అవకాశం రాష్ట్రంలో, దేశంలో ఏ అధికారికీ లభించి ఉండకపోవచ్చు. – రామ్‌ప్రసాద్, తహసీల్దార్, మంగళగిరి, గుంటూరు జిల్లా ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రాంతంలో అల్పాదాయ వర్గాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఎంతో ఆనందించాల్సిన, అభినందించాల్సిన విషయం. అన్ని సామాజిక వర్గాలకు మేలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుతుంది. ప్రభుత్వం ఎంతో శ్రమపడి పేదల కల సాకారం చేసింది. గతంలో ఎప్పడూ ఇటువంటి ప్రయత్నం జరగలేదు. ఈ అంశంలో అందరూ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందించాల్సిందే. – కె.శ్రీరామమూర్తి, పూర్వ ప్రిన్సిపాల్, ఏయూ ఆర్ట్స్, కామర్స్ కళాశాల (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Fact Check: టిడ్కో ఇళ్లపైనా క్షుద్ర రాతలు
సాక్షి, అమరావతి : సీఆర్డీఏ పరిధిలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 50,004 నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు యుద్ధప్రాతిపదికన సన్నాహాలు చేస్తుంటే దానిని చూసి ఓర్వలేక నానా యాగీ చేసిన చంద్రబాబు, ఆయన భజన బృందంలోని ఎల్లో మీడియా.. తమ పాచికలు పారకపోవడంతో ఇప్పుడు టిడ్కో ఇళ్లపై మొసలికన్నీరు కారుస్తోంది. నిజానికి.. అమరావతి పరిధిలోని నిడమర్రు, మందడం, అనంతవరం, దొండపాడు, ఐనవోలు, పెనుమాక, తుళ్లూరు, నవులూరులో 5,024 టిడ్కో ఇళ్లను చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చేపట్టినా, ఆనాడు వాటికి ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండానే వదిలేశారు. అనంతరం జగనన్న ప్రభుత్వం వచ్చాక ఆయా నివాసాలకు తాగునీరు, ఎస్టీపీ, విద్యుత్ వంటి సౌకర్యాలకు రూ.75 కోట్లు వెచ్చించింది. ఇక్కడ నిర్మించిన సముదాయాల్లో 300 చ.అడుగుల్లో 992 ఇళ్లు, 365 చ.అ. విస్తీర్ణంలో 1,536.. 430 చ.అ. విస్తీర్ణంలో 2,496 యూనిట్లు మొత్తం 5,024 టిడ్కో ఇళ్లు మంజూరు చేశారు. ప్రభుత్వ సబ్సిడీ పోగా 300 చ.అ. ఇంటికి 2.65 లక్షలు బ్యాంకు రుణంగా పొంది 20 ఏళ్ల పాటు చెల్లించాలని బాబు సర్కారు షరతు విధించింది. అంటే ఒక్కో లబ్దిదారుడు ఇంటికి రూ.7.20 లక్షలు చెల్లించాలి. ఇక్కడి నివాసాల్లో 992 యూనిట్లు నిరుపేదలకు కేటాయించినవే. వారందరిపైనా బాబు మోపిన ఆర్థిక భారం అక్షరాలా రూ.71.42 కోట్లు. కానీ, ఈ మొత్తాన్ని జగనన్న ప్రభుత్వమే భరించి లబ్ధిదారులకు రూ.1కే ఇంటిని కేటాయించింది. రూ.112.86 కోట్ల మేర బాబు అదనపు భారం.. ట‘బి’ కేటగిరిలో ఉన్న 365, 430 చ.అ. ఇంటికి రూ.50 వేలు, రూ.లక్ష చొప్పున లబ్దిదారు వాటాగా చెల్లించాలని బాబు సర్కారు షరతు పెడితే, జగనన్న ప్రభుత్వం ఆ మొత్తాన్ని రూ.25 వేలు, రూ.50 వేలకు తగ్గించింది. ఫలితంగా అమరావతిలోని ఈ రెండు కేటగిరీల లబ్దిదారులపై ప్రస్తుత ప్రభుత్వం రూ.16.32 కోట్ల భారాన్ని తగ్గించడంతో పాటు మూడు కేటగిరీల ఇళ్లకు లబ్ధిదారుల భారం రూ.87.74 కోట్లను రద్దుచేసింది. పైగా రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుండడంతో మరో రూ.25.12 కోట్ల భారం లబ్దిదారులకు తగ్గిపోయింది. అంటే గత ప్రభుత్వం మోపిన రూ.112.86 కోట్ల భారాన్ని ఇప్పటి ప్రభుత్వమే భరిస్తోంది. ♦ అంతేగాక.. పేదలకు ఇచ్చిన 300 చ.అ ఇళ్లను రూ.2.65 లక్షల చొప్పున 323 మంది బ్యాంకుల నుంచి రూ.6.46 కోట్లు రుణాలు తీసుకుంటే జగన్ సర్కారు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించి సదరు లబ్ధిదారులకు రూ.1కే ఇంటిని కేటాయించింది. ♦ ఇక ప్రస్తుతం టిడ్కో ఇళ్లు ఉన్న ఎనిమిది ప్రాంతాల్లో గత సర్కారు ఎలాంటి మౌలిక వసతులు కల్పించలేదు. దాంతో ప్రస్తుత ప్రభుత్వం రూ.75 కోట్లతో తాగునీరు, ఎలక్ట్రిక్ పనులు, ఎస్టీపీ నిర్మాణం వంటి వసతులు కల్పించింది. అలాగే, ఎలక్ట్రికల్ పవర్ కనెక్షన్ పనులను మరో రూ.17.06 కోట్లతో చేపట్టింది. ♦ ఇక తుళ్లూరు, దొండపాడు, అనంతవరం, నవులూరు ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఉప్పునీరు కావడంతో వాటికి తాగునీటిని అందించేందుకు ప్రత్యేక ప్రాజెక్టును ప్రస్తుత వైఎస్సార్సీపీ రూపొందించింది. గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యాన్ని సరిదిద్దేందుకు జగన్ సర్కారు మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఇటు పేదలపై ఆర్థిక భారం పడకుండా చేస్తోంది. ఇలా అన్ని రకాలుగా ఇక్కడి లబ్దిదారులకు రూ.200 కోట్ల మేర లబ్ధిని చేకూర్చింది. మరోవైపు.. అన్ని వసతులతో సిద్ధమైన 5,024 టిడ్కో ఇళ్లను మే చివరి వారం లేదా జూన్ మొదటి వారంలో అందించేందుకు ప్రణాళికను సిద్ధంచేసింది. కానీ, అమరావతిలోని టిడ్కో లబ్దిదారులను ఆర్థికంగా దెబ్బతీసేలా పథకాలు రూపొందించిన నాటి చంద్రబాబు నిర్లక్ష్యాన్ని ప్రశ్నించలేని క్షుద్ర పత్రిక ఈనాడుకు ప్రస్తుత సర్కారు ఇంత మేలు చేస్తున్నా కనిపించకపోవడం విచారకరం. -
అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
-
పనులు చకచకా.. ఆర్–5 జోన్లో పేదలకు ఇళ్ల స్థలాలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు పనులు చకచకా సాగుతున్నాయి. లేఅవుట్లను పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ప్లాట్ల సరిహద్దులు గుర్తించి రాళ్లు పాతే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వారం రోజుల్లో అన్ని పనులు పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, మంగళగిరి అర్బన్, రూరల్ ప్రాంతాలతోపాటు తుళ్లూరు, పెదకాకాని మండలాల్లో లబ్ధిదారులకు 23,192 మందికి రకరకాల కారణాలతో పట్టాలు పంపిణీ చేయలేదు. ఎన్టీఆర్ జిల్లాలో సుమారు 25 వేల మందికి పట్టాలు ఇచ్చేందుకు లబ్ధిదారులను గుర్తించారు. ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో రాష్ట్ర్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో–45 ద్వారా భూమిని కేటాయించడం జరిగింది. గుంటూరు జిల్లాకు 550.65 ఎకరాలు, ఎన్టీఆర్ జిల్లాకు 583.94 ఎకరాలు మొత్తం కలిపి 1,134.,59 ఎకరాల భూమిని కేటాయించారు. ఇప్పటికే పట్టాలు సిద్ధం లబ్ధిదారులకు సంబంధించి మళ్లీ ఇంటింటికీ వెళ్లి వెరిఫికేషన్ చేయించారు. ఎవరైనా లబ్ధిదారులు మరణిస్తే.. వారి వారసుల పేరిట పట్టాలిచ్చారు.తాత్కాలిక అవసరాల నిమిత్తం కొందరు, శాశ్వతంగా మరికొందరు వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. వీరందరినీ గుర్తించి అర్హులందరికీ ఇళ్ల పట్టాలు సిద్ధం చేయించారు. ఇప్పటికే పట్టాలను సైతం ప్రింట్ చేయించారు. అందులో లబ్ధిదారుల వివరాలన్నీ పొందుపరిచారు. ఇందులో ముఖ్యమంత్రి సందేశం, లబ్ధిదారుని వివరాలు, ఆధార్ నంబర్, గ్రామం, వివరాలు, రెండు పేజీలలో డి.పట్టా, లేఅవుట్, ప్లాట్ హద్దులు ఉండేలా ఏర్పాటు చేశారు. ఈ పట్టాలపై సంబంధిత తహసీల్దార్‌తో సంతకాలు చేయించి అందుబాటులో పెట్టారు. వీరందరికీ ఇళ్లు కూడా కట్టించి ఇచ్చేందుకు వాటిని స్కాన్ చేసి ఆ వివరాలను కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. 6 గ్రామాల్లో 20 లేఅవుట్లు ఐనవోలు, మందడం, నవులూరు, నిడమర్రు, కృష్ణాయపాలెం, కురగల్లు గ్రామాల్లో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల లబ్ధిదారుల కోసం 20 లేఅవుట్లు వేశారు. íసీఆర్డీఏకి భూమిని కేటాయించిన తర్వాత భూముల హద్దులు నిర్ధారించి.. ఆ భూమిని స్వాధీనం చేసుకున్న తర్వాత లేఅవుట్లు సిద్ధం చేశారు. టౌన్‌ప్లానింగ్ నిబంధనలకు అనుగుణంగా లేఅవుట్లలో ఉండాల్సిన ఓపెన్ స్పేస్, రోడ్లు, డ్రెయిన్లు, పార్కింగ్, ఇతర అవసరాలకు కావాల్సిన భూమిని వదిలి ప్లాట్లు వేశారు. సీఆర్డీఏ టౌన్‌ప్లానింగ్ నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకున్నారు. అనుమతులు వచ్చిన తర్వాత అభివృద్ధి బాధ్యతను íసీఆర్డీఏకి ప్రభుత్వం అప్పగించింది. టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లను ఎంపిక చేసి ప్రతి లేఅవుట్‌కు ఒక కాంట్రాక్టర్ ఉండేలా పనులు అప్పగించారు. పనులు శరవేగంగా జరుగుతున్నాయి. లెవలింగ్ దాదాపు పూర్తయ్యింది. ప్రతి లేఅవుట్ పూర్తిస్థాయిలో రావడం కోసం లెవలింగ్, జంగిల్ క్లియరెన్స్, రోడ్ల ఏర్పాటు, సరిహద్దుల మార్కింగ్ చేశారు. సరిహద్దు రాళ్లు పాతి వాటికి తెల్లరంగు వేసి ప్లాట్ నంబర్లు వేసే పనులు చకచకా సాగుతున్నాయి. దీంతోపాటు రోడ్డు పక్కన డ్రెయిన్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి లేఅవుట్‌కు డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని, ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ను నియమించారు. మార్కింగ్ ఇవ్వడం కోసం 120 మంది సర్వేయర్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లను నియమించారు. వీరంతా మార్కింగ్ చేస్తున్నారు. పేదల ఇళ్ల కోసం మరో 268 ఎకరాలు సాక్షి, అమరావతి: ఏపీ సీఆర్డీఏ పరిధిలో ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకానికి ప్రభుత్వం మరో 268 ఎకరాలను కేటాయించింది. ఇందులో బోరుపాలెం, పిచికలపాలెం, అనంతవరం గ్రామాల పరిధిలో 168 ఎకరాలను ఎన్టీఆర్ జిల్లాకు చెందిన లబ్ధిదారుల కోసం కేటాయించగా.. గుంటూరు జిల్లాకు చెందిన లబ్ధిదారుల కోసం మరో 100 ఎకరాలను నెక్కల్లులో కేటాయించింది. ఇప్పటికే పేదలందరికీ ఇళ్ల పథకానికి ప్రభుత్వం 1,134.58 ఎకరాలను కేటాయించి ప్లాట్లుగా వేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలో సుమారు 50 వేల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వనుంది. గతంలో ఇక్కడ 48,218 మంది లబ్ధిదారులకు చోటు కల్పించారు. అయితే, కేటాయించిన భూమిలో 40,502 ప్లాట్లు సిద్ధమవుతున్నాయి. మిగిలిన లబ్ధిదారులకు కూడా ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు అనువుగా అదనంగా భూమి ఇవ్వాలని రెండు జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వాన్ని కోరారు. దాంతో మంగళవారం మరో 168 ఎకరాలను కేటాయించింది. ఈ ప్రాంతంలో పేదలందరికీ ఇళ్లు పథకంలో ఎన్టీఆర్ జిల్లాకు 26,739 మంది, గుంటూరు జిల్లాకు చెందిన 23,235 మంది లబ్ధిదారులకు మొత్తం 49,974 ప్లాట్లు ఇవ్వనున్నారు. సీఎం చేతుల మీదుగా పట్టాల పంపిణీ ఈ నెల 15వ తేదీ తర్వాత ఎప్పుడైనా సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా పట్టాల పంపిణీ జరుగుతుంది. సుమారు రెండు జిల్లాల్లో కలిపి 50 వేల మందికి పట్టాల పంపిణీ చేస్తాం. ఈ పట్టాలు పంపిణీ జరిగితే జిల్లాలో పట్టాల పంపిణీ ప్రక్రియ పూర్తి అవుతుంది.– ఎం.వేణుగోపాలరెడ్డి, కలెక్టర్ -
'జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇవ్వడం శుభపరిణామం'
సీఎం కేసీఆర్ చొరవతో రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు సమకూరుతాయని జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఆశాభావం వ్యక్తం చేసింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి జేఎన్జే సొసైటీ పట్ల సానుకూల వైఖరి అవలంబిస్తున్నారని తెలిపింది. ప్రాంతీయ బేధాలు లేకుండా సభ్యులందరికి స్థలాలు అందించాలని విధాన నిర్ణయం తీసుకున్న సీఎంకు సభ్యులందరూ ధన్యవాదాలు తెలియచేస్తూ సొసైటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. సొసైటీ సర్వసభ్య సమావేశం ఆదివారం నిజాంపేట్‌లోని నిర్వహించారు. అదేవిధంగా హైదరాబాద్‌లో అర్హులైన జర్నలిస్టులందరికి స్థలాలు కల్పించే దిశగా ప్రణాళిక చేయమని మంత్రి కేటీఆర్, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ ఆదేశించారు. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో జేఎన్జే సొసైటీతో పాటు హౌసింగ్ సొసైటీలతో సంబంధం లేని మిగతా జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వాలన్న కేటీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ప్రెస్ అకాడమి అధ్వర్యంలో కసరత్తు ప్రారంభించడం శుభపరిణామమని సొసైటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇందుకు కేటీఆర్‌కు కృతఙ్ఞతలు తెలుపుతూ సొసైటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. జేఎన్జే సొసైటీకి మిగిలిన 38 ఎకరాల స్థలం వీలైనంత తొందరగా సొసైటీకి అప్పగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు ఈ సమావేశంలో విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సొసైటీ ప్రెసిడెంట్, అందోల్ శాసనసభ్యుడు సీహెచ్ క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. 'కోట్లాది రూపాయలు చెల్లించినా దశాబ్ద కాలంగా అప్పటి ప్రభుత్వాలు సొసైటీకి భూమి అప్పగించలేదు. తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ నిజాంపేట్‌లోని 32 ఎకరాలు సొసైటీకి అప్పగించమని ఆదేశాలు జారీ చేశారు. అలాగే గత ఆగస్టులో సొసైటీకి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు రావడానికి ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్ కీలకంగా నిలిచింది. ఈ దిశగా ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రికి, మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు సొసైటీ తరఫున కృతఙ్ఞతలు.' తెలిపారు. ప్రస్తుత కమిటీ నేతృత్వంలోనే పేట్ బషీరాబాద్ స్థలం సాధించాలని కోరుతూ సర్వసభ్య సమావేశం కమిటీ పట్ల తమ పూర్తి విశ్వాసాన్ని ప్రకటించింది. ఈ సమావేశంలో సీఈఓ వంశీ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు పల్లె రవి, రవికాంత్ రెడ్డి, నేమాని భాస్కర్, జ్యోతి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
కరీంనగర్లో కలకలం.. కాల్పులు జరిగాయా? ప్రచారమేనా?
కరీంనగర్‌క్రైం: కరీంనగర్లో శుక్రవారం రాత్రి అన్నదమ్ముల మధ్య చోటుచేసుకున్న ఆస్తి వివాదం కలకలం రేపింది. ఇంటి స్థలం విషయంలో అన్నదమ్ముల మధ్య నెలకొన్న గొడవ ముదిరి పరస్పరం దాడి చేసుకునే వరకూ వెళ్లింది. ఈ క్రమంలో గన్‌తో కాల్పులు జరిగాయన్న వార్త స్థానికంగా చర్చనీయాంశమైంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. నగరంలోని ఖలీల్‌పురకు చెందిన మీర్‌గులామ్ అజార్‌కు ఐదుగురు కుమారులు, ఇద్దరు కూమార్తెలు. సయీద్ అజ్గర్ హుస్సేన్ (52) పెద్దవాడు. అతని తమ్ముళ్లు సయీద్ శంషద్ హుస్సేన్, సయీద్ అల్తాఫ్ హుస్సేన్, సయీద్ అన్వర్ హుస్సేన్, సయీద్ మున్నవర్ హుస్సేన్‌లకు మధ్య ఇంటి షట్టర్ల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. రెండు రోజుల కిత్రం కూడా గొడవ జరగడంతో అజ్గర్‌హుస్సేన్‌పై గురువారం అతని తమ్ముళ్లు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయినా.. శుక్రవారం రాత్రి అన్నదమ్ములు మరోసారి గొడవ పడ్డారు. అయితే.. కాల్పులు జరిగినట్లుగా శబ్దం రావడంతో స్థానికులు హైరానా పడ్డారు. వివరాలు తెలుసుకుంటున్న పోలీసులు ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారు. దీంతో అడిషనల్ డీసీపీలు శ్రీనివాస్, అశోక్, వన్‌టౌన్ సీఐ నటేశ్ సంఘటనా స్థలానికి వెళ్లి తనిఖీలు చేపట్టారు. అజ్గర్ ఇన్నోవా కారు అద్దాలు పగిలి ఉండడంతో గన్‌తో కాల్పులు జరిపాడని పోలీసులు ముందుగా భావించారు. ఘటనా స్థలంలో గన్, బుల్లెట్ల కోసం వెతికారు. కానీ.. ఎక్కడా దొరకలేదు. దీంతో అజ్గర్‌ను, అతని కారును పోలీసులు స్టేషన్‌కు తరలించారు. పోలీసులు అక్కడ దొరికిన ఆధారాలను ఫోరెన్సిక్‌కు పంపించగా.. కాల్పులు జరగలేదని నిర్ధారించినట్లు సీపీ కమలాసన్‌రెడ్డి స్పష్టం చేశారు. అక్కడ లభించిన వీడియో ఫుటేజీల ఆధారంగా వారి మధ్య గొడవ మాత్రమే జరిగిందని తెలిపారు. -
ఇళ్లకూ ‘ఆధార్’ !
ఇళ్లకు ఆధార్ ఏంటనుకుంటున్నారా...నిజమే మరి. వ్యక్తులకు సంబంధించి బహుళప్రయోజకారిగా ఉపయోగపడుతున్న ఆధార్ కార్డు తరహాలోనే జీహెచ్ఎంసీ పరిధిలోనిప్రతి ఇల్లు, ప్లాట్, తదితర స్థలాలన్నింటికీ ‘ఆధార్’ నంబర్లు జారీ చేయనున్నారు. నగరంలోచిరునామా కనుక్కోవడంలో తిప్పలు తప్పించేందుకు డిజిటల్డోర్ నంబర్ల ప్రక్రియకు సిద్ధమైనజీహెచ్ఎంసీ.. ఇప్పటికే వివిధ సంస్థలకు ఆ బాధ్యతలు అప్పగించగా, ఏవీ పూర్తిస్థాయిలోకార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీయే స్వయంగా కొత్త డిజిటల్ డోర్ నంబరింగ్సిస్టమ్కు సిద్ధమైంది. దీన్నే ప్రాపర్టీ ఆధార్ నంబర్‌గా కూడా వ్యవహరిస్తారు. ఇందులో భాగంగాజీహెచ్ఎంసీ పరిధిలోని ప్రతి ఇల్లు, ప్లాట్, ఖాళీ స్థలం, నిర్మాణం జరుగుతున్న భవనం, నిర్మాణం పూర్తయినప్పటికీఆస్తిపన్ను జాబితాలో నమోదు కాని ఇల్లు.. ఇలా అన్నింటికీ డిజిటల్ డోర్‌నంబర్లను జారీ చేయనుంది. ఈ డిజిటల్ డోర్ నంబర్ ద్వారానే ఇల్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ తదితర వివరాలన్నీ తెలుస్తాయి. సాక్షి, సిటీబ్యూరో: ఆధార్..వ్యక్తులకు సంబంధించిన చిరునామాలతోపాటు బ్యాంకులు, సిమ్‌కార్డులు, రేషన్‌కార్డులు, ఓటరు కార్డు, పాన్ నంబర్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పనికీ ‘ఆధార్’ అవసరం తెలిసిందే. ఇది మనుషులకు కాగా ఇళ్లకూ ‘ఆధార్’ తరహా నంబర్లిచ్చేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. బహుళ ప్రయోజనకారిగా ఉపయోగపడుతున్న ‘ఆధార్’ తరహాలోనే జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రతి ఇల్లు, ప్లాట్, తదితర స్థలాలన్నింటికీ ‘ఆధార్’ నంబర్లు జారీ చేయనున్నారు. ఈమేరకు జీహెచ్ఎంసీయే స్వయంగా కొత్త డిజిటల్ డోర్ నంబరింగ్ సిస్టమ్‌కు సిద్ధమైంది. దీన్నే ప్రాపర్టీ ఆధార్ నంబర్‌గా కూడా వ్యవహరిస్తారు. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రతి ఇల్లు, ప్లాట్, ఖాళీ స్థలం, నిర్మాణం జరుగుతున్న భవనం, నిర్మాణం పూర్తయినప్పటికీ ఆస్తిపన్ను జాబితాలో నమోదు కాని ఇల్లు.. ఇలా అన్నింటికీ డిజిటల్ డోర్ నంబర్లను జారీ చేయనుంది. ఈ డిజిటల్ డోర్ నంబర్ ద్వారానే ఇల్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ తదితర వివరాలన్నీ తెలుస్తాయి. ఒక డిజిటల్ డోర్ (ఆధార్)నంబర్‌ను కేటాయించారంటే దానికి సంబంధించిన స్థలం ఎవరి పేరు మీద ఉంది.. ఒకరి నుంచి ఒకరికి మ్యుటేషన్ జరిగిందా.. వంటి వివరాలతోపాటు ఆ ఇంటి ఆస్తిపన్ను గుర్తింపు నంబర్( పీటీఐఎన్), నివాస భవనమా, వాణిజ్య భవనమా, వేకెంట్ ల్యాండా వంటి వివరాలు ఆన్లైన్ ద్వారానే తెలుసుకునే వీలుంటుంది. అంతే కాదు సంబంధిత ఇంటికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్(ఓసీ) జారీ అయిందా లేదా వంటివి కూడా తెలుస్తాయి. ఇది ప్రజలకుపకరించే అంశం కాగా.. ఇళ్ల ఆధార్ నంబర్ల ద్వారా ఆస్తిపన్ను చెల్లించారా..లేదా? చెల్లించకుంటే ఎంతకాలంగా చెల్లించడం లేదు..? రికార్డుల్లో మాత్రం నివాస భవనంగా ఉన్నప్పటికీ, వాస్తవంగా వాణిజ్యం నిర్వహిస్తున్నారా.. తదితర వివరాలు జీహెచ్ఎంసీకి తెలుస్తాయి. అంతేకాదు.. ఇంతవరకు ఓసీలు తీసుకోని, ఆస్తిపన్ను చెల్లించని ఇళ్ల వివరాలు కూడా తెలుస్తాయి. వీటిని గుర్తించి ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్సులు, ఇతరత్రా ఫీజులు వసూలు చేయడం ద్వారా జీహెచ్ఎంసీకి కనిష్టంగా ఏటా దాదాపు రూ.150 కోట్ల ఆదాయం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సమగ్ర కుటుంబ సర్వే మేరకు జీహెచ్ఎంసీలో దాదాపు 20 లక్షల ఇళ్తుండగా, ఆస్తిపన్ను జాబితాలో మాత్రం 14 లక్షలే ఉన్నాయి. సర్వే అనంతరం దాదాపు 70 వేల ఇళ్లు కొత్తగా వచ్చి ఉంటాయని అంచనా. వీటన్నింటినీ ఆస్తిపన్ను పరిధిలోకి తెస్తారు. ట్రేడ్ లైసెన్సులు లేకుండానే వ్యాపారాలు నిర్వహిస్తున్నవారికి ట్రేడ్లైసెన్సులుజారీ చేస్తారు. తద్వారా జీహెచ్ఎంసీ ఆదాయం పెరుగుతుంది. పైలట్ ప్రాజెక్ట్‌గా మూసాపేటలో.. ఈ డిజిటల్ డోర్‌నంబర్(ఆధార్) కోసం పైలట్ ప్రాజెక్టుగా మూసాపేట సర్కిల్లో బుధవారం సర్వేకు శ్రీకారం చుట్టారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ(ఎన్ఆర్ఎస్ఏ) సహకారంతో శాటిలైట్ చిత్రాల మ్యాపింగ్‌తో జీహెచ్ఎంసీ ఐటీ, రెవెన్యూ విభాగాలు ఈ సర్వే నిర్వహిస్తున్నాయి. మూసాపేట సర్కిల్లో దాదాపు 60 వేల ఇళ్లున్నట్లు అంచనా. వీటన్నింటి సర్వే రెండు నెలల్లో పూర్తవుతుందని, అడిషనల్ కమిషనర్ (ఐటీ) ముషార్రఫ్ ఫారూఖి తెలిపారు. అవసరాలకనుగుణంగా ఆరు నుంచి ఎనిమిది డిజిట్లతో ఇళ్ల ఆధార్ నంబర్లు జారీ చేయనున్నట్లు చెప్పారు. ఈ నంబర్ ఉంటే సెల్‌ఫోన్‌తోనే కావాల్సిన చిరునామాకు నేరుగా వెళ్లిపోవచ్చునని చెప్పారు. ఫైర్సర్వీసెస్, పోస్టల్, కొరియర్ సర్వీసులకు ఎంతో ఉపయుక్తమన్నారు. -
పేద దళితులకు ఇళ్ల స్థలాలు
అనంతపురం అర్బన్ : పేద దళితులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కలెక్టర్ కోన శశిధర్‌కి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కమిటీ చైర్మన్ బీసీఆర్‌దాస్, నాయకులు విన్నవించారు. గురువారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్‌లో కలెక్టర్‌తో పాటు జేసీ బి.లక్ష్మీకాంతం, జేసీ–2 సయ్యద్ ఖాజా మొహిద్దీన్, డీఆర్ఓ సి.మల్లీశ్వరిదేవి దళిత సంఘాల నాయకులు, ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. నాయకులు మాట్లాడుతూ కుందుర్పి మండలం నిజవళ్లి గ్రామ పొలం సర్వే నెంబర్ 106–4లో 5.30 ఎకరాల భూమిని 130 మంది దళితులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కేటాయించారన్నారు. అనంతపురం నగరంలోని అంబేద్కర్ భవన్ నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని కోరారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కుందుర్పి ఓబయ్య, నాయకులు గుడిసె రామాంజి, దొడ్డప్ప, బడిగి నాగరాజు, నరసింహమూర్తి, బాబు, తదితరులు ఉన్నారు.అదేవిధంగా ఉపాధి హామీ పథకం కింద మామిడి మొక్కల పెంపకానికి సంబంధించి బిల్లులు చేయాలని దండోరా నాయకుడు అక్కులప్ప విన్నవించారు. దళితులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కేవలం 1,826 రుణ యూనిట్లు కేటాయించడం ద్వారా న్యాయం జరగదని కలెక్టర్‌నుS ఎమ్మార్పీఎస్ (జిన్నే రమణయ్య వర్గం) రాష్ట్ర కార్యదర్శి యు.చిన్నపెద్దన్న, జిల్లా కార్యదర్శి రవికుమార్ విన్నవించారు. దళితులకు ఉపాధి కల్పన కోసం రుణ యూనిట్లను కోటా పెంచాలని కోరారు.