పేద దళితులకు ఇళ్ల స్థలాలు
అనంతపురం అర్బన్ : పేద దళితులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కలెక్టర్ కోన శశిధర్‌కి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కమిటీ చైర్మన్ బీసీఆర్‌దాస్, నాయకులు విన్నవించారు. గురువారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్‌లో కలెక్టర్‌తో పాటు జేసీ బి.లక్ష్మీకాంతం, జేసీ–2 సయ్యద్ ఖాజా మొహిద్దీన్, డీఆర్‌ఓ సి.మల్లీశ్వరిదేవి దళిత సంఘాల నాయకులు, ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. నాయకులు మాట్లాడుతూ కుందుర్పి మండలం నిజవళ్లి గ్రామ పొలం సర్వే నెంబర్ 106–4లో 5.30 ఎకరాల భూమిని 130 మంది దళితులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కేటాయించారన్నారు. అనంతపురం నగరంలోని అంబేద్కర్ భవన్ నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని కోరారు.
సంఘం జిల్లా అధ్యక్షుడు కుందుర్పి ఓబయ్య, నాయకులు గుడిసె రామాంజి, దొడ్డప్ప, బడిగి నాగరాజు, నరసింహమూర్తి, బాబు, తదితరులు ఉన్నారు.అదేవిధంగా ఉపాధి హామీ పథకం కింద మామిడి మొక్కల పెంపకానికి సంబంధించి బిల్లులు చేయాలని దండోరా నాయకుడు అక్కులప్ప విన్నవించారు. దళితులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కేవలం 1,826 రుణ యూనిట్లు కేటాయించడం ద్వారా న్యాయం జరగదని కలెక్టర్‌నుS ఎమ్మార్పీఎస్ (జిన్నే రమణయ్య వర్గం) రాష్ట్ర కార్యదర్శి యు.చిన్నపెద్దన్న, జిల్లా కార్యదర్శి రవికుమార్ విన్నవించారు. దళితులకు ఉపాధి కల్పన కోసం రుణ యూనిట్లను కోటా పెంచాలని కోరారు.