ఇంటర్ విద్యా మండలి కేంద్ర కార్యాలయం మార్పు
Published Mon, Aug 8 2016 11:20 PM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM
శ్రీకాకుళం: ఇంటర్మీడియెట్ విద్యా మండలి కేంద్రం కార్యాలయం హైదరాబాద్ నుంచి విజయవాడకు మార్చినట్లు ఇంటర్మీడియెట్ విద్యామండలి ప్రాంతీయ పర్యవేక్షణాధికారి పాత్రుని పాపారావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కావున జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు తమ మెయిలింగ్ లిస్టులో కార్యదర్శి, ఇంటర్మీడియెట్ విద్యామండలి, డోర్ నంబర్ 48–18–2/ఎ, నాగార్జున నగర్ కాలనీ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎదురుగా, విజయవాడ–520008, ఫోన్ 0866–2974130 చిరునామాను నమోదు చేసుకోవాలని ఆ ప్రకటనలో తెలిపారు.
Advertisement
Advertisement