రాష్ట్రపతి ప్రసంగంలో ప్రత్యేకత ఏమి లేదు: కాంగ్రెస్‌ చీఫ్‌​ ఎం ఖర్గే | M Kharge Said President Droupadi Murmus Address Nothing Special | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి ప్రసంగంలో ప్రత్యేకత ఏమి లేదు: కాంగ్రెస్‌ చీఫ్‌​ ఎం ఖర్గే

Published Wed, Feb 1 2023 2:09 PM | Last Updated on Wed, Feb 1 2023 2:09 PM

M Kharge Said President Droupadi Murmus Address Nothing Special  - Sakshi

ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంలో..

బడ్జెట్‌ను చూడకుండా దాని గురించి మాట్లాడటం తగదని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే అన్నారు. పార్టీ తరుఫున మీడియా సమావేశం ఏర్పాటు చేస్తామని , అందులో నిపుణులైన పార్టీ నేతలే దీని గురించి ముందుగా మట్లాడతారని ఆ తర్వాత తాను మాట్లాడతానని చెప్పారు. మంగళవారం ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంలో అంతగా చెప్పుకోదగ్గ ప్రత్యేకత ఏమి లేదన్నారు ఖర్గే.

ఇదిలా ఉండగా, కేంద్ర బడ్జెట్‌ను సమర్పించే ముందు సీతారామన్‌ని రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రి వర్గ సమావేశం అనంతరం ఖర్గే కలిశారు. కేంద్ర బడ్జెట్‌ 2023-24 సమర్పణ పార్లమెంటులో సీతారామన్‌ ప్రసంగంతో ప్రారంభమైంది. ఈ బడ్జెట్‌ను అమృత్‌ కాల్‌లో మొదటి బడ్జెట్‌గా పేర్కొన్నారు నిర్మలమ్మ.

ఈ అమృత్‌కాల్‌ బడ్జెట్‌లో సంపన్నమైన సమ్మిళిత భారతేదేశాన్ని ఊహించాం అన్నారు. సవాళ్ల సమయం ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ ఉజ్వల భవిష్యత్తు వైపు పయనిస్తోంది. ఈ మేరకు సీతారామన్‌ 2022-23 ఆర్థిక సర్వేకి సంబంధించిన ముఖ్యాంశాలు, గణాంక అనుబంధం తోపాటు పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల మొదటి రోజైన మంగళవారం ప్రవేశ పెట్టారు. కాగా, ఖర్గే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, చైనాతో సరిహద్దు వివాదం వంటి అంశాలను బడ్జెట్‌ సెషన్‌లో లేవనెత్తుతామని చెప్పారు. అలాగే కొంతమంది పెట్టుబడిదారులకు ప్రభుత్వ బ్యాంకులు బారీ మొత్తంలో రుణాలు ఇస్తున్న విషయాన్ని కూడా పార్టీ ప్రస్తావిస్తుందని చెప్పారు మల్లికార్జున ఖర్గే. 

(చదవండి:  బడ్జెట్‌లో టంగ్‌ స్లిప్‌ అయిన నిర్మలమ్మ..ఓహ్‌ !సారీ అంటూ...)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement