- ఎన్పీడీసీఎల్ సీఎండీ వెంకటనారాయణ
- ∙విద్యుత్ ఉద్యోగుల రాష్ట్రస్థాయి క్రీడలు ప్రారంభం
ఆరోగ్యానికి చిరునామా క్రీడలు
Published Sat, Sep 10 2016 12:18 AM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM
వరంగల్ స్పోర్ట్స్ : క్రీడలు ఆరోగ్యానికి చిరునామా లాంటివని ఎన్పీడీసీఎల్ సీఎండీ కొంటె వెంకటనారాయణ అభివర్ణించారు. తెలంగాణ ట్రాన్స్‌కో, డిస్కంల ఇంటర్ సర్కిల్ కబడ్డీ, క్యారమ్ టోర్నమెంటు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కౌన్సిల్ ఆపరేషన్స్ సర్కిల్ ఆధ్వర్యంలో హన్మకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీలను శుక్రవారం వెంకటనారాయణ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. క్రీడా పతాకాన్ని ఆవిష్కరించిన ఆయన క్రీడాకారుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతు పని ఒత్తిడితో సతమతమయ్యే ఉద్యోగులకు క్రీడలు మానసిక ప్రశాంతతను చేకూరుస్తాయన్నారు. ఒత్తిడితో అనారోగ్య బారిన పడుతున్న వారిసంఖ్య అన్ని రంగాల్లోనూ ఉందన్నారు. అనంతరం క్యారమ్ క్రీడాకారుడు, మాజీ విద్యుత్ ఉద్యోగి వెలంటేన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎండీ వెంకటనారాయణ కబడ్డీ ఆడడం క్రీడాకారుల్లో ఉత్తేజాన్ని నింపింది.
కార్యక్రమంలో డైరెక్టర్ ప్రాజెక్ట్స్ బి.వెంకటేశ్వర్‌రావు, డైరెక్టర్ ఆపరేషన్స్ బి.నర్సింగరావు, వరంగల్ సర్కిల్ ఎస్‌ఈ శివరాం, సీజీఎం సదర్‌లాల్, తిరుపతిరెడ్డి, మోహన్‌రావు, మధుసూదన్, డీఈలు శ్రీకాంత్, రాంబాబు, విజయేందర్‌రెడ్డి, స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ కేవీ జాన్సన్, ఇన్‌చార్జి ఆర్.రమేష్ వివిధ జిల్లాల డీఈ, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement