
న్యూఢిల్లీ: తన అనుబంధ పాఠశాలలన్నీ వచ్చే సంవత్సరం నుంచి విధిగా రోజూ క్రీడలకే ఒక పీరియడ్ కేటాయించాలని సీబీఎస్‌ఈ ఆదేశించింది. 9–12 తరగతి విద్యార్థుల్లో శారీరక, మానసిక ఉల్లాసం నింపేలా ఆటలు ఆడించాలని సూచిస్తూ 150 పేజీల మార్గదర్శకాలను విడుదల చేసింది.
హెల్త్, ఫిజికల్ విద్య(హెచ్‌పీఈ)ని అకడమిక్స్‌లో భాగం చేస్తూ రూపొందించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం..పాఠశాలల్లో రోజూ జరిగే ఆటల పీరియడ్‌లో విద్యార్థులంతా మైదానానికి వెళ్లి, బోర్డు పేర్కొన్న జాబితాలోని ఏదో ఒక ఆట లేదా వ్యాయామం చేయాల్సి ఉంటుంది. అందులో విద్యార్థులకు ఇచ్చే గ్రేడ్లను పాఠశాలలు సీబీఎస్‌ఈ వెబ్‌సైట్‌లో పొందుపర్చాలి. విద్యార్థులు వార్షిక పరీక్షలకు హాజరవ్వాలంటే హెచ్‌పీఈలో పాల్గొనడం తప్పనిసరి. అయితే ఇలా వచ్చే గ్రేడ్లను ప్రధాన పరీక్షలో వచ్చిన మార్కులకు కలపరు.
Comments
Please login to add a commentAdd a comment