ఆరోగ్యానికి క్రీడలు అవసరం
ఆరోగ్యానికి క్రీడలు అవసరం
Published Tue, Dec 13 2016 11:58 PM | Last Updated on Mon, Sep 4 2017 10:38 PM
* డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ హబీబ్ బాషా
* నలందాలో టాలెంట్ హంట్ 2కే 16 ప్రారంభం
సత్తెనపల్లి: ఆరోగ్యం కోసం క్రీడలు అవసరమని గుంటూరు డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ షేక్ హబీబ్‌బాషా చెప్పారు. సత్తెనపల్లి మండలం కంటెపూడి సమీపంలోని నలందా ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం టాలెంట్ హంట్ 2కే 16 ప్రారంభ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సభకు ఎంబీఏ కళాశాల ప్రిన్సిపాల్ అబ్రహంలింకన్ అధ్యక్షత వహించారు. హబీబ్‌బాషా మాట్లాడుతూ ఒలంపిక్్స పోటీల్లో రజత పతకం సాధించిన పి.వి.సింధు తెలుగు రాష్ట్రాలకు గౌరవం తెచ్చిందని కొనియాడారు. క్రీడాకారులకు ఉన్న మానసిక పరిజ్ఞానం మరెవరికీ ఉండదన్నారు. క్రీడలు లేనిదే జీవితం ఉండదని చెప్పారు. అన్ని రేషన్ దుకాణాల్లో ఈపాస్ యంత్రాలు ప్రవేశపెట్టామని, నగదు రహిత లావాదేవీలను విద్యార్థులు ప్రొత్సహించాలని సూచించారు. నలందా విద్యాసంస్థల చైర్మన్ ఆరిమండ వరప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ రెండు రోజుల పాటు ఇంటర్మీడియట్ విద్యార్థులకు నిర్వహించే క్రీడా పోటీల్లో క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలన్నారు. దేశం గర్వించదగ్గ క్రీడాకారులు మీ మధ్యలో నుంచే రావాలంటూ ప్రేరణనింపారు. క్రీడలనేవి శారీరక, మానసిక ధృడత్వానికే కాకుండా జాతీయ సమైక్యతా స్ఫూర్తిని నింపుతాయన్నారు. నలందా విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ స్కిల్ లేదా ఉన్నత విద్య ఉంటేనే భవిష్యత్తులో రాణించ గలుతారన్నారు. ఏదో ఒక లక్ష్యాన్ని ఎంచుకుని దాన్ని చేరు కోవాలన్నారు. అనంతరం ప్రిన్సిపాల్స్ సరిత సంపతి, ఎ.వాణి, డాక్టర్ బ్రహ్మారెడ్డి మాట్లాడారు. అనంతరం క్రీడా పోటీలను ప్రారంభించారు. జిల్లాలోని 60 కళాశాలల నుంచి 55 మంది క్రీడాకారులు పోటీలకు హాజరయ్యారు. బాల, బాలికలకు కబడ్డీ, వాలీబాల్, ఖోఖో పోటీలు, బాలికలకు అదనంగా టెన్నికాయిట్ పోటీలు నిర్వహించారు. సాంస్కృతిక విభాగంలో గ్రూప్, సోలో డ్యాన్సులు, పాటల పోటీలు, సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. బాలికల కబడ్డీ పోటీల్లో విన్నర్‌గా నరసరావుపేట వాగ్దేవి కలాశాల, రన్నర్‌గా సత్తెనపల్లి క్రిష్ణవేణి, టెన్నికాయిట్‌లో విన్నర్‌గా సత్తెనపల్లి క్రిష్ణవేణి, రన్నర్‌గా నగరం ఎస్‌డబ్ల్యూ జూనియర్ కళాశాల జట్లు నిలిచాయి. కార్యక్రమంలో పీఈటీలు చంద్రవాస్, నాగిరెడ్డి, కళాశాల వివిధ విభాగాల హెచ్‌ఓడీలు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Advertisement