క్రీడలతో బుద్ధిమాంద్యులకు ఆరోగ్యం
క్రీడలతో బుద్ధిమాంద్యులకు ఆరోగ్యం
Published Tue, Aug 9 2016 11:47 PM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM
అనంతపురం సప్తగిరి సర్కిల్ : బుద్ధిమాంద్యులు క్రీడల్లో పాల్గొంటే వారి ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆర్డీటీ ప్రోగ్రామ్ డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ తెలిపారు. మంగళవారం ఆర్డీటీ క్రీడాగ్రామంలోని అథ్లెటిక్స్ ట్రాక్‌పై జాతీయస్థాయి పశ్చిమ, దక్షిణ భారత రాష్ట్రాల బుద్ధి మాంద్యుల అథ్లెటెక్స్ సన్నాహక శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకలాంగులకు ఒలింపిక్స్ వికలాంగులకు పారా ఒలింపిక్స్, లాగా బుద్ధిమాంద్యులకు స్పెషల్ ఒలింపిక్స్ జరుగుతాయన్నారు. ఈ నెల 11 వరకూ సన్నాహక శిబిరం జరుగుతుందన్నారు. క్రమశిక్షణ, తర్ఫీదు పొందితే స్పెషల్ ఒలింపిక్స్‌లో రాణించవచ్చన్నారు. ఈ సందర్భంగా ఆర్డీటీ స్పెషల్ ఒలింపిక్స్ జర్నీ అనే ఆంగ్ల పుస్తకాన్ని మాంఛో ఫెర్రర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ స్పెషల్ ఒలింపిక్ భారత్ సమన్వయకర్త రాజశేఖర్, ఆర్డీటీ సీబీఆర్ డైరెక్టర్ దశరథ్, కోచ్‌లు పాల్గొన్నారు.
Advertisement
Advertisement