
ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి: ఒమర్ అబ్దుల్లా
దుబాయి: ప్రపంచంలోనే ఎత్తైన భవనం బూర్జ్ ఖలీఫా సమీపంలోని ఫైవ్ స్టార్ హోటల్ అయిన అడ్రస్ డౌన్ టౌన్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టెర్రస్లో ముందుగా మంటలు అంటుకొని ఆ తర్వాత అంతటా వ్యాపించాయని జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో అడ్రస్ హోటల్ సమీపంలోనే ఉన్నట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు.
చిన్నగా ప్రారంభమైన మంటలు ఒకే సారి పెద్ద ఎత్తున వ్యాపించి భవనాన్ని అంటుకున్నాయని తెలిపారు. భవనంలో ఇరుకున్న వారందరి కోసం ప్రార్థిస్తున్నాను. వారందరూ సురక్షితంగా బయటకు రావాలని ఆకాంక్షింస్తున్నట్టు ఒమర్ తెలిపారు.
I'm next to The Address in Dubai where a sudden fire enveloped the building. Started from a terrace & raced up. pic.twitter.com/p8OWF6NIW5
— Omar Abdullah (@abdullah_omar) December 31, 2015
It started from a tiny fire & in no time at all spread all the way up the building #Dubai #AddressFire pic.twitter.com/rykqos5Euj
— Omar Abdullah (@abdullah_omar) December 31, 2015