రైల్వేకోడూరు: వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు పట్టణంలోని కృష్ణనగర్‌కు చెందిన ప్రవీణ అనే మహిళ ఇంటిముందు వరండాలో ఉండగా ఒక వ్యక్తి అడ్రస్ అడిగేందుకు వచ్చి ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లాడు. కుటుంబసభ్యులు దుండగుడ్ని వెంబడించినా కొద్దిదూరం వెళ్లిన తర్వాత అక్కడ రెడీగా ఉన్న బైక్‌పై ఉడాయించాడు.
150 గ్రాముల బంగారు గొలుసు లాక్కెళ్లాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దుండగుడి కోసం గాలిస్తున్నారు. బంగారు గొలుసు ధర సుమారు ప్రీ ప్లాన్ గా ఈ చోరీ జరిగి ఉండొచ్చునని పోలీసులు భావిస్తున్నారు.