యుద్ధ నేరస్తుడు బెంజమిన్ నెతన్యాహును యూఎస్ కాంగ్రెస్‌లో మాట్లాడేందుకు చట్టసభ సభ్యులు ఆహ్వానించడాన్ని సెనేటర్ బెర్నీ శాండర్స్ తప్పబట్టారు. తాను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రసంగానికి హాజరుకావడం లేదని పేర్కొన్నారు.
అక్టోబర్ ఏడవతేదీ నాటి హమాస్ ఉగ్ర దాడికి వ్యతిరేకంగా తమ దేశాన్ని రక్షించుకునేందుకు ఇజ్రాయెల్‌కు హక్కు ఉంది. అయితే నెతన్యాహు రైట్ వింగ్ తీవ్రవాద నాయకత్వంతో పాలస్తీనా ప్రజలపై యుద్ధానికి దిగారు. ఇటువంటి హక్కు ఇజ్రాయెల్‌కు లేదంటూ సెనేటర్ బెర్నీ శాండర్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
రిపబ్లికన్, డెమొక్రాటిక్ నేతలు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును సెనేట్, ప్రతినిధుల సభలో ప్రసంగించేందుకు అధికారికంగా ఆహ్వానించారు. దీనికి నెతన్యాహు అంగీకారాన్ని తెలిపారని, కాంగ్రెస్ ఉభయ సభల ముందు ఇజ్రాయెల్‌కు ఆయన ప్రాతినిధ్యం వహించనున్నారని నెతన్యాహు కార్యాలయం తెలిపింది. అయితే ఈ కార్యక్రమం ఎప్పుడు జరిగేదీ వెల్లడించలేదు.
Right now tens of thousands of children in Gaza are facing starvation, malnutrition, and famine.
And Congressional leadership thinks it’s okay to invite war criminal Netanyahu to address Congress?
No. Unacceptable. pic.twitter.com/sun43kAE4z— Bernie Sanders (@BernieSanders) June 4, 2024
Comments
Please login to add a commentAdd a comment