ATTENDING
-
నెతన్యాహు ప్రసంగానికి హాజరుకాను:సెనేటర్
యుద్ధ నేరస్తుడు బెంజమిన్ నెతన్యాహును యూఎస్ కాంగ్రెస్‌లో మాట్లాడేందుకు చట్టసభ సభ్యులు ఆహ్వానించడాన్ని సెనేటర్ బెర్నీ శాండర్స్ తప్పబట్టారు. తాను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రసంగానికి హాజరుకావడం లేదని పేర్కొన్నారు.అక్టోబర్ ఏడవతేదీ నాటి హమాస్ ఉగ్ర దాడికి వ్యతిరేకంగా తమ దేశాన్ని రక్షించుకునేందుకు ఇజ్రాయెల్‌కు హక్కు ఉంది. అయితే నెతన్యాహు రైట్ వింగ్ తీవ్రవాద నాయకత్వంతో పాలస్తీనా ప్రజలపై యుద్ధానికి దిగారు. ఇటువంటి హక్కు ఇజ్రాయెల్‌కు లేదంటూ సెనేటర్ బెర్నీ శాండర్స్ సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు.రిపబ్లికన్, డెమొక్రాటిక్ నేతలు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును సెనేట్, ప్రతినిధుల సభలో ప్రసంగించేందుకు అధికారికంగా ఆహ్వానించారు. దీనికి నెతన్యాహు అంగీకారాన్ని తెలిపారని, కాంగ్రెస్ ఉభయ సభల ముందు ఇజ్రాయెల్‌కు ఆయన ప్రాతినిధ్యం వహించనున్నారని నెతన్యాహు కార్యాలయం తెలిపింది. అయితే ఈ కార్యక్రమం ఎప్పుడు జరిగేదీ వెల్లడించలేదు. Right now tens of thousands of children in Gaza are facing starvation, malnutrition, and famine.And Congressional leadership thinks it’s okay to invite war criminal Netanyahu to address Congress?No. Unacceptable. pic.twitter.com/sun43kAE4z— Bernie Sanders (@BernieSanders) June 4, 2024 -
కొంప ముంచిన అంత్యక్రియలు.. చనిపోయాక..
సాక్షి, పర్వతగిరి(వరంగల్) : వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మంగళవారం రాత్రి మృతి చెందగా బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. బంధువులు, కుటుంబసభ్యులు, గ్రామస్తులు చాలామంది పాల్గొన్నారు. ఆ కొద్దిసేపటికే ఆయనకు పాజిటివ్ వచ్చినట్టు తేలడంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. సదరు వ్యక్తి కొద్దిరోజుల క్రితం అస్వస్థతకు గురై.. పర్వతగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ పరీక్ష చేయించుకోగా నెగెటివ్ వచ్చింది. ఈనెల 12న మరోసారి ఏనుగల్ గ్రామంలో 104 అంబులెన్స్ ద్వారా ర్యాపిడ్ టెస్ట్ చేయించుకున్నారు. ఈ పరీక్ష ఫలితం పాజిటివ్‌గా ఆశవర్కర్కు బుధవారం మెసేజ్ వచ్చింది. అప్పటికే ఆయన మృతి చెందడం, బుధవారం అంత్యక్రియలు ముగిశాక ఇది తెలియడంతో అంత్యక్రియల్లో పాల్గొన్న వారంతా బెంబేలెత్తుతున్నారు. ఈ గ్రామంలో ఇప్పటికే 20కిపైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ప్రజలంతా ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. -
ఇదేనా సాధికారత
-
ఐఈఆర్టీ పరీక్షకు 144 మంది హాజరు
అనంతపురం ఎడ్యుకేషన్ : సర్వశిక్ష అభియాన్ ద్వారా భర్తీ చేయనున్న ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ టీచర్స్ పోస్టులకు ఆదివారం నిర్వహించిన ఆన్లైన్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి 11.30 గంటల వరకు ప్రశాంతంగా జరిగింది. తొలిసారి ఆన్ లైన్ విధానంలో పరీక్ష నిర్వహించారు. ఎస్ఆర్ఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. మొత్తం 155 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 144 మంది హాజరయ్యారు. జాయింట్ కలెక్టర్–2 సయ్యద్ ఖాజా మొహిద్దీన్, సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర ప్లానింగ్ కోఆర్డినేటర్ గురుమూర్తి, ప్రాజెక్ట్ ఆఫీసర్ దశరథరామయ్య, ఐఈడీ కోఆర్డినేటర్ పాండురంగ పరీక్షల ప్రక్రియను పరిశీలించారు. మూడో అంతస్తుకు వెళ్లడం ఇబ్బందిగా మారిందని కొందరు దివ్యాంగులు వాపోయారు. కేటాయింపు తమపరిధిలో లేదని రాష్ట్ర స్థాయిలో జరిగిందని ఎస్ఎస్ఏ అధికారులు తెలిపారు. -
మోడీ సభకు కమల దండు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ బహిరంగసభకు జిల్లా నుంచి పెద్దఎత్తున జనసమీకరణ చేసేందుకు కమలనాథులు కసరత్తు చేశారు. ఆదివా రం హైదరాబాద్‌లో నవభారత యువభేరి పేరుతో భారతీయ జనతా పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. నెల రోజులుగా ఈ సభ విజయవంతం కోసం జిల్లాలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాన్ని నా యకత్వం చేపట్టింది. ప్రధానంగా బైక్ ర్యాలీలు, ప్రదర్శనలు, కాగడాల ప్రదర్శన నిర్వహించారు. నిజామాబాద్ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ రానున్న ఎన్నికల్లో ఇందూరు పార్లమెంట్ స్థానంపై దృష్టి సారించడంతో మోడీ సభను అనుకూలంగా మలుచుకునేందుకు జిల్లాలో విస్తృతంగా పర్యటించి సభలు, సమావేశాలు నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, రాష్ట్ర నాయకుడు పెద్దోళ్ల గంగారెడ్డితో పాటు నియోజక వర్గ ఇన్చార్జిలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు. సంస్థాగతంగా బలంగా ఉన్న నిజామాబాద్ అర్బన్‌తో పాటు ఆర్మూర్, నిజామాబాద్‌రూరల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ నియోజక వర్గాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలతో పాటు జనసమీకరణకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు రెండు వందల బస్సులు, రెండు వందల సుమోలు, జీపులను వినియోగిస్తున్నారు. అదే విధంగా స్వచ్ఛందంగా మోడీ సభకు తరలించే వారికి తగిన సూచనలను , సలహాలను నాయకత్వం ఇచ్చింది. డాక్టర్లు, వ్యాపారులు, న్యాయవాదులు ఈ సభకు తరలిరానున్నట్లు బీజేపీ పేర్కొంది. తెలంగాణ విషయంలో కాంగ్రెస్, టీడీపీలు ద్వంద్వ వైఖరితో ప్రజలను మోసం చేస్తున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. సీమాంధ్రలో ఉన్న కాంగ్రెస్ నాయకులు సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తుండగా తెలంగాణలోని నాయకులు ప్రత్యేక ప్రకటన ఏర్పాటు పూర్తయిందని సంబరాలు జరుపుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని బీజేపీ ఎద్దేవా చేస్తోంది. తెలంగాణ విషయంలో ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్ రెండు ప్రాంతాల్లోని నాయకత్వాన్ని ఒప్పించడంలో పూర్తిగా విఫలం అయ్యిందని, దీంతో రాజకీయ లబ్ధికోసం రెండు ప్రాంతాల వారిని రెచ్చగొడుతోందని బీజేపీ ఆరోపిస్తుంది.తెలంగాణ విషయంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని ప్రకటించిన ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని, అయితే హైకమాండ్ గుండ్లప్పగించి చూస్తుందే తప్ప సరైన నిర్ణయంతో ముందుకు సాగడం లేదని బీజేపీ నేతలు అంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తెలంగాణకు అనుకూలమేనంటూ మరోవైపు సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా ప్రధానికి లేఖ రాయడం దేనికి సంకేతమని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ మోసాలను ఎండగట్టాడానికే బీజేపీ నవభారత యువభేరి బహిరంగసభను హైదరాబాద్‌లో నిర్వహిస్తుందని ఆ పార్టీ నేతలు వివరించారు. పార్లమెంట్లో బేషరతుగా తెలంగాణ బిల్లుకు మద్దతు ఇస్తామని బీజేపీ ఏనాడో చెప్పిందని, కేంద్రంలో అధికారంలోకి రాగానే ప్రథమంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చి తీరుతుందని స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశ పెట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అందుల్లో భాగంగానే నవభారత యువభేరి సభను నిర్వహిస్తుందని యువనేత, భారత రథసారథి నరేంద్రమోడీతో సహా జాతీయ రాష్ట్ర నాయకులు పాల్గొంటున్నారని బీజేపీ పేర్కొంది.