ఐఈఆర్టీ పరీక్షకు 144 మంది హాజరు
అనంతపురం ఎడ్యుకేషన్ : సర్వశిక్ష అభియాన్ ద్వారా భర్తీ చేయనున్న ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ టీచర్స్ పోస్టులకు ఆదివారం నిర్వహించిన ఆన్లైన్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి 11.30 గంటల వరకు ప్రశాంతంగా జరిగింది. తొలిసారి ఆన్ లైన్ విధానంలో పరీక్ష నిర్వహించారు. ఎస్‌ఆర్‌ఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. మొత్తం 155 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 144 మంది హాజరయ్యారు. జాయింట్ కలెక్టర్–2 సయ్యద్ ఖాజా మొహిద్దీన్, సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర ప్లానింగ్ కోఆర్డినేటర్ గురుమూర్తి, ప్రాజెక్ట్ ఆఫీసర్ దశరథరామయ్య, ఐఈడీ కోఆర్డినేటర్ పాండురంగ పరీక్షల ప్రక్రియను పరిశీలించారు. మూడో అంతస్తుకు వెళ్లడం ఇబ్బందిగా మారిందని కొందరు దివ్యాంగులు వాపోయారు. కేటాయింపు తమపరిధిలో లేదని రాష్ట్ర స్థాయిలో జరిగిందని ఎస్‌ఎస్‌ఏ అధికారులు తెలిపారు.