నల్లధనంపై పోరులో వెనక్కి తగ్గేది లేదు | PM Narendra Modi to address the nation on New Year's Eve | Sakshi
Sakshi News home page

నల్లధనంపై పోరులో వెనక్కి తగ్గేది లేదు

Published Sat, Dec 31 2016 7:27 PM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM

నల్లధనంపై పోరులో వెనక్కి తగ్గేది లేదు - Sakshi

నల్లధనంపై పోరులో వెనక్కి తగ్గేది లేదు

 న్యూఢిల్లీ: నవంబర్ 8 పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  మరోసారి జాతి నుద్దేశించి ప్రసంగిస్తున్నారు. నగదు కష్టాలపై శనివారం మాట్లాడిన ఆయన ముందుగా కొత్త ఆశలతో, కొత్త ఆకాంక్షలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాన్నారు. నల్లధనంపై  ప్రభుత్వం  చేపట్టిన పోరాటంలో  భుజం భుజం కలిపి కోట్లాదిమంది ప్రజలు మద్దతు అందిస్తున్నారు. దీనికితాను గర్వపడుతున్నానని ప్రధాని  హర్ష వ్యక్తం  చేశారు.

ప్రజలు అందిస్తున్న ఈ అపూర్వ మద్దతుతో   నేపథ్యంలో నల్లధనం,  నకిలీ కరెన్సీ పై  పోరాటంలో ఒక్క అడుగు కూడా వెనక్కి వేసిదిలేదని స్పష్టం చేశారు.  ముఖ్యంగా  దీపావళి పండుగ  ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నల్లధనంపై ఉక్కుపాదం మోపడం ద్వారా దీర్ఘ  ప్రయోజనాలపై దృష్టి పెట్టింది. స్వచ్చ భారత్  దిశగా దేశం అడుగులు వేస్తోంది. అత్యాచారాలు, నల్లధనం, నిరోధంలో నిజాతీపరులకు కూడా  కష్టం కలిగింది.

 
అయినా చెడు పై పోరాటానికి అనేక ష్టాలను ఎదుర్కొంటూ అసమాన ధైర్యంతో  ప్రజలు పోరాటం చేస్తున్నారని మోదీ  చెప్పారు. దీపావళి తరువాత  కేంద్ర ప్రభుత్వం కోట్లాది మంది ప్రజల కష్టాలనుంచి గట్కెక్కేపనిలో పడ్డట్టు  మోదీ  తెలిపారు.  అనేక సందర్భాల్లో  పోరాటాల్లో ప్రజలు కంకణ బద్దులయ్యారు.  ముఖ్యంగా కార్గిల్ యుద్దం,  అనేక కోట్లాది మంది భారతీయుల దేశభక్తిని మనం చూశాం. మోదీ ప్రసంగం ఇంకా కొనసాగుతోంది.
 

కాగా  నవంబర్‌ 8న రూ.500, 1000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.  అనంతరం 2వేలు, 500 నోట్లను చలామణిలోకి తెచ్చింది. దీంతో  పాత నగదును మార్చుకోవడానికి, కొత్త కరెన్సీని పొందడానికి సామాన్యులు క్యూలైన్లలో నానా కష్టాలు పడ్డారు. కాగా నోట్ల మార్పిడికి గడువు కూడా  నిన్నటి(డిసెంబర్ 30 ) తో ముగిసిపోయింది. మరోవైపు పెద్దనోట్ల రద్దుతో తాత్కాలికంగానే ప్రజలకు కష్టాలు ఉంటాయని, దీర్ఘకాలంలో సంపన్నులే దీనివల్ల నష్టపోతారని, పేదలు, సామాన్యులు లాభపడతారని  మోదీ చెప్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement