నేపాల్ పార్లమెంట్లో ప్రసంగించనున్న మోడీ
ఖాట్మాండు: భారత ప్రధాని నరేంద్ర మోడీ నేపాల్ పార్లమెంట్లో ప్రసంగించనున్నారు. వచ్చే నెలలో మోడీ రెండు రోజుల పాటు నేపాల్ పర్యటనకు వెళ్లనున్నారు. ఆగస్టు 4న మోడీ నేపాల్ పార్లమెంట్ను సందర్శించనున్నారు.
నేపాల్లోని ప్రసిద్ధ పశుపతి ఆలయాన్ని మోడీ సందర్శించనున్నారు. హిందువులు పవిత్రంగా భావించే ఈ ఆలంయలో శివుడు కొలువైఉన్నాడు. మోడీ రాకను పురస్కరించుకుని ఆలయం పరిసర ప్రాంతాలను శుభ్రం చేస్తున్నారు. మోడీ పర్యటన సందర్భంగా ఇరు దేశాల నాయకులు కీలక అంశాలపై చర్చించనున్నారు. భారత ప్రధానిగా మోడీ బాధ్యతలు స్వీకరించాక ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలకు ప్రాధానం ఇస్తున్నారు. మోడీ ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాధినేతలు హాజరైన సంగతి తెలిసిందే.