ఒక యువకుడు తెలిసి చేశాడో తెలియక చేశాడో గాని ఆన్‌లైన్‌లో కండోమ్స్ ఆర్డర్ చేశాడు. అది తానున్న చోటికి కాకుండా ఇంటికి చేరడంతో యువకుడి తల్లి షాక్ కు గురైంది. ఈ సంఘటనను ఆ యువకుడి సోదరి సోషల్ మీడియాలో పంచుకోగా నెటిజన్ల నుంచి విశేషమైన స్పందన వచ్చింది.
ఓ యువకుడు ఆన్‌లైన్ షాపింగుకు బాగా అలవాటు పడ్డాడో ఏమో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో కండోమ్స్ ఆర్డర్ చేశాడు. ఆర్డర్ అయితే బాగానే చేశాడు కానీ అడ్రస్ మార్చడం మర్చిపోయాడా ప్రబుద్ధుడు. దీంతో ఆ కండోమ్స్ పార్సిల్ కాస్తా తానున్న చోటికి కాకుండా తన ఇంటికి చేరింది. ఆ యువకుడి తల్లి తన కొడుకు ఎదో సర్ప్రైజ్ ప్లాన్ చేశాడనుకుందో ఏమో ఆతృతగా పార్సిల్ తెరిచింది. లోపల కండోమ్స్ చూసి పాపం ఆ తల్లి షాక్ కు గురైంది.
ఈ సంఘటనను ఆ యువకుడి సోదరి ఎలెనా ట్విట్టర్లో పోస్ట్ చేసి.. అన్నయ్య పాపం అడ్రస్ మార్చడం మర్చిపోయినట్టున్నాడు.. అమ్మ ఈ పార్సిల్ రిసీవ్ చేసుకుందని రాసి కండోమ్స్ ఫోటోను షేర్ చేసింది..
Looks like my brother forgot to change the address because my mom just received his instamart order💀💀 pic.twitter.com/BmZbLyEAtr
— elena (@elena4yo) July 4, 2023
ఈ పోస్ట్ కు అతి తక్కువ వ్యవధిలోనే లక్షల్లో వ్యూస్ వచ్చాయి. చాలా మంది తర్వాత ఏం జరిగిందని ప్రశ్నించగా.. అమ్మకు దిమ్మతిరిగి తమ ఫ్యామిలీ గ్రూపు నుంచి అన్నయ్యని తొలగించిందని చెబుతూ వాట్సప్ గ్రూపులో తన సోదరుడిని తొలగించిన స్క్రీన్ షాట్ పోస్ట్ చేసింది. దీంతో ట్విట్టరంతా నవ్వులమయమైంది.
— elena (@elena4yo) July 4, 2023
ఇవ్వాళ రేపు ఏమి కొనాలన్నా అంతా ఆన్‌లైన్‌లో నడుస్తోంది మరి. మొబైల్ ఆన్ చేసి మీట నొక్కితే చాలు కాళ్ళకు భారం తగ్గి అన్నీ కళ్ల ముందుకు వచ్చి వాలుతున్నాయి. అలాగని అన్నిటినీ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయకుండా కొన్నిటిని వెళ్లి కొనుక్కోవడమే మంచిదని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
ఇది కూడా చదవండి: బైక్ హెల్మెట్ ధరించి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్.. ఎందుకంటే..
Comments
Please login to add a commentAdd a comment