సాక్షి, న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2020-21)గానూ ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) డిపాజిట్లపై వడ్డీరేటును 8.5 శాతంగా ఖరారు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయకుండా యథాతథంగా ఉంచారు. గురువారం శ్రీనగర్‌లో జరిగిన ఈపీఎఫ్‌ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశం ఈ మేరకు నిర్ణయించింది. ఈ నిర్ణయంపై అధికారిక ప్రకటన మరికొద్ది క్షణాల్లో వెలువడనుంది.
కాగా కరోనామహమ్మారి నేపథ్యంలో పీఎఫ్ వడ్డీరేటును తగ్గనుందనే అంచనాలు వెలువడ్డాయి. 2019-20 సంవత్సరానికి వడ్డీ రేటును 8.5 శాతంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 2018-19లో ఇది 8.65 శాతంగా ఉండగా, గత ఏడాది 8.5 శాతం వద్ద 7 సంవత్సరాల కనిష్టానికి చేరింది. తాజాగా దాదాపు దశాబ్దం కనిష్టానికి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment