ఈపీఎఫ్ చందాదారులకు శుభవార్త. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) అతి త్వరలో సుమారు ఆరు కోట్ల మంది చందాదారుల ఖాతాలలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) వడ్డీని క్రెడిట్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఒక ఖాతాదారుడు ట్విటర్ లో అడిగిన ప్రశ్నకు ఈపీఎఫ్ఓ ఇలా ట్వీట్ చేసింది.. "ఈ ప్రక్రియ పైప్ లైన్ లో ఉంది. అతి త్వరలో మీ ఖాతాలో చూపించవచ్చు. ఇప్పటి వరకు పొగుచేసిన వడ్డీ పూర్తిగా క్రెడిట్ చేయబడుతుంది. వడ్డీలో ఎటువంటి నష్టం ఉండదు. దయచేసి సహనాన్ని పాటించండి" అని పేర్కొంది.
ఇప్పటివరకు తెలిసిన నివేదికల ప్రకారం.. రిటైర్ మెంట్ ఫండ్ రెగ్యులేటర్ ఈ నెలాఖరునాటికి 2020-21 ఆర్థిక సంవత్సరానికి 8.5 శాతం ఈపీఎఫ్ వడ్డీని క్రెడిట్ చేసే అవకాశం ఉంది. అయితే, ఈ ప్రక్రియ ఇంకా పైప్ లైన్ లో ఉంది. ఈపిఎఫ్ చందాదారులు తమ పీఎఫ్ బ్యాలెన్స్ అప్పుడప్పుడు చెక్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే వారి ఖాతాలో ఏదో ఒక రోజు ఈ నెలలో క్రెడిట్ చేసే అవకాశం ఉంది. చందాదారులు తమ ఈపీఎఫ్ బ్యాలెన్స్, వడ్డీ స్టేటస్ ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు.
The process is in pipeline and may be shown there very shortly. Whenever the interest will be credited, it will be accumulated and paid in full. There would be no loss of interest. Please maintain patience.
— EPFO (@socialepfo) July 28, 2021
ఆన్‌లైన్ లో పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి ఇలా..
- ఈపీఎఫ్ పోర్టల్ https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login లింకు మీద క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీ ఖాతా ఓపెన్ చేయడానికి మీ యుఎఎన్ నెంబర్, పాస్ వర్డ్ నమోదు చేయండి.
- సైన్ ఇన్ చేసిన తర్వాత మీరు మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment