వేతన జీవులు డబ్బులు పొదుపు చేసుకునే ప్రావిడెంట్ ఫండ్ (PF)లో డిపాజిట్ల వడ్డీ రేటును 8.15 శాతానికి పెంచాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సిఫార్సును ప్రభుత్వం జులై 24న ఆమోదించింది.
ఈ ప్రకటన వెలువడినప్పటి నుంచి చాలా మంది సభ్యులు తమ పీఎఫ్ ఖాతాలో వడ్డీ మొత్తం ఎప్పుడు జమవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్విటర్‌లో ఓ చందాదారు 2022-23 ఆర్థిక సంవత్సారానికి సంబంధించిన వడ్డీ ఎప్పుడు జమవుతుందని అడిగారు. దీనికి ఈపీఎఫ్‌ఓ స్పందిస్తూ, ప్రాసెస్ జరుగుతోందని, అతి త్వరలో వడ్డీ సొమ్ము జమవుతుందని బదులిచ్చింది. వడ్డీ సొమ్ము ఎప్పుడు జమయినా మొత్తం జమవుతుందని, కాస్త ఓపిక పట్టాలని కోరింది.
EPFO: వేతన జీవులకు గుడ్‌న్యూస్: ఈపీఎఫ్ వడ్డీని పెంచిన కేంద్రం
సాధారణంగా పీఎఫ్ వడ్డీని నెలవారీ ప్రాతిపదికన లెక్కిస్తారు. ఆర్థిక సంవత్సరం చివరిలో జమ చేస్తారు. ఇలా జమయిన వడ్డీ.. తర్వాత నెల బ్యాలెన్స్‌కి యాడ్ అవుతుంది. ఆ మొత్తం అంతటికీ మళ్లీ వడ్డీ లెక్కిస్తారు. వడ్డీ మొత్తం జమయిన తర్వాత పీఎఫ్ చందాదారులు ఈపీఎఫ్‌ఓ వెబ్‌సైట్, ఎస్సెమ్మెస్, మిస్డ్ కాల్‌లు లేదా ఉమంగ్ యాప్‌తో సహా వివిధ మోడ్‌ల ద్వారా వారి ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోవచ్చు.
EPFO Provides dedicated portal for the members of EPF
— EPFO (@socialepfo) August 4, 2023
For more details please click on the below link 👇https://t.co/Y6MCy1V8rx#epf #ईपीएफ #पीएफ #epfowithyou #AmritMahotsav #HumHaiNa #epfo@PMO @byadavbjp @Rameswar_Teli @MIB_India @LabourMinistry @PIB_India @AmritMahotsav
Comments
Please login to add a commentAdd a comment