provident fund
-
పీఎఫ్ పేరుతో మోసం - కోట్ల రూపాయలు కోల్పోయిన వృద్ధ జంట
టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో.. సైబర్ మోసాలు కూడా అంతే వేగంగా డెవలప్ అవుతున్నాయి. ఇలాంటి మోసాలకు సంబంధించిన సంఘటనలు గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో సంఘటన ఇప్పుడు తెరమీదకు వచ్చింది. ఇందులో బాధితులు ఏకంగా రూ. 4.32 కోట్లు మోసపోయినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ముంబైకి చెందిన 70 ఏళ్ల వ్యక్తి ఓ సంస్థలో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యారు. అతని భార్యకు ఒక గుర్తు తెలియని వ్యక్తి ఎంప్లాయిస్ ప్రాఫిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నుంచి ఫోన్ చేస్తున్నట్లు నమ్మించి.. ఆమె భర్తకు సంబంధించిన చాలా వివరాలను వెల్లడించి, మీ భర్త పీఎఫ్ ఖాతాలో 20 సంవత్సరాలకు కంపెనీ రూ. 4 లక్షలు డిపాజిట్ చేసినట్లు తెలిపింది. కంపెనీ డిపాజిట్ చేసిన డబ్బు ఇప్పుడు రూ. 11 కోట్లుకు మెచ్యూర్ అయిందని, ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి టీడీఎస్, జీఎస్టీ, ఇన్కమ్ టాక్స్ చెల్లించాల్సి ఉంటుందని తెలిపాడు. కాలర్ చెప్పినట్లుగా వృద్ద మహిళ పలుమార్లు రూ. 4.32 కోట్లు వారి ఖాతలో జమచేసింది. ఇదీ చదవండి: రిలయన్స్ బోర్డులోకి అంబానీ వారసులు - ఆమోదం తెలిపిన షేర్ హోల్డర్స్ ఎన్ని రోజులకు డబ్బు రాకపోవడం మాత్రమే కాకుండా.. ఇంకా డబ్బు డిపాజిట్ చేయాలని డిమాండ్ చేయడం, ఐటీ శాఖకు సమాచారం అందిస్తామని బెదిరించడం కూడా స్టార్ట్ చేశారు. చివరికి మోసపోయినట్లు గ్రహించిన ఈ వృద్ధ జంట జరిగిన విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదీ చదవండి: యువతనుద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి - ఇలా చేయాల్సిందే అంటూ.. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని, గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఎక్కువ డబ్బు వస్తుందని అత్యాశ చూపితే ఎవరూ మోసపోవద్దని, బ్యాంకులకు సంబంధించిన వివరాలను ఎవరితోనూ పంచుకోకూడదని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
పీఎఫ్ వడ్డీ డబ్బులు ఎప్పుడు పడతాయి? ఈపీఎఫ్ఓ ఏం చెప్పింది?
వేతన జీవులు డబ్బులు పొదుపు చేసుకునే ప్రావిడెంట్ ఫండ్ (PF)లో డిపాజిట్ల వడ్డీ రేటును 8.15 శాతానికి పెంచాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సిఫార్సును ప్రభుత్వం జులై 24న ఆమోదించింది. ఈ ప్రకటన వెలువడినప్పటి నుంచి చాలా మంది సభ్యులు తమ పీఎఫ్ ఖాతాలో వడ్డీ మొత్తం ఎప్పుడు జమవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్విటర్లో ఓ చందాదారు 2022-23 ఆర్థిక సంవత్సారానికి సంబంధించిన వడ్డీ ఎప్పుడు జమవుతుందని అడిగారు. దీనికి ఈపీఎఫ్ఓ స్పందిస్తూ, ప్రాసెస్ జరుగుతోందని, అతి త్వరలో వడ్డీ సొమ్ము జమవుతుందని బదులిచ్చింది. వడ్డీ సొమ్ము ఎప్పుడు జమయినా మొత్తం జమవుతుందని, కాస్త ఓపిక పట్టాలని కోరింది. EPFO: వేతన జీవులకు గుడ్‌న్యూస్: ఈపీఎఫ్ వడ్డీని పెంచిన కేంద్రం సాధారణంగా పీఎఫ్ వడ్డీని నెలవారీ ప్రాతిపదికన లెక్కిస్తారు. ఆర్థిక సంవత్సరం చివరిలో జమ చేస్తారు. ఇలా జమయిన వడ్డీ.. తర్వాత నెల బ్యాలెన్స్‌కి యాడ్ అవుతుంది. ఆ మొత్తం అంతటికీ మళ్లీ వడ్డీ లెక్కిస్తారు. వడ్డీ మొత్తం జమయిన తర్వాత పీఎఫ్ చందాదారులు ఈపీఎఫ్ఓ వెబ్సైట్, ఎస్సెమ్మెస్, మిస్డ్ కాల్లు లేదా ఉమంగ్ యాప్‌తో సహా వివిధ మోడ్ల ద్వారా వారి ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోవచ్చు. EPFO Provides dedicated portal for the members of EPF For more details please click on the below link 👇https://t.co/Y6MCy1V8rx#epf #ईपीएफ #पीएफ #epfowithyou #AmritMahotsav #HumHaiNa #epfo@PMO @byadavbjp @Rameswar_Teli @MIB_India @LabourMinistry @PIB_India @AmritMahotsav — EPFO (@socialepfo) August 4, 2023 -
EPFO: ఇక ఎక్కడి నుంచైనా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్
న్యూఢిల్లీ: వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ పీఫ్ ఆఫీస్‌లకు వచ్చి లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించలేని పెన్షనర్లకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌వో) కొత్త వెసులుబాటు కల్పించింది. ఇకపై ఎక్కడి నుంచైనా సరే ఫేస్ రికగ్నిషన్ అథెంటికేషన్ సాయంతో డిజిటల్ రూపంలో లైఫ్ సర్టిఫికెట్‌ను పంపేందుకు అనుమతినిస్తూ ఈపీఎఫ్‌వో నిర్ణాయక మండలి నిర్ణయం తీసుకుంది. దీంతో 73 లక్షల మంది పెన్షనర్లలో ఇల్లు విడిచి బయటకు రాలేని వృద్ధులకు లబ్ధి చేకూరనుంది. పెన్షనర్ల కోసం కొత్తగా ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని కేంద్ర కార్మిక మంత్రి భూపేందర్ యాదవ్ ప్రారంభించారు. దీంతోపాటు పెన్షన్, ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకానికి సంబంధించిన కాలిక్యులేటర్‌ను అందుబాటులోకి తెచ్చారు. స్కీమ్ ప్రయోజనాలను పెన్షనర్, కుటుంబ సభ్యులు ఈ కాలిక్యులేటర్ ద్వారా తెల్సుకోవచ్చు. మరోవైపు, ఈపీఎఫ్‌వో సెక్యూరిటీస్‌కు కస్టోడియన్‌గా సిటీ బ్యాంక్‌ను ఎంపిక చేస్తూ పీఎఫ్ నిర్ణాయక మండలి సీబీటీ నిర్ణయం తీసుకుంది. -
పీఎఫ్‌పై 8.5 శాతం వడ్డీ!
నేడు వెలువడనున్న ప్రకటన న్యూఢిల్లీ: ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్)పై 8.5 శాతం వడ్డీని చెల్లించాలని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) నిర్ణయించింది. ఈమేరకు సోమవారం అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ నిర్ణయంతో 2013-14 సంవత్సరంలో ఐదుకోట్ల మంది ఖాతాదారులకు లబ్ధి కలుగుతుంది. సోమవారం జరిగే ఈపీఎఫ్ఓ కేంద్రపాలక మండలి(సీబీటీ) సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓకు రూ.20,796.96కోట్ల ఆదాయం వచ్చింది. ఉద్యోగుల భవిష్యనిధి, బీమా పథకాలను నిర్వహించడానికి అయ్యే పాలనాపరమైన వ్యయాన్ని పెంచడంపైనా నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం నెలకు ఈపీఎఫ్ పథకానికి ఐదు రూపాయలు, బీమా పథకానికి రెండు రూపాయల వంతున పాలనాపరమైన ఖర్చులు వసూలు చేస్తున్నారు. ఈసారి వీటిని వరుసగా రూ.500, రూ.200గా పెంచాలని భావిస్తున్నారు. అంతేకాక సర్వీసు చార్జీలను కూడా పై రెండు పథకాలకు క్రమంగా రూ.75, రూ.25 వంతున వసూలు చేయాలని నిర్ణయించనున్నారు. ఏడాది తర్వాత సీబీటీ సమావేశం జరుగుతోంది.