
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియను సులభతరం చేయడానికి రెండు ముఖ్యమైన మార్పులను ప్రవేశపెట్టింది. ఈ సంస్కరణలు ఈపీఎఫ్ సభ్యులకు గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తాయని, కార్యకలాపాలను క్రమబద్ధీకరిస్తాయని, ఆలస్యాన్ని తగ్గిస్తాయని భావిస్తున్నారు.
డాక్యుమెంట్ అప్‌లోడ్ అవసరం లేదు
ఫిర్యాదులను తగ్గించడానికి, క్లెయిమ్‌లను దాఖలు చేసే సౌలభ్యాన్ని మెరుగుపరిచే చర్యలో భాగంగా ఆన్‌లైన్ క్లెయిమ్ చేసేటప్పుడు సభ్యులు చెక్ లీవ్స్ లేదా ధ్రువీకరించిన బ్యాంక్ పాస్‌బుక్ వివరాల స్కాన్ చిత్రాలను అప్‌లోడ్ చేయాల్సిన అవసరాన్ని ఈపీఎఫ్ఓ తొలగించింది. గతంలో ఈ డాక్యుమెంట్లను నాసిరకంగా అప్లోడ్ చేయడం వల్ల చాలా క్లెయిమ్లు తిరస్కరణకు గురయ్యేవి. ఈ ఆవశ్యకతను తొలగించడం ద్వారా, ప్రక్రియ సులభతరం కావడం కాకుండా క్లెయిమ్ ఆమోదం వేగవంతమయ్యే అవకాశం ఉంటుంది.
కంపెనీ ఆమోదం అక్కర్లేదు
సభ్యుల బ్యాంకు ఖాతాలను వారి యూనివర్సల్ అకౌంట్ నంబర్లతో (యూఏఎన్) అనుసంధానించే ప్రక్రియలో యజమాన్యం (కంపెనీ) అనుమతి అవసరాన్ని ఈపీఎఫ్ఓ తొలగించింది. యూఏఎన్‌కు బ్యాంకుల ఖాతాల లింక్ కోసం సభ్యులు పెట్టుకున్న వినతులకు అనుమతులివ్వడంలో కొన్నిసార్లు యాజమాన్యాల వద్ద జాప్యం జరుగుతోంది. దీంతో క్లెయిమ్‌లు, ఇతర వాటి కోసం సభ్యులు సభ్యులు ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు తాజా మార్పుతో సభ్యులు ఇబ్బందులు తొలగుతాయి.
Under the leadership of PM Shri @narendramodi ji, EPFO continues its reform journey!
Two major reforms have been introduced to make the claim settlement process simpler, faster, and hassle-free for crores of EPF members & employers:
✅ No need to upload image of cheque leaf/… pic.twitter.com/YScWOkw0gn— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) April 3, 2025