మెజారిటీ విశ్లేషకులు, బ్యాంకర్ల అంచనాలు తలకిందులయ్యాయి. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ షాకింగ్ న్యూస్ ప్రకటించారు. కీలక రెపో రేటులో ఎలాంటి కోత లేదని వెల్లడిస్తూ మార్కెట్ వర్గాలకు, విశ్లేషకులకు షాకిచ్చారు. రెండు రోజుల సమీక్ష నేపథ్యంలో నిన్న సమావేశమైన ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ ఈ మేరకు నిర్ణయం ప్రకటించింది. రెపో రేటును ఏ మాత్రం మార్చకుండా ఇంతకుముందున్న 6.25 శాతాన్ని అలాగే ఉంచారు.