RBI repo rate
-
రుణ రేట్లను పెంచిన ఎస్బీఐ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నిధుల సమీకరణ ఆధారిత రుణ రేటును (ఎంసీఎల్ఆర్)ను పెంచింది. రెండు ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంకులు– కోటక్ మహీంద్రా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్‌లు కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. దీనితో ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన ఆయా బ్యాంకుల వ్యక్తిగత, గృహ, ఆటో రుణాలు మరింత ప్రియం కానున్నాయి. ఆర్బీఐ రెపో రేటు (మే నుంచి 1.9 శాతం పెంపుతో 5.9 శాతానికి అప్) పెంపు బాట పట్టిన నేపథ్యంలో పలు బ్యాంకులు తమ రుణ రేట్లను పెంచుతున్న సంగతి తెలిసిందే. ఎస్బీఐ, కోటక్, ఫెడరల్ బ్యాంక్ రేట్ల పెంపు వివరాలు ఇలా.. ► ఎస్బీఐ బెంచ్‌మార్క్ ఏడాది కాలపరిమితి ఎంసీఎల్ఆర్ 25 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెరిగి 7.95 శాతానికి చేరింది. ఈ రేటు అక్టోబర్ 15 నుంచీ అమల్లోకి వస్తుంది. మెజారీటీ కస్టమర్ల రుణ రేటు ఏడాది రేటుకే అనుసంధానమై ఉంటుంది. రెండు, మూడు సంవత్సరాల కాలపరిమితుల ఎంసీఎల్ఆర్ పావుశాతం చొప్పున పెరిగి వరుసగా 8.15 శాతం, 8.25 శాతానికి ఎగసింది. ఓవర్‌నైట్, నెల, మూడు, ఆరు నెలల రేట్లు 7.60–7.90 శాతం శ్రేణిలో ఉన్నాయి. ► కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎంసీఎల్ఆర్ వివిధ కాలపరిమితులపై 7.70–8.95 శ్రేణిలో ఉంది. ఏడాది ఎంసీఎల్ఆర్ 8.75 శాతం. అక్టోబర్ 16 నుంచి తాజా నిర్ణయం అమలవుతుంది. ► ఫెడరల్ బ్యాంక్ ఏడాది రుణ రేటు అక్టోబర్ 16 నుంచి 8.70 శాతానికి పెరిగింది. ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్ రేటు కోత కాగా, ఎస్బీఐ సేవింగ్స్ డిపాజిట్ రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనితో ఈ రేటు 2.70 శాతానికి దిగివచ్చింది. అక్టోబర్ 15 నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుంది. రూ.10 కోట్ల కన్నా తక్కువ బ్యాలెన్స్ ఉన్నవారికి తాజా రేటు అమలవుతుంది. కాగా, రూ.10 కోట్లు దాటిన సేవింగ్స్ అకౌంట్స్‌పై వడ్డీరేటును 2.75 శాతం నుంచి 3 శాతానికి పెంచుతున్నట్లు ఎస్బీఐ ప్రకటన పేర్కొంది. నిధుల భారీ సమీకరణ లక్ష్యంగా వివిధ బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచుతున్న నేపథ్యంలో ఎస్బీఐ చేసిన ఈ సర్దుబాట్లకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఎఫ్సీఎన్ఆర్ డిపాజిట్లపై బీఓబీ రేట్ల పెంపు కాగా, ప్రవాస భారతీయుల ఫారిన్ కరెన్సీ (ఎఫ్సీఎన్ఆర్) డిపాజిట్లపై బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) వడ్డీరేట్లు పెంచింది. వివిధ కరెన్సీలు, మెచ్యూరిటీ కాలపరిమితులపై 135 బేసిస్ పాయింట్ల వరకూ వడ్డీరేటు పెరిగినట్లు బీఓబీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 16 నుంచి నవంబర్ 15 వరకూ తాజా రేట్లు అమలవుతాయని కూడా వివరించింది. -
పరిశ్రమలపై ఆర్బీఐ గవర్నర్ దృష్టి
ముంబై: దేశ స్థూల ఆర్థిక పరిస్థితులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ మరింత దృష్టి సారిస్తున్నారు. ఆర్థికాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన గురువారం పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ ట్వీట్లో దాస్ ఈ వివరాలను వెల్లడించారు. నవంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి కేవలం అరశాతంగా నమోదయిన నేపథ్యంలో గవర్నర్ పారిశ్రామిక బృందాలతో భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. డిసెంబర్ రిటైల్ (2.19%), టోకు ధరలు (3.80%) తగ్గిన పరిస్థితుల్లో ఆర్బీఐ రెపో రేటును (ప్రస్తుతం 6.5%) తగ్గించాలని ఇప్పటికే పారిశ్రామిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. పాలసీ విధానాలు, తీసుకునే నిర్ణయాల విషయంలో ఆర్బీఐ తమ వాదనలకు ప్రాధాన్యమివ్వడం లేదని కూడా పలు సందర్భాల్లో పారిశ్రామిక ప్రతినిధుల నుంచి విమర్శ వస్తోంది. కొత్త గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ద్రవ్య పరపతి విధాన కమిటీ ఫిబ్రవరి 7వ తేదీన ద్వైమాసిన ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించనున్న సంగతి తెలిసిందే. వరుస సమావేశాలు... ఆర్బీఐ గవర్నర్‌గా డిసెంబర్ 12న బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండుసార్లు ప్రభుత్వ బ్యాంకర్లతో, ఒకసారి ప్రైవేటు బ్యాంకర్లతో ఆర్బీఐ గవర్నర్ సమావేశమయ్యారు. లిక్విడిటీ (ద్రవ్యలభ్యత), చిన్న పరిశ్రమలకు రుణ లభ్యతసహా దిద్దుబాటు చర్యల పరిధిలో (పీసీఏ) ఉన్న 11 బ్యాంకులపై ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు వార్తలు వచ్చాయి. అటు తర్వాత లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ), నాన్– బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల ప్రతినిధులతో కూడా భేటీ అయ్యారు. ఎంఎస్ఎంఈ ప్రతినిధులతో సమావేశం అనంతరం ఈ రంగం అభివృద్ధిపై సలహాలకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ మాజీ చైర్మన్ యూకే సిన్హా నేతృత్వంలో ఆరుగురు సభ్యుల నిపుణుల కమిటీనీ ఏర్పాటు చేయడం గమనార్హం. ఎంఎస్ఎంఈలకు సంబంధించి రూ.25 కోట్ల వరకూ రుణం ఉండి, చెల్లించలేకపోతున్న రుణాన్ని, ఒకేసారి పునర్వ్యవస్థీకరించడానికి కూడా ఆర్బీఐ అనుమతించింది. -
4 ఏళ్లలో ఎన్నడూ లేనంత ధరల భయం
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జూన్‌లో గత నాలుగేళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగింది. ధరల పెరుగుదల రేటు 5.77 శాతం. అంటే 2017 జూన్ నెలతో పోల్చిచూస్తే, 2018 జూన్ నెలలో టోకు వస్తువుల బాస్కెట్ ధరలు 5.77 శాతం పెరిగాయన్నమాట. కూరగాయలు, ఇంధన ధరల పెరుగుదల వంటివి దీనికి కారణం. ధరల పెరుగుదల రేటు ఇదే విధంగా తీవ్రంగా ఉంటే, ఆగస్టు పాలసీ సమీక్ష సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటు (ప్రస్తుతం 6.25 శాతం)ను మరో పావుశాతం పెంచే అవకాశం ఉందన్నది నిపుణుల అంచనా. జూన్ పాలసీ సమావేశంలో ఆర్బీఐ రెపో పావుశాతం పెరిగిన సంగతి తెలిసిందే. 2017 జూన్ నెలలో టోకు ద్రవ్యోల్బణం కేవలం 0.90 శాతంగా ఉంది. 2018 మేలో ఇది 4.43 శాతం. 2013 డిసెంబర్లో ద్రవ్యోల్బణం 5.9 శాతం ఉంది. అటు తర్వాత 2018 జూన్ నెలలోనే మళ్లీ అప్పటి తీవ్ర స్థాయికి చేరింది. ప్రధాన విభాగాలన్నీ పెరుగుదలే..! ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్ ఆర్టికల్స్, నాన్–ఫుడ్ ఆర్టికల్స్‌తో కూడిన ప్రైమరీ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం భారీగా 5.30 శాతం ఎగసింది. 2017 ఇదే నెలలో ఈ విభాగంలో అసలు ద్రవ్యోల్బణం పెరక్కపోగా – 4.17 శాతం క్షీణించింది. ఇక ఒక్క ఫుడ్ ఆర్టికల్స్‌లో రేటు –3.33 శాతం క్షీణత నుంచి 1.80 శాతానికి పెరిగింది. నాన్– ఫుడ్ ఆర్టికల్స్ రేటు కూడా –4.99 శాతం క్షీణత నుంచి 3.81 శాతానికి పెరిగింది. మే నెలలో ఈ రేటు కేవలం 1.6 శాతంగా ఉంది. ఇంధనం, విద్యుత్: ఈ రంగంలో ద్రవ్యోల్బణం 5.16 శాతం నుంచి 16.18 శాతానికి ఎగసింది. మేలో ఇది 11 శాతం మాత్రమే. తయారీ: మొత్తం సూచీలో దాదాపు 60 శాతం ఉన్న ఈ విభాగంలో ద్రవ్యోల్బణం 2.36 శాతం నుంచి 4.17 శాతానికి పెరిగింది. కూరగాయల ధరల చూస్తే... మేలో పెరుగుదల రేటు కేవలం 2.51 శాతం ఉంటే ఇది జూన్‌లో ఏకంగా 8.12 శాతానికి ఎగసింది. ఆలూ ధరలు మేలో 81.93 శాతం పెరుగుదల ఉంటే, జూన్‌లో మరింతగా 99.02 శాతానికి పెరిగాయి. ఉల్లి ధరలు ఇదే కాలంలో 13.20 శాతం నుంచి 18.25 శాతానికి ఎగశాయి. అయితే పప్పు దినుసుల ధరలు మాత్రం పెరక్కపోగా 20.23 శాతం తగ్గాయి. ఇటీవలే ప్రకటించిన రిటైల్ ద్రవ్యోల్బణం కూడా 4 శాతం పైగా నమోదయ్యింది. -
గృహ రుణాలు మరింత భారం
-
స్వల్పంగా పెరిగిన బీఓబీ వడ్డీ భారం!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) రుణ రేటు 5 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) పెరిగింది. ఆర్బీఐ కీలక రెపో రేటు నిర్ణయానికి ఒకరోజు ముందు బీఓబీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. తాజా నిర్ణయం ఎంసీఎల్ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్) జూన్ 7 నుంచీ అమల్లోకి వస్తుందని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. దీనితో దీనికి అనుసంధానమైన గృహ, వాహన రుణ రేట్లు కొంత పెరిగే వీలుంది. ఈ పెంపు నేపథ్యంలో ఇకపై బ్యాంక్ ఏడాది ఎంసీఎల్ఆర్ 8.45 శాతంగా ఉండనుంది. రోజువారీ, నెల, మూడు నెలలు, ఆరు నెలల రేట్లు వరుసగా 7.95, 8, 8.1, 8.3 శాతాలుగా ఉంటాయి. ఇప్పటికే ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, పీఎన్బీ, యూనియన్ బ్యాంక్లుసహా పలు బ్యాంకులు ఎంసీఎల్ఆర్ను స్వల్పంగా పెంచాయి. -
ధరలపై పెరుగుతున్న భయాలు
ముంబై: అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పరుగు దేశంలో ధరలు పెరుగుతాయనే భయాలను పెంచుతోంది. ద్రవ్యోల్బణం కట్టడిలో భాగంగా ఆగస్టులో జరిగే ద్రవ్య పరపతి విధానం సందర్భంగా ఆర్బీఐ తన కీలక రేటు రెపోను (ప్రస్తుతం 6 శాతం) పావుశాతం పెంచే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. రెపో రేటు పెంపు ద్వారా వ్యవస్థలో నగదు ప్రవాహానికి అడ్డుకట్ట వేయటం, డిమాండ్ తగ్గించటం, తద్వారా ధరల పెరుగుదలను నిరోధించటం ఆర్బీఐ లక్ష్యం. అయితే ఇలాంటి సందర్భాల్లో వ్యవస్థలో డిమాండ్ తగ్గి వృద్ధికి బ్రేక్ పడుతుందన్న ఆందోళనలుంటాయి. అందుకని జూన్‌లో మాత్రం రేటు పెంపు ఉండదన్నది నిపుణుల అభిప్రాయం. చమురు ధరల పెరుగుదల, దీనితో ఈ కమోడిటీని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశంగా భారత్‌లో వాణిజ్యలోటు (ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం), కరెంట్ అకౌంట్ లోటు (ఎఫ్ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీలు మినహా దేశంలోకి వచ్చీ–పోయే నికర విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య వ్యత్యాసం) భయాలు, వెరసి రూపాయి వేగంగా పతనమవుతున్న సంగతి తెలిపిందే. హెచ్ఎస్బీఐ కూడా ఆగస్టు, అక్టోబర్లలో రేటు పెరిగే అవకాశం ఉందన్న అంచనాలను ఇప్పటికే వెలువరించింది. దేశీయ పరిస్థితులు ఓకే... ఊహించినదానికన్నా ముందే ఆర్బీఐ రేటు పెంచే అవకాశం ఉందని భావిస్తున్నాం. 2019 తొలి త్రైమాసికంలో రేటు పెంపు ఉంటుందని తొలుత అంచనా వేశాం. అయితే ఆగస్టులోనే పావుశాతం పెరిగే అవకాశముంది. రేటు పెంపు కేవలం వేగంగా మారుతున్న అంతర్జాతీయ అంశాలకు సంబంధించినదిగా భావిస్తున్నాం. దేశీయంగా ఆర్థిక పరిస్థితులు మాత్రం బలహీనంగా లేవు. – మెక్వైరీ, ఆస్ట్రేలియన్ బ్రోకరేజ్ సంస్థ కఠిన ధోరణివైపు మొగ్గు... పాలసీ రేట్లకు సంబంధించి ఇప్పటి వరకూ ఆర్బీఐ కొంత సరళతర, తటస్థ విధానాన్నే పాటిస్తోంది. అయితే ఆగస్టులో తన విధానాన్ని ఆర్బీఐ మార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్టులో పావుశాతం, అక్టోబర్‌లో పావుశాతం మొత్తం అరశాతం రేటు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్‌లో పాలసీ సంకేత సూచీ 0.01 పాయింట్ల వద్ద ఉంటే, ఇది మేలో 0.10 పాయింట్ల వద్దకు మారింది. క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, రూపాయి పతనం దీనికి కారణం. – నొమురా, జపాన్ బ్రోకరేజ్ సంస్థ పెరిగే చమురు రేట్లతో వృద్ధికి విఘాతం: పరిశ్రమలు పెరుగుతున్న ఇంధన ధరలు దేశ ఆర్థిక వృద్ధి గతిని దెబ్బతీసే ప్రమాదముందని పరిశ్రమవర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలను తక్షణమే తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. వీటిని వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానంలోకి చేర్చాలని కోరాయి. పరిశ్రమ సమాఖ్యలు ఫిక్కీ, అసోచాం ఈ మేరకు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మళ్లీ ఎగుస్తుండటంతో (ఈ వార్త రాసే రాత్రి 10 గంటల సమయానికి అంతర్జాతీయ మార్కెట్లో బ్యారల్ బ్రెంట్ క్రూడ్ ధర నాలుగేళ్ల గరిష్ట స్థాయిలో 78 డాలర్లు, లైట్ స్వీట్ ధర 72 డాలర్లపైన ట్రేడవుతోంది) దేశీయంగా ద్రవ్యోల్బణం, వాణిజ్య లోటు మొదలైనవి మరింతగా పెరిగే రిస్కులు అధికమయ్యాయని ఫిక్కీ ప్రెసిడెంట్ రశేష్ షా తెలిపారు. రూపాయి బలహీనపడుతుండటం వల్ల దిగుమతుల భారం మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఎకానమీ క్రమంగా కోలుకుంటున్న తరుణంలో.. ముడిచమురు రేట్ల పెరుగుదల వల్ల దేశ ఆర్థిక వృద్ధి గతికి గణనీయమైన రిస్కులు నెలకొన్నాయన్నారు. జీఎస్టీ పరిధిలోకి తేవడానికి సంబంధించి రాష్ట్రాలు, కేంద్రం కలిసి పనిచేస్తేనే ఇది సాధ్యపడుతుంది’ అని అసోచాం సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ వ్యాఖ్యానించారు. -
ఆశలు ఆవిరి.. ఎక్కడి రేట్లు అక్కడే
-
వడ్డీ రేట్ల కోతకు చాన్స్
న్యూఢిల్లీ: బడ్జెట్లో తీసుకున్న చర్యలు, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో సమీప భవిష్యత్తులో బ్యాంకింగ్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రేట్ల కోత సంకేతాలకు అవకాశాలు మరింత సుస్పష్టమయినట్లు పలు విశ్లేషణా సంస్థలు, నిపుణులు అంచనావేస్తున్నారు. వీరి అంచనాలను ఒక్కసారి పరిశీలిస్తే... ప్రస్తుతం ద్రవ్యోల్బణం అత్యంత దిగువ స్థాయిలో ఉంది. బడ్జెట్లో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించిన పలు చర్యలు ఈ ధోరణికి ఎటువంటి విఘాతం కలిగించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఈ వారంలోనే ఎప్పుడైనా రెపో రేటు(బ్యాంకులకు ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు-ప్రస్తుతం 8%)ను కొంత తగ్గించే వీలుంది. 2015 ముగింపు నాటికి ఆర్బీఐ రెపో రేటును 1.25% తగ్గించే అవకాశం ఉంది. ఇక బడ్జెట్ వ్యవహారం పూర్తయిపోయినందున, కీలక పాలసీ సంస్కరణల కోసం ఇన్వెస్టర్లు దృష్టి పెడతారు. - చేతన్, మోర్గాన్ స్టాన్లీ ఆసియా ఎకనమిస్ట్ సమీప భవిష్యత్తులో అర శాతం మేర వడ్డీ రేట్ల కోతకు అవకాశం ఉందన్న మా అంచనాలకు కట్టుబడి ఉన్నాం. ఇందులో మొదటి విడత తగ్గింపు ఏప్రిల్ ఆర్బీఐ సమీక్షా సమావేశంలో చోటుచేసుకునే అవకాశం ఉంది. - భండారీ, హెచ్ఎస్బీసీ చీఫ్ ఇండియన్ ఎకనమిస్ట్ ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు కట్టడికి కట్టుబడి ఉన్నట్లు బడ్జెట్ సూచించింది. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్ 7వ తేదీ (తదుపరి పాలసీ సమీక్ష తేదీ), జూన్‌లో కూడా ఆర్బీఐ పావుశాతం చొప్పున రేట్ల కోత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. - బ్యాంక్ ఆఫ్ అమెరికా మిరిల్ లించ్ జూన్ నాటికి అరశాతం రేట్ల కోత ఉంటుందన్న మా అంచనాల్లో ఎటువంటి మార్పూ లేదు. - డీబీఎస్ బ్యాంక్ వృద్ధికి ప్రోత్సాహం దిశగా ఏప్రిల్ 7న పాలసీ రేటును పావు శాతం తగ్గించే అవకాశాలు ఉన్నాయి. సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్ల తగ్గింపు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. - నోమురా