చివరకు ఆ రోజు వచ్చింది.. రేపో రేటు తగ్గింపుపై మీమ్స్ | Aakhir Woh Din aa Hi Gaya Memes On RBI Repo Rate | Sakshi
Sakshi News home page

చివరకు ఆ రోజు వచ్చింది.. రేపో రేటు తగ్గింపుపై మీమ్స్

Published Fri, Feb 7 2025 8:01 PM | Last Updated on Fri, Feb 7 2025 8:41 PM

Aakhir Woh Din aa Hi Gaya Memes On RBI Repo Rate

ఊహించినట్టుగానే 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (RBI) దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత మొదటిసారిగా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఇది 6.25 శాతానికి వచ్చింది. ఖర్చులను పెంచడానికి, వృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కేంద్ర బడ్జెట్‌లో వ్యక్తిగత పన్ను రేట్లను తగ్గించిన క్రమంలోనే ఈ రేటు తగ్గింపు నిర్ణయం కూడా రావడం గమనార్హం.

ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra) నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (MPC) ఫిబ్రవరి 5న.. మూడు రోజుల సమావేశాన్ని ప్రారంభించింది. శుక్రవారం వడ్డీ రేట్లపై సంజయ్ మల్హోత్రా ప్రకటన చేశారు. పూర్వ గవర్నర్‌ శక్తికాంత దాస్ పదవీకాలం ముగిసిన తర్వాత, సంజయ్ మల్హోత్రా డిసెంబర్ 2024లో బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది మొదటి ద్రవ్య విధాన కమిటీ సమావేశం. మార్కెట్లు రేటు తగ్గింపు కోసం ఆసక్తిగా ఎదురుచూశాయి. అందరూ అంచన వేసినట్లుగానే ఆర్బీఐ రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో బెంచ్‌మార్క్ రుణ రేటు ప్రస్తుత 6.5 శాతం నుండి 6.25 శాతానికి తగ్గింది.

ఇదీ చదవండి: రీఛార్జ్‌ లేకుండానే.. ఫ్రీగా కాల్స్ మాట్లాడొచ్చు: సింపుల్ ట్రిక్ ఇదే..

ఆర్బీఐ చివరిసారిగా 2020 మేలో రేపో రేట్లను తగ్గించింది. కోవిడ్-19 మహమ్మారి ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి అప్పట్లో రెపో రేటును 4 శాతానికి తగ్గించింది. 2022 మే నుంచి.. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, సరఫరా గొలుసు అంతరాయాలు, ప్రపంచ ధరల పెరుగుదలను ఎదుర్కోవడానికి సెంట్రల్ బ్యాంక్ రెపో రేటును ఏడు సార్లు 6.5 శాతానికి పెంచింది. కాగా ఇప్పుడు తగ్గిన రేపో రేటు హోమ్‌ లోన్‌ చెల్లించే కస్టమర్లకు ప్రయోజనాన్ని చేకూర్చుతుంది.

ఈ రోజు రేపో రేటును తగ్గించడంతో పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. దీనికి సంబందించిన మీమ్స్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఒకరు "ఆఖిర్ వో దిన్ ఆ హి గయా" (చివరకు, ఆ రోజు వచ్చింది) అనే పోస్ట్ సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement