వాతావరణంలో రికార్డు స్థాయిలో జనవరి 2025లో ఉష్ణోగ్రతలు పెరిగినట్లు కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ (సీ3ఎస్) తెలిపింది. లా నినా, తూర్పు పసిఫిక్‌లో ఏర్పడే ఉష్ణోగ్రతల వల్ల వాతావరణ మార్పుల్లో తేడాలొస్తున్నట్లు పేర్కొంది. జనవరిలో సాధారణంగా ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయి. కానీ అందుకు భిన్నంగా జనవరి 2025లో సగటు ప్రపంచ ఉష్ణోగ్రత 13.23 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు సీ3ఎస్ తెలిపింది. ఇది 2024 జనవరిలో నమోదైన రికార్డు కంటే 0.09 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉంది.
‘లా నినా’ అనేది మధ్య పసిఫిక్ మహాసముద్రంలో చల్లని ఉపరితల జలాలతో ఏర్పడే వాతావరణాన్ని సూచిస్తుంది. ఇది పసిఫిక్ చుట్టు పక్కల ప్రాంతాలను ప్రభావితం చేస్తుంది. ప్రపంచ ఉష్ణోగ్రతలపై లా నినా ప్రభావం ఉన్నప్పటికీ ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. తూర్పు పసిఫిక్‌లో మాత్రం సముద్ర ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఈ పరస్పర విరుద్ధం వాతావరణంలో మార్పు అధికంగా ఉండడంతోనే ఉష్ణోగ్రతలు పెరుగతున్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
గ్లోబల్ వార్మింగ్
ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదల గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల ప్రభావాన్ని హైలైట్ చేస్తుంది. ఉష్ణమండల పసిఫిక్‌లో ఏర్పడే ఉష్ణోగ్రతలు లా నినాపై తీవ్ర ప్రభావాన్ని చూపినట్లు సీ3ఎస్ డిప్యూటీ డైరెక్టర్ సమంత బర్గెస్ పేర్కొన్నారు. ప్రపంచ ఉష్ణోగ్రతలపై లా నినా తాత్కాలిక శీతలీకరణ ప్రభావం ఉన్నప్పటికీ గత రెండు సంవత్సరాలుగా రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలిపారు. అయితే ఈ ఉష్ణోగ్రతలు ప్రపంచవ్యాప్తంగా ఓకే ప్రభావాన్ని చూపలేదన్నారు. యునైటెడ్ స్టేట్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో అసాధారణంగా చల్లని ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కెనడియన్ ఆర్కిటిక్ వంటి ప్రాంతాల్లో 30 డిగ్రీ సెంటిగ్రేడ్‌ల ఉష్ణోగ్రత రికార్ట్ అయింది. ఈ తేలికపాటి వాతావరణం ఆర్కిటిక్‌లో సముద్ర మంచు మట్టాన్ని ప్రభావితం చేసిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. నారాయణమూర్తి ఏమన్నారంటే..
2025 జనవరిలో నమోదైన రికార్డు ఉష్ణోగ్రతలు గ్లోబల్ వార్మింగ్‌పై ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. జనవరిలోనే ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైతే రాబోయే వేసవికాలంలో ఏమేరకు ఉష్ణోగ్రతలు చూడాల్సి వస్తుందోనని నిపుణులు ఆందోళనలు చెందుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఉష్ణోగ్రతల్లో స్థిరమైన పెరుగుదల ఇబ్బందికరమైన అంశాన్ని సూచిస్తుంది. వాతావరణ మార్పుల ప్రభావాలతో ప్రపంచం సతమతమవుతున్న తరుణంలో గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల రాబోయే వేసవిలో వ్యవసాయ దిగుబడులు ప్రభావితం చెందే అవకాశం ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అది వ్యవసాయ ఉత్పత్తులపై ఆధారపడే కంపెనీల బ్యాలెన్స్‌షీట్లను ఎఫెక్ట్ చేస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment