
రుణాలపై విధించే వడ్డీరేట్లలో పారదర్శకతను పెంపొందించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చర్యలు తీసుకుంటోంది. విభిన్న రుణాలపై వసూలు చేసే గరిష్ట వడ్డీ రేట్లను బహిర్గతం చేయాలని బ్యాంకింగేతర ఫైనాన్స్ కంపెనీలను (NBFC) ఆదేశించింది. ఇందులో భాగంగా వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, బీమా, ఇతర ఛార్జీలను స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది.
ఆర్‌బీఐ ఆదేశాల్లోని కీలక అంశాలు
తనఖా, వాహనం, ఆస్తి, బంగారం, విద్యా రుణాలు వంటి వివిధ రుణ కేటగిరీలకు కాంపోజిట్ సీలింగ్ రేట్ల(గరిష్ట వడ్డీరేట్లు)ను ఎన్‌బీఎప్‌సీలు వెల్లడించాల్సి ఉంటుంది. ఈ గరిష్ట రేట్లను సంబంధిత డైరెక్టర్ల బోర్డులు ఆమోదించాలి. ఆర్థిక సంస్థల కార్యకలాపాలు ఆర్‌బీఐ ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్‌కు అనుగుణంగా ఉండాలి. ఇది వివిధ కేటగిరీల రుణగ్రహీతలకు వేర్వేరు రేట్లను వసూలు చేసే విధానాలపై స్పష్టతను ఇస్తుంది. రుణ రేట్లపై ఆర్‌బీఐ పరిమితులు విధించనప్పటికీ, బోర్డు ఆమోదం లేకుండా ఎన్‌బీఎఫ్‌సీలు వెల్లడించిన గరిష్ట రేట్లను మించరాదు.
ఇదీ చదవండి: కోటక్ బ్యాంకు అలెర్ట్.. ‘డెబిట్ కార్డులు పని చేయవు’
పెరుగుతున్న గృహ రుణభారం, రుణగ్రహీతలకు వారి రుణాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయాల్సి ఉంది. దీనిపై కొంత ఆందోళనలు వస్తున్న నేపథ్యంలో దానికి ప్రతిస్పందనగా ఆర్‌బీఐ ఈ చర్య తీసుకుంది. ఆర్‌బీఐ నేరుగా రుణ రేట్లను నియంత్రించనప్పటికీ ఎన్‌బీఎఫ్‌సీలు తమ రుణ ధరల్లో పారదర్శకతను కొనసాగించడానికి ఈ ఆదేశాలు ఉపయోగపడుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది సంస్థలపై కొంత ఆర్థిక ఒత్తిడిని కలిగించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment