
పేదల కోసం సంక్షేమ పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వానికి నిధులు అవసరం. కాబట్టి, పరిశ్రమలు పన్నులను తగ్గించాలని నిరంతరం డిమాండ్ చేయకూడదని కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో వెల్లడించారు.
జీఎస్‌టీ, ఇతర పన్నులను తగ్గించమని అడగకూడదు, ఒకవేళా పన్నులను తగ్గిస్తే.. ఇంకా తగ్గించాలని చెబుతారు. ఎందుకంటే అది మానవ నైజం. పన్నులు వసూలు చేయకుండా.. ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడం కష్టం. ధనవంతుల నుంచి పన్ను తీసుకొని.. పేదలకు ప్రయోజనాలు కల్పించడం ప్రభుత్వ దార్శనికత అని గడ్కరీ అన్నారు.
రెండేళ్లలోపు భారతదేశంలోని లాజిస్టిక్స్ ఖర్చు 9 శాతానికి తగ్గుతుందని నితిన్ గడ్కరీ అన్నారు. ప్రస్తుతం భారతదేశ లాజిస్టిక్స్ ఖర్చు 14 నుంచి 16 శాతంగా ఉంది. చైనాలో లాజిస్టిక్స్ ఖర్చు 8 శాతంగా ఉంది. అమెరికా, యూరోపియన్ దేశాలలో ఇది 12 శాతం అని మంత్రి అన్నారు. కాబట్టి మరో రెండేళ్లలో మన దేశంలో కూడా లాజిస్టిక్ ఖర్చులను తగ్గించనున్నట్లు స్పష్టం చేశారు. అంత కాకుండా పెట్టుబడిని పెంచడం ద్వారా భారతదేశం మరిన్ని ఉద్యోగాలను సృష్టించబోతోందని మంత్రి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: నెలకు 10 రోజులు.. టెక్ కంపెనీ కొత్త రూల్!
మీరు సంపద సృష్టికర్తలు మాత్రమే కాదు, ఉద్యోగాల సృష్టికర్తలు కూడా. ఈ స్వర్ణ యుగాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. అంతేకాకుండా, భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి దిగుమతులను తగ్గించి ఎగుమతులను పెంచాల్సిన అవసరాన్ని గడ్కరీ నొక్కి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment