న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) రుణ రేటు 5 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) పెరిగింది. ఆర్‌బీఐ కీలక రెపో రేటు నిర్ణయానికి ఒకరోజు ముందు బీఓబీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. తాజా నిర్ణయం ఎంసీఎల్‌ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్) జూన్ 7 నుంచీ అమల్లోకి వస్తుందని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.
దీనితో దీనికి అనుసంధానమైన గృహ, వాహన రుణ రేట్లు కొంత పెరిగే వీలుంది. ఈ పెంపు నేపథ్యంలో ఇకపై బ్యాంక్ ఏడాది ఎంసీఎల్‌ఆర్ 8.45 శాతంగా ఉండనుంది. రోజువారీ, నెల, మూడు నెలలు, ఆరు నెలల రేట్లు వరుసగా 7.95, 8, 8.1, 8.3 శాతాలుగా ఉంటాయి. ఇప్పటికే ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, పీఎన్‌బీ, యూనియన్ బ్యాంక్‌లుసహా పలు బ్యాంకులు ఎంసీఎల్‌ఆర్‌ను స్వల్పంగా పెంచాయి.
Comments
Please login to add a commentAdd a comment