సాక్షి, ముంబై: డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రోజుకో రికార్డు కనిష్టానికి జారిపోతుండటంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) స్పందించింది. ఈసీబీ రూటులో రుణ పరిమితిని రెట్టింపు చేయడంతో సహా విదేశీ మారకపు ప్రవాహాన్ని పెంచేందుకు నిబంధనలను మరింత సరళీకృతం చేసింది. ఈ మేరకు ఆర్బీఐ బుధవారం ఒక ప్రకటన జారీ చేసింది.
అస్థిరతను తగ్గించడానికి, గ్లోబల్ స్పిల్‌ఓవర్‌లను తగ్గించేందుకు, డెట్ మార్కెట్లలో విదేశీ పెట్టుబడిదారులను ప్రోత్సహించేందుకు కొన్ని నిబంధనలను సడలించింది. మొత్తం స్థూల ఆర్థిక, ఆర్థిక స్థిరత్వాన్ని భరోసా ఇచ్చేలా ఫారెక్స్ ఇన్‌ఫ్లోలను పెంచడానికి ఐదుచర్యలను చేపట్టాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ తెలిపింది. అలాగే ఫారెక్స్ మార్కెట్లో లిక్విడిటీ పరిస్థితులను నిరంతరం, నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. క్రమబద్ధమైన మార్కెట్ పనితీరును నిర్ధారించే లక్ష్యంతో ఈ చర్య తీసుకున్నామని ఆర్బీఐ పేర్కొంది.
► విదేశీ కరెన్సీ నాన్-రెసిడెంట్ డిపాజిట్లు FCNR(B), NRE టర్మ్ డిపాజిట్లపై క్యాష్ రిజర్వ్ రేషియో (సీఆర్‌ఆర్), స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో (ఎస్‌ఎల్‌ఆర్) నుంచి మినహాయింపు
► విదేశీ కరెన్సీ నాన్-రెసిడెంట్(బీ) ఎన్‌ఆర్‌ఈ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంపు. ఈ సడలింపు అక్టోబర్ 31, 2022 వరకు అందుబాటులో ఉంటుంది.
► రుణంలో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు పెట్టుబడులు. ప్రభుత్వ సెక్యూరిటీలు, కార్పొరేట్ బాండ్లలో మూడు మార్గాల ద్వారా ఎఫ్‌పీఐలు పెట్టుబడి పెట్టవచ్చు. ఎఫ్‌పీఐ పెట్టుబడులను ప్రోత్సహించేలా అక్టోబర్ 2015లో ప్రవేశపెట్టిన మధ్యస్థ-కాల ఫ్రేమ్‌వర్క్ (ఎంటీఎఫ్); (బి) మార్చి 2019లో ప్రవేశపెట్టిన వాలంటరీ రిటెన్షన్ రూట్ (వీఆర్‌ఆర్); (సి) ఏప్రిల్ 2020లో ఎఫ్‌ఏఆర్ నిబంధనల్లో మార్పులు చేసింది.
► అధీకృత డీలర్ కేటగిరీ I (AD కేటగిరీ-I) బ్యాంకుల ద్వారా విదేశీ కరెన్సీ రుణాలు
► బాహ్య వాణిజ్య రుణాలు(ECBs):ఆటోమేటిక్ ఈసీబీ మార్గంలో, అర్హత కలిగిన రుణగ్రహీతలు ఆర్బీఐని సంప్రదించకుండానే ఆర్థిక సంవత్సానికి తీసుకునే పరిమితిని 750 మిలియన్ల డాలర్ల నుంచి 1.5 బిలియన్ డాలర్లకు పెంచింది. అలాగే ఆల్ ఇన్ కాస్ట్ సీలింగ్ కూడా 100 బేసిస్ పాయింట్లకు పెంచింది. రుణ గ్రహీత పెట్టుబడి గ్రేడ్ రేటింగ్‌కు లోబడి ఇది ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment