రూపాయి 86 పైసలు డౌన్
ముంబై: దేశీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ప్రధాన కరెన్సీలతో రూపాయి మారకం విలువ రోజురోజుకూ కొత్త కనిష్ట స్థాయులకు పడిపోతోంది. బుధవారం డాలర్‌తో పోలిస్తే మరో ఆల్‌టైమ్ కనిష్టమైన 64.54 స్థాయిని తాకింది. అటు పౌండ్‌తో పోలిస్తే సెంచరీ కొట్టి 101.3 స్థాయిని తాకింది. కరెన్సీ క్షీణతకు అడ్డుకట్ట వేసే దిశగా బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్య సరఫరాను పెంచేం దుకు ఆర్‌బీఐ మంగళవారం చర్యలు ప్రకటించినప్పటికీ ఫలితం కనిపించలేదు. దిగుమతిదారుల నుంచి డాలర్లకు భారీ డిమాండ్, విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం, వచ్చే నెల నుంచి అమెరికా ఉద్దీపన ప్యాకేజీలు ఉపసంహరించవచ్చన్న భయాలు రూపాయిపై ఒత్తిడి పెంచుతున్నాయి.
బుధవారం ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి ట్రేడింగ్ క్రితం ముగింపు 63.25తో పోలిస్తే బలహీనంగా 63.45 వద్ద ట్రేడయ్యింది. ఒక దశలో గరిష్టంగా 63.10 స్థాయికి పెరిగినా.. ఆ తర్వాత ఇంట్రా డేలో జీవిత కాల కనిష్టం 64.54కి పడిపోయింది. చివరికి 86 పైసల (1.36%) నష్టంతో 64.11 వద్ద క్లోజయ్యింది. మొత్తం మీద అయిదు సెషన్లలో రూపాయి విలువ 292 పైసలు (4.77%) పతనమైంది. ఆర్‌బీఐ చర్యలెన్ని తీసుకుంటున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదని, రూపాయి బలహీనత కొనసాగుతూనే ఉందని ఇండియా ఫారెక్స్ అడ్వైజర్స్ సీఈవో అభిషేక్ గోయెంకా చెప్పారు. రూపాయి పతనానికి అడ్డుకట్ట వేసేందుకు 64.40 స్థాయి దగ్గర ప్రభుత్వరంగ బ్యాంకుల ద్వారా రిజర్వ్ బ్యాంక్ డాలర్లను విక్రయించి ఉంటుందని అల్పరీ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఇండియా) సీఈవో ప్రమీత్ బ్రహ్మభట్ తెలిపారు.
పౌండ్ ః100.5 ..
బ్రిటిష్ పౌండుతో పోలిస్తే రూపాయి మారకం సెంచరీ దాటేసింది. ఇంట్రాడేలో ఆల్‌టైమ్ కనిష్టమైన 101.3కి పడిపోయి చివరికి 100.5 వద్ద ముగిసింది. పౌండుతో పోలిస్తే ఇంతస్థాయికి పడిపోవడం చరిత్రలోనే మొదటిసారి. ప్రస్తుతం రూపాయితో పోలిస్తే అత్యంత ఖరీదైన కరెన్సీల్లో పౌండు, యూరో, స్విస్ ఫ్రాంక్, అమెరికా డాలరు ఉన్నాయి.
డాలర్‌తో పోలిస్తే మరో నెల రోజుల్లో
కరెంటు ఖాతా లోటు, అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులతో పాటు దేశీయ ఎకానమీ అస్తవ్యస్తంగా ఉండటం రూపాయిపై ఒత్తిడి పెంచుతోందని బ్యాంకింగ్ దిగ్గజం డాయిష్ బ్యాంక్ తెలిపింది.