ముంబై: డాలర్‌తో రూపాయి మరికొంత బలపడింది. గురువారం ఫారెక్స్ మార్కెట్లో క్రితం రోజుతో పోలిస్తే 29 పైసలు లాభంతో 74.42 వద్ద ముగిసింది. ఈ ఏడాది నవంబర్ 24 తర్వాత రూపాయి తిరిగి గరిష్ట స్థాయికి చేరుకోవడం ఇదే మొదటిసారి. ఏడాది చివర్లో బ్యాంకులు, ఎగుమతిదారులు డాలర్ల విక్రయాలను చేపట్టడం రూపాయికి బలాన్నిచ్చింది. స్థానికంగా కమోడిటీ ధరలు తక్కువగా ఉండడం, ఆసియా కరెన్సీలు సైతం బలంగా ఉండడం సానుకూల సెంటిమెంట్‌కు దారితీసినట్టు ట్రేడర్లు పేర్కొన్నారు.
‘‘రానున్న రోజుల్లో విదేశీ పెట్టుబడులు మెరుగ్గా ఉంటాయన్న అంచనాలు, ఎగుమతిదారులు ఏడాది చివర్లో అమ్మకాలు చేపట్టడంతో డాలర్ నెల గరిష్టానికి చేరింది. సెంట్రల్ బ్యాంకు జోక్యం చేసుకోకుండా వేచి చూసే ధోరణితోనే ఉంది.
చదవండి:2022 జనవరి 1 నుంచి పెరిగే, తగ్గే వస్తువుల జాబితా ఇదే..!
Comments
Please login to add a commentAdd a comment