
ముంబై: ఫారెక్స్ మార్కెట్లో రూపాయి పతనం ఆగడం లేదు. డాలర్ మారకంలో సోమవారం పది పైసలు క్షీణించి జీవితకాల కనిష్టం 82.40 స్థాయి వద్ద స్థిరపడింది. ఉదయం 82.68 స్థాయి వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఒక దశలో 82.69 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. అయితే రూపాయి విలువ రక్షించేందుకు ఆర్‌బీఐ జోక్యం చేసుకోవచ్చనే అంచనాలతో కొంతమేర ఆరంభ నష్టాలు తగ్గాయి.
దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల బాటన సాగుతున్నందున ఇన్వెస్టర్లలో రిస్క్ తీసుకొనే సామర్థ్యం తగ్గిందని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. ‘‘అమెరికాలో ఉద్యోగ గణాంకాలు నిరాశపరచడంతో ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు వేగవంతంగా ఉండొచ్చనే ఊహాగానాలతో డాలర్ బలపడింది. దీంతో రూపాయి విలువ కొత్త జీవితకాల కనిష్టానికి దిగివచ్చింది. రానున్న రోజుల్లో 81.50 – 83 శ్రేణిలో కదలాడొచ్చు’’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ విశ్లేషకుడు దిలీప్ పర్మార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment